త్రిదండి అంటే ఎవరు ?
>> Tuesday, August 4, 2009
- త్రిదండి
- మంగళవారం-4-ఆగస్టు ; మనం చేసే కర్మల ఫలాన్ని అనుసరించి, ఉత్తమ జన్మను కానీ, నీచజన్మను కానీ మనంపొందుతాం. ఉత్తమ కర్మలను ఆచరించడం వలన దేవత్వం లభిస్తే, మధ్యమ స్థాయి కర్మలు అనగా పుణ్యపాపాల కల యిక వలన తిరిగి మానవ లోకంలో జన్మిస్తాం. అధమస్థాయి కర్మఫలం వలన, (అన్నీ పాపాలు, హింస, మోసం, అసత్యం, అధర్మంవంటివి) పశువులుగా, పక్షులుగా జన్మించ వలసి వస్తుంది. మనస్సు, మాట, క్రియలనే ఈ మూడింటి వలన చేసే కర్మ ఫలం జన్మలను నిర్దేశిస్తుంది. కానీ అన్నింటికంటే ముఖ్యమైన మనస్సు సంకల్పాల వల్లే జన్మలు కలుగడానికి కారణం అవుతున్నాయి.లి ఈ సందర్బ ంగా మనం జడ భర తుని వృత్తాంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయనఅన్నీత్యజించి, మునియై, తపస్సాచరిస్తూ లేడి మీద సానుభూతితో, మరణకాల మున దానినే స్మరిస్తూ మరణించడం వలన ఆ లేడిజన్మనెత్తవలసివచ్చింది. కనుక సంకల్పాలు మనస్సు నుండి ఉద్బ వించేవి అధిక ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. దేహంతో చేసే మంచిచెడు పనుల ఫలితం దేహంఅనుభవించకతప్పదు. మంచి కార్యఫలం వలన శరీరానికి సుఖం, భోగభాగ్యాలు కలిగితే, చెడుకార్య ఫలితం వల్ల వ్యాధులు, రోగాలతో బాధపడవలసిందే. కనుక మనం వివేకంతో ఈ మూడు విధాలైన మనస్సు, మాట, దేహంతో జరిగే పాపకర్మలు, నాల్గు విధాలుగా జరిగే నోటితో వాణిక్కుల ద్వారా పాపకర్మలు, మూడువిధాల మనోసంబంధ పాపకర్మలు మొత్తం 10విధాలైన పాపపు పద్ధతులను విడచి, ధర్మమార్గాన్ని అనుసరించి, పాపఫలం నుండి విముక్తి పొంద వలసి ఉంది. మనం శరీర సంబంధమైన కర్మదోషాల వలన, కొండలు,చెట్లు మున్నగు స్థావర రూపాలు ఎత్త వలసి ఉంటుంది. నాల్గురకాల వాణిక్‌కర్మలచేత,పక్షిగాకానీ,మృగంగా కానీ జన్మించాల్సి ఉంటుంది. మాన సిక పాప కర్మఫలాల చేత చండాల జన్మలు లభిస్తాయి. పలుకకూడని మాటలు, దుర్మార్గపు ఆలోచనలు, చెడుప్రవర్తన లేనివారిని త్రిదండి అంటారు. అంటే వాగ్దండం, మనో దండం, కాయదండం అను వాటిని త్రికరణ శుద్ధిగా పాటించేవారు. వీటికై కామక్రోధాదులైన అరిషడ్వ ర్గాలను అణచి, వీటిపై జయం సాధించినా మోక్ష ప్రాప్తి పొందగలం. ఆదూరి హైమవతి[వార్త
- నుండి ]
1 వ్యాఖ్యలు:
వేదాన్త శాస్త్రం తెలిపిన తత్వాలు మూడు- పరమాత్మ,జీవులూ,ప్రకృతి అని ఈ మూడింటిని సూచిస్తూ 3 దండాలుంటాయి. ఆయా తత్వం ఇలా ఉంటుంది ? అలానే ఎందుకుంటుంది ? దాని ప్రయోజనమేమి ? ఇలాంటివన్నీ తెలిపేది ఆచార్యులేగద ! అందుకే ఆచార్యుల అనుగ్రహంతో మాత్రమే జీవుడు తరించాలనేది శాస్త్రసమ్మతమైన విషయం. వారినీ ఒక తత్వంగా భావించి 4వదండం గూడ ఉంటుంది. ఈ తత్వాలన్నీ ఎప్పుడూ విడిచి ఉండవు.అన్నీ కలిసి ఉంటాయని, వాటిని బంధించి ఉంచుతారు.అదే మన సిద్ధాన్తమని, దానిని ప్రచారం చేయడమే కర్తవ్యమని త్రిదండి స్వాములవారు దానిని ధరించి తిరుగుతారు.
ఈ వివరణ నేను త్రిదండి రామానుజ చిన్నజియ్యర్ గారి ద్వారా తెలుసుకున్నది.
Post a Comment