రాఖీలు కట్టించా ....తిక్కకుదిరింది ... గాడిదలకు .
>> Wednesday, August 5, 2009
సార్ ,..ఇక చదువులు చెప్పలేంసార్ .మీరే ఎదో ఒకటి చేయాలి అంటూవచ్చాడు మా స్కూల్ లో సోషల్ మాస్టర్ గారు.
ఏమైందిసార్ .అనడిగాను
ఏమైందేమిటిసార్ .పిల్లలకు వయస్సుకుమించిన ఆలోచనలు .మేము పాఠం చెబుతుంటే ముసిముసి నవ్వులు వంకచూపులు , కొత్తగావచ్చినవాల్లతో మరీ ఇబ్బంది సార్ టెన్త్ లో . ఈసినిమాలు మరీ చెడగొడుతున్నాయి పిల్లలను వెధవలు జోకులొకటి..........
మనం చదువుకునేప్పుడు పదవతరగతి లో ఇలా ఆడపిల్లలతో మాట్లాడాలంటే ఎంత భయం సార్ ..మనకు... ఆయన తనగోడు వెల్లబోసుకుంటున్నాడు.
నిజమే మాస్టారూ అన్నాను నేను .[ అప్పట్లో పదవతరగతి ఆడపిల్లలంటె అదొక ప్రత్యేక వర్గం వి ఐ.పి. లన్నమాట .పంతుల్లుకూడా కొట్టరు వాల్లకు మార్కులు తగ్గినా .మాకైతే వీపు విమానం మోతమోగేది .అలాంటి రోజులలో ఆడపిల్లలతో మాట్లాడటం కూడానా! ?]
మాకు ఇక్కడ పల్లెటూళ్ళలో ఎనిమిది తొమ్మిది దాకా గవర్నమెంట్ స్కూల్లోనో .లేక బయట వినుకొండ ,దర్శి లాంటి పట్టనాలలోనో చదివించి ఆతరువాత అలివిగాని బాచ్ లను ..ఇహ లాభం లేదు ..దుర్గా సార్ దగ్గరైతే అణగేస్తాడు అని తెచ్చి నాపాలిట పడేసి పోతుంటారు. తప్పదు మొహమాటాలు కనుక చేర్చుకోవటం . వీల్లలో చాలామందికి చదువు తక్కువైనా కళలు ఎక్కువ .పదవతరగతి కొచ్చేస్తారు గనుక కాస్త మాటతీరు మనసుతీరు కూడా తేడావస్తుంది. ఇక మనసినిమాల పుణ్యమా అని ఆఅతితెలివి కూడా పెరిగిపోతుంది. నాదగ్గర చిన్నతనం నుంచి చదివిన పిల్లలు పరవాలేదుగానీ ఇలా తొమ్మిది పదులలో చేరేవాల్లతో కాస్త తలనొప్పి. దానికితోడు మా మాస్టర్లు పిల్లల్తో స్నేహితుల్లా మెదిలితే బాగ చదువస్తుందనుకుంటారేమో వాల్లిచ్చేచనువెక్కువై పోతుంది ఒకోసారి.
అసలే పోర్షన్లు కాక మనం అల్లాడుతుంటే ఇదొక గోల . చదువని చెబుదామా ,కాపలాలు కాద్దమా ఏమిటో సార్ గట్టిగా కొడదామంటే చిన్నపిల్లల్లా లేరు ఇప్పుడు కాలం మారింది. ఏ అఘాయిత్యాలు చేసుకుంటారో ... అయన మరీ భయస్తుడు ఆయన భయం నాకెక్కిస్తున్నాడనిపించింది.
ఆడపిల్లలు జాగ్రత్తగావుంటూన్నారా ? అడిగాను
అమ్మో ! దొంగముండలు ..వాల్లలో కూడా కొంతమంది తో జాగ్రత్తగా వుండాలిసార్ ,మీరొస్తున్న అలికిడైతే చాలు బుద్దిమంతుల్లా తెగ నటించేస్తుంటారు . క్లాసులో ఒకటే గోల వాల్లది కూడా .
సరేలెండి కొడితే లాభం లేదు . నాలుగురోజులాగండి అని చెప్పిపంపించా ఎవరెవరు కాస్త ఎక్స్ ట్రా గాల్లో కనుక్కుని .
[ఈసందర్భంగా నాకోసన్నివేశం గుర్తొచ్చింది . మేము డీగ్రీ చదివేరోజులలో మక్కెన శ్రీను అనేవాడుమ్డేవాడు ఫైనలియర్ లో .వాడూ రౌడీ షీటర్ కూడా . మాముందు వాడు కాలరెగరేస్తూ ఆడపిల్లలదగ్గరకెల్లేవాడు మాట్లాడాలని .వాల్లు పళ్ళుతెగ ఇకిలిం చేస్తూ ఏంటన్నాయ్యా ... అని పలకరించేవాల్లు .అంతేవాడు కాలర్ దింపి పాతసినిమాలో ఎన్టీఆర్ లా చూడండమ్మా మీకేదన్నా అవసరమయితే నన్నడగండి ,మీకేంభయం లేదు నేనున్నానని హామీ ఇచ్చేసి వచ్చేవాడు .పాపం వాడి బ్రతుకలా అఖిలాంధ్ర ఆడపిల్లలకు అన్నయ్యగా మిగిలిపోయింది .]
ఇక పదవతరగతి వాల్లకు ఆఫీస్ లోకి పిలచి చెప్పాను . ఒరే ..అబ్బాయిలూ రేపు రాఖీ పండుగరోజు చిన్న పార్టీ చేకుందాము తలా ఓపాతికా పట్రాండ్ర్రా అని . అలాగే ఆడపిల్లల దగ్గర తలా ఓ పాతిక వసూలుచేసి వాల్లకు చెప్పకుండా చిన్నసైజ్ రాఖీలు తలా ఓపదిహేను తెప్పించాను .
ఈరోజు ప్రేయర్ లో రాఖీపండుగ గురించి చెప్పి ,దాని ప్రాముఖ్యతన్చెప్పి అన్నయ్యలు తమకు రక్షగావుండాలని చెల్లెల్లు అక్కలు ఇలాకట్టాలిరా .చూడండి మన పదవతరగతి వాల్లు ఎంతచక్కగా .సామూహికంగా చేసుకుంటున్నారో ఈపండుగ అని ప్రకటించేశా .పక్కలోబాంబులు పడ్డట్టు బిత్తరచూపులు చూస్తున్న వారిలో కొంతమందిని క్రీగంట గమనిస్తూ మీరుకూడా అలా పదవతరగతి వాల్లలా కల్సి మెలసివుండాలి .అర్ధమైనదా ? అంటూ సాగించా నా వుపన్యాసాన్ని.
ఆతరువాత పదవతరగతి మగపిల్లలనందరినీ ఒకవరుస నిలబెట్టి , ఆక్లాస్ ఆడపిల్లలందరిచేత వరుసగా అందరికీ రాఖీలు కట్టీంచా మిగతవారిచేత చప్పట్లు కొట్టిస్తూ ,ఒక్కొక్కడి ముఖం చూడాలి . మాస్టర్లు నవ్వలేక చస్తున్నారు అవతల . కొద్దిసేపటికి రాఖీలుకట్టీంచుకుంటున్న పిల్లకాయలకు తప్పలేదు నవ్వటం . తరువాత వాల్లచేత మాట్లాడించా . ఒక్కొక్కడూ మాక్లాసు ఆడపిల్లలు మాకు అక్కలు చెల్లెల్లుఅంటూ మనపాఠశాలలో మనమందరం ఒకేతల్లిపిల్లల లాంటివారము అంటూ చెప్పకతప్పలేదు ,ఎందుకంటే వాడికంటె ముందువాడిలా మాట్లాడకుంటే ఎక్కడ తప్పుపడతారోనని.
ఇప్పటివరకు పంతుల్లను జోకర్లుగా చిత్రిస్తున్న సినిమా వాల్లు మాలాంటి వారి విలనిజాన్ని కూడా చూపించుకోండి అని సలహా ఇస్తున్నాను.
30 వ్యాఖ్యలు:
మంచిపని చేసారు.
ha ha ha
good Idea
;-) ;-)
మీరు బుద్ధిబలం వాడారు .. నేనైతే కండబలం వాడేశా.
నా తొలి ఉద్యోగం గుంటూరు మాజేటి గురవయ్య కాలేజిలో డిగ్రీ విద్యార్ధులకు మ్యాత్స్ లెక్చరర్‌గా. డిగ్రీ రెండవ సంవత్సరం తరగతిలో ఓ బడుద్ధాయి ఉండేవాడు. అతనో చిన్నపాటి రౌడీ. పాఠాలు వినకపోటమే కాక అమ్మాయిలని ఏడిపించటం చేస్తుండేవాడు. నాకేమో ఆవేశం ఎక్కువ. ఓ సారతను అమ్మాయిలపైకి పేపర్ రాకెట్లు విసురుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. నేనతన్ని పట్టుకుని చితకబాదేశా. (తర్వాత స్ట్రైకులూ అవీ యధావిధిగా జరిగిపోయాయనుకోండి) కొట్టాక తెలిసిందేమిటంటే, అతను గుంటూరులో పేరుమోసిన రౌడీ షీటర్ తమ్ముడు! నన్ను కాపేసి కొట్టటానికి ప్రయత్నాలు జరిగాయి. విద్యార్ధుల్లో మరో వర్గం నాకు ఈ 'కుట్రదారుల' వివరాలు, వాళ్ల ప్లాన్లు ఎప్పటికప్పుడు చేరేశేది. అలా వాళ్ల బారినుండి ఎప్పటికప్పుడు తప్పించుకునేవాడిని. ఎత్తులు, పైఎత్తులతో ఓ ఆర్నెల్లు లాగించాక లెక్చరర్ ఉద్యోగమ్మీద విసుగొచ్చి మానేసి నాకు నచ్చిన రంగంలో ఉద్యోగం వెదుక్కున్నా.
అబ్రకదబ్ర
నేను కోబాల్ట్ పేట రౌడీని. నువ్వేనా నా తమ్ముణ్ణి కొట్టింది. ఎక్కడ ఉన్నావో చెప్పు. వస్తా :):)
ఆయన అమెరికాలోవుంటాడు.ఇప్పుడల్లారారు.
ఇంతకూ గుంటూర్ లో కోబాల్ట్ పేట లేదే
@అజ్ఞాత:
మీ తమ్ముడి దెబ్బకి పారిపోయొచ్చి ఇక్కడ దాక్కున్నా. నువ్వున్నన్నాళ్లూ రానుగాక రాను :-)
మా స్కూల్లో సీనియర్ ని అన్నయ్య/అక్క అని, పిలిపించేవారు.ప్రైఇ రాఖీ పండక్కి అందరినీ ఎదురెదురుగా కుర్చోపెట్టి "నువ్వు నాకు రక్ష,నేను నీకు రక్ష,మనిద్దరం దేశానికి రక్ష"అని చెప్పించి రాఖీ కట్టించేవారు.అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే పెళ్ళి సంబంధాలు చూస్తున్నప్పుడు నా ఫ్రెండుకి అన్ని విధాలా సరిపోయే సంబంధం వచ్చింది.తీరా చూస్తే ఆ అబ్బాయిని చిన్నప్పుడు అన్నయ్య అని పిలిచిన కారణం గా సంబంధం వదులుకున్నారు.అదీ మేటరు.ఇంకోటేటంటే మా అత్త కొడుకులిద్దరూ మా స్కూల్లోనే చదివేవారు.అందరినీ అన్నయ్య అని పిలిచి వాళ్లని మాత్రం బావ అనడానికి భలే మొహమాటం గా వుండేది.
భలే పని చేసారు!
http://baala.mywebdunia.com/2009/08/05/1249471860000.html ఇదే పొస్త్ ఇంక్కడ కూడా ఉంది.. అది కూడా మీదేనా లేక ఎవరన్నా కాపీ చేసారా? చూడండి ఒకసారి.
ప్రస్తుత యువతరం రాఖీ కట్టినంత మాత్రాన మారిపోతున్నారా గురువుగారు? నిజానికి రాఖీ కి అంత పవర్ ఉంటే ఈ యాసిడ్ దాడులు అవీ తగ్గించవచ్చేమో కదా అనిపిస్తుంది. మరి చిన్నవయసులోనే ఉన్మాదులుగా అయిపోయి యాసిడ్ దాడులు చేస్తున్నవాళ్ళని అలా తయారు చేయకుండా ఉండడానికి స్కూల్లోనే వాళ్ళకి ప్రేమ విలువని, జీవితపు విలువలని తెలియజేప్పే పాఠాలు పెడితే బాగుంటుందేమో.
maaripotunnara ante atleast konta mandaina maarutaaru gada.......
manchi pani chesaaru.........
మంచిపని చేసారు. నేను లెక్చరర్ గా పని చేసినప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యం లేదు ఏవైనా చిన్నా చితకా సరదాలు పడ్డా అవి మా ద్రుష్టికి రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అంతా సర్వబ్రష్టత్వం.ఆడపిల్లలు కూడా అలానే ఉన్నరు.
నిన్ననే ఒక ఒక పాత స్నేహితున్ని కలవడానికి వెళ్ళితే( అతను గుంటూరులో ఒక చైతన్యా కాలేజీ బ్రాంచీ కి ప్రిన్సిపాలు) మొత్తుకుంటూ చెప్పాడు. 15 రోజుల కిందటే ఒకమ్మాయి (అతని బ్రాంచీలో నే) లవరుతో వెళ్ళి పోయి ఇంతవరకూ ఆచూకీ తెలియలేదని.
గుంటూర్లో అశోక్ నగరూ,కంకరగుంట గేటూ, బ్రాడీపేట మధ్యలో ఉన్నదే కోబాల్ట్ పేట.
సరే మీ గౌరవనీయులైన మాస్టారూ గారి గురించి ప్రస్తావించకుండా మళ్ళీ అదే వ్యాఖ్య తిరిగి రాస్తున్నా.
అయ్యా పిల్లలు అమాయకులు. పెద్దవాళ్ళ కన్నా స్వచ్చమైన వాళ్ళు. వాళ్ళని కించపరచకండి, అనుమానించి అవమానించకండి.
హార్మోన్ల తేడాలవల్ల కొందరిపిల్లల్లో ఈ వయసులో అపోజిట్ వారిపై కాస్త ఆసక్తి ఏర్పడుతుంది. అదిఅనేకాదు పిల్లల ప్రవర్తన అల్లరి ఇటువంటి విషయాల్లో స్కూలల్లో కౌన్సిలింగ్ ఇవ్వటం ఇప్పుడు జరుగుతోంది. మీకు పిల్లల ప్రవర్తన నచ్చకపోతే అలాంటి కౌన్సిలింగ్ క్లాసులు చక్కటి సైకాలజిస్ట్ తో నిర్వహించండి.
ఇంకొన్ని స్కూలల్లో ఆడపిల్లలకు మగపిల్లలకు వేరు వేరు సెక్షన్లు గా టీచింగ్ చేస్తున్నారు అలా ప్రయత్నించండి ఆ పద్దతి బావుండవచ్చు.
బాబూ పవన్
ఇక్కద ఈవిషయాన్ని ఇలా సరదాగా రాయటానికి కారణం మారుతన్న సమాజం లో ఎల్లాంటి విపరీతాలు చోటూచేసుకుంటూన్నాయో అనెది తెలియపరచటం కోసం మాత్రమే.
ఇక మిగతావాదనలకునావివరణకూడా చూడండి. ఇక్కడ మా పల్లెలలో ఇలాపిల్లలనుమందలించటం మామూలు మాటగానేభావిస్తారు.
ఇక కార్పోరేట్ కౌన్సిలింగ్ లు వలన జరిగేమేలు కార్పోరేట్ కల్చర్కు అలవాటైనవారికి మాత్రమే సరిపోతుంది ఎందుకంటేడబ్బుతోమాత్రమే మంచిమాటనైనా కొనుక్కుని ఆహా అనుకోగలరు కనుక.
మంచిమాటనైనా కొనుక్కుని నమ్మగలరు కనుక
మాకు సాంప్రదాయ బద్దంగా ఎలకౌన్సిలింగులివ్వాలో కొన్నిపద్దతులున్నాయి అవి మనజీవితాలకు సరిపోయినవి సరయినవని నిరూపించబడ్దవి.
హార్మోన్లు ,మానసికభావాలు ....ఈతెలివితేటలు మీకన్నా ముందుగా చదివిన మాకు కూడాతెలుసని గమనించండి. మాదగ్గరచదివేపిల్లలను మాస్వంతబిడ్దలలా చూచుకునే పంతుల్లము మేము .కనుక ఎవరికి ఏసమయం లో ఎలాంటి శిక్షణనివ్వాలో తెలియని తనం లోలేము. ఇక మాప్రయోగం విజయవంతమైనది ,మాపాఠశాలకు రండి చూపిస్తాము .ఇప్పుడు పిల్లలె వాల్ల ఆలోచనలకు సిగ్గుపడుతూ ,వాటిని మరచిపోయి ఆక్కాయ్ ,చెల్లాయ్ అంటూ జోకులేసుకుంటూ కలసిపోతున్నారు .మెల్లగా.... ఈభావాలగూర్చి వీటీ దుష్ఫలితాలు సమాజం లోజరుగుతున్న ఇలాంటి వాటివల్ల అనర్ధాలు ,సినిమాలు సున్నితంగా నవ్వుతూనేవారికి చెప్పబడతాయి .మీలా అంతావ్యాపారంగా కొనుక్కుని వచ్చినట్లు జరగదు.మీకు ఇది తెలియాలంటె కొంతకాలం మావృత్తిలోకి రండి అప్పుడు అనుభవమవుతుంది .ఎలాంటీ పరిస్థితిలో ఏమి చేయాలో .
Post a Comment