శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఉగాది రోజుజరిగే "సహస్రకమలార్చన"కు గోత్రనామాలు పంపి మీరూ పాల్గొనండి

>> Thursday, March 11, 2010




నూతనసంవత్సర ప్రారంభమయ్యే ఉగాది పర్వదినమున శ్రీ వేంకటేశ్వరజగన్మాత పీఠం లో లోకశ్రేయస్సుకోరుతూ అర్చనా ప్రియ అగు ఆ జగన్మాతకు "సహస్ర కమలార్చన " చేయ సంకల్పించబడినది. ఆతల్లి అనుగ్రహం తో కొత్తసంవత్సరం ప్రతి ఇంటా సకల శుభాలు,సంతోషము వెల్లి విరియాలని అమ్మను ప్రార్ధిస్తూ అర్చన జరుపుతాము. అందుకోసం పూజకు 1008 తామరపుష్పాలను ఉపయోగించుట జరుగుతుంది. లక్ష్మీప్రదమైన కమలాలతో అర్చించటం వలన తల్లి అనుగ్రహం వర్షించి భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని ప్రగాఢనమ్మకము .

ఈ కార్యక్రమములో భక్తులు తమ గోత్రనామాలను పంపితే వారి తరపున ఒక్కొక్కరి తరపున ఒక్కొక్క పుష్పము అమ్మవారికి అర్చనలో సమర్పించబడుతుంది. దానికోసం లలిత సహస్ర నామావళిలోని 1008 దివ్యనామములను పఠించటం జరుగుతుంది. ఇక్కడ గోత్రనామాలు పంపిన ప్రతివారికి వరుసక్రమంలో అమ్మ సంకల్పాను సారం ఒక్కో నామం తెలియజేయబడుతుంది. ఆనామాన్ని పండుగరోజు ఉదయం పూజలో మీరు 108 సార్లు జపించవలసిఉంటుంది. ఇంకా మీ ఇఛ్చాను సారం జపం చేయవచ్చు. మీ మితృలు బంధువులకు కూడా తెలియపరచి పాల్గొనేలా చేయవచ్చు. వారి గోత్రనామాలు మీరు పంపినచో వారు పఠించవలసిన నామం కూడా మీద్వారా తెలియజేయబడుతుంది. ఉదయాన్నే మీ ఇల్లలో జరుపుకునే పూజలో మీరు ఈ నామాన్ని పఠించి మీ ఇష్ట దైవానికి పూలు సమర్పించాలి. సర్వదేవతాస్వరూపమైన అమ్మకు అదిమీరుచేసిన అర్చన అవుతుంది. మహాప్రభావం చూపగల ఈ నామ జపం ద్వారా మీ ఇంటిలో సకలశుభాలు నెలకొనాలని ఇక్కడ అమ్మకు అర్చనలో సంకల్పం చేసి నివేదించబడుతుంది. ఇంతమంది భక్తుల మనసులు ఏకమై చేసే ఈ నామ పఠనము వలన మహాశక్తి అనుగ్రహ ధారలు తప్పనిసరిగా వర్షిస్తాయి. పైన చెప్పిన సంఖ్య సూచన మాత్రమే . మీమనస్సులయమైనతరువాత ఎంత సంఖ్య ఎలా చేపించాలో గురుమండలరూపిణ్యైనమోనమ: అని స్తుతించబడే అతల్లే మరలా గురువుగా మారి చేపిస్తుంది మనచేత.
గోత్రనామాలను మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియబరచండి
durgeswara@gmail.com 9948235641

భక్తజనదాసుడు
దుర్గేశ్వర .


3 వ్యాఖ్యలు:

రాజేశ్వరి నేదునూరి March 14, 2010 at 10:18 AM  

నమస్కారములు తమకి అభ్యంతరం లేనియెడల మాగోత్ర నామములు శర్మ నేదునూరి మధుకుమార్ నేదునూరి. కౌండిన్యస గోత్రం. న్యూజెర్సీ డబ్బు ఎంత పంపాలో తెలుప గలరు అన్యధా భావింప వలదు విధేయులు.శర్మ $ మధు

durgeswara March 15, 2010 at 12:32 AM  

అయ్యా శర్మగారు

మీ గోత్రనామాలు వరుసలో వ్రాసుకున్నాము మీరు జపించవలసిన నామము పంపటం కూడా జరిగనది.

ఇక్కడ ఈకార్యక్రమమునకు డబ్బు పంపించాల్సిన అవసరం లేదండి . భక్తజన రక్షణకోరుతూ సాగుతున్న ఈ పూజలకు మీరు సూచించిన నామమును జపం చెస్తే చాలు. అలాగే మీరు గోత్రనామములను నామెయిల్ కుపంపండి వ్యాఖ్యలలో కాకుండా ఇకపై్ కార్యక్రమములకు.

ధన్యవాదములు

durgeswara March 15, 2010 at 12:33 AM  
This comment has been removed by the author.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP