శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తిరుమల కొండ గుండెమండుతోంది

>> Friday, March 21, 2014

మానవులం దివ్యక్షేత్రాలలో చేయకూడని పనులు చేస్తున్నాం . పరమ పురుషుని సన్నిధిలో పనికిమాలిన వారి సేవలో తరిస్తున్న అధికారగణం. మన దర్శనం, మనకొబ్బరికాయలుతప్ప మనకోసం నిలుచున్న స్వామి ప్రేమకు ప్రతిగా మనం చూపించవలసిన శ్రధ్దాసక్తులు, ఇక్కడ మనబాధ్యతలను పట్టించుకోవటం మానివేశాం . కృతయుగంలో హిరణ్యకశిపుని పాలనలో, త్రేతాయుగంలో రావణుని పాలనలోను ఎలాప్రవర్తించారో అలా అహంకారులైన పాలకులు ఇక్కడ దర్పం ప్రదర్శిస్తున్నారు.

శేషుని గుండెమండినదో  క్షేత్రపాలకుడైన రుద్రగుండు స్వామి ఆవేశం రగులుతున్నదో , పచ్చని చెట్లనునరికే పాపాత్ముల,పరమపావనస్థలాల మహిమను చులకనచేయబూనుతున్న దుండగల మనస్సులలో పుడుతున్న దురూహలకు  తిరుమల తల్లడిల్లుతున్నది. మూగజీవుల జీవితాలు ఆహుతవుతున్నవి.  మొన్న కేదారంలో పంచభూతాలలోని జలము, ఈరోజు అగ్ని  ఆవేశం చూపుతున్నాయి.  ఇవి మనకు రానున్న దారుణ కష్టాలకు సంకేతాలు కావచ్చు. మనం మేలుకోం . పుణ్యక్షేత్రాలన్నీవ్యాపారక్షేత్రాలయ్యేను,కన్నుమూసితెరిచేలోగా కానున్నది జరిగేను అని చెప్పిన కాలజ్ఞానుల మాటలు మన చెవికెక్కవు.

శ్రీనివాసా....... పాహిప్రభో

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP