శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇలా చేయండి ..కావాల్సినంత ఆక్సిజన్ దొరుకుతుంది మీకు

>> Friday, February 17, 2012


అందరికి నమస్కారములు
ఈ విషయము క్రింద నేను చెప్పే రెండవ విషయము. మనము గోవు ను పూజ చేస్తున్నాము. ఏదో గోసాల కు వెళ్లి పూజ చేసి రావడము తో ఆ పని ఐ పోతుంది. ఐతే మన ఇంటిలో కూడా ఒక చిన్న ప్రక్రియతో తో గో సేవ ఫలితము పొందవచ్చు. అదేమంటే ఆవు పిడకలతో పొందే ఫలితము. ఒక ఆవు పిడక లో కర్పూరముతో అగ్ని రాజేసి అందులో ఇరవై నాలుగు పూర్ణ బియ్యము గింజల తగ్గకుండా ఆవు నెయ్యి తో అభిగరించి ఒక చిన్న మంత్రము తో సూర్యోదయ మరియు సూర్య అస్తమ సమయములలో అట్టి అగ్ని హోత్రములో ఆహుతి చేస్తే అట్టి ప్రదేశములలో ప్రతిసారి ఒకటి నుండి ఐదు టన్నుల ఆక్సిజెన్ invoke అవుతుంది. ఈ విషయము మన దేశము నుండి పశ్చిమ జెర్మని కి చెందినా అడాల్ఫ్ స్టినేర్ అనే సాస్త్రజ్జ్ఞుడు నిరూపించాడు. అదే విషయము ఇటీవలే శ్రీ వెంకటేశ్వర భక్తీ చానెల్ వారి ప్రసరములో కూడా తెలిపారు. అన్నిటి కన్నా ఈ విషయము మా వ్యవసాయ క్షేత్రములోను మరియు మా ఇంటిలో కూడా వాడినాము. ఫలితము కూడా పొందినాము. ఏ వర్ణము వారైనా ఇది చేయవచ్చు.
ఇంకా ఆవు పిడక అగ్నిహోత్రములో సాంబ్రాణి సమర్పించి ఆ పొగను ఇంటినిండా ప్రసరిమ్పచేస్తే అనేక రోగ కర క్రిమి కీటకాలు తొలగిపోతాయి. అంతా మొత్తము పది నిముషాలలో అయిపోతుంది. ఫలితము ఆక్సిజెన్ మరియు క్రిమికీటక రహిత పరిసరములు. అందుకు చేయవలసినది మాత్రము ఆవు పిడకల సంగ్రహణ.
మనలో చాలామందికి ఆవు పిడకల సంగ్రహణ కష్టము కాదు. అలా అనుకున్నవారికి ఈ క్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే (9989541434) ప్రేమ కుమార్ గారు అనే అయన అగ్ని హోత్రములకు మాత్రమే ఆవు పిడకలు సమకూరుస్తున్నారు. ఆయనకు నాకు ఏ సంబంధము లేదు అతని నెంబర్ నా మిత్రులలో ఒకరు ఇచ్చారు. మొదటి సరిగా ఈ రోజు మాత్రమే మాట్లాడాను. అతను ఇచ్చిన వివరములు ప్రకారము అతను అరవై రూపాయలకు వంద పిడకలు ఇస్తారంట. ఐతే సంవత్సరములో కావలసిన పిడకలు ఖరీదు వంద రూపాయలు దాటదు.
లేక ఎవరైనా మరొక source చెప్తే అందరికి ఉపయుక్తము. ఇప్పుడు మనము నివసిస్తున్న అపార్ట్మెంట్ పరిసరాలలో ఆక్సిజెన్ తగ్గిపోతున్న సమయములలో మన అందరి కర్తవ్యము తగ్గిపోతున్న ఆక్సిజెన్ లెవెల్ లను పెంపొందించడమే.
ఇట్లు
వరప్రసాద్ దైతా


8 వ్యాఖ్యలు:

రాం చెరువు February 17, 2012 at 10:46 AM  

నిజమే.. గత సంవత్సరం.. శ్రీ తనికెళ్ళ భరణి గారింటికి ఉదయాన్నె వెల్తే..
మీరు చెప్పినట్లు గానె ఆవు పిడకలతో అగ్ని హొత్రం వేస్తు కనపడ్డారు .

రాం చెరువు February 17, 2012 at 10:46 AM  

నిజమే.. గత సంవత్సరం.. శ్రీ తనికెళ్ళ భరణి గారింటికి ఉదయాన్నె వెల్తే..
మీరు చెప్పినట్లు గానె ఆవు పిడకలతో అగ్ని హొత్రం వేస్తు కనపడ్డారు .

PRAMEELA February 17, 2012 at 8:52 PM  

Request you to tell me the "MANTHRAM" also so that we will follow the same.

Thank you and best regards,

Prameela
Hyderabad

Unknown February 18, 2012 at 7:07 AM  

ఎంతో మంచి విషయం చెప్పారు.
తప్పక ఆచరిస్తాను. అందరికి చెప్తాను.

Anonymous February 18, 2012 at 8:38 PM  

ఒక్క పిడక, ఓ 10గ్రా నెయ్యి(~ 200గ్రాములతో) 4టన్నుల ఆక్సిజన్ అంటే భౌతిక, రసాయన శాస్త్రాలని కలిపి పుడకల్తో పోనివ్వడమే! ఆయనకు 100నోబుల్ ప్రైజులిచ్చినా తక్కువే! ఎవరా జర్మన్ శాస్త్రవేత్త? అభినవ రామర్ పిళ్ళే కాదుకదా?!

Anonymous February 18, 2012 at 8:51 PM  

200గ్రాములకు ఏకంగా 4టన్నులు మరీ ఎక్కువేమో నండి. 200గ్రాములకు లోపున వుండేలా కొద్దిగా తగ్గించగలరు. :)

Anonymous February 19, 2012 at 2:16 AM  

పిడకల్ని కాల్చటంవల్ల ఆక్సిజన్ invoke అవ్వటమనే విషయమే నాకర్థం కాలేదు. మీ ఉద్దేశ్యం ఆక్సిజన్ వెలువడుతుంది అనయితే అది అసంభవం. మేము మా ల్యాబులో కొన్ని వందలసార్లు పిడకలు కాల్చి పరీక్షించాం. (ప్రయోగ లక్ష్యం వేఱు) పిడకలు కాల్చటం వల్ల వెలువడే వాయువుల్లో కార్బన్ డైయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ప్రధానమైనవి. కనుక ఇంట్లో పిడకల్ని కాల్చకపోవటమే ఉత్తమం. ఇక రెండవ పార్శ్యం invoke అంటే పిలువటం అని అర్థం. పిడకల్ని కాల్చటం అనే ప్రక్రియ ఆక్సిజన్ని పిలిచినా అది మనకి ఉపయోగపడేదీ లేదు దహన క్రియకు తప్ప!

durgeswara February 19, 2012 at 9:21 AM  

meeru hari dvar lo gayatri samsodhana samsthan vari parishodhana vivaraalu telusukuni chudamdi

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP