ప్రసాదానికి కూడా ప్రాంతీయ వాసనలా !? ముదిరిపోయిన మూర్ఖత్వం .
>> Saturday, December 19, 2009
మూర్ఖత్వం ముదిరితే మనిషి ఆలోచనలెలా దిగజారతాయో ఇప్పుడు జనం లో పెరుగుతున్న పట్టుదలలు వివేకం లేని వాదలను చూస్తుంటే తెలుస్తోంది .
మొన్న భవానీ దీక్షల సందర్భంగా విజయవాడలో తయారు చేసిన ప్రసాదాలను రాష్ట్రం లో ఆరు ప్రధాన దేవాలయాలకు పంపారు .అందులో వేములవాడ కు పంపిన ప్రసాదాలను అవి ఆంధ్రా ప్రాంతాన్నుంచి వచ్చాయి కనుక ఈ ప్రసాదాలు మాకొద్దని తిప్పి పంపారట. అమ్మవారికి ఈ ప్రాంతీయ తత్వాలు ఆపాదించవద్దని ఆలయ ఈ వో ప్రాధేయ పడ్దాడని వార్తలొచ్చాయి.
అమ్మవారు జగన్మాత అని విన్నామేగాని ఇలా ఆంధ్రావాళ్లకో .తెలంగాణా వాల్లకో ,ఏహిందీవాళ్లకో ,అరవ వాళ్లకో మాత అనే మౌఢ్యపు మాటలు ఇప్పుడే వింటున్నాము . భగవంతున్ని కూడా మని ఇష్టాఇష్టాలతో ప్రమాణికరించే తత్వం కలిపురుషుని ప్రభావం తో పెరుగుతున్నది ,మనుషులలో . రంగులు మారుతున్న రాజకీయారణాలు భౌతిక విషయాలు .అవి ఆథ్యాత్మిక విషయాలకు ఆపాదించవచ్చా. ఆసద్వివేకాన్ని పెంపొందించుకోవాలి మనం. ఇలా భగవత్ ప్రసాదాన్ని తిరస్కిరించటం దోషమవుతుంది . జగన్మాత ప్రసాదాన్ని తిరస్కరించి అవమానించి కష్టాలు కొనితెచ్చుకున్న చరితములు మనం చదువుకున్నాం . లోకమంతటికి తల్లి ఆజగన్మాత మా అవివేకాన్ని మన్నించి లోకాన్ని రక్షించమని వేడుకుంటున్నాము .
5 వ్యాఖ్యలు:
రేప్ ప్రొదున్న వెంకన్న సీమ లో ఉన్నాడు.. అందుకే అతడు మా దేవుడు కాదు.. తెలంగాణా వెంకన్న కావాలి అని అంటారేమో..
Really :))
జరిగింది నిజమే అయితే వీళ్ళు బాగుపడే అవకాశమేలేదు.
పైకి మూర్ఖత్వం లా కనిపించినా, దీనివెనుక ఉన్న బలమైన programming, ఎంత బలంగా ఇలాంటి భావనలు ప్రజల మనసుల్లో చొప్పించగలిగారు ఆని ఆలోచిస్తే, చాలా ఆవేదనగా ఉంది.
ఇది ఇక్కద విజయవాడ ఎడిషన్ {ఈనాడులో} లో వచ్చిందండి ఆలయ ఈవో గారి విన్నపముగా.
మీరన్నట్లు ప్రాంతీయవాదమనే ముసుగు వెనుక రాజకీయయ కారణాలేకాక ఇంకా ఇతర లక్ష్యాలున్న శక్తులు చేరినట్లు కనిపిస్తున్నది చూస్తుంటే. తెలంగాణా వాదనతో ఉద్యమిస్తున్న సోదరులు గ్రహించి ముందురాబోతున్న ముప్పును కనిపెట్టి ఆశక్తులను మొదటిలోనే తరమాలి .లేకుంటే చాలాప్రమాదం
నేను మొన్నొక పోస్ట్ వ్రాస్తే దానికి ఒక అనామక వ్యాఖ్య రూపం లో ఈశక్తుల నుంచి వచ్చినది స్పందన.దానిని తొలగించాను. అందులో వెంఅకటేస్వర స్వామి రాయలసీమ లో వెలసితెలంగాణాకు అన్యాయం చేశాదని,భద్రాచలం ...సీతమ్మ గొప్పేంటి ? ఇలా ప్రశ్నిస్తూ హిందూ భావ వ్యతిరేకతత్తో బ్లాగర్లను రెచ్చగొట్టాలని చూశాడందులో . బాబూ! నీఉద్దేశ్యమ్ అరధమైనది మర్యాదగా ఇక్కడనుంచి తొలగు మరలా రావద్దని మెయిల్ ఇచ్చాను.
Post a Comment