శంభో శివ శంభో.. శివ లింగానికి సర్పార్చన
>> Sunday, January 17, 2010
ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త ఇది . పరమేశ్వరుని అర్చించిన ఫణిరాజము వివరాలు చూడండి.
-----------------------------------------------
శంభో శివ శంభో..
శివ లింగానికి సర్పార్చన
చెన్నై : సూర్యగ్రహణం రోజు తమిళనాట ఓ పాము శివలింగంపై ఆకులు వేసి అర్చన చేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని తేప్పెరుమాల్ నల్లూరులో ప్రసిద్ధి చెందిన విశ్వనాథ ఆలయం ఉంది. శుక్రవారం ఉదయం సూర్యగ్రహణానికి ముందు, సుమారు 10.30 గంటలకు ప్రత్యేక పూజలు చేసేందుకు పూజారి నీటి కోసం ఆలయ ప్రాంగణంలో ఉన్న బావి వద్దకు వెళ్లారు. అక్కడ బిల్వవృక్షం నుంచి ఓ నాగుపాము దిగి రావడాన్ని గమనించిన ఆయన దూరంగా జరిగారు. అయితే సర్పం నోట్లో ఓ ఆకు ఉండడంతో ఆశ్చర్యపోయిన పూజారి దానిని గమనించారు. ఆ సర్పం నేరుగా ఆలయంలోకి ప్రవేశించి, ఆకును శివలింగంపై వేసింది.
అనంతరం మళ్లీ బిల్వవృక్షమెక్కి మరో ఆకును తీసుకొచ్చి శివలింగంపై ఉంచింది. తరువాత శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసింది. ఈ తతంగాన్ని ఆలయ పూజారితో పాటు స్థానికులు కూడా వీక్షించి, పాముకు ప్రత్యేక పూజలు చేశారు. రెండేళ్ల క్రితం ఇదే ఆలయంలో ఓ పాము ఇలాగే పూజలు నిర్వహించిందని స్థానికులు తెలిపారు. కాగా, గ్రహణం రోజు పాప పరిహారం కోసమే పాము పూజలు చేసిందని కొందరు చెబుతుండగా, పాములకు పూజలు చేసేటంత ఆలోచనా శక్తి ఉండదని, అదేదో అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమేనని జంతు సంబంధ నిపుణులు పేర్కొంటున్నారు.
7 వ్యాఖ్యలు:
అద్బుతం. ఏదో ఒక్క సారి జరిగితే యాదృశ్చికం అనుకొవచ్చు. రెండుసార్లు అలా చేయడం నిజంగా ఆశ్చర్యం. కంటితో చూసింది కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు కొందరు. వారికి ఏదీ కనిపించదు అంతే.
అద్బుతం....
శర్మగారూ
నమ్మకం లేకకాదండి .నమ్మితే నమ్మామని చెబితే ఇప్పటిదాకా దేవుడులేడని ఉపాన్యాసాలిచ్చి మేధావులమని ప్రకటించుకుంటున్న వీరి అహం దెబ్బతింటుంది అందుకు ఇలాంతివి వాల్లు ఒప్పుకోరు .అది నిజమైనా సరే. పాపం వీళ్లమెదల్లు అలా ట్యూన్ అయి ఉన్నాయి
అద్భుతం.
నీ బొంద ఏమి కాదు !!
Grahanam roju matrame pamu yenduku vatchindi? adbuthalu appudappudu jarugutuntai nityam jaragavu, yedaina nammadagga vishayame.
greate
Post a Comment