ఆలయాలు ఎందుకు?
>> Saturday, September 21, 2013
ఆలయాలు ఎందుకు?
September 21, 2013
నిజం
చెప్పాలంటే బాధ కలుగుతుంది. ఈ రోజుల్లో ఆలయాలకు వెళ్లే వారిలో చాలా మంది ఆ
శక్తికి ఆకర్షింపబడి వెళ్లడం లేదు. భయంతోనో, ఆశతోనో వెళుతున్నారు. అసలు
గుడి స్థాపన వెనక ఉన్న విజ్ఞానం వేరు. ఉదాహరణకు ఆకాశాన్ని చూస్తే మీకు అదో
విశాలమైనదిగా గోచరిస్తుంది. మీకు కేవలం సూర్యుడు నక్షత్రాలు మిగతా గ్రహాలే
ఆకర్షిస్తాయి. అంతకుమించి ఆ అఖండంలో వ్యాపించి ఉన్న శూన్యం మీకు తెలుసా?
రూపం లేని ఆ శూన్యంలో పరమానందాన్నిచ్చే అనుభవం ఒకటుంది. దాన్ని
తెలుసుకోవడానికే గుళ్లూ, గోపురాలు స్థాపించబడినాయి. ఆ పరమానందాన్ని
తెలుసుకోవడానికి మీ పంచేద్రియాలు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం)
సరిపోవు. పంచేద్రియాల విజ్ఞానంతో విశ్వాన్ని అర్థం చేసుకుంటానని భావించడం
ఎలా ఉందో తెలుసా? ఒక జెన్ గురువు దగ్గరకి ఒక కోతి వచ్చింది. తనను
శిష్యునిగా స్వీకరించమని అడిగింది."వే రే వాళ్ల దగ్గర లేని సామర్థ్యం నా దగ్గర ఉన్నది ఒకే గెంతుతో 100 చెట్లను దాటేస్తాను'' అంది. ఆ కోతికి ఒక కత్తి ఇచ్చారు గురువు. 'ఈ రోజు ఎంత దూరం వెళ్లగలవో అంత దూరం వెళ్లు. అక్కడ ఈ కత్తితో ఒక గుర్తుపెట్టి తిరిగిరా. ఆ తరువాత నా అభిప్రాయం చెప్తాను' అన్నారు. ఆ పందెం తేలిక అనుకుంది కోతి. జెన్ గురువును అదరగొట్టాలని అనుకుంది మామూలు కన్నా ఎక్కువ వేగంతో ఎగురుతూ వెళ్లింది. అలసట వచ్చాక ఒక చోట ఆగి ఒక చెట్టు మీద కత్తితో గుర్తు చెక్కి తిరిగి వచ్చింది. 'నేను గుర్తుపెట్టిన చెట్టును చూడాలంటే మీరు కొన్ని నెలల పాటు ప్రయాణం చేయాలి' అంది కోతి. "అక్కర్లేదు!'' అని జెన్ గురువు మందహాసం చేశారు. తాను కూర్చుని ఉన్న చెక్క పలకను చూపించాడు. దాని మీద కోతి చెక్కిన గుర్తు కనిపించింది. ప్రపంచపు బ్రహ్మాండంలో మానవుడి ప్రయాణం కూడా ఇంతే. ఎంత దూరం వెళ్లాననుకున్నా, ఏమి సాధించాననుకున్నా చేసిందీ వెళ్లిందీ ఎక్కడకూ లేదు. ఇటువంటి ప్రయాణాలకు మించిన పయనం కొరకు నిర్మింపబడినవే ఈ కోవెలలు.
దేవాలయాలు ఎందుకో ఇంకా తేలికగా చెప్పాలంటే ఏమీ లేని శూన్యం మీద విశాలమైన ఒక తివాచీ పరిచి ఉందనుకోండి. మీరు ఆ తివాచీ మీదే ఉన్నారు. అనుభవంతో పండిపోయిన వారు శక్తినిండిన స్థితిలో వైజ్ఞానికంగా ఆ తివాచీ మీద ఏర్పరచిన రంధ్రాలే ఈ కోవెలలు. ఆ రంధ్రాలలో పడిపోతే ఆవల ఉన్న శూన్యాన్ని, ఆ పరిమితిలేని శూన్యాన్ని అనుభూతి చెందగలరు. ఆ అంతుచిక్కని శూన్యమే 'శివ' నిరాకార తత్త్వం కలిగిన శూన్యం ఒక రూపం సంతరించుకున్నప్పుడు మొదట ఏర్పడే రూపమే లింగం. దేని నుంచి ఉద్భవించామో ఆ శూన్యతత్త్వమైన 'శివ'తో ఏకమైపోవడానికే ప్రారంభంలో ఆలయాలు నిర్మింపబడ్డాయి.
మొదట్లో నిర్మింపబడిని వేలకొలది ఆలయాలు ఏ అట్టహాసాలు లేకుండా కేవలం లింగాలతోనే ఉండేవి. మనుషులను ఆకర్షించడం వాటి ధ్యేయం కాదు. కాలక్రమేణా మానవుడి ఆకస్తి మారిపోయింది. చివరకు లభించే ముక్తి కంటే వెంటనే కావలసినవి ముఖ్యం తోచాయి. ఆ అవసరాలకు తగినట్లు శక్తులను ప్రసాదించే రూపాలను స్పష్టించడం ప్రారంభించాడు. ఆలయాలకు సంబంధించిన విజ్ఞానమెలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్న మానవుడు శక్తికి ఒక దైవం, ధనానికి ఒక దైవం, చదువుకు ఒక దైవం, కాపాడి రక్షించేందుకు ఒక దైవం అంటూ ఎన్నో రకాల దేవుళ్ల కొరతకు ఆలయాలు నిర్మించాడు. ఈ రోజు గుళ్లకు వెళ్లే అధికశాతం ప్రజలకు అక్కడ నిక్షిప్తమైన శక్తిని గ్రహించే స్థాయిలేదు కనుక స్పర్శ లేని వారిలా ఉన్నారు.
శక్తితో కూడిన గుడి ఏది? ఏది మామూలు కట్టడం? అనే బేధం తెలుసుకోలేక ఉన్నారు. మహాయోగుల వల్ల నిర్మింపబడిన గొప్ప శక్తివంతమైన ఎన్నో అలయాలు మన దేశంలో ఆదరణలేక పాడైపోవడం వాటి శక్తి తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. మిమ్ములను ఆవేశపూరితం చేసే ఆలయాలు కావాలనుకుంటున్నారు. కోరికలు తీర్చే స్థలంగా ఏ కోవెలకు ఎక్కువగా ప్రకటన చేస్తున్నారో అవి ప్రముఖమవుతున్నవి. ప్రముఖమైనంత మాత్రాన ఆ కోవెలకు ఆ శక్తి ఉన్నట్లు చెప్పలేం. శూన్యం నుంచి పుట్టిన వన్నీ తిరిగి ఆ శూన్యంలో కరిగిపోతున్నాయనే సత్యాన్ని ఆకళింపు చేసుకోవడానికి స్థాపింపబడినవే నిజమైన ఆలయాలు.
ం సద్గురు
1 వ్యాఖ్యలు:
Manchi...udaharana...
http://devotional-mp3.blogspot.in/
Post a Comment