శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏమాత్రం అజాగ్రత్తగావున్నా ప్రమాదమే తస్మాత్ జాగ్రత్

>> Wednesday, September 2, 2009

మన ముఖ్యమంత్రి వైయస్ ఇకలేరని నమ్మటం కష్టం గానే వున్నది. మొండితనం,పట్టుదల ,అనుకున్నది సాధించేదాకా
విశ్రమించని కార్యదీక్ష గల నాయకుడు తనబాధ్యతల నిర్వహణలోనే రణరంగం లో వీరునిలా మరణించారు. ఆయన ఆత్మకుశాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిధ్ధాము.

ఆయన బయలుదేరిన సమయము జ్యోతిష శాస్త్రరీత్యా దుర్ముహూర్తము కావటము , ఎక్కడికన్నా బయలుదేరేప్పుడు వద్దు అని ఎవరినోటనుండైనా రావటము శుభసూచకలు కాదని మనపెద్దలంటారు. శుభాశుభాలను హెచ్చరిమ్చేవారన్నా ఆయనను నిలువరించలేకపోవటము దురదృష్ట కరము. మాహత్ములైనా ,మహానాయకులైనా మృత్యువుముందు తలవంచాల్సినదే . మనకెంతబాధవున్నా విధిని ఎదిరించి మార్చలేని మానవ మాత్రులము.

ఐతే ఈబాధ విషాధం లో కొన్ని విషయాలలో అప్రమత్తతలోపిస్తే మరింత విషాధకరమవుతుంది పరిస్థితి. ఉగ్రవాదులు సమయము కోసము కాచుకుని సిద్దంగావున్నారని గూఢాచార వర్గాల హెచ్చరికలు పేపర్లలో చదువుతున్నాము. ప్రస్తుతము అధికారయంత్రాంగమంతా ఈవిషయం పైన ద్రుష్టి సారించివున్నందున వారి కదలికలను గమనించకుంటే దేశానికి మరింతప్రమాదము .వారు దేనికైన తెగబడవచ్చు. ఇక అసాంఘీక శక్తులు ఏ అవకాశాన్ని వదులుకోరు .ప్రస్తుతం హైదరాబాద్ లో గణేశ నిమజ్జనం లో వేలాదిమంది గుంపులుగా చేరే అవకాశమున్నది గనుక అక్కడ మరింత జాగ్రత్త అవసరం . గనేశ్ నిమజ్జనాలను కూడా నిరాడంబరముగాను త్వరగాను పూర్తిచేయటం మంచిది .

ఏమాత్రం అజాగ్రత్తగావున్నా ప్రమాదమే తస్మాత్ జాగ్రత్ .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP