శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నూజండ్ల హనుమదాలయంలో "విజయీభవ"

>> Tuesday, March 11, 2014

మండలకేంద్రమైన నూజండ్లలోని హనుమదాలయంలో  విజయీభవ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ముందు స్వామికి పంచామృతాలతోను,వివిధ అభిషేకద్రవ్యాలతో మన్యుసూక్తప్రకారంగా  అభిషేకం జరిగింది. అనంతరం అర్చనలు జరిపి రక్షలను,పెన్నులను విద్యార్థులకు ప్రసాదంగా ఇవ్వటంజరిగింది.హనుమంతునిలక్షణాలను పునికి పుచ్చుకుని కార్యసాధకులై విజయాన్ని సాధించాలని ,జీవితంలో జయన్ని కోరుకున్నవారు స్వామిని ఆశ్రయించాలని వివరించటం జరిగింది.
ఈకార్యక్రమంలో సర్పంచ్ బాలపేరిరెడ్డి,శ్రీరామనేని హనుమంతరావు,సుదర్శనాచార్యులు,ఆచారి, రామదండు సభ్యులు సుబ్రహ్మణ్యం,బ్రహ్మానందం ఏడుకొండలు పాల్గొన్నారు.

అలాగే మన రామదండు సభ్యులు   ములకలూరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు జరిపి విద్యార్థులకు రక్షలు ,పెన్నులను అందజేశారు. ఈకార్యక్రమంలో రామదండు తరపున అంజిరెడ్డి, రామాంజనేయరెడ్డి పాల్గొన్నారు.0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP