శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నెలసరి రోజులలో స్త్రీలను దూరంగాఉంచటముపై మీ అభిప్రాయమేమిటి?

>> Monday, January 26, 2009

స్త్రీలకు సహజ సిద్దమయిన నెలసరి రోజులలో ఇంటిలో దూరంగా ఉంచటం మన ఆచారం. దీనిని పాటించాలని పెద్దవాళ్ళు పట్టుబడుతుటే ,ఈతరం వారు చాదస్తం ఈరోజులలో ఏమిటి వెర్రి అని ఈసడిమ్చుకొటున్నారు. సరే కొద్దిమంది పాటిస్తున్నా వాళ్లు చేసేపని వాళ్లకు నిజముగా ఇష్టమై పాటిస్తున్నారో లేక పెద్దవాళ్ళ మాట తీసివెయ్యటమెమ్దుకని పాటిస్తున్నారో తెలియదు. కొందరికి దీనివెనుకేమన్నా రహస్యమున్నదేమో తెలిసివున్నదేమో. ఏతావాతా ఇది పాటిం చాలా అనే సందిగ్దం ఎక్కువమందిలో వున్నది. ఈ ఆచారము పట్ల మీ అభిప్రాయమేమిటో తెలుపవలసినదిగా కోరుతున్నాను

19 వ్యాఖ్యలు:

Anonymous January 26, 2009 at 9:26 AM  

ayya
People are losing jobs, getting hit with kings like one Mr. Ramalinga Raju, govts are changing and facing uphill tasks to do anything, banks are failing, price of common commodities (read onions and tomatoes) are outta reach of people. And it is a lucky day if people can eat two meals a day. General laborors are moving from small town to cities in search of jobs and getting nothing.

In the midst of all these, do not you have any other matter to discuss than the monthly periods of women? Pray do something better. At least you can pray for all these people and world peace.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం January 26, 2009 at 9:43 AM  

అయ్యా! అనామకుడుగారూ ! ఈ బ్లాగు ఆధ్యాత్మిక విషయాలు చర్చించడానికే ఉంది. అది మర్చిపోయి మీ బుర్రని అతలాకుతలం చేస్తున్న ఏవేవో న్యూస్ పేపర్ విషయాలు తీసుకొచ్చి అవే చర్చించాలని పట్టుపట్టడానికి అసలు మీరెవరు ? న్యూస్ పేపర్లు చర్చించే విషయాలు తప్ప మరింకేవీ మనం చర్చించకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా ?

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం January 26, 2009 at 9:56 AM  

దుర్గేశ్వరగారూ !

స్త్రీల మాసధర్మం వెనుక ఒక కథ ఉంది. అది నిజమేనని నేను నమ్ముతున్నాను. చాలా యుగాల క్రితం ఇంద్రుడు విశ్వరూపుడనే దేవగురువుని చంపినప్పుడు అతనికి బ్రహ్మహత్యాపాతకం సిద్ధించిందట. ఆ పాపాన్ని ఇతరులతో పంచుకుంటే పోతుందని పెద్దలు చెప్పగా ఇంద్రుడు కొంత ఇనుముకు, కొంత ఇతరేతరులకు, వివిధపదార్థాలకూ ఇచ్చాడట. ఆ తీసుకున్నవారిలో స్త్రీలు కూడా ఉన్నారు. వారు ఇంద్రుడి అందచందాలకి బ్రమసి అతని పాపం తీసుకోవడానికి సిద్ధపడ్డారట. అందుచేత అది మాసధర్మం రూపంలో బయట పడుతుందని చెబుతారు.

మాసధర్మం ఆ విధంగా పాపస్వరూపం కనుక దానికీ ఇతరవిధాలైన దేహవిసర్జితాలకీ స్వభావరీత్యా చాలా తేడా ఉంది. స్త్రీల ఋతుస్రావం అపరిశుద్ధమైన ప్రేతాత్మలకి, బ్రహ్మరాక్షసాత్మలకీ అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుచేత ముట్టైన స్త్రీలని ఆవహించడానికి, అనుభవించడానికీ అవి ప్రయత్నిస్తూంటాయి. అనుభవించాక చంపేస్తాయి కూడా. ఆ అనుభవం ఇహంలా కాకుండా ఒక కలలాగా ఆమెకి అనుభవంలోకి వస్తుంది. అందుకని "అది కల" అనే అనుకుంటుంది కూడా ! కానీ ఆ అనుభవాలు ఎక్కువయ్యేకొద్దీ శారీరికంగా క్షీణించి మరణించే అవకాశం ఉంది. కానీ ఆమె ఏదో రోగం వచ్చి పోయిందని లోకులు అనుకుంటారు. అందుచేత ఆ సమయంలో స్త్రీలు ప్రయాణాదులు చెయ్యడం మంచిది కాదు. జుట్టు విరబోసుకోవడం స్త్రీలకు అన్నివేళలా నిషిద్ధం. విరబోసుకున్న ఆడజుట్టు ఆ ఆత్మల్ని చాలా ఆకర్షిస్తుంది.

ఆ సమయంలో వారిని ఇంట్లోనే దూరంగా ఒక గదిలో పెట్టాలి. కానీ బయటికి పంపకూడదు.

మున్నీ January 26, 2009 at 10:08 AM  

దుర్గేశ్వరగారూ,


స్త్రీలకు సహజ సిద్దమయిన నెలసరి రోజులలో ఆమెకు శారిరకమయిన అనేక నొప్పులు చీకాకులు రావచ్చు.కనుక ఆ సమయములో ఆమెకు పనులు చెప్పకుండ ఉండడమే ఈ ఆచారం యొక్క ముఖ్య ఉద్ద్యేశం అని నా అభిప్రాయం.

Anonymous January 26, 2009 at 10:08 AM  

mundu ga mi inta aaduvari abhiprayam telusukuni maaku telupumu, appudu maa abhiprayam telipedamu.

durgeswara January 26, 2009 at 4:37 PM  

ఆర్యా
లోకములో ఏపనికాపనే జరిగిపోతూ ఉంతాయి.మనఊరిలో అదుక్కొనేవారు చాలామంది వుంటారు పాపం వాల్లు తిన్నారా లేదా అని ఆలోచించకుందా మనం రాత్రి భోజనము చేసామా లేదా? అన్ని విషయాలగురించి ఎక్కడజరగాల్సినవి అక్కద జరుగుతూనే వుంతాయి మీరు బాధపడినా పడకపోయినా
ఇక రెందవవారు వ్రాసినట్లు నేను ఇంటగెలవక రచ్చకొచ్చేరకముకాదు. కనుక మా ఆవిడను కూడా అభిప్రాయం అడిగి తీసుకున్నాను,అదికూడా వ్రాస్తాను చర్చ జరగనివ్వండి.
మరొక మనవి. మీరు నిరభ్యరంతరం గా మీ పేరు చెప్పుకోవచ్చు. ఇక్కడ అభిప్రాయాలను చెప్పినంయమాత్రాన మిమ్మల్ని ఎవరూ ద్వేషించరు. ఇది చర్చేకదా దానివలన తెలియని విషయాలు తెలుసు కోవచ్చు కదా,అవి మాకు తెలియనివి కూడా కావచ్చు. స్పందిస్తున్న మిత్రులకు ధన్యవాదములు.

Disp Name January 26, 2009 at 4:45 PM  

స్త్రీ ఇంటికి ఆటపట్టు. గృహ సీమ అందం గా ఆనందం గా ఉంది అంటే దానికి కారణం ఇంతి. అట్లాంటి మహిళ దినసరి చర్యలో ఇంటి పనుల్లో తలమునకలౌతూ ఉండటం, ఇంటిని జక్కబెడుతూ ఉండటం మన దేశం లో కాన వచ్హే సర్వసాధారణ విషయం. ఆంతే గాక ఇప్పటి ఆధునిక ప్రపంచం లొ స్త్రీ ఉద్యొగాలకి వెలుతూ ఇంటిని పిల్లల బాగొగుల్ని చూసుకుంటూ ఇంకా ఎక్కువ గా కర్పూరం లా కరిగి పొతొంది.

నెలసరి రోజులు అన్నవి ప్రకృతి సహజం. ఈ సమయం లో ఆవిదకి కావలసినది ప్రకృతి సిద్ధ వెసులుబాటు. మూడాచారమొ లెక సాంప్రదాయమొ ఎదన్నా గనివ్వంది దీని పెరుతొ ఆమెకి వెసులుబాతు దొరికె రొజులివే. కాలన్ని బట్టి అందులొని నిజ విషయన్ని గ్రహించి స్త్రీకి ఆ రొజుల్లొ ఫ్రీ సమయం ఇవ్వడం గృహ సామ్రాజ్యంలొ ఉన్న వాల్ల కనీస భాద్యత.

జిలెబి.
http://www.varudhini.tk

Anonymous January 26, 2009 at 8:00 PM  

దుర్గేశ్వరగారూ !

మీ బ్లాగులో పెట్టిన Neocounter Visitors' Stats వల్ల మీ జాలపుటలు తెఱుచుకోవడం ఆలస్యమవుతున్నట్లుంది.

Anonymous January 26, 2009 at 8:00 PM  

దుర్గేశ్వరగారూ !

మీ బ్లాగులో పెట్టిన Neocounter Visitors' Stats వల్ల మీ జాలపుటలు తెఱుచుకోవడం ఆలస్యమవుతున్నట్లుంది.

Anonymous January 26, 2009 at 8:18 PM  

Interesting discussion.
Title choodagane enduko kaasta chikaakugaa anipinchinaa.. Comments chadivaaka kaasta manchi gaa anipinchindi...
Comments chadivaaka, Naa Srimathiki koodaa 3 days holidays este entho baagunnu, aa perutho kaasta saanthavanam pondutaaru.
Alage naa daggara pani chese females lo eappudanna kaasta work lo chikaaku gaa anipiste, I used to take their tasks easy for that day. I never know when do they need some relief but they need some relief during those days.
Thanks for those commenter(s) for giving the positive comments which make sense..

సుజాత వేల్పూరి January 26, 2009 at 8:44 PM  

దుర్గేశ్వరగారు,
నెలసరి సమయంలో స్త్రీలందరూ ఒక్కేరకంగా ఉండరు. మూడ్స్ మారుతూ ఉంటాయి. కొంతమంది విపరీతంగా నిద్రపోతూ ఉంటారు. మరికొందరు ఎదుటివారిని చంపేసేంత కోపంలో ఉంటారు. మరి కొందరు అధిక స్రావం వల్ల నీరసంగా ఉంటారు. నొప్పులు, వగైరాలు మామూలే! ఇటివంటి సమయంలో స్త్రీలకు శారీరకంగా విశ్రాంతి అవసరం. ఆమెను ఇంట్లోకి రానిస్తే ఇంటిపనుల్లో పాలు పంచుకోక మానరు స్త్రీలు. అందువల్ల వారిని దూరంగా ఉంచి బలవర్ధకమైన ఆహారం(నువ్వులు, బెల్లం,నెయ్యి వగైరా ఇనుము సంబంధిత ఆహారం)ఇవ్వడం, విశ్రాంతి కల్పించడం ఇదివరలో ఆచారంగా ఉండేదని మా అమ్మ గారు చెప్పారు ఆమెకున్న సాధారణ పరిజ్ఞానంతో! ఆ దృష్టితో చూస్తే మంచిదేగా!కానీ అది మూఢాచారంగా మారడమే విచారకరం! పచ్చని చెట్టును ముట్టుకోకూడదని, పసి బిడ్డల్ని ఎత్తుకోకూడదని..ఇలా చెప్పడం విడ్డూరం!

Bolloju Baba January 27, 2009 at 12:29 AM  

menstruation is a FAILURE and at the same time HOPE.

failure of the uterus to get its egg fertilized and a hope to get it done in next attempt.

ఈ సాంప్రదాయం ప్రకృతిపరంగా చికాకు కలిగించే ఆ సమయంలో ఇంటి భారం నుండి కొంత వెసులుబాటు కల్పించే ప్రక్రియగానే అనిపిస్తుంది.

బహుసా ఇదీ ఒకరకంగా శారీరికంగా మానసికంగా ఆ స్త్రీ కోలుకొనే ఒక అవకాసమే.

ఇది వెర్రితలలు వేసి, ముహంచూడకూడదు, చప్పిడి తిండి తినాలి అంటూ పరిణమించటం దురదృష్టకరం.

భార్య భర్త కూడా పనిచేసుకోవటం తరతరాలుగా అలవాటుపడిఉన్న కొన్ని సామాజిక వర్గాలలో ఇలాంటి పట్టింపులు లేవు. (నాకుతెలిసి). ఎందుకంటే ఆ యా కులాలలో ఇలా మూలకూర్చుంటే మనుగడ కష్టం కనుక కావొచ్చు.

ఇప్పటి పరిస్థితులలో అన్నికులాలవారూ అడ్డాలో కూలీలే (సెటైర్ కాదు వాస్తవమే) కనుక ఈ ఆచారాలకు సవరణలు, మినహాయింపులు, దిద్దుబాట్లు అవసరం అనిపిస్తుంది.

దుర్గేశ్వరగారు, తాడేపల్లి గారు మీరు పెద్దలు, సాధికారికత కలవారు, మీ సూచనలు తెలియచేయండి. ఒక భావ వేదికను ఏర్పాటు చేయండి. హిందూ సమాజానికి మీ బోటి వారి మాటలు ఇప్పటికీ ఆచరణీయాలే కనుక, వెంటనేకాకపోయినా కాలానుగుణంగానైనా, వాస్తవంగా కాకపోయినా మానసికంగానైనా దాని ప్రభావం ఉంటుంది.

ధన్యవాదములతో

durgeswara January 27, 2009 at 3:10 AM  

బొల్లోజు బాబాగారూ
మమ్మ్లను గౌరవించినందుకు ధన్యవాదములు.చిన్న మనవి .మేము ఏవిషయములోనూ మీకంటే పెద్దవారము కాము.ఇక మేము చేసేఅపని మనపెద్దలిచ్చిన విజ్ఞానాన్ని ,దాని రహస్యాలను అందరము అర్ధము చేసుకుని ఉపయోగించుకునేలా చేయాలనే ఉద్దేశ్యముతోనే ఇలా చర్చలు రేపుతున్నామని గ్రహించిన మీ పెద్దమనసుకు నమస్కృతులు.చర్చ జరగనివ్వండి ఇంకా పలువైపులనుండి వారి భావాలను ప్రసరింపజేయనివ్వండి.మా అభిప్రాయాలు కూడా తెలియ జేస్తాము.

durgeswara January 27, 2009 at 11:02 PM  

నెలసరి రోజులలో మా చిన్నతనములో ఇంట్లో ఆడపిల్లలు లేరుకనుక మేమే వంటచేసేవారము.మేముముగ్గురము మగపిల్లలమే మా అమ్మకు. మానాన్నగారు వినయాశ్రమములో టీచర్ ట్రైనింగ్ పొందాడుకనుక ఆయనకు అక్కడ తప్పనిసరి వంటచేయటము విధ్యార్ధులకు కాబట్టి వంటబాగానే వచ్చు.

ఇక ఇప్పుడు మా అమ్మగనుక అందుబాటులో లేకుంటే మా అవిడ ఇంట్లోకి రాకూడనప్పుడు నాకు తప్పదు.మనంమాత్రం ఎందులో తక్కువ అని ఎంతో కష్టపడి రకరకాల కూరలు చేసినా సరే ,అబ్బే ఇందులో ఉప్పు తక్కువ ..అందులో కారం ఎక్కువ ...ఇదేంటి నల్లగా మాడింది....ఇలా మా ఆవిడ వందవంకలు పెడుతుంది. అంతేనా ఇదివ్వండి ..అదితెండి...మంచినీల్లివ్వండి...ఆ డబ్బాలో ఇవున్నాయి దించి చూడండి...ఇలా రకరకాల ఆజ్ఞలు జారీ చేస్తూ ఒకపనిని వందసార్లు చెప్పి చేపిస్తూ ఆటాడుకుంటుంది ఆ నాలుగు రోజులూ నన్ను.ఆడుకుంటున్నవుగదే నన్ను..దేవుడెందుకు మీకిలా చాన్సిచ్చాడోగానీ...అన్నననుకో., ఆ నెలరోజులు మీకు అడ్దమైన చాకిరీ చేస్తుల్లా? ఒక్క నాలుగురోజులకే అల్లాడి పోతున్నరే అంటూ కౌంటర్ మొదలుపెడుతుంది.అదిగాదు గానీ ఇలా మిమ్మల్ని నెలలో నాలుగురోజులపాటు దూరంగావుంచటం వలన నీకేమనిపిస్తుంది? అని అడిగా.హాయిగా వుంటుంది ప్రాణానికి .చక్కగా కావాల్సినవి అడిగి చేపించుకుని కూర్చుని తినొచ్చు.పండుకొని నిదురపోవచ్చు. మరొక ముఖ్యమయిన ఆనందం ఏమిటంటే ..నెలరోజులపాటు అవి తీసుకురా ...ఇవికాలేదా?..ఇంకా ఎంతసేపని పరుగులు పెట్తిస్తారు కదా/ దానికి రివెంజ్ చేసినట్లు పిచ్చ ఆనందం గా ఉంటుంది అని మనసులో మాట చెప్పినది. హమ్మా...{ఎంతకుట్ర వున్నదే నీమనసులో}ఇది నీటైమ్ ఏంచేస్తాం! అనుకుని ..అది చెబితే బాగుండదుగానీ ...ఇలా దూరంగా వుంచటం పట్ల నీ అభిప్రాయమ్ చెప్పు అడిగాను.

పెద్దలు ఊరికే పెట్టరుకదా ఈ ఆచారాన్ని దీని వెనుకఏదో బలమయిన కారణముండీ వుంటుంది.మాకు మాత్రం అనీజీగా వుండే ఈసమయము లో విశ్రాంతి ఇవ్వటము చాలా మేలనిపిస్తున్నది ,అని వివరించింది.

ఇక దీని ఈచర్చకు నేను ఒక కొత్తపోస్ట్ లో సమాధానమిస్తున్నాను చూడగలరు.

సత్యసాయి కొవ్వలి Satyasai January 28, 2009 at 3:45 AM  

బాబాగారి అభిప్రాయం బాగుంది. అవును, అందరూ అడ్డాల్లోని కార్మికుల్లాగే ఉన్న ఈరోజుల్లో పాత పద్ధతుల్లో కాక ఆధునికంగా ఆలోచించి ఆనాల్గు రోజులూ ఎందుకొచ్చాయిరా బాబోయ్ అన్న ఫీలింగు లేకుండా చేస్తే బాగుంటుంది. చాలా ఇళ్ళల్లో ఇళ్ళూ, మనసులూ ఇరుకై పోయి ఛాదస్తంగా ఇబ్బంది పెట్టడంవల్ల ఈఆచారం వల్ల ఇబ్బందే కానీ సుఖం లేకుండా పోయిందని మాకు తెలిసిన వాళ్ళమ్మాయి ఓసారి వాపోయింది.

చింతా రామ కృష్ణా రావు. February 4, 2009 at 7:57 PM  

శ్రీ దుర్గేశ్వర! విష్ణు పాద యుగళిన్ సేవించు భాగ్యంబు తా
మా దుర్గేశ్వరులిచ్చి యుండు తమకున్. ఆనందమా విష్ణు సే
వా ధర్మంబు. మహాత్మ! మీదు కృపచే ప్రాప్తించె మాకున్. సుధా
మాధుర్యంబది మీదు బ్లాగు. తమరిన్ మన్నింపగా నర్హమే?

ఆర్యా! నమస్తే.
నా కుటుంబ పరమైన అంశాల్ని మీతో చెప్పుకొని మీ సలహా తీసుకోవాలనుంది. తప్పుగా భావించరు కదా?
నా కుమారుడు చింతా వేంకట సన్యసి రామ శర్మ.
ఐ.బీ.యెం. హెచ్. వై.డి. లో సాఫ్ట్వేరింజనీర్.
వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము.యేదైనా కలిసిరాలేదు. ఒకటి రెండు సంబంధాలు ముహూర్తాల వరకూ వచ్చి కూడా ఎవరో జ్యోతిష్యులు నప్పలేదంటున్నారని చాలా బాధపడుతూ చెప్పారు.
ఎక్కడవుంది లోపం. జాతకం ప్రభావమా .
మీలాంటి వారు సరయిన సలహా యివ్వ గలరనే విశ్వాసంతో మా అబ్బాయి జన్మ నక్షత్రాది వివరాలు యీ క్రింద వివరిస్తున్నాను.
దయతో శ్రమ అనుకోకుండా చూడ గలందులకు విన్నపము.

పేరు:- చింతా వేంకట సన్యాసి రామా శర్మ.
పుట్టిన తేదీ:- 06 - 03 - 1981.యేయం {05 - 03 - 1981 రాత్రి} 03 గంటల 35 నిమిషములు.
పుట్టిన ప్రదేశము:- వైజాగ్ దగ్గర యస్. రాయవరం గ్రామంలో.

జన్మ కుండలి:-{ రాశి చక్రమునందు}:-
లగ్నం:- మకరం.
మకరంలో వున్న గ్రహాలు:-
కేతువు
బుధుడు.
కుంభ రాశి లో వున్న గ్రహాలు:-
చంద్రుడు
కుజుడు
శుక్రుడు
రవి.
లగ్నానికి సప్తమ స్థానమైన కర్కాటక రాశిలో వున్న గ్రహం:-
రాహువు.
కన్యా రాశిలో వున్న గ్రహాలు:-
గురుడు
శని.

అంశ చక్రమునందు గ్రహ సంపత్తి:-
కుంభ రాశియందు గల గ్రహాలు:-
లగ్నం
చంద్రుడు
శుక్రుడు.
మేష రాశియందుండు గ్రహము:-
రవి.
వృషభ రాశియందుండు గ్రహములు:-
కేతువు
గురుడు
శని.
మిధున రాశియందుండు గ్రహము:-
కుజుడు.
కన్యా రాశియందుండు గ్రహము:-
బుధుడు.
వృశ్చిక రాశియందుండు గ్రహము:-
రాహువు.

జన్మ కాల రాహు మహా దశా శేషాంతం తేదీ:-1988 - 02 - 16. {16 03 - 1988 వరకు.}
శని మహాదశ ప్రారంభం తేదీ:- 2004 - 02 - 16. { 16 - 02 - 2004 వ తేదీ నుండి}
శని మహాదశ ముగిసే తేదీ:- 2023 - 02 - 16.{ 16 - 02 - 2023. వరకు}

ఇదండీ సంగతి.
నేను శనిదోష నివారణార్థం శని జపం చేశాను. తిల దానం చేయించాను.
రాహువుకి కూడా జప దానాలు జరిపాము.
రాహుపూజ మాత్రం ఖాళీ కుదరక చేయించడం అవటంలేదు.

చూచారుకదా? మీరు తీరికగా ఆలోచించి తగిన సూచనలనిచ్చి సహకరించగలరని ఆశించుచున్నాను.
తప్పైతే మన్నించే మహోదార మనస్కులుమీరు.
మీరు తీసుకొంటున్న శ్రమకు నా ప్రత్యేక ధన్యవాదాలు.
ఇట్లు
సద్ విధేయుడు.
చింతా రామ కృష్ణా రావు.
{ఆంధ్రామృతం బ్లాగ్}

రావు వేమూరి February 14, 2009 at 2:23 PM  

ఆచారాల వెనుక ఏదో ఆరోగ్య సూత్రం ఉంటుందని నమ్మేవాళ్ళల్లో నేనొకడిని. ఎంగిలి, అంటు, మడి మొదలైనవన్నీ ఇలా పుట్టినవే. కాని ఆచారం వెనక ఉన్న ఆరోగ్య సూత్రాన్ని పక్కకి పెట్టి ఆచారం వెర్రి తలలు వేస్తే అప్పుడు ఆ ఆచారానికి విలువ పోతుంది.

ఉదాహరణకి బందరు రాఘవరావు గారి కొడుకు కేశవుడు ఆస్ట్రేలియాలో సిడ్నీ లోనూ, మాధవుడు ఆస్ట్రేలియాలో పెర్త్ లోనూ, గోవిందుడు కేలిఫోర్నియాలోనూ, ఉన్నారనుకుందాం. కేశవుడి కోడలు గర్భవతి. మార్చిలో ప్రసవం అవుతుందని వైద్యుడు చెప్పేడు. కేలిఫోర్నియాలో ఉన్న గోవిందుడి కూతురుకి అదే సమయంలో వివాహం నిశ్చయమయింది. పెండ్లి వార్త చెప్పటానికి పిలచినప్పుడే గోవిందుడికి అన్న కోడలు గర్భవతి అయిందని తెలిసింది.

ఆస్ట్రేలియాలో ఉన్న కేశవుడూ, మాధవుడూ, తమ్ముడి కూతురి పెళ్ళికి అమెరికా వెళ్ళటానికి సన్నద్ధులవుతున్నారు.

ఇంతలో గోవిందుడు అన్నలిద్దరినీ టెలిఫోనులో పిలచి పెళ్ళికి రావద్దని బ్రతిమాలేడు. ఎందుకుట? కేశవుడి కోడలుకి మార్చిలో పురుడొస్తే, ఆ పురిటి శుద్ధి అయేవరకూ బందరు వారింట ఎవ్వరూ పెళ్ళి చెయ్యకూడదుట. కాని అన్ని ఏర్పాట్లూ అప్పుడే జరిగిపోయాయి కనుక ముహూర్తాన్ని వెనక్కి జరిపితే వేలకి వేలు నష్టం వస్తుంది. ఇప్పుడెలా? అందుకని గోవిందుడు అన్నలని మూడు వరాలు అడిగేడు. ఒకటి, పురిటి వార్త తనకి ఎవ్వరు చెప్పకూడదనిన్నీ, రెండు, పురిటి వార్త పెళ్ళికి వెళ్ళేవారెవరికీ చెప్పకుండా దాచమనిన్నీ. అన్నదమ్ములిద్దరూ పెళ్ళికి రాకూడదన్నది మూడవ కోరిక: ఇద్దరిలో ఎవ్వరు వచ్చినా పురిటి వార్త తెలిస్తే కన్యాదానపు ఫలితం బందరు వారి పితృదేవతలకి దక్కదుట. ఈ "రూలు" కేశవుడూ, మాధవుడూ ఎప్పుడూ వినలేదు. ఈ ఆచారంలో ఉన్న శాస్త్రీయత ఏమిటో ఎవ్వరయినా శెలవియ్యగలరా? లేక మాధవుడిని పురీహితుడు బుట్టలో వేసేడా? లేక అన్నలిద్దరికంటె మాధవుడు రెండాకులు ఎక్కువ చదివేడా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపోతే ఏమిటి జరుగుతుందో తెలుసా?

durgeswara February 15, 2009 at 5:52 PM  

రావు గారూ
అసలు పురుడు పంటతో సమానము. దానిని అంటుకింద పరిగణించరాదు. తప్పు. ఇక
ప్రసూతి మైల కెవలము తల్లికి తండ్రికి మాత్రమే ఉంటూంది.
స్నానంచేపించినతరువాత య్ధావిధిగా వారూ పల్గొనవచ్చు. ఒకవేళ పెళ్ళి సమయములో
పురుడువచ్చినా దోషమేమీ కాదు.ఎలాగూ ఇప్పుడుపురుళ్ళు హాస్పటల్ లోనే
జరుగుతున్నాయి కనుక ఆతల్లి బిడ్డాలు స్నానం చెసినదాకా అక్కడే వుంటారు కౌక
ఇబ్బంది లేదు. మీరు భేతాళ ప్రశనలేమీ అడగలేదు.శాపాలు అక్కరలేదు. ఇంకా మీకు
వివరణకావాల్ంటే మరికొందరు పెద్దలచేత చెప్పించగలను.

ATOZORGANICS RAAVIRAMANA October 17, 2009 at 9:24 AM  

అయ్యా స్త్రీలలో ఋతుక్రమం నకు కారణం శరీర వ్యవస్థ నుండి వెలువడే శక్తి సంపూర్ణ విసర్జకం (ఇటీవలే శాస్త్రవేత్తలు ఋతుక్రమంలో విడుదలయ్యే రక్తస్రావంలొ మూల కణములను కనుగొన్నారు) ఈ మూలకణాల శక్తి విశ్వావిర్భావ శక్తి కి దాదాపుగా సమానం ఈకారణం వల్లనే స్త్రీలలోని శక్తి విసర్జకం పూర్తి అయ్యేంతవరకు వారిని శరీరశ్రమనుండి మానసిక ఆందోళనలకు గురి కాకుండా ఉండునట్లు చేయటం ఈ సమయంలో శారీరక,మానసిక ఆందోళనలకు గురి ఐన స్త్రీల లో శరీర వ్యవస్థ ప్రకృతి విరుధ్ధ మార్పులకు గురై పురుష హార్మోన్ల ప్రభావం ప్రస్పుటం గా ప్రదర్సితమగుతున్నాయి (ఉదా; అవాంచితరోమాలు,భుజబలం, మెడ కండరాలు మరియు మెడదిగువ కండరాలు)

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP