ఏమిటీ వెర్రిమమకారం ? మరణం తప్పదని తెలిసినా !
>> Friday, September 4, 2009
జాతస్యహి మరణం ధృవం . పుట్టిన ప్రతిప్రాణీ ఏదోఒకరోజు మరణించటం తప్పదు. కాకుంటే ఆజీవి ఖర్మానుసారం చివరదశ రోగాలతోను .వేదనలతోనో .ఘోరపరిస్థితులలోనో ..సునాయాసముగానో ఏదో ఒకరీతిలో జరిగిపోతుంది . ప్రతిరోజూ మనముందు ఏదో ఒకజీవి తమప్రస్థానాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నా నేనుకూడా మరణిస్తాననేవిషయాన్ని మాత్రం నమ్మడు మానవుడు. అదినమ్మితే చాలు ఏఇతరజీవికి చెందాల్సిన దానినీ తానే స్వంతం చేసుకోవాలనే స్వార్ధానికి తెగబడడు. కానీ అలా జరకుండా మాయ అతనిని కమ్మేస్తుంది . కాబట్టే మనిషి చేయరాని పనులన్నీచేసి దాని ఫలితాలన్నిటికీ బాధ్యుడవుతున్నాడు.
అయితే కొన్నిసార్లు అంటే మరణసన్నివేశాలను చూసినప్పుడూ ఈవివేకం కలుగుతుంది. దానినే స్మశానవైరాగ్యమంటారు. మహాకవి జాషువాగారు ఇలా ఈమరణస్న్నివేశాన్ని స్మశానం లో ఆవాస్తవాలను చూసి కాబోలు .............. అద్బుతంగా తనపద్యాలలో వ్యక్తపరచారు ఆవైరాగ్యాన్ని . కాబట్టి ఏవ్యక్తి పట్లనైనా ఏవస్తువుపట్లనైనా మితిమీరిన మమకారం మానవజీవితానికి అర్ధం లేకుండా చేస్తుందని హెచ్చరించారు పెద్దలు .
ప్రస్తుతము ముఖ్యమంత్రి మరణవార్త విని తట్టుకోలేక గుండెఆగి,ఆత్మహత్యలకు పాల్పడి మొత్తం వందమందికి పైగా మరణించారనే వార్తలు చూస్తుంటే ఏమిటీ మానసిక దౌర్భల్యమని బాధకలుగుతుంది. మరణం సహజమే .అది మహాత్మాగాంధీనైనా ,మహాయోగులనైనా ,రాజకీయనాయకులనైనా రంగులుపూసుకుని నటించి మెప్పించిన నటులనైనా ఒకేరకంగా గౌరవిస్తుంది. మీరు ,నేను ,మరొకరు ఏదో వొకరోజు మరణిస్తాము. ఇది మానవజీవిత వేదనకు ఒక విశ్రాంతి . అది సహజంగా జరగాలి .అలాకాక ఆత్మహత్యలు చేసుకోవటం అనవసర ఆవేదనలు తెచ్చుకోవటం ముందుగా జీవితాన్ని ముగించటం భగవంతుడిచ్చిన అవకాశాన్న వ్యతిక్రమించడమే .దానిద్వారా మరణానంతర ము జీవి వేదనాభరితమైన స్థితిని స్వీకరిస్తాడు ఆవేదన మరింతభయంకరంగావుంటూంది.
నా అభిమానవ్యక్తి మరణం నేను తట్టుకోలేనని విలపిస్తున్నావా ? ఏదీ ఎలాకలిగినదీ అభిమానం ఆలోచించి చూడు.
నువుపెంచుకున్న విపరీత మమకారం అనేమాయ నిన్నుఅలా ఆలోచింపజేస్తున్నది అంతే . నీకు రాజకీయంగా నో కుటుంబపరంగానో ఇంకాఎలానీ చాలామంది పై అభిమానముంటుంది ఎన్నిసార్లు మరణించగలవు ? వారికోసం.
నువ్వు మానవత్వం లేని మూర్ఖుడివి ఒకప్రాణి మరణిస్తే కనీసం సానుభూతిలేకుండా విమర్శిస్తున్నావని నన్ను తిడతావేమో .అలానే కానీ ...
కానీ ఓసారి ఆలోచించిచూడు. ఈసన్నివేశం లో ఆయనతోపాటు ఇంకా నలుగురు మరణించారు .వారిపట్లనీమానవత్వం ప్రదర్శింపబడదేమి ? కేవలం నీకిష్టమైన విషయం పట్లనే మాత్రమే మమకారమనే మాయను పెంచుకుంటున్నది నువ్వే ..తుంచుకుంటున్నదీ నువ్వే ! కాదా?
నేనుపెంచిన పిల్లి ఒకరోజు మాఇంట్ళో ఎలుకతలనుకొరికినది సంతోషమేసినది. మరొకరోజు మాకోడిని పట్టుకుని తలకొరికిచంపింది దు:ఖం వచ్చినది. అదేపిల్లి ఒకేరకమయినా పనిచెసినా నాకు వేర్వేరు భావాలెందుకు కలిగాయి?
ఇక్కడ ఆభావాలకు మూలం ఆవస్తువుపట్ల నేను పెంచుకున్న మమకారం .అంతవరకు పర్వాలెదు. ఆకోడిలేకుంటే నేను బ్రతకననో , లేక ఆకోడి నిచంపినపిల్లిని చంపిగాని శాంతించననో అంటే దానిని నామూర్ఖత్వమనాలి. అవునా ?కాదా?
కనుక సోదరా ! ఆలోచించు భగవంతుడిచ్చిన జీవితం లో అభిమానం అనేది ఒకరుచి దానిని అలానే ఆస్వాదించాలి .అంతవరకే . నీకిచ్చిన జీవితం లో నీ అభిమానవ్యక్తులమరణం తో కొన్నిపాఠాలు నేర్చుకోవాలి. వారి జీవితాలలో వున్న మంచిని స్వీకరించి ఆమంచితనాన్ని నీజీవితం లో అన్వయించుకోవాలి. వారిలో వున్న చెడును కూడా తెలుసుకుని అవి నీజీవితం లోకితొంగిచూడకుండా జాగ్రత్తపడాలి. భగవంతుడిచ్చిన పూర్ణజీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించి ఆనందంగా మృత్యువుకు స్వాగతం చెబుదాము సమయమొచ్చినప్పుడు. తనంత తానుగా వచ్చినప్పుడు.
తమసోమా జ్యోతిర్గమయ
11 వ్యాఖ్యలు:
ప్రస్తుతము ముఖ్యమంత్రి మరణవార్త విని తట్టుకోలేక గుండెఆగి,ఆత్మహత్యలకు పాల్పడి మొత్తం వందమందికి పైగా మరణించారనే వార్తలు చూస్తుంటే ఏమిటీ మానసిక దౌర్భల్యమని బాధకలుగుతుంది. మరణం సహజమే
దుర్గేశ్వర గారు
నిన్న మొన్న, ఈ వారం రోజుల్లో చావబోయే ప్రతి మనిషీ సెయింట్ శామ్యూల్ రెడ్డి గారీ కోటా లేకే వస్తారు. అది మీడీయా మహిమ.
అవునండి.అది నిజంగా నిజం.
అందరూ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు చెప్తున్న ఈ దశలో ఆత్మహత్యలు చేసుకొనేవారి వైపు దృష్టి సారించినందుకు కృతఙ్ఞతలు! యోగి గారు చెప్పిన దాంట్లోనూ నిజం లేకపోలేదు .
"నిన్న మొన్న, ఈ వారం రోజుల్లో చావబోయే ప్రతి మనిషీ సెయింట్ శామ్యూల్ రెడ్డి గారీ కోటా లేకే వస్తారు." - :)
"అరవై ఏళ్ల తర్వాత రాజకీయాలలో ఉండను" అని ముందే చెప్పి అలాగే ఉండకుండా పోయిన మరో దేముని అవతారానికి మదర్ తెరెసా తో పాటు, రెడ్డి కి కూడా, వాటికన్ వాళ్లు, సెయంట్ వుడ్, ప్రకటించాలని మా డల్లాస్ లో నిన్న క్రిస్టియన్ మిత్రులు తీర్మానం ప్రకటించారు.
వాటికన్ ను సెయెంట్ వుడ్ కు ఎలా కంటాక్ట్ చేయాలో ఎవరయినా తెలిస్తే చ్ప్పండి, లెకపోతే జగన్ ఏటూ కంటాక్ట్ చేస్తారనుకోండి.
అజ్ఞానం. స్వామీ వివేకానంద ఇలాంటి విషయాలపై గూర్చే ప్రజలను జాగరూకుల్ని చేయాలని ప్రభోధించేవాడు. ఆయన రచనల్ని చాలా చదివాను. అయితే నన్నూ ఈ వేదన వదిలిపెట్టలేదు. కాకపోతే కొద్ది సేపటి తర్వాత బయటకు రాగలిగానంతే...
అర్థంపర్థం లేని దురభిమానం పట్ల ప్రశ సంధించే చక్కని టపా. భక్త కబీరు గురించి ఒక విషయం చెప్తారు, శవయాత్రకి ముందు అందరి తల చుట్టూ ఒక వెలుగు చక్రం వుందట, కానీ తిరిగి వచ్చే సమయంలో ఒక్కరికే వుందట, ఆయనే కబీరు. జరామరణ మాయ కమ్మని నిర్వికారి. ఎవరి పయనం వారిదే ఈ నడుమ బ్రతుకే నడిచే నాటకము, పాత్రధారి వంతు రావటం, ముగియటం ఆపైన వున్న జగన్నటక సూత్రధారికే చెల్లు.
ఈ వెర్రి అభిమానమే దేశప్రజలను పట్టుకునీ పలుబాధలకు గురిచేస్తున్నది.
"ప్రస్తుతము ముఖ్యమంత్రి మరణవార్త విని తట్టుకోలేక గుండెఆగి,ఆత్మహత్యలకు పాల్పడి మొత్తం వందమందికి పైగా మరణించారనే వార్తలు చూస్తుంటే ఏమిటీ మానసిక దౌర్భల్యమని"
Ikkada meeru vaari "మానసిక దౌర్భల్యమ" ani enduku anukuntunnaru ? Vari jeevithamlo vaaru chesina kharmalani batti veerandariki ilanti chaavu raasipettundi. Alane veerandaru kannu moosaru. Anthe kani deenilo "దౌర్భల్యమ" ane prasthavana endukostondi ?
Post a Comment