మరణస్పృహ ఒక మహా గురువు
>> Wednesday, September 25, 2013
మరణస్పృహ ఒక మహా గురువు
September 25, 2013[andhrajyothi]
చికాగోలో జరిగిన విశ్వమత సమ్మేళనంలో ప్రసంగించిన
అనంతరం స్వామి వివేకానందను కలవడానికి అమెరికాకు చెందిన 50 ఏళ్ల వ్యాపార
వేత్త వచ్చాడు. వ్యాపార రంగంలో తాను అత్యున్నత స్థాన ంలో ఉన్నా, జీవన
మోక్షానికి సంబంధించిన జ్ఙానం తనకేమీ లేదన్న ఒక లోతైన భావన అతన్ని ఎన్నో
ఏళ్లుగా వెంటాడుతోంది. కాకపోతే ఆ జ్ఞానం కోసం ఎక్కువ సమయం వెచ్చించే
పరిస్థితి తనకు లేదని అతడు ఆవేదన చెందుతున్నాడు కూడా. వివేకానందను కలిసిన
సమయంలో ఆ మాటే చెప్పాలనుకున్నాడు. 'స్వామీ! సభలో మీరు చేసిన ప్రసంగానికి
సంబంధింంచిన కొన్ని వాక్యాలు నేను పత్రికల్లో చూశాను. అవి న న్ను అమితంగా
ఆకట్టుకున్నాయి. నాకు మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించగలిగే శక్తి మీకు ఉంద ని
ఎందుకో నాకనిపించింది. కాకపోతే, అలాంటి ఆశతో ఇప్పటి కి ఎన్నోసార్లు నేను
ఎంతో మంది యోగుల్ని, రుషుల్నీ, సాధువుల్నీ కలిశాను. అయితే వారంతా ఆ జ్ఞాన
సిద్ధి కోసం లోతైన అధ్యయనం, నిరంతర సాధన అవసరమని చెప్పిన వాళ్లే. వాస్తవం
ఏమిటంటే నా వద్ద అంత సమయం లేదు. అందుకే వాళ్లు సూచించిన సాధనల్లో ఏ ఒక్కటీ
నేను చేయలేదు. నాకది అప్పుడూ సాధ్యం కాలేదు.ఇప్పడే కాదు. ఎప్పటికీ సాధ్యం కాదు. అందువల్ల మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే. నాకు మోక్ష జ్ఞానం కావాలి. కానీ, దాని కోసం వేదాలు, ఉపనిషత్తులూ చదవమని గానీ, యజ్ఞ, యాగాలు చేయాలని గానీ, యోగా, ధ్యానాలు చేయాలని గానీ, నిరంతర సాధన చేయాలని గానీ, ఇవేవీ చెప్పొద్దు. నేను వాటిలో ఏ ఒక్కటీ చేయలేను' అన్నాడు.
స్వామి వివేకానంద వ్యాపారి మాటలు విని లోలోపల నవ్వుకున్నాడు. ఆ తరువాత అతనితో 'మోక్షజ్ఞానానికి సంబంధించి రెండు మూడు వాక్యాలకు మించి చెబితే వినే సమయం లేదన్నారు కదా! రెండు మూడు వాక్యాలు మాత్రం ఎందుకు? నేను మీకు ఒకే ఒక్క వాక్యంలో ఆ జ్ఞాన సిద్ధి కలిగే మార్గం చెబుతాను సరేనా?' అన్నాడు వివేకానంద. ఆ మాటలు విన్న వ్యాపారి సంబ్రమాశ్చర్యాలతో తడిసి ముద్దయిపోయాడు. అతని ముఖం కాంతి పుంజంలా వెలిగిపోయింది. 'ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే చెప్పండి స్వామీ! చెప్పండి' అన్నాడు ఎంతో ఆతృతగా. ఇంక ఏమాత్ర ఆలస్యం చేయకుండా 'మీరు వేదాలు, ఉపనిషత్తులు ఏమీ చదవొద్దు. యజ్ఞయాగాలేమీ చేయొద్దు. యోగా ధ్యానాలు అవసరమే లేదు. నిరంతర సాధనతో పనేలేదు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే రోజుకు ఒకసారి మీ మరణాన్ని మీరు గుర్తు చేసుకోండి. చాలు. నేను చెప్పడం పూర్తయిపోయింది. మీరింక వెళ్లిపోవ చ్చు'' అన్నాడు వివేకానంద. వ్యాపారి కొద్ది క్షణాలు ఆశ్చర్యంగా చూశాడు. అతని హృదయంలో ఏదో విస్పోటనం జరిగినట్లు అనిపించింది. పశ్చాత్తాపంతో అతని అహం, అజ్ఞానం పటాపంచలు కావడం మొదలయింది.
అతని కళ్లల్లోంచి ధారాపాతంగా కన్నీళ్లు ప్రవహించసాగాయి. వెంటనే పాదాల మీద మోకరిల్లి. స్వామీజీ ఒకే ఒక్క మాటతో నా కళ్లు తెరిపించారు మరణ స్పృహ కలగనంతకాలం మనిషికి జీవితం విలువ తెలిసి రాదు. మోక్ష జ్ఞానం కలగద ని ఎంత సూక్ష్మంగా చెప్పారు! నేను ఇన్ని దశాబ్దాలుగా వెతుకుతూ ఉండిపోయింది. ఈ రోజు మీ ద్వారా నాకు దొరికి పోయింది. జీవితమంతా నేను మీకు రుణపడి ఉంటాను' అంటూ సెలవు తీసుకున్నాడు వ్యాపారి.
-ఆనంద వర్థన్
1 వ్యాఖ్యలు:
Cheppina vidhanam baavundi....chaalaa..
Post a Comment