ఈమతం పనికిరానప్పుడు కులమెందుకు ?
>> Tuesday, August 25, 2009
హిందూధర్మం లో లోపాలున్నాయి . ఇది మనకు పనికిరాదు . మాకు వద్దు. మేము మమ్మల్ని ఉద్దరించగల ,ఈ అసమానతలు లేని ,మాస్థాయిని పెంచగల మతం లోకి మేము మారతాము . ఇదీ మతం మార్చుకునేవారి భావన. సరే ఈమతం నుంచి మారావు ,బాగనేవుంది .అంటే నీ నమ్మకం ప్రకారం నీస్తాయి మతం మారగనే సంస్కరించబడి పోయినప్పుడు ఇక పాత మతం తాలూకూ గుర్తులెందుకు ? ఆయామతం లోవున్నవారితో సమానత్వాలు,అసమానత్వాలపట్ల చర్చలెందుకు .? ఆపాత మత మిచ్చిన కులగుర్తింపులెందుకు ? వాటికోసం పాకులాటలెందుకు ?
ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వారి పూర్వీకులు ఈమతవిధానం పట్ల విరక్తితో మతం మారారు. కానీ వారి పేరు వెనుక రెడ్డి గారిని తీసెయ్యలేదు .కారణమేమిటి ? ఆ తోకతో ఏప్రయోజనం ఆశించకుంటే .ఈమతాన్ని ద్వేషించి వదలినప్పుడు ఈమత మిచ్చిన ఆ అవశేషం ఎందుకు ? ఇక ఊరికి ఒకటి రెండు చర్చీలున్నా జనాభాలెక్కలలో మాత్రం ,స్కూల్లరికార్డులలో మాత్రం హిందువులుగా కనపడే జనం వారికి గిట్టని ఈ కులతోకలు ఎందుకు ఉంచుకోవాలి? వాటిద్వారా ఎందుకు లబ్దిపొందాలని ప్రయత్నించాలి? ధర్మం మారితే మనస్థితి మారిపోతుందనుకున్న ఆశలు నిరాశలయ్యాయా? ఆలోచించాలి .
ఒక్కటిగుర్తుంచుకోండి .ఏసమాజం లోనైనా మానవుల అవివేకం వలన అసమానతలు సహజం గాచోటుచేసుకుంటాయి .ఈదేశం లో వున్న్ అలాంటి అసమానతలను బాపటానికే వీరబ్రహ్మేంద్రులవంటి ప్రవక్తలు ప్రయత్నిస్తూనే వచ్చారు. అమెరికాలో నల్లవాల్లపట్ల అసమానత లేదా? వాటికి వ్యతిరేకంగా పోరాడటానికి మార్టిన్ లూథర్ కింగ్ మతం మారాడా? లేదే ? పరాయి శక్తుల చేతిలో పావుగామారి మనలోమనం సంస్కరించుకోవాల్సిన లోపాలలో బయటివారిప్రమేయాన్ని మనకు తెలియకుండానే పెంచుతున్నాము. తద్వార బలహీనులమయి ఎవరి ఎత్తులకోబలిచేసుకోబోతున్నాము మన మాతృభూమిని . ఈసందర్భంగా నమీబియా అధ్యక్షుడు అన్నమాట గమనించాలి. "తెల్లవాడు ఈదేశానికొచ్చేసరికి మాచేతిలో భూములున్నాయి .వాని చేతిలో బైబిలుంది . ఏభై ఏళ్ళు గడిచాక చూసుకుంటే మాచేతిలో బైబిలుంది ,వానిచేతిలో మాభూమి వున్నది"
ఇక్కడ లోపాలు ఇక్కడ సవరించుకోవాలి గాని పరాయి మతాల ప్రలోభాలకో ,మనమతం పట్లద్వేషం తోనో ఇలా వలసపోయి పరాయిశక్తులవారి వ్యూహాలలో భాగమయి పోయి ఈదేశ సంస్క్రుతీ సంపదలను ధ్వంసం చేసుకుంటే ఏమిజరగనున్నదో .అసలెందు కిలా జరుగుతున్నదో ? ఎప్పుడో వేలసంవత్సరాలనాడే మనమహర్షులు హెచ్చరించిన విషయాన్ని వరుస టపాలలో మీకు తెలియజేస్తాను.
ఆథ్యాత్మికత అంటే కొబ్బరికాయలు ,ప్రసాదాలవరకే తప్ప అంతకంటే ఎక్కువ ఆలోచించని స్థితికి చేరుకుంటూన్న భౌతికంగా మాత్రమేహిందువులుగా బ్రతుకుతున్న వారికొక హెచ్చరిక .కళ్ళుతెరచి చూడండి.
ఈదేశం లో మతమార్పిడి జరిగి క్రిష్టియనయినవారికి ఏదన్నా ప్రమాదం వస్తే వారినాదుకోవటానికి ఒక వంద దేశాలు ఉన్నాయి ప్రపంచాన పెద్దదిక్కుగా , ఇక అదేస్థితి ముస్లిములకొస్తే వారికోసం ఓ యాభై దేశాలు సహాయమందించడానికి ముందుకొస్తాయి. ఈదేశం లో హిందువులమైన మనకు ఆపదొస్తే తలదాచుకోవడానికి అందరికంటె పెద్దదిక్కువుంది . అదేమిటో తెలుసా? హిందూమహాసముద్రం . దాదాపు డెబ్బైకోట్లాదాకావున్న మనం శక్తిహీనులమై కాపాడమని పరుగులు పెట్టి వెళ్ళి కోరితే ,ఏంపర్వాలేదు నేనున్నాను రండి అని తనలోకి ఆహ్వానిస్తుంది. కొద్దిసేపు సంచలనం కలిగినా ఏంపర్వాలేదు తరువాతంతా ప్రశాంతంగా వుంటుంది. .కాబట్టి మనం కూడా భయపడవలసిన పనిలేదు .ఏమాత్రం స్పందించవలసిన అవసరం లేదు . కలిపురుషుని సేన ఎలా కదం తొక్కనుక్కదో? ప్రపంచాన ఎంతముప్పువాటిల్లనున్నదో ?ఆలోచించాల్సిన అగత్యం అంతకంటే లేదు.
12 వ్యాఖ్యలు:
hindu desam lo hinduvule minorityluga migilina desam manadi.
emina entha mandi hindu mattani nasanam cheyalnukunna ,adi enno 100ella nundi cheyalekapoyaranataniki mana desa charithra sakshyam.konni vandala samvathsarlu palinchina moghals enni gudulu kulcharo lekakaledu,300ellu palinchina british vallau entha praythininchina ee natiki sithram ga vundante mana matham okka goppathaname .kadantaaara? i post bagundi.
నూటికి నూరు శాతం నిజమైన మాట చెప్పారు... ప్రలోభాలకు లొంగి మతం మారిన వారికి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలని అసెంబ్లీ లో ప్రధాన పార్టీలు ప్రశ్నించకుండా పచ్చ జెండా ఊపడం దారుణం...
We Are All Hindus Now
http://www.newsweek.com/id/212155
We Are All Hindus Now
By Lisa Miller | NEWSWEEK
Published Aug 15, 2009
From the magazine issue dated Aug 31, 2009
America is not a Christian nation. We are, it is true, a nation founded by Christians, and according to a 2008 survey, 76 percent of us continue to identify as Christian (still, that's the lowest percentage in American history). Of course, we are not a Hindu—or Muslim, or Jewish, or Wiccan—nation, either. A million-plus Hindus live in the United States, a fraction of the billion who live on Earth. But recent poll data show that conceptually, at least, we are slowly becoming more like Hindus and less like traditional Christians in the ways we think about God, our selves, each other, and eternity.
The Rig Veda, the most ancient Hindu scripture, says this: "Truth is One, but the sages speak of it by many names." A Hindu believes there are many paths to God. Jesus is one way, the Qur'an is another, yoga practice is a third. None is better than any other; all are equal. The most traditional, conservative Christians have not been taught to think like this. They learn in Sunday school that their religion is true, and others are false. Jesus said, "I am the way, the truth, and the life. No one comes to the father except through me."
Americans are no longer buying it. According to a 2008 Pew Forum survey, 65 percent of us believe that "many religions can lead to eternal life"—including 37 percent of white evangelicals, the group most likely to believe that salvation is theirs alone. Also, the number of people who seek spiritual truth outside church is growing. Thirty percent of Americans call themselves "spiritual, not religious," according to a 2009 NEWSWEEK Poll, up from 24 percent in 2005. Stephen Prothero, religion professor at Boston University, has long framed the American propensity for "the divine-deli-cafeteria religion" as "very much in the spirit of Hinduism. You're not picking and choosing from different religions, because they're all the same," he says. "It isn't about orthodoxy. It's about whatever works. If going to yoga works, great—and if going to Catholic mass works, great. And if going to Catholic mass plus the yoga plus the Buddhist retreat works, that's great, too."
Then there's the question of what happens when you die. Christians traditionally believe that bodies and souls are sacred, that together they comprise the "self," and that at the end of time they will be reunited in the Resurrection. You need both, in other words, and you need them forever. Hindus believe no such thing. At death, the body burns on a pyre, while the spirit—where identity resides—escapes. In reincarnation, central to Hinduism, selves come back to earth again and again in different bodies. So here is another way in which Americans are becoming more Hindu: 24 percent of Americans say they believe in reincarnation, according to a 2008 Harris poll. So agnostic are we about the ultimate fates of our bodies that we're burning them—like Hindus—after death. More than a third of Americans now choose cremation, according to the Cremation Association of North America, up from 6 percent in 1975. "I do think the more spiritual role of religion tends to deemphasize some of the more starkly literal interpretations of the Resurrection," agrees Diana Eck, professor of comparative religion at Harvard. So let us all say "om."
అంటే నీ నమ్మకం ప్రకారం నీస్తాయి మతం మారగనే సంస్కరించబడి పోయినప్పుడు ఇక పాత మతం తాలూకూ గుర్తులెందుకు ?
__________________________________
Thats a good question - a very valid one!
" ఆథ్యాత్మికత అంటే కొబ్బరికాయలు ,ప్రసాదాలవరకే తప్ప అంతకంటే ఎక్కువ ఆలోచించని స్థితికి చేరుకుంటూన్న భౌతికంగా మాత్రమేహిందువులుగా బ్రతుకుతున్న వారికొక హెచ్చరిక" బలే చెప్పేరు అండీ.
"మనకు ఆపదొస్తే తలదాచుకోవడానికి అందరికంటె పెద్దదిక్కువుంది . అదేమిటో తెలుసా? హిందూమహాసముద్రం "
ఏమి పర్లేదు అండి ఎవ్వరు అక్కర్లేదు మనకు.. మనకు మనమే పోటి అలానే మనకు మనమే సాటి, ఎవ్వరు వచ్చి చెయ్యందించక్కర్లేదు.. మనమే ఆ హిందు మహా సముద్రాన్ని మన నమ్మకమనే చిరు చేతులతో ఈదెయ్యగలం. ఆ నమ్మకం నాకు వుంది..
కులం హిందూమత సమస్య కాదు. ఇదొక ఆర్థిక-సామాజిక-రాజకీయ సమస్య.
http://parnashaala.blogspot.com/2008/12/blog-post_879.html
హైందవం పై అన్ని రకాలుగా దాడి జరుగుతోంది. దీనిని అభివృధ్ధి అని మురిసిపోవటం మరో కోణం. ఈ రాజకీయ ఓటు బ్యాంక్ విధానాలను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈదేశం లో హిందువులమైన మనకు ఆపదొస్తే తలదాచుకోవడానికి అందరికంటె పెద్దదిక్కువుంది . అదేమిటో తెలుసా? హిందూమహాసముద్రం . దాదాపు డెబ్బైకోట్లాదాకావున్న మనం శక్తిహీనులమై కాపాడమని పరుగులు పెట్టి వెళ్ళి కోరితే ,ఏంపర్వాలేదు నేనున్నాను రండి అని తనలోకి ఆహ్వానిస్తుంది
100% correct
mmmm chala funny ga vundi especially last para i dont want to argue with u abt this topic........
but think once before writing anything..........
hindus prob vaste evaru help cheyaleda............
మహేష్ సూటిగా సమాధానం చెప్పలేదు. క్రైస్తవులు తమ మతంలో లేని సంప్రదాయం (కులం) పేరు చెప్పుకుని రిజర్వేషన్లు అనుభవించడం ఎంత వరకు హేతుబద్ధం? నాస్తిక హేతువాది అయిన మహేష్ కి ఈ విషయం తెలియదా?
antha bagundi, comments kuda bagunnayi. kani ivvi jana saamaanyam loki velli andariki telisela unte baguntundi. kevalam manalo manam gonukkunte prayojanam yemiti?
CM ki open letter iste baguntundi. Aina ayanagaru ati svartha parulu ani telustondi kada ilanti vallu chesedi chesesi migatavi pattinchu koru. siggulenivallu dharmam maaratharu. kanna talli tandrulani kalito tanne vallu veellu. bharatha deshamlo tintu deshanne tagala bette vallu.
హిందూ మతం మీద నమ్మకం లేని వాళ్ళు మతం మారొచ్చు, నాస్తికులుగానైనా మారొచ్చు కానీ హిందూ మతాన్ని వదిలి పెట్టిన తరువాత కూడా తమ పిల్లలకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు ఇప్పించడానికి హిందూ ఐడెంటిటీ అయిన కులం పేరు చెప్పుకోవడాన్ని ఎలా సమర్థించగలం?
Post a Comment