ఇప్పటి ఆథ్యాత్మిక సాధనలలో ఇదో అమాయకత్వం
>> Thursday, August 27, 2009
ఆథ్యాత్మిక లోకంలో ఇదొక అమాయకత్వం
అథ్యాత్మిక సాధనలో వున్నాము అనుకుంటున్న కొందరు తమస్వధర్మాని విమర్శించడమనే అమాయకత్వాన ఇహపరశ్రేయస్సులను ఎలా కోల్పోతున్నారో ఈ ఉదాహరణ చూడండి.
నేనొక సంవత్సరం క్రితం వినుకొండలోనున్న రంగారెడ్దిగారు అనే తెలిసివారి ఇంటికి వెళ్ళాను. వాల్లబ్బాయి రమణారెడ్డి ఇంటర్మీడియట్ లో మాక్లాస్ మేట్ అవటం వలన మేము చదువునేప్పుడు మారూమ్ కూడా వారింటికి దగ్గరవటం వలన రమణ వాల్ల అమ్మగారితో మాకుకూడా స్వంతఇంటిలో పిల్లలాగా చనువెక్కువ. ఆమె అమ్మవారి భక్తురాలు .ఆవిడకూడా నవరాత్రులప్పుడు కలశస్తాపని చేసి పూజలు నిర్వహించుకుంటూంది. ఆయనకూడా బ్రతికివున్నరోజులలో హనుమద్దీక్షతీసుకునేవారు. నేను వెళ్ళేసమయానికి వాల్ల కోడలు క్రిందగదిలో వున్నది,ఆమ్మా! అత్తయ్యఎక్కడికెళ్ళినది? అని అడిగాను. ఇప్పుడొక కొత్త సత్సంగం ప్రారంభించారన్నయ్యా ! మీకు తెలియదా .అత్తయ్య ఇప్పుడు మనపూజలు అవీ వదిలేసి ఆసత్సంగం చేస్తున్నారు పైన మేడమీద గదిలో వాళ్లంతావున్నారు ,వాల్ల సంస్థతరపున ఒకాయన గుంటూరునుంచి వచ్చి వున్నారు పైకెల్లు అని చెప్పినది. నాకనుమానం వచ్చి అవునమ్మా ! నువ్వెళ్లలేదేం అనడిగాను .నాకు ఈగుడ్దలుత్రుక్కోవటం వంతచేసుకోవటం తీరికలేదు .ఐనా వాల్లు చెప్పేది నాకర్ధంకాదులే అని అనినవ్వి ఊరుకున్నది. సరేలేమ్మా వాల్లేదన్నా సాధనలోవున్నరేమో నేను వెళితే ఇబ్బందేమో నువ్వెళ్ళి అత్తయ్యఖాళీగా వుంటే పిలువు నేనొచ్చానని చెప్పి అన్నాను . ఆవిడదిగలేరన్నయ్యా ! అనిచెప్పి ఆ అమ్మయి వెళ్ళి విషయం చెప్పినది .ఆవిడ మేడమీద గది వరండాలోకొచ్చి క్రిందున్న నన్నుచూసి దుర్గా సమయానికొచ్చావు పైకిరా అని పిలచినది.నేను మామూలుగా ఫాంట్ చొక్కామీదే వున్నాను .పైకెళ్ళి చూసేసరికి అక్కడ సత్సంగం చేస్తున్నది ఈమధ్య కాలంలో సాధనారంగం లో విస్తరిస్తున్న ఒకసంస్థ [................ మిషన్] పేరెందుకులేండి .అనవసర వివాదం .
వెళ్లాను .అక్కడ గదిలో కొందరు నేలమీద .మరికొందరు కుర్చీలలో కూర్చుని వారి గురువుగారిలాంటి వ్యక్తి ఏదో చెబుతున్నారు వింటున్నారు. ఆయనమాత్రం నేలమీదే కూర్చున్నాడు . అక్కడ వారి గురువుగారి లామినేషన్ ఫోటో [బహుశా ఆసంస్థ స్థాపకులయ్యుంటారు] పెట్టి పూలమాల వేశారు. ఆపక్కనే తరువాత వితరణ చేయడానికనుకుంటా ఘుమఘుమలాడే నేతితో చేసిన హల్వా పాత్ర నోరూరించే సువాసన వెదజల్లుతోంది . నన్నుతీసుకెళ్ళి ఆవిడ వాల్లందరికీ పరిచయం చేసినది .ఇతను దుర్గా అని మనపిల్లవాడే .పూజలూ యాగాలను చేయిస్తుంటాడు జనాలచేత అని .వాల్లుకూడా రండి రండి అని ఆహ్వానించారు. వెళ్ళి నేలమీదకూర్చున్నవారిపక్కన కూర్చున్నాను. మీరు కుర్చీమీదైనా కూర్చోవచ్చు అని చెప్పారు. పరవాలేదు ఇక్కడ క్రింద గురువుగారి ఫోటో వున్నదికదా అలా కూర్చోలేనులేండి .ఇక్కడే బాగుంది అని చెప్పాను.
సరే ! ఇప్పటిదాకా వాల్లేమి చెప్పుకున్నారో నాకు తెలియదుగానీ ఇప్పుడు నావేపుకు మల్లారందరూ . మీరేమి చేస్తుంటారు ?ప్రశ్నించారు సత్సంగం జరుపుతున్నపెద్ద నన్ను.
పెద్దగా ఏమీ చేయమండీ పెద్దలనుండి అలవాటయిన పూజ .ఎదో క్రిష్ణా! రామా !అనుకోవటం
అలాగా ! మీకు మెము చెస్తున్న కార్యక్రమం గూర్చి తెలుసా ?
లేదండీ ! ఇదే చూడడం
మీరు ఆథ్యాత్మిక సాధనలో విజ్ఞానంతో వ్యవహరించాలి .ఎప్పుడొ పెద్దలు చెప్పారని మనం చెసే వన్నీ అజ్ఞానపు పనులు .అవి వదిలి ఈమార్గానికి రావాలి ఆథ్యాత్మికంగా ఉన్నతిపొందాలంటే
ఏదోలెండి ! అందరికీ అన్నీ చేతకాదుకదా ! ఎవరికి చేతనైన మార్గం లో వారు వెలుతుంటారు .సమాధానమ్,ఇచ్చాను.
అలాకాదు ! తెలుసుకోవాలి ముందు .తెలియదనివుంటే మనిషిఎలా ఎదుగుతాడు ? మా కార్యక్రమములో మాగురుదేవులు.................. ఇలా వారి మిషన్ కార్యక్రమాలగూర్చి చెప్పుకు పోతున్నారాయన.
సరే ! కూర్చున్నాము కదా . అని వింటున్నాను.
ఎవరికి చేతనైన తెలిసిన పద్దతిలో సాధన సాగిస్తే మేలు అంతారు కదా పెద్దలు.అలాకాక తెలియని వాటిలో చేతులు పెట్టి ఉభయబ్రష్టత్వం ఎందుకు అని నేను సున్నితంగా చెబుతున్నాను.
సమయము గడిచేకొద్దీ ,నా అజ్ఞానం పట్ల గురువుగారికి అసహనం పెరుగుతోంది .ఎన్ని చెప్పినా వారి మాటలకు అంగీకారం తెలుప్కపోవటమే గాక తిరస్కరిస్తున్ననన్న భావం వ్చ్చినది కాబోలు శిష్యులముఖాలలోనూ అదే భావం గోచరిస్తున్నది.
ఈ అజ్ఞానమే మీలాంటి వారిని ఎదగనీయటం లేదు మీరుచేస్తున్న పూజలతో ప్రయోజనమున్నదా ? గురువుగారి ఆగ్రహంగొంతులో కనపడుతోంది.
అలా అని కాదండీ ! మనకు పెద్దలు చెప్పిన మార్గాలు వారు నడచిన బాటలు మన పయనానికి అనుకూలంగావుంటాయి అని నాభావం . కొద్దిగా నాకు అసహనం వస్తున్నది.వారికంటే నేను ఇంకా తక్కువస్థాయిలో వున్నాను కనుక సహజం.
మీలాంటి వారు మారరు .మూర్ఖత్వాన్నెక్కించి మనుషులను అజ్ఞానం లోనే వుంచే మార్గం మీది .గురువుగారు ఈసారి బయటపడి తిట్టటం ప్రారంభించారు . ఇక శిష్యులందుకున్నారు బోధన
ఏమయ్యా ! ఏమి తెలివిటేటలయ్యా ?చదువుకున్నావు ,.ఆలోచననుండదా ? ఆయనచెబుతున్నది అర్ధం చెసుకోవేమి? అసలు మీలా కొబ్బరికాయలు పూజలు కుంకుమలు ఇవేతప్ప వీటివల్ల ఏంలాభమని చెబుతుంటే వినవేమి . మూర్ఖులలో మొదటగావున్నావే ? వారెవరికీ నేనింతవరకు తెలియకపోయినా వాల్లు నన్ను అలా స్వంత మనిషిలా తిట్టి సంస్కరించాలని ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో పాపం ఇంటావిడ నన్ను ఇలాధూషించటం ఇబ్బందిగా వుండి పోనీలే అతనితో మనకెందుకు అతనే తెలుసుకున్న రోజు అతనే తెలిసి వస్తాడు అని వారించబోతున్నా వారు వినటం లేదు .పైగా ఆడవాల్లు కూడా ఇంకాఎక్కువగా బోధిస్తున్నారు నాకు . మేము చేయలేదా పూజలు ఇంతకుమునుపు .వాటివల్ల లాభమేమిటీ? ఇలా మాటలు చాలాదూరం వెళుతున్నాయి .
చెప్పొద్దూ ! నాకు కూడా అజ్ఞానికి కోపం సహజం కనుక ఈమాటలతో కోపం నషాలానికెక్కింది .విసుగొచ్చింది.
చూడండి , మా అమ్మ నాకు మా నాన్నను౮ చూపి వీడే మీ నాన్న అన్నది . నాకు మా అమ్మ మాటమీద పూర్ణవిశ్వాసముంది .సందేహానికి తావులేదు . కనుక ఆమె చూపినవాడే మానాన్న. అలాగే మా పెద్దలు ఇది సక్రమమైన దారిరా భగవంతుని చేరటానికి అని చెప్పారు. అంటే కాదు ఆచరించి చూపారు ,అది నిజం కనుకనే లోకం లో ఎక్కువమంది ఈమార్గాన సాగుతున్నారు. ఇక మీ అమ్మమాటలమీద మీకు నమ్మకమున్నదో లేదో ? నాకెందుకు మీఇష్టం . అని అన్నాను కోపంగా .
నువ్వు చాలాతప్పుగా మాటలాడుతున్నావు .మగవాల్లు ఆవేశపడిపోయారు .ఆడవాల్లు ముఖం మాడ్చుకున్నారు.
ఎందుకు . నేను చేసే పూజలు ,భజనలు పనికిరానివని మీరనొచ్చా ? మీమార్గాన్ని నేను ఇక్కడకొచ్చాక ఒక్కమాటన్నా అన్నానా? నేను ఇందాకనే వెళ్ళేవాడిని పిలిచారుకనుక అలావెల్లటంపద్దతికాదని మిమ్మల్ని అవమానించినట్లవుతుందని కూర్చున్నాను నామార్గాన్ని. మీరెంత తిడుతున్నా ,,సహించాను. దానికీ హద్దువుంటుంది.
అసలు నేను చేస్తున్నదీ ,మీరుచేస్తున్నదీ తేడాలేదు గమనించండి.
మీరు ఏదో విషయాలగూర్చి చెప్పుకుని ధ్యానం చేసుకుంటారు .మేమూ భగవంతుని పూజచేసుకుని ఏ భాగవతమో చదువుకుంటాము పక్కనెవరన్నా వుంటే చెప్పుకుంటాము. మొన్నటిదాకా మీరు చేసినది ఇదేకదా .
ఇప్పుడు చూడండి మీరూ మీగురువుగారి పటం బెట్టి పూలమాలవేశారు .మేమూ దేవుడు పటం పెట్టుకుని కొద్దిగా పూలుచల్లుకుని పూజచేనుకుంటాము. అంటే ! మీరు డబ్బుండి లామినేషన్ పటం పెట్టుకుంటే ఒప్పు ,మేము ఏదో మామూలు పటం పెట్టుకుంటే అది విగ్రహారధన తప్పు అవుతుంది. మరి మీదెలా కాకుండాపోయినది. మీ హల్వా ఘుమఘుమలు లేకపోయినా ఏదో మా పాయసం కూడా ప్రసాదమేగా .ఏమిటీ తేడా .గట్టిగా వాదించాను.
వీడేవడో మనకంటె తలతిక్కవెధవనుకున్నాడేమో !గురువుగారు ఈసారి మెత్తబడ్డారు .చూడండి ఇలావాదనవలన లాభం లేదు .అతని గూర్చి మనకెందుకు ,అనవసరం .వదిలేయండి అని ఆజ్ఞాపించారు సరేనండి మీరిక వెల్లవచ్చు అన్నారు ,
"నే వెళ్లను."
ఏం ఎందుకని?
"మీరింకా ప్రసాదం పెట్టలేదు."
"మరచిపోయాము ,ముందు ప్రసాదం పెట్టండివెంటనే" .గురువుగారి ఆజ్ఞ అయినది తడవు ఘుమఘుమ లాడే హల్వా
మన చేతికొచ్చినది .
"తీసుకోండి"
"నేను తినలేను"
"ఎందుకని?"
"నేనొక్కడినే ఎలాతినగలను ?"
అలాగా అందరికీ ఇవ్వండి . గురువుగారి ఆజ్ఞ
ఆనందంగా ఆపటములోని రూపంలో కూడా వున్న దత్తస్వామికి ఒకనమస్కారం పడేసి .చక్కగా తినేసి వచ్చేశాను .సత్సంగములో గడిపిన ఆసమయములో వచ్చే పుణ్యమెలాగూ వస్తుందనుకోండి మరలా వెళ్లలేదు ఇప్పుడెలాసాగుతున్నదో వారి సాధన చూద్దామని మనసులోవున్నా !
7 వ్యాఖ్యలు:
hehehe ... Tit for Tat!!!
అక్కడ జరిగినది చక్కగా వర్ణించారు. చదివి నవ్వలేక చచ్చాను.
"పూజలు చేస్తే ఏం వొరిగింది ?" అని కదా వాళ్ళ ప్రశ్న. "అసలు ఏం వొరగాలి ?" అని అడగాల్సింది. నిష్కామంగా భగవంతుణ్ణి సేవించడమే మతసారాంశం కదా !
ముందే హల్వా పెట్టమని అడిగేసి ఉంటే బాగుండేది కదా? ;-)
మంచి పనే చేసారు.
మంచి పని చేశారు గురువు గారూ!!!
అబ్బా హల్వా... నాకు నోరు ఊరుతుంది
నాకు సుందరకాండలో హనుమంతుడు గురుతొచ్చాడండీ. చూసిరమ్మంటే కాల్చివచ్చినట్టు మీరు అందరికీ హల్వా పెట్టించేసారు. బావుందండీ. హహ్హహ్హ :D
Post a Comment