అమర వీరుల్ని మరిచిపోకండి...!
>> Sunday, August 23, 2015
|
1963లో
భారత చైనా యుద్ధం ముగిసిన తరువాత, అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించే ఒక
కార్యక్రమం, ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగింది. ఆ కార్యక్రమానికి
అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ హాజరయ్యారు. అమర వీరుల
స్మృత్యర్థం ప్రముఖ కవి, ప్రదీప్ రాసిన ‘ఏ మేరే వతన్ కే లోగోఁ గీతాన్ని
సి. రామచంద్ర స్వరపరిస్తే, లతా మంగేష్కర్ ఆ వేదిక మీద ఎంతో రసార్థ్రంగా
పాడారు.
ఆ
గీతం విని భావోద్వేగానికి లోనైన నెహ్రూ వేదిక మీదే కంటతడి పెట్టుకున్నారు.
ఈ ప్రైవేట్ గీతాన్ని ఐదు దశాబ్దాలుగా వింటూనే ఉన్నా, విన్న ప్రతిసారీ దేశ
ప్రజల హృదయాలు గగుర్పాటుకు లోనవుతూనే ఉన్నాయి. అమర వీరుల త్యాగాల్ని
తలుచుకుని భారతీయుల గుండెలు తీవ్రమైన ఉద్విగ్నతతో ఊగిపోతూనే ఉన్నాయి.....
సాకీ:
ఏ మేరే వతన్ కే లోగోఁ .....! తుమ్ ఖూబ్ లగాలో నారా
యే శుభ్‌దిన్ హై హమ్ సబ్‌కా, లహెరాలో తిరంగా ప్యారా
పర్ మత్ భూలో సీమా పర్, వీరో నే హై ప్రాణ్ గవాయే
కుఛ్ యాద్ ఉన్హే భీ కర్‌లో, జో లౌట్ కే ఘర్ నా ఆయే
మనందరికీ ఇదో శుభదినం, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి
కానీ, సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన వీరుల్ని ఎప్పుడూ మరిచిపోకండి
ఎన్నడూ ఇంటికి తిరిగి రాకుండా పోయిన ఆ వీరుల్ని జ్ఞాపకం చేసుకోండి)
ఏ మేరే వతన్ కే లోగోఁ జరా ఆంఖ్ మే భర్‌లో పానీ
జో శహీద్ హుయేఁ హైఁ ఉన్ కీ జరా యాద్ కరో ఖుర్‌బానీ
తుమ్ భూల్ న జావో ఉన్ కో, ఇస్ లియే సునో యే కహానీ
జో శహీద్ హుయే హై ఉన్‌కీ జరా యాద్ కరో ఖుర్‌బానీ
(ఓ నా దేశ ప్రజలారా..! కళ్లల్లో కాసిన్ని అశ్రువుల్ని నింపుకోండిఅమరులైన వారి ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి
మీరు మరిచిపోకుండా ఉండేందుకు ఈ కథ వినండి )
జబ్ తక్ థీ సాఁస్ లడే వో, ఫిర్ అప్‌నీ లాశ్ బిఛా దీ
సంగీన్ పే భర్ కర్ మాథా, సోగయే అమర్ బలిదానీ
జో శహీద్ హుయే హైఁ ఉన్ కీ, జరా యాద్ కరో ఖుర్‌బానీ
(హిమాలయాలు గాయమైనప్పుడు, స్వాతంత్య్రం ప్రమాదంలో పడినప్పుడు
ఊపిరి ఉన్నంతవరకు పోరాడి, చివరికి తమ శవాల్ని పరిచేశారు
తుపాకీ అంచు మీద నుదురు ఆనించి, అమర వీరులు శాశ్వతంగా నిదురోయారు) /అమరులైన/
జబ్ హమ్ బైఠే తే ఘరోఁ మే, వో ఝేల్ రహే థే గోలీ
థే ధన్య్ జవాన్ వో అప్‌నీ, థీ ధన్య్ వో ఉన్‌కీ జవానీ
జో శహీద్ హుయే హైఁ ఉన్‌ఖీ జరా యాద్ కరో ఖుర్‌బానీ
మనమంతా ఇళ్లల్లో కూర్చున్నప్పుడు, వాళ్లు తూటాలకు ఎదురొడ్డుతూ ఉండిపోయారు
ఎంతటి ధన్యులో ఆ సైనికులు, వారి యువశక్తి ఎంత సార్థకమైన దో ) /అమరులైన/
సర్‌హద్ పర్ మర్‌నే వాలా.... హర్ వీర్ థా భారత్ వాసీ
జో ఖూన్ గిరా పర్వత్ పర్, వో ఖూన్ థా హిందుస్తానీ
జో శహీద్ హుయే ఉన్‌కీ, జరా యాద్ కరో ఖుర్‌బానీ
(ఒకరు సిక్కు, ఒకరు జాట్, ఒకరు మరాటీ ఒకరు గూర్ఖా, ఒక మదరాసీఎవరైతేనేమిటి? సరిహద్దులో మరణించే ప్రతి వీరుడూ భారత వాసి
పర్వతాల మీద పడిన రక్తం ఎవరిదైతేనేమిటి? ఆ రక్తం హిందుస్తానీది)
/అమరులైన /-
దస్ దస్ కో ఏక్ ఏనే మారా, ఫిర్ గిర్ గయే హోశ్ గవా కే
జబ్ అంత్ సమయ్ ఆయా తో, కహ్‌గయే కె అబ్ మర్‌తే హై
ఖుశ్ రహ్‌నా దేశ్ కే ప్యారో, అబ్ హమ్ తో సఫర్ కర్‌తే హైఁ
ఒక్కొక్కరు పది-పది మందిని అంతమొందించి, చివరికి స్పృహ తప్పి నేలవాలిపోయారు
అంతిమ ఘడియలు వచ్చేశాక, తమ మరణాన్ని గురించి చె బుతూ
సంతోషంగా ఉండండి ఓ నా దేశపు బిడ్డలారా! ఇక మేము వెళ్లిపోతున్నామంటూ సాగిపోయారు.)/ అమరులైన/
జో శహీద్ హుయే హై ఉన్ కీ జరా యాద్ కరో ఖుర్‌బానీ
తుమ్ భూల్ న జావో ఉన్‌కో, ఇస్ లియే యే హై కహానీ
జో శహీద్ హుయే హైఁ ఉన్‌కీ, జరా యాద్ కరో ఖుర్‌బానీ
జయ హింద్....జయ హింద్, జయ హింద్ కీ సేనా- 2
జయ హింద్... జయహింద్... జయ్ హింద్... జయ హింద్... జయహింద్
అమరవీరుల ఆ ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోండి
మీరు మరిచిపోకుండా ఉండేందుకు ఈ కథంతా వినండి /అమరులైన/
స్వాతంత్య్రం
రాగానే సరిపోదు కదా! ఈ స్వతంత్ర దేశాన్ని కుటిలత్వంతో కుయుక్తులతో
కూలదోయాలని చూసే శత్రుదేశాల నుంచి దాన్ని అనుక్షణం కాపాడుకోవడమూ అంతే
ముఖ్యం కదా! అలా కాపాడుతున్నది అన్నింటికీ సిద్ధపడి, రేయింబవళ్లు
సరిహద్దుల్లో గస్తీ కాసే సైనిక వీరులే! ఆ గస్తీలోనూ ఇప్పటికీ ఎన్నెన్నో
ప్రాణాలు అహుతి అవుతూనే ఉన్నాయి.
అనంతంగా
సాగిపోతున్న అమర వీరుల ప్రాణత్యాగాలను అనుక్షణం గుర్తు చేసుకోవడం తప్ప వారి
ఆత్మలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆ అమరవీరులను అనునిత్యం గుర్తుచేయడం
ద్వారా ఈ పాట గత ఆరు దశాబ్దాలుగా ఒక అద్భుతమైన భూమిక నిర్వహిస్తోంది. ఆనాటి
అమర వీరుల శ్రద్దాంజలి సభలో మాట్లాడుతూ నెహ్రూ ‘ఈ పాట విని స్పూర్తి
పొందని వాడు అసలు భారతీయుడే కాదు’ అన్నారు. దేశ రక్షణలో మనమూ ఒక భాగం
కావడానికి కంకణబద్ధులమవడం తప్ప భారతీయుడిగా మన ముందుండే మరో కర్తవ్యం
ఏముంది!
from andhrajyothi daily
0 వ్యాఖ్యలు:
Post a Comment