శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏమిటీ అశుభం ?

>> Wednesday, September 2, 2009

ఈసంవత్సరం ప్రమాదాలు ,విరోధాలు ఎక్కువగావుంటాయనే పంచాంగకర్తల మాటలను ఉటంకిస్తూ చెబుతూనే వున్నాను. ఏమిటో ,అసెంబ్లీభవనం లోను ఆతరువాత మొన్న ప్రధాన న్యాయస్తానం లోనూ అగ్నిప్రమాదం జరగటం ఏదో అశుభాన్ని సూచిస్తున్నాయి. శ్రీవారి ఆలయం లో అనాచారాలు కూడా వుపద్రవాలకు దారితీయవచ్చు .

భగవంతుని దయవలన మన ముఖ్యమంత్రిగారికి ఏ ఆపదా రాకుందా వుండాలని వేడుకుందాము.

4 వ్యాఖ్యలు:

Anonymous September 2, 2009 at 5:55 PM  

మీలాంటి వాళ్ళ తిట్లూ, శాపనార్థాలే దీనికి కారణం!

durgeswara September 2, 2009 at 8:17 PM  

మీరెవరోగాని చాలాపొరబడుతున్నారు.

ధర్మానికి హానిజరిగినప్పుడు దానికి వ్బాధ్యులను వ్యతిరేకించటం సహజం . అది సిద్దాంతపరంగా మాత్రమే.వ్యక్తిగా ఏమనిషినీ పతనమవ్వాలని కోరుకుంటె అతను అసలు ఆథ్యాత్మిక వాది కానేకాదు. అలాంటి సంస్కారం హిందుత్వంలో వుండదు. ఏ వ్యవస్థని ,వ్యక్తినిగాని.సంఘాన్ని కాని నాశనమవ్వాలని కోరుకునే సంస్కృతి మనదికాదు. ఒకసారి చరిత్రచూడండి .

ఇక వ్యక్తికి జరిగేశుభాశుభాలు వారి,వారి ధర్మాధర్మ ప్రవర్తనపైన ఖర్మఫలితం పైన ఆధారపడివుంటుంది.

వీటన్నింటికంటే ముందు మనం మనుషులము ఏజీవికి హానికలిగినా అది మనదిగా భావించే సంస్కారం లోనుంచి వచ్చినవారము .ఆమనవతా ధర్మాన్ని ఆలోచించండి.

సుజాత వేల్పూరి September 2, 2009 at 9:56 PM  

దుర్గేశ్వర గారు,
బాగా చెప్పారు.

ధర్మగ్లాని జరిగినపుడు దానికి బాధ్యులను వ్యతిరేకించడం సహజం! అందువల్ల వారు మరణించాలనో, కేవలం వారు మరణించినంత మాత్రాన తిరిగి ధర్మ ప్రతిష్ట జరుగుతుందనో హృదయమున్న ఏ మనిషీ కోరుకోడు, భావించడు.

ఆయన ఎలాంటివాడైనా మానవతా క్షేమంగా తిరిగి రావాలనే(హెలికాప్టరు కూలిపోయిందన్న వార్త తెలిసింది)కోరుకుందాం ఇప్పటికీ! ఆశ జీవితానికి పునాది కదా!

www.madamanchipadu.blogspot.com September 4, 2009 at 8:48 AM  

Dear sir, thankful to your comments on our beloved great chief minister Dr.Y.S.Rajasekharreddy, everyone will known this issues

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP