శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమంతుని విజయఘోషతో మార్మోగిన వినుకొండ

>> Sunday, March 16, 2014

 ఈరోజు జరిగిన విజయీభవ కార్యక్రం లో విద్యార్థులు చేసిన విజయఘోష తో వినుకొండ మార్మోగింది.
పదవతరగతి  విద్యార్థుల విజయాన్ని కాంక్షిస్తూ, వారికి మనోధైర్యం,బుధ్ధి కుశలతా,ధారణాశక్తి,నిర్భయత్వం కలగాలని స్వామివారిని వేడుకుంటూ   శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం, తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు వినుకొండ గుంటిఆంజనేయస్వామి వారి ఆలయంలో  విద్యార్థులచే స్వామివారికి అభిషేకములు,పూజలు జరిపించాము. ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలవిద్యార్థులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో ఉత్సాహంతో,భక్తిశ్రద్దలతో పాల్గొన్నారు. పాఠశాలల ఉపాద్యాయులు కూడా వారివెంటవచ్చి వారి పాఠశాలల తరపున పూజలు జరిపించారు.  విద్యార్థులందరికీ  స్వామివారి రక్షలు,ఆంజనేయదండకం. పూజించిన పెన్ లను ప్రసాదంగా అందజేయటం జరిగింది  హనుమంతుని కార్యసాధనా దీక్ష,ాఅయన ఆచరణ గూర్చి పిల్లలకు వివరించటం జరిగింది. ఉన్నఒకే పరమాత్మ ఒక్కో కార్యం కోసం ఒక్కో రూపంలో అనుగ్రహం చూపుతున్నారని, విజయాన్ని ప్రసాదిమ్చే శక్తి హనుమంతుడు కనుక ఆయనను ఆరాధించి విజయాన్ని పొందినవారి జీవితాలను ఉదాహరణగా వివరించటం జరిగింది . పీఠం సేవా విభాగమైన "రామదండు " తరపున ఆచారి, నమశ్శివాయ, అంజిరెడ్డి బాలకృష్ణ, కోటిరెడ్డి,ఆంజనేయులు, చరణతేజ లు కార్యక్రమంలో పనులన్నీ చూసుకున్నారు.  వర్మగారు, లక్ష్మీనారాయణరెడ్డి,తాతాగోపాలక్రిష్ణమూర్తిగారలు  ఈ కార్యక్రమానికి కావలసిన సామాగ్రినంతా అందజేశారు.


పిల్లలు భగవంతుని మాత్రమే ప్రేమిస్తారు ,పెద్దలు మాత్రమే విబేధాలు సృష్టిస్తారు అనేది నిజం. పిల్లలంతా అన్నిమతాలవారూ స్వచ్చందంగా తరలివచ్చి చక్కగా ఈకార్యక్రమంలో  పాల్గొని స్వామి ప్రసాదాలు స్వీకరించారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP