శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇప్పటికి ఐదు ఆవృతులు పూర్తయి ఆరవ ఆవృతిగా నిర్వహించబడుతున్న హనుమద్రక్షాయాగం [ఒక పరిశీలన]

>> Wednesday, March 19, 2014

 హనుమత్ రక్షాయాగం. స్వామి అనుగ్రహంతో భక్తజనులు సాగిస్తున్న ఓ ఆథ్యాత్మిక ప్రయోగం. స్వామి భక్తజనపాలనకు అనేకకోట్ల ఉదాహరణలు మనకు భక్తులజీవితాలలో కనిపిస్తాయి. స్వామిని ఆశ్రయించి బాధలను తొలగించుకున్నవారు,ప్రమాదాలనుండి రక్షింపబడ్డవారు, కష్టాలనుండి గట్టెక్కినవారు,విజయం సాధించినవారు అడుగడుగునా కనపడతారు భారతావనిలో.  కలియుగంలో భక్తరక్షణదీక్షాధారియై యున్న ఆంజనేయస్వామివారి ఉపాసన, ఎటువంటిసద్యోఫలితాలను ప్రసాదిస్తుందో తమజీవితంలో నిరూపణగావించుకునేందుకు  హనుమత్ రక్షాయాగం పేరిట ఈసాధనాప్రక్రియను మొదలుపెట్టాము. ప్రతిసంవత్సరం హనుమజ్జయంతి కి హనుమద్రక్షాయాగం పూర్ణాహుతి జరుగుతూ ఇప్పటికి ఐదు ఆవృతులు పూర్తయ్యింది. ఈ ఐదుసంవత్సరాలకాలంలో ఈ సాధనా కార్యక్రమంలో పాల్గొన్న భక్తుల జీవితాలలో ఒక్కొక్కరికి ఒక్కో దివ్యానుభవాలు ప్రసాదించారు స్వామి. అనేక జీవితాలలో వెలుగుబాటలు వేయబడినాయని వారి అనుభవాలవలన తెలుస్తున్నది.

మన సాధన మనకొక్కరికే శుభాలను కలుగజేస్తున్నది. ఇలాంటి సామూహిక కార్యక్రమం వలన లోకంలో పదిమందికి మమ్చి జరుగుతున్నందున ఈ కార్యక్రమాన్ని ప్రతిసంవత్సరం సాగిద్దాం మాష్టారూ అని  మనవాల్లు అందరూ కోరటం స్వామి ఆజ్ఞగా భావించి కొనసాగిస్తున్నాము.


ఈకార్యక్రమం సాగినతీరును ఓసారి మరలా గుర్తుతెచ్చుకుందాం
స్వామి ఆజ్ఞగాభావించి ఏబదినాలుగురోజులపాటు నిత్యం స్వామికి అభిషేకములతో,పారాయణములతో స్వామి దీక్షలో ఉన్న బాల స్వాములు సాగించిన దీక్షావిధానం ఈక్రిందిలింక్ లో చూడండి.ఈ యాగానికి  అమెరికానుండి కుమార్ గారు,చెరుకూరి దుర్గాప్రసాద్ గారు,రామరాజు భాస్కర్ ఉమాశంకర్ సోదరులు ,ఉప్పుటూరి శ్రీనివాస్ గారు,వెంకటసూర్యనారాయణ గారు లాంటివారు,ఇక్కడ నాగప్రసాద్, విజయమోహన్ గారు, కంప్యూటర్ ఎరా శ్రీధర్ గారు ఇంకా స్థానిక భక్తులు సహాయ సహకారాలు అందజేసి నడిపించారు
ద్వాదశ కుండాలతో పూర్ణాహుతి యాగం జరిగింది.వివరాలిక్కడచూడండి
 http://durgeswara.blogspot.in/2009/05/blog-post_20.htmlఇక రెండవ ఆవృతి వివరాలు ఈ క్రింద లింక్ లో చూడండి
http://durgeswara.blogspot.in/2010/06/blog-post_08.html

బాలస్వాములసాధనతో సాగిన ఈయాగం లో గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున ఆహుతులివ్వటం జరిగింది. చెన్నైనుంచి హోమంలో పాల్గొనేందుకువచ్చిన మన బ్లాగ్ లోక మితృలు నాగప్రసాద్ ,సునీల్ వైద్యభూషణ్ లు ప్రధాన భూమిక వహిస్తూ యాగ నిర్వహణలో పాల్గొన్నారు. నలభైరోజులపాటు దీక్షలో ఉన్న బాల బ్రహ్మ చారులు తమ తల్లిదండ్రులతో కలసి యాగమ్ లో పాల్గొని స్వామిని అర్చించారు.


 మూడవసారి జరిగిన యాగం వివరాలు ఇక్కడచూడండి
http://durgeswara.blogspot.in/2011/05/blog-post_29.html
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద........ అన్న మాటను ఋజువుచేస్తూ సాగించిన ఈయాగం అద్భుతమైన అనుభవాలను ప్రసాదించినది. నాగప్రసాద్,మనోహర్సునీల్,,కృష్ణారావుగారిలాంటి హనుమద్భక్తులు ఈ యాగానికి సహకారం అందించారు. ఇక కోటి చాలీసా పారాయణ లక్ష్యంతో అహోబిల నృసింహస్వామి సన్నిధిలో సంకల్పం గావింపబడి, మాహాత్ముల ఆశీర్వాదములు,రాష్ట్రంలో ఎక్కడెక్కడినుండో భక్తజనసంఘాలు చేసిన పారాయణలతో, అత్యద్భుతరీతిగా సాగిన ఈ నాల్గవ ఆవృతి వివరాలు ఇక్కడ చూడండీ

http://durgeswara.blogspot.in/2012/05/blog-post_17.html

రాష్ట్రంలో సుమారు పదునాల్గు జిల్లాలనుండి చాలీసా పారాయన సహిత రామనామ ప్రతులను భక్తులు తీసుకునిరాగా, హైదరాబాద్ నుండి నాగేంద్రగారు, తాడేపల్లిగారు, విజయ్ శర్మగారి బృందం ఇలా అనేకమంది భక్తజనులుతరలిరాగా అత్యంత వైభవోపేతంగా సాగినది యాగము.స్వామికి అత్యంత ఇష్టమైన రామనామ లేఖనముతో ప్రారంభింపబడి   పూజ్యులు అన్నదానం చిదంబరశాస్త్రిగారి ప్రత్యక్షపర్యవేక్షణలో నిర్వహించబడిన ఐదవ ఆవృతి వివరాలిక్కడున్నాయి.రామనామ ప్రతులతో భద్రాచలం తరలివెళ్ళి రామకార్యం లో పాల్గొని స్వామివారికి సమర్పించడంతో యాగం పూర్తయినది.

http://durgeswara.blogspot.in/2013/02/blog-post_21.html

 ఈసంవత్సరం    రామాయణ శ్లోక ఇరవైనాలుగుకోట్లసంఖ్య కు ప్రతీకగా ఇరవైనాలుగుకోట్ల రామనామ లేఖనం తో హనుమద్రక్షాయాగం సాధన ప్రారంభింపబడింది. ఈసంవత్సరం మే ఇరవైమూడు హనుమజ్జయంతి కార్యక్రమం  ఇరవై నాలుగు,వైశాఖబహుళ ఏకాదశి  రోజు పూర్ణాహుతి నిర్వంచబడుతున్నది.ఇప్పటికే రామనామ లేఖనమునకు అవసరమగు పుస్తకాలను భక్తులకందజేయగా వారు అత్యంత భక్తిశ్రద్దలతో రామనామలేఖనం సాగిస్తున్నారు. మీ జీవితంలో స్వామి అనుగ్రహాన్ని చవిచూడతానికై మీరూ సాధన మొదలుపెట్టి ఈయాగంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాల్గొనవచ్చు. మీ ఇచ్ఛానుసారం ఈ యాగంలో భాగస్వాములవ్వనూ  తరలిరావాలని ఆహ్వానిస్తున్నాము జైశ్రీరాం.

వివరాలకై  సంప్రదించండి

durgeswara@gmail.com
9948235641


1 వ్యాఖ్యలు:

మనోహర్ చెనికల March 19, 2014 at 10:12 PM  

నిన్నో మొన్నో జరిగినట్టుంది. ఐదేళ్ళయిపోయింది మొదటిసారి నేను రవ్వవరం వెళ్ళి. నాగప్రసాద్ పుణ్యమా అని మొదటిసారి, ఉండలేక రెండో సారి, ఎలాగైనా పూర్ణాహుతికి వెళ్ళాలని మూడో సారి, రామనామజపం చేసి నాలుగోసారి, పట్టాభిషేకానికి వెళ్ళకపోయినా యాగానికి వెళ్ళాలని ఐదో సారి ఇలా ఐదు సంవత్సరాలు వెళ్ళాను. ఆ స్వామి నాకిచ్చిన అదృష్టం ఎన్నోసార్లు రకరకాల దర్శనాలు కలిగించారు. సొంతబిడ్డలా చూసుకునే మాస్టరుగారి కుటుంబం దొరికింది. ఈసారి కూడా వెళతాను. ఐతే మొదటిసారి పిల్లలు చేసిన హడావిడి మాత్రం ఎప్పటికి గుర్తుంటుంది, ప్రతీసారి పిల్లలంతా వస్తే బాగుండుననిపిస్తుంది. చిన్న చిన్నపిల్లలు రామాయణం చెప్తుంటే చెవులు రిక్కిచుకుని ఎలా విన్నారో, వింటూ వింటూ అలాగే ఊ కొడుతూ నిద్రపోయేవారు. కొండగురునాథస్వామి దర్శనం పిల్లలే చేయించారు. అన్నా అన్నా అని మాతోపాటే తిరిగారు. ఆ జ్ఞాపకాలు వెలకట్టలేనివి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP