శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణానికి సహకరించండి .

>> Friday, March 28, 2014

                         శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ


                         సర్వమంగళ మాంగళ్యే శివేసర్వార్థసాధికే
                       శరణ్యే త్రయంబకేదేవి నారాయణీ నమోస్తుతే .








భగవద్బంధువులకు    శ్రీమాతస్మరణత్పూర్వక
నమస్కారములు.
ధార్మికసాధనా కార్యక్రమములు, దైవసేవావిధులు,ధర్మప్రచారములతో "శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం" భగవత్సేవలో నిమగ్నమై యున్నది.    అనేక  భగవత్ కైంకర్య సేవలలో  ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొనే భక్తులేకాక, పరోక్షంగా తమ గోత్రనామాలుపంపి ఆయా కార్యక్రమాలలో నామస్మరణ,పారాయణాదులు చేస్తూ వేలాదిమంది మాతోను మేము వారితోనూ కలసి   జరుపుతున్న ఆథ్యాత్మిక కార్యక్రమాల గూర్చి "హరిసేవ" బ్లాగుద్వారా మీకందరకు విదితమే.
శ్రీవేంకటేశ్వరస్వామి,రామలింగేశ్వరులతో అమ్మ దుర్గాభవాని కొలువైన మందిరం నిర్మాణం జరిగినది.మొత్తం రెండెకరాల పొలం [ఇదిమాత్రమే నాకున్న ఆస్థి] అమ్మవారి మందిరం తదితరములకై సమర్పించి   మా అన్నదమ్ముల కష్టార్జితము, మా స్నేహితులు, మీలాంటి ధార్మికులు అందించిన సహకారం తో మందిరము,సంకీర్తనామండపము  ఈ పది సంవత్సరాలలోనిర్మించగలిగాము. ఇక్కడ జరుగుతున్న ప్రతికార్యక్రమములోనూ అన్నప్రసాదవితరణ జరిగేలా  అమ్మ అనుగ్రహిస్తున్నది. ఇప్పటిదాకా గతంలో మేము  నిర్వహించి ప్రస్తుతం నిలుపదలచేసిన హిందూ పబ్లిక్ స్కూల్  కోసం వినియోగించిన రేకుల షెడ్లను ఉపయోగిమ్చుకుంటున్నాము. అయితే అవి  శిథిలస్థితికి చేరుకున్నాయి.  ఎంత ఎండకైనా మందిర ఆవరణలో ఉన్న చెట్లవలన రక్షణలభిస్తున్నది కానీ వాన వస్తే మాత్రం తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నది . వండిన వంటకాలను భద్రపరచలేక, తినేవారికి స్థలం లేక  కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఇక దూరప్రాంతములనుండి వచ్చినవారు వారిసామానులు  ఇక్కడ మేము నివసిస్తున్న గదిలోనే ఉంచవలసి వస్తున్నది. గత హనుమత్ రక్షాయాగ సమయంలో భారీగా తరలివచ్చిన భక్తులతోపాటు దొంగలుకూడా వచ్చి మనవాల్ల కొందరి బ్యాగులలో వస్తువులు  తీసుకెళ్ళారు.. ఇంతమందిలో  ,అంతవత్తిడిలో ఎవరు?ఏమిటని గుర్తించటం సాధ్యం కాదు.
ఇక ఇప్పటినుండి  గ్రామాలనుండి బృందాలను ఎంపిక చేసుకుని వారికి ఃహరిభజన" లో ను, యువతకు,విద్యార్థులకు హైందవ ధార్మిక విషయాలపై నాలుగైదు రోజులు గా శిక్షణాశిబిరాలను నిర్వహించాలనే సంకల్పంలో ఉన్నాము.

అందుకోసమని శాశ్వతంగా  "అన్నపూర్ణ భిక్షాశాల" [అందులోనే  దూరప్రాంతం నుండి వచ్చినవారు సామానులు భద్రపరుచుకొనుటకుకొన్ని  లాకర్లు తో] నిర్మించటం అవసరము. అందుకోసం  టంగుటూరులో పనిచేస్తున్న మన ఏ.ఈ. గారు శ్రీనివాస్ గారు రేకులషేడ్ తొలగించి ఆస్థానంలో నిర్మించుటకు గాను చక్కని  ప్లాన్ తయారు   చేసి ఇచ్చారు.మొత్తం నేటి అంచనాలప్రకారం పదిలక్షలరూపాయలు  అవుతుందని అంచనావేశారు. ఈసంవత్సరం మే ఇరవైనాలుగున నిర్వహించబోతున్న "హనుమద్రక్షాయాగం" నాటికి  సకలలోకాల ఆకలితీర్చే తల్లి "అన్నపూర్ణమ్మ"  పేరున ఈ భిక్షాశాల సిద్దమవ్వాలని  మాకోరిక.

 అయితే నాకు పూర్తిగా ఖర్చుభరించే స్థోమత లేదు. నేనుకూడా నెలజీతగాడినే. అందునుండి నాకుటుంబఖర్చులు పీఠనిర్వహణ చూసుకోవాలి.  అమ్మా ! నావంతుగా ఇందుకోసం లక్షరూపాయలు  సమకూర్చుకుంటానని అమ్మకు మనవి చేసుకుని   "అసాధ్యసాధకస్వామిన్ అసాధ్యం కిం వద! రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో!" అని ఇక్కడ క్షేత్రపాలకుడై నిలుచుని నడిపిస్తున్న స్వామిని నమ్ముకుని మీముందు ఈ ప్రణాళికనుంచుతున్నాను.
ఎవరికైనా స్వామి ప్రేరణకలుగజేసి మా వంటిఉడుతల  ప్రయత్నానికి సహకారమందిస్తారని నమ్ముతున్నాము. ప్రధాన మందిరము,సంకీర్తనా మండపము నిర్మాణసమయములలోనూ మధ్యలో ఇది మావలన అవుతుందా? అని భీతి చెందిన సమయంలో కూడా స్వామి కరుణతో హనుమత్పరివారము, వారంతవారు స్పందించి సహకారం అందించిన దైవలీలలు  పరమాత్మ అనుగ్రహం అనుభవమే.అందుకే నేను,నాతోపాటు పీఠమునకొచ్చి అమ్మ సేవాకార్యక్రమాలలో పాల్పంచుకుంటున్న కార్యకర్తలు స్వామిపైభారముంచి ప్రయత్నమారంభిస్తున్నాము.

పైన ఇమేజ్ లలో   కిచెన్ గా చూపిస్తున్నది నిర్మించవలసిన ప్లాన్.

[ఇక్కడ  నాదొక చిన్నమనవి. ఇక్కడ వినియోగించాలని ఇచ్చే ప్రతిపైసా ఖచ్చితంగా స్వామి సేవకే వినియోగపడుతుంది. భగవంతుడు నాకు తినటానికి ఎక్కడా దేహీ అనిచేయిచాచే దుస్థితి రాకుండా ఒక ఉద్యోగం ఇప్పటిదాకా మనఃసంకల్పం లో శుధ్ధిని ప్రసాదించాడు. కనుక సహాయం  చేసిన ప్రతివారూ ఏసమయంలోనైనా వివరాలు అడిగినా,వారు వారితరపున ఎవరువచ్చి ప్రత్యక్షంగా పరిశీలించుకున్నా వారికి అన్నివివరాలు తెలుపుటకు సిధ్దంగా ఉంటాను]

. సమకూరినవి,ఖర్చులు, వినియోగవివరాలు అన్నీహనుమత్ రక్షాయాగం సమయంలో అందరికీ వివరించి , బహిరంగముగనే ఉంచబడతాయి అని మనవి చేస్తున్నాను.
ఈకార్యక్రమంలో వస్తురూపేణాగాని, ద్రవ్యరూపేణాగానీ మీ ఇచ్చానుసారం   చేయికలపాలనిసంకల్పిస్తే  నానంబర్ లేదా  మెయిల్ కు సమాచారమివ్వాలని కోరుతున్నాను
durgeswara@gmail.com
9948235641

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP