శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రామున్ని నమ్మిన వారిని సదా హనుమ రక్షిస్తారు అనేది నిజమా ? ఇదిగో ప్రత్యక్ష ప్రమాణం

>> Monday, August 29, 2011


యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం.......అని అంటారు కదా నిజంగా రామున్ని నమ్మినవారిని కంటికి రెప్పలా ఎలాకాపాడుతాడో స్వామి ఈ ఉదాహరణ చుస్తే తెలియటం లేదా ! ఈసంవత్సరం పీఠం లోజరిగిన హనుమత్ రక్షాయాగం లో హనుమజ్జయంతి నాడు పూర్ణాహుతిలోలో పాల్గొన్న ఒకరామభక్తుడు తన స్వానుభావాన్ని వ్రాశి పంపారు .ఆయన తనపేరు చెప్పొద్దనటం వలన ఆయన పంపిన మెయిల్ నుండి పేరు తొలగించాను . అయితే ఆరోజు యాగానికి వచ్చిన మన అంతర్జాల మిత్రులకు అతను పరిచితుడే .ఆయన పంపిన మెయిల్ యథాతథంగా చదవండి]

------------------------




గురువుగారు
నమస్తే ..
మొదటి శ్రావణ మంగళవారం నాడు గుర్తు చేశారు, కనీసం చివరి శ్రావణ మంగళ వారానికైనా అందించాలనుకున్నాను. చిత్తగించండి.

ఒక్క అభ్యర్ధన .. నా పేరు మాత్రం ఎక్కడా ప్రచురించకండి.. .. ఎందుకో నాకు పేరు చెప్పుకోవాలనిపించడం లేదు ..
భవదీయుడు
.............................

ఎనిమిదేళ్లకుపైబడిన నా సాఫ్ట్వేర్కెరీర్లో నాకు ఒక విషయం బాగా అర్ధమైంది. ఉద్యోగం, కెరీరు, డెడ్లైన్లూ, డెలివరీలూ, క్లైంట్లూ, బిల్లింగులూ వీటన్నిటి వెనక్కాల మన ప్రమేయం ఎంత మాత్రమూ లేని మనం ఏవిధంగానూ ప్రభావితం చేయలేని కొన్ని విషయాలు సూపర్పవర్లు ఉంటాయి. అది అమెరికా ఆర్ధిక మాంద్యమే కావచ్చ్చు, మన టీముల్లో నడిచే గ్రూపు రాజకీయాలే కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. వీటన్నిట్లో నెగ్గుకురావాలంటే మన పనిమీద మనకుండే నైపుణ్యమో, వృత్తిమీద ఉండే నిబద్ధతో సరిపోవు. మనల్ని వెనకుండి నడిపించే ఒక శక్తికావాలి.

నా జీవితానికి సంబంధించి నాకు నా ఆలోచనలూ నా ప్రణాళికలూ చాలా వరకూ ముందుగానే సిద్ధం చేసుకుని ఉన్నాను. నా 22 సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను, ఎనిమిదేళ్లతర్వాత ఈరోజుకున్న స్థితిగతులప్రకారంగా లెక్కవేసుకుంటే మరో పదేళ్ళు, పన్నెండేళ్ళు ఏకధాటిగా ఉద్యోగం చేస్తే 42 సంవత్సరందాటాక ఇక ఉద్యోగం చేయదలచుకోలేదు. వయసురాగానే ఇంత వత్తిడి ఉన్న ఉద్యోగాన్ని ఇకచేయదలచుకోలేదు. నేను తప్పుకుని వత్తిడిని భరించగలిగి, నాలా ఔత్సాహికుడైన మరో యువకుడికి అవకాశం ఇవ్వదలుచుకున్నాను.

ప్రణాళిక బానే ఉంది, కానీ అది అమలుజరగాలంటే దానికి బలమైన పునాది పడాలి. 9 to 6 ఉద్యోగమొక్కటే సరిపోదు, నా లక్ష్యం చేరుకోవడంలో నాకు ఎదురవబోయే ప్రతీ అవరోధం మీదా నాకు ఒక అవగాహన ఉంది. ప్రకారంగా రిస్కులు తీసుకోవడానికి, పడినా లేచి నిలబడడానికి ఇదే సరైన సమయం అనిపించింది.

ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను.

ఒక ప్రణాళిక ప్రకారం 365 రోజులపాటు కష్టపడితే ఒక పునాది ఏర్పడుతుంది, తర్వాత కొంతమంది సాయం తీసుకుని దాన్ని మరికొన్నాళ్ళు స్టెబిలైజ్చేయగలిగితే నేను ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది అనుకున్నాను.

అయితే అన్నీ అనుకున్నట్లు జరగలేదు, ఒక తప్పటడుగు పడింది. నా వల్ల.. కేవలం నా వల్ల.. నా క్షణికావేశం మూలాన సాధించిన ప్రగతి అంతా నేలపాలయి మళ్ళీ సున్నా నుంచీ నిర్మించుకునే పరిస్థితి వచ్చింది.

చిన్నప్పుడు మా అమ్ముమ్మ రోజూ రాత్రివేళ భోజనం ముగిశాక రామాయణం కధలు చెప్పేది. నాకు ఒక 7,8 సంవత్సరాల వయసులో రామదాసు, తానీషా కధ తెలుగువాచకంలో చదివి నేను ఒక సందేహం అడిగాను. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము, పతకమునకు పట్టె పదివేల వరహాలు, ఎవడబ్బసొమ్మని కులుకుతు తిరిగావు రామచంద్రా అని రామదాసు తిట్టాడు కదా? అయినా ఆయనికి రాముడు దర్శనం ఎలా ఇచ్చాడు అమ్ముమ్మా అని! "ఆయన అలా తిట్టాడు కాబట్టే అన్ని రోజులు చెరసాలలో అఘోరించాడు, పొరపాట్న కూడా దైవదూషణ తగదు, ఫలితం అనుభవించక మానవు” అని చెప్పింది.

ఒకటికి పదిసార్లు నన్ను నేను తిట్టుకోవడం నాకు ఇష్టంలేదు. పొరపాట్లు జరుగుతాయి, కొన్నిసార్లు అలా జరిగిపోతాయి, నేను దేవుణ్ణికాను, గొప్పతనమూ లేని ఒక మనిషిని, నా వల్ల మరిన్ని పోరపాట్లు జరుగుతాయి. కానీ చేసిన పొరపాటుని క్షమించకుండా దాన్ని మరింతగా పెంచేసి, దాని పర్యవసానాలని నాకు అంత త్వరగా, అంత కఠినంగా విధిస్తున్న దేవుణ్ణి అంతకన్నా ఎక్కువసార్లు విమర్శించుకున్నాను. "ఏమయ్యా రామయ్యా ! ఏదో తప్పుచేశాను సరే, నువ్వునాకు అనుక్షణం అందిస్తున్న సంకేతాలని గుర్తించకుండా ఏదో మాయలో పడి అలా ప్రవర్తించాను సరే, నా మీద కొంచెం కూడా దయలేదా? మరీ ఇంత కఠినమైన పరిక్షపెడతావా? అంటూ”

ఇక ఒకవైపు మనసు కకావికలంగా తయారైంది. సుఖంగా గడుస్తున్న జీవితాన్ని ఒక్క స్వయం కృతాపరాధంతో కష్టాల్లోకి నెట్టుకున్నాను, ఇక నా చేతిలో ఏమీ లేదు, అంతా మనల్ని నడిపిస్తున్న సూపర్‌ పవర్‌ చేతిలో, మన కార్పొరేట్‌ కెరీర్‌ ని శాశించే సూపర్‌ పవర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. నేను చేయగలిగింది వేచి చూడడమే. నాకు అస్సలు నచ్చని పరిస్థితి అది, నా వంతు ప్రయత్నంగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాను.

అదే సమయంలో నాకు ఒక గురువుగారినుండీ ఫోన్వచ్చింది. మరి ఆయనకి నామీద ఎందుకని అభిమానమో నాకు తెలీదు, ఆయనకి తెలిసున్న అంతమంది కుర్రాళ్ళలో నాకున్న ప్రత్యేకతేంటో నాకుతెలీదు. నన్ను పీఠానికి రప్పించడానికి గత పదినెలలుగా ఆయనతో పలికిస్తున్న శక్తికున్న గొప్పతనమేమిటో నాకు తెలీదు. హనుమజ్జయంతిని పునస్కరించుకుని 40 రోజులపాటు వ్రతం చేస్తున్నాం, ఫలానారోజు మొదలుపెడుతున్నాం, నువ్వు రావాలి అని మైల్వచ్చింది. రాలేను గురువుగారు అని బదులిచ్చాను, సరే కనీసం దీక్ష ముగించేరోజుకైనా సరే రావాలి, పూర్ణాహుతికి ఉండాలి అని మరో మైల్వచ్చింది. అక్కడితో ఆగలేదు కనీసం 4 ఫోన్లు వచ్చాయి, నేను దేశంగాని దేశంలో ఉన్నా, మీటింగులో ఉన్నా, జిమ్ములో ఉన్నా, నన్ను వదల్లేదు, వెతుక్కుంటూ వచ్చేశాయి పిలుపులు.

సరే కానీ అనుకున్నాను, అక్కడికి వెళ్ళి హనుమంతుడితోనే చెప్పుకుందాం నా బాధలు అనుకున్నాను. కనీసం ఆయన సాన్నిధ్యంకోసం, గురువుగారి సంతృప్తికోసం, యఙ్ఞం లో పఠించే వేదమంత్రాల ధ్వనికోసం, పాప ప్రక్షాళన చేసే పూర్ణాహుతి సెగకోసం, ఒక పవిత్రమైన కార్యంలో పాలుపంచుకున్న అనుభూతికోసం, అన్నిటికీ మించి అన్నిసార్లు పిలిపించిన అమ్మ పిలుపుకోసం బయలుదేరక తప్పదన్న నిర్ణయానికి వచ్చాను.

పొద్దున 9 దాటితేగాని నిద్రమెలకువారాని వాడికి సరిగ్గా తెల్లవారుఝామున నాలుగు గంటలకి మెలకువ వస్తుందే. గంట నుంచి కురుస్తున్న భోరున వర్షం అభాగ్యుడు బయటకి వచ్చీ రాగానే ఎవరోపిలిచినట్లు ఆగిపోతుందే? నిండా గుప్పెడు లేని పెట్రోలు పదికిలోమీటర్లు ఆగకుండా నడిపిస్తుందే, 5 గంటల 5 నిముషాలకి స్టేషను వదిలివెళ్ళిపోవాల్సిన బస్సు పదినిముషాల పాటు ఆగిపోయి వీణ్ణి ఎక్కించుకుని కాని బయల్దేరదే? తోవతెలియక ఎవరిని సాయమడిగినా నేను చేప్తా నేను చెప్తా అని వంతులేసుకుని చెప్తారే, మారాల్సిన మూడు బస్సులు పట్టుమని ఒక్క నిముషం కూడా ఆలశ్యం చేయకుండా పోటిలుపడి ఒకదానికొకటి అందిస్తాయే .. అన్నిటికీ మించి...

చేరడానికి గంటక్రితమే అయిపోవాల్సిన పూర్ణాహుతి, నేను చేరుకున్న పదినిముషాలకి మొదలౌతుందే, నేను రావడం ఆలశ్యమయినందుకు కోప్పడతాడనుకున్న హనుమంతుడు, సరిగా సమయానికొచ్చేశావురా అని చిరునవ్వుతో పలకరిస్తాడే? కన్నీళ్ళతో ఆయనముందు నిలబడి వేదుకున్న అభ్యర్ధనని ఆరామయ్యకి మర్చిపోకుండా అందజేస్తాడే, ఎంత త్వరగా ఒక కారుమబ్బు జీవితాన్ని కమ్ముకుందో అంతే త్వరగా విడగొట్టేస్తాడే, సరిగ్గా 96 గంటల్లో ఇదిగో నువ్వెళ్ళే దారిదే అని వేలుపట్టి నడిపించాడే !!!

ఎవరిమాయ ఇది? ఎవరి మహిమ ఇది?

ఒక్క పూజతో కష్టాలు తొలగిపోతాయా? ఒక్క సారి యఙ్ఞంలో కూర్చుంటే అనుకున్నవి జరిగిపోతాయా? పూర్ణాహుతి సెగ ఒంటికి తగిల్తే అప్పటిపవరకూ చేసినపాపాలు హరించుకుపోతాయా?

కాకపోవచ్చు ............కానీ ఒకటిమాత్రం నిజం ..

నమ్మి వెంటవచ్చిన వాణ్ణి విడిచేదిలేదని నా రాముడు మరోసారి నిరూపించాడు.

చుక్కనడిగా దిక్కునడిగా .. చెమ్మగిల్లిన చూపునడిగా ..

నల్లపూసైనాడు దేముడు నల్లని రఘు రాముడు
[ఆయన వద్దంటే పేరు తెలియజేయటం లేదుగానీ వాస్తవానికి భగవంతుని పట్లమనకృతజ్ఞత ఎలుగెత్తి చాటటానికి చాటు అవసరం లేదనేది నా అభిప్రాయం]

Read more...

పత్రి పూజ పరమార్థం

>> Sunday, August 28, 2011

పత్రి పూజ పరమార్థం

సృష్టిలో అన్ని వైద్య విధానాలకూ ఆయుర్వేదం తల్లిలాటిదని అంటూంటారు. కానే కాదు, అదంతా ట్రాష్ అంటారు వెంఠనే మరికొందరు సృష్టి మొదలైనప్పట్నుంచీ అన్నిరకాల వైద్యవిధానాలకూ ఆయుర్వేదమే ‘తల్లి’లాటిదనడంలో సందేహం లేదు. సిద్ధవైద్యం, యునాని వైద్యం, హోమియో వైద్యం, అల్లోపతి వైద్యం- అన్నిటికీ ఆయుర్వేదమే ఆధారమని చెప్పక తప్పదు. అసలు మన భారతదేశమే పుణ్యభూమి. ప్రతి యుగంలోనూ, అనుక్షణమూ సంభవించే పండుగల్లో, పబ్బాల్లో నిర్దేశించిన పూజా విధుల్లో, ఆహారపు విషయాల్లో- ప్రతి అంశంలోనూ ఏదో ఒక నిగూఢమైన అంశం ఇమిడి ఉంటుంది. ఆధ్యాత్మికమంటే గిట్టినా, గిట్టక పోయినా, ఆ పేరుతో చెబితే జనాలకు భయం, భక్తి అంటూనైనా ఆచరిస్తారనీ మన పెద్దలు ఆశించారు. ఈ పూజలూ, పునస్కారాల వెనక ఎంతో సైన్సు దాగి ఉంది. సైన్సుకందనిది ఆధ్యాత్మికం. కానీ ఆధ్యాత్మికానికి అందనిదేదీ లేదు.
వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు. మరి ‘మతం’ అంటే ‘మానవత్వా’న్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచిపనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం ‘కొత్త’మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి.
అసలు ప్రాచీన భారతంలో ఇలానే పూజ ఎందుకు చేయాలని నిర్దేశించి ఉంటారో కొద్దిగా ఆలోచించండి. కొత్త మట్టి ఎక్కడ దొరుకుతుంది? భాద్రపద మాసం అంటే, అపుడే వానలు బాగా వచ్చి ఉండటంవల్ల గ్రామాల, పట్టణాల్లో ఉండే చెరువులు, నదులు కొత్త నీటితో, కొత్తమట్టితో నిండుగా ఉంటాయి. వానలవల్ల నీరు చేరితే మంచిదే. కానీ దానితోబాటు మట్టికూడా పేరుకునిపోతే నదుల్లో, చెరువుల్లో పరిస్థితేంటి? కాబట్టి పూడిక తీయడం రైటు. ఈ పూడిక తీయడంతో వచ్చే బంకమట్టితో చక్కగా వినాయకుడి ప్రతిమలు చేయడంవల్ల, దానికి 21 రకాల పత్రులతో 9 రోజులు పూజ చేయడంవల్ల మరో ప్రయోజనం ఉంది. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలీ అని సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు- వీటిలో వర్షాలవల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం, అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ’ రహస్యం. నేడు సైన్సు అనే వాళ్ళంతా ‘ఎకో-ఫ్రెండ్లీ’అంటూ ఎనె్నన్నో ‘తంతులు’ నిర్వహించనారంభించారు. ఐతే, ఇది భారతీయులకు కొత్తేమీ కాదు. వేద కాలంనించీ ‘పర్యావరణ పరిరక్షణ’అనేది మనకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిర్దేశించారు. మనం ఏమిచేసినా శ్రద్ధగా, నిష్టగా చేయడమే ముఖ్యం. అదే ఆధ్యాత్మిక రహస్యం. శ్రద్ధతో, నిష్టగా మనం ఏ పనిచేసినా, దానిలో మనకు విజయం తథ్యం. సంక్రాంతికి ముగ్గులేసి, గొబ్బెమ్మలు పెట్టినా, దీపావళికి మతాబాలు కాల్చినా కూడా ఆ సంబరాల వెనక ఎంతో సైన్సు ఉంది. వాటి గురించి మరోసారి చర్చిద్దాం. కానీ ప్రస్తుతం వినాయక చవితిలో మనం చేసే పత్రి పూజ గురించి ప్రస్తావిద్దాం. ఈ ప్రతి పూజలో 21 రకాల ఆకులున్నాయి. ఆకులు ఎందుకు ఎంచుకొన్నారూ? అంటే, మనకు అనాదిగా ఋషిపరంపర ఓషధులను, మూలికలను పూజాద్రవ్యాలుగా, యజ్ఞయాగాది కార్యక్రమాల్లో సమిధలుగా కొన్ని ఆకులను, మూలికలనూ, సమిధలనూ ప్రస్తావించారు. వీటి వెనక ఉన్నదంతా సైనే్స.
వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వీటి పేర్లు, శాస్ర్తియ నామాలతోబాటు వ్యావహారికంగా తెలుగులో పేర్లు పట్టికలో చూడవచ్చు.
కొన్ని పూజా విధానాల్లో భృంగరాజపత్రం, మాలతీ పత్రం, కేతకీ పత్రం, అగస్త్య పత్రం- వీటి ప్రస్తావన కూడా ఉంది.
మాచీ పత్రం లేదా మాచిపత్రిని సంస్కృతంలో శుక బర్హ, శుక పుష్ప అనీ, స్థౌణీయకా అనీ పిలుస్తారు. ఇది త్రిదోషహారి. దుర్గంధాన్ని తొలగిస్తుంది. క్రిమిహారి కూడా.
వినాయకుని పత్రి పూజలో మాచీపత్ర రహస్యాన్ని మొదటి నామంలోనే ఇమిడ్చారు మన ఋషులు. సుముఖాయనమః - అంటూ మాచీపత్రం సమర్పయామి అంటాం. సుముఖం అంటే చక్కటి ముఖం. ముఖం అంటే పెదాలు, దంతాలు, చిగుళ్ళు, నాలుక, కంఠము, అంగిలి, నోరు- ఇలా ఏడు భాగాలు కల్గింది కదా! అలాటి ముఖంనించి వచ్చే దుర్గంధాన్ని హరించి సుఖాన్నిచ్చేదే మాచీ పత్రం.
బృహదీ పత్రం అనే దాన్ని సంస్కృతంలో కంటకారి, మహతీ, కులీ, వార్తకీ- ఇలా పలురకాలుగా పిలుస్తారు. తెలుగులో ‘ములక’ అంటాం. ఈ ఆకు వంకాయ ఆకులా ఉంటుంది. తెల్లని చారలతో ఉంటుంది. దీని పండ్లు పసుపుపచ్చగా బంగారు రంగులోని ముళ్ళతో ఉంటాయి. ఇది శ్వాస, కాస వ్యాధుల్లో విశేషంగా గుణాన్నిస్తుంది.
బిల్వపత్రాన్ని సంస్కృతంలో శ్రీ్ఫల, శాండిల్య, మాతార, శైలూష అని పిలుస్తారు. మూడు ఆకులు కలిసి ఉంటాయి. ఏక బిల్వం అంటే ఒకే పత్రం మూడుగా చీలి ఉంటుందన్నమాట. మూడు దళాలూ ఒకే మూలాన్నుంచి వచ్చినట్లే, త్రిగుణాలు (సత్వ, రజ, తమోగుణాలు) కూడా ఒకే మూలాన్నుంచి వస్తాయి. త్రిమూర్తులు ‘ఒక్కటే’ రూపమనీ సూచిస్తుంది. ఈ బిల్వం అనేది మధుమేహంలో (ఆకు, బెరడు) ఔషధంగా వాడతారు. ఇది రక్తాన్ని శుద్ధిచేస్తుంది. దీని పండ్లు బంగారు రంగులో వుంటుంది. లోపలి గుజ్జు మంచి వాసనలు వెదజల్లుతూంటుంది. అందులో బంగారు రంగులో తేనె లాటి ద్రవం ఉంటుంది. ఈ గుజ్జును రక్తశుద్ధికీ, మలబద్ధకాన్ని తొలగించడానికీ వాడతారు.
దూర్వాయుగ్మం అంటే గరిక (లేదా గడ్డి). ఈ గడ్డి మూడు రకాలు: శే్వతదూర్వా, నీలదూర్వా, గండదూర్వా. ‘గండ దూర్వా’నే గండాలి అంటారు. శే్వత (తెల్ల)గరికనే శతవీర్యా అంటారు. నీల దూర్వా లేదా నల్ల గరికనే సహస్రవీర్యా అంటారు. శే్వత గరికనీ నల్లగరికనీ కలిపి దూర్వాద్వయం అని (ఆయుర్వేద వైద్యశాస్త్రంలో) అంటారు. దూర్వాయుగ్మం అంటే రెండు ఆకులు/ దళాలు కల్గినవి అని అర్థం. ఇవి దాహం, చర్మ రోగం, చుండ్రు- వీటి నివారణకు వాడతారు. చెడ్డ కలలు వచ్చినపుడు మూత్ర విసర్జనలాటి సమస్యలను నివారిస్తుంది గరిక.
దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు. దీనే్న కనక, ఉన్మత్త, శివప్రియ అని సంస్కృతంలో వ్యవహరిస్తారు. ఇది వంకాయ జాతికి చెందిందే. ఉన్మాద లక్షణాలుండటంవల్ల దీనికి ఉన్మత్త అనీ పేరు. ఉన్మత్త కాస్త ఉమ్మెత్త అయ్యింది. ఇది జ్వరాన్ని, కుష్ఠు, కృమి తగ్గించడానికి, పుండ్లు మానడానికి, నొప్పి/ వేదన తగ్గించడానికీ పనికొస్తుంది. శ్వాస, కాస వ్యాధులనీ తగ్గించే ప్రత్యేక ఔషధంగా కూడా ఉమ్మెత్తను వాడతారు. విష ప్రభావాన్ని శరీరమంతా వ్యాపించకుండా నిరోధించే విశేష గుణం ఉమ్మెత్తది.
బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకు అజప్రియ, కోల, ఫేనిల, ఉభయ కంటక అనీ వ్యవహరిస్తారు. దీని గుండ్రని ఆకులు, ముళ్ళు చూడటానికి అందంగా ఉంటాయి కూడా. భోజనం తర్వాత ప్రతిరోజూ బదరీ ఫలం అంటే రేగుపండ్లు గనక తింటే, మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణవౌతుంది. అంతేకాదు. లంబోదరం- పొట్ట పెరగడం తగ్గుతుంది. (అందుకే ఆరో మంత్రం లంబోదరాయనమః బదరీ పత్రం సమర్పయామి అని ఉంటుంది గమనించండి).
అపామార్గ పత్రం అనేది ఉత్తరేణి చెట్టు ఆకు. ఉత్తరేణి చెట్టు వేరు ఉత్తర దిశగా వ్యాపించి ఉంటుంది. దీనే్న ఖరయాజరి, శిఖరి, ప్రత్యేక పుష్టి అని సంస్కృతంలో అంటారు. అధర్వణ వేదంలో దీని గురించి చాలా చక్కగా వర్ణన ఉంది. దీని విత్తనాలతో పాయసం చేసి సేవిస్తే, చాలాకాలంపాటు ఆకలి ఉండదని అంటారు. ఇది కడుపునొప్పి, చర్ది, శ్వాస వ్యాధుల నివారణకు విశేషంగా పనిచేస్తుంది. ‘అతి ఆకలి’నీ నివారిస్తుంది.
తులసీ పత్రం- అంటే తులసి ఆకు. తులసికే సురసా, సులుభ, బహుమంజరి, వృందా దేవదుంధుభి అని సంస్కృతంలో పేర్లున్నాయి. తులసీ తీర్థం ఎంత పవిత్ర స్థానాన్ని కల్గిందో వేరే చెప్పనక్కర్లేదు. తులసి ఇంట్లో ఉంటే విష పురుగులు దరిచేరవు. ఇది మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. ఇది ‘గజకర్ణ’మనే చర్మవ్యాధి నివారణకు దివ్యౌషధం (8వ మంత్రమూ అదే- గజకర్ణాయనమః తులసీ పత్రం సమర్పయామి).
చూతపత్రం అంటే మామిడి ఆకు. దీనే్న సంస్కృతంలో శుకప్రియ, వసంతదూత అంటారు. మామిడి ఇంట్లోని దుష్టశక్తులని (నెగటివ్ ఎనర్జీ) తొలగిస్తుంది. దీని గాలి సోకడంవల్ల, ఆరోగ్యం బాగుంటుంది. అతి మూత్రవ్యాధికి మామిడి చక్కని ఔషధం. మామిడి చిగుళ్ళు చక్కని కంఠ స్వరాన్నిస్తాయి. మామిడి ‘జీడి’వాడితే ‘పేను కొరుకుడు’వ్యాధిని తొలగించుకోవచ్చు. గుండెల్లో మంట, వాంతులు, అతిసారం- వీటి నివారణలో ‘మామిడి’కి ఎంతో పేరు ఉంది.
కరవీరపత్రం అంటే గనే్నరు ఆకు. దీనే్న సంస్కృతంలో గౌరీపుష్ప అనీ, గణేశ కుసుమ, చండీ కుసుమ అనీ అంటారు. హరప్రియ, అశ్వమారక, హయ మారక అనీ కూడా అంటారు. గనే్నరు పాలు మొండి పుండ్లను మానే్పయగలదు. వాపులనీ, గడ్డలనీ పోగొడ్తుంది. తేలుకాటుకు దీని పాలు ఎంతో ప్రశస్తమైన ఔషధం.
విష్ణుక్రాంత పత్రం అంటే సంస్కృతంలో శంఖపుష్టి, సుపుత్ర, అపరాజిత అనే పేర్లు కల్గి ఉన్నాయి. దీని పూలు నీలిరంగులో ఉంటాయి. ఇది మంచి దృష్టినీ, కంఠస్వరాన్నీ, జ్ఞాపక శక్తినీ ఇస్తుంది. మూత్ర దోషాలను తొలగించడంలో, కుష్టువ్యాధిలో కూడా దీన్ని వాడతారు.
దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకు. దీనే్న దంత బీజ, రక్తపుష్ప అనీ అంటారు. ఇది అజీర్ణాన్ని పోగొడ్తుంది. వాంతుల నివారణలో, జలుబును తగ్గించడంలో బాగా వినియోగిస్తుంది. ఆకలి లేని వారికి దానిమ్మ తింటే చక్కగా ఆకలి వేస్తుంది.
దేవదారు పత్రం అనే దాన్ని సంస్కృతంలో సాల, భూతహారి, దేవకాష్ట అనీ అంటారు. ఇది హిమాలయాల్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఈ చెట్టు మానుతో విగ్రహాలు కూడా చెక్కుతారు. దీన్నించి తీసే పైన్ ఆయిల్ రంగుల పరిశ్రమలో వాడతారు. ఈ పైన్ ఆయిల్ కీళ్ళనొప్పుల్ని నివారిస్తుంది.
మరువక పత్రానికి ధవనం, మరువకం అనే పేర్లూ ఉన్నాయి. ఈ మరువం ఎండిపోయినా దాని సుగంధాన్ని ‘మరువం’. ఇది పురుగులను పారద్రోలుతుంది. దుర్గంధాన్ని తొలగిస్తుంది. ఇది ‘విషహారి’గా కూడా పేరుపొందింది.
సింధువార పత్రం అనేది తెలుగు లోగిలిలోని వావిలి చెట్టు ఆకు. వాత రోగానికి వావిలి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ వావిలి ఆకులను పొగ వేస్తే దోమలు పోతాయి.
జాజి పత్రం లేదా సన్నజాజి ఆకును సంధ్యాపుష్పి అని సంస్కృతంలో వ్యవహరిస్తారు. దీని పూలనుంచి తీసే సుగంధ తైలాన్ని తలనొప్పి నివారణకీ, చెవిపోటు నివారణకీ వాడతారు.
గండలీ పత్రం అనేది 17వ పత్రంగా వినాయక పూజలో చెబుతాం. దీనికే లతాదూర్వా అనీ సర్పాక్షి అనీ అంటారు. ఇది జ్వరాన్ని తగ్గించడానికి, దాహం తగ్గించడానికి బాగా వినియోగిస్తుంది.
శమీ పత్రమనేది తెలుగులో జమ్మి చెట్టు ఆకు. శమీవృక్షం, లక్ష్మి, సక్త్ఫుల అని సంస్కృత నామాలున్నాయి. విజయదశమి అంటే మనకు గుర్తొచ్చేది శమీవృక్షమే. దీని పండ్లలో ఉండే గుజ్జు, దీని కషాయం త్రిదోష జన్యమైన వ్యాధులను తొలగిస్తాయి.
అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు ఆకు. బోధితరు, పిప్పల, యాజ్ఞీక అని సంస్కృతంలో దీన్ని పిలుస్తారు. ఇది స్ర్తిసంబంధ వ్యాధులను నివారించడంలో మహత్తర ఔషధం.
అర్జున పత్రం అంటే మద్ది చెట్టు ఆకు. ఇది అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. సాధారణంగా దీన్ని ఇళ్ళ నిర్మాణంలో ఎక్కువగా వాడతారు. మర్రి ఆకుల్లా ఉంటాయి దీని ఆకులు. ఇది రక్తదోషాన్నీ, టీబీ లాటి వ్యాధుల్లో, గుండెకు సంబంధించిన రోగాల్లో ఎక్కువగా వాడతారు.
జిల్లేడునే ‘అర్క’అంటారు. జిల్లేడు ఎర్రని, తెల్లని పూలతో రెండు రకాలుగా వుంటుంది. వీటిలో తెల్ల జిల్లేడు ప్రశస్తం. దీని ఆకుల నించి తీసిన రసాన్ని పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. దీని పూలు శ్వాసకోశ విరుగుడుగా పనిచేస్తుంది. దీని పూలు శ్వాసకోశ వ్యాధుల్లో, దీని పాలు నపుంసకత్వ నివారణలో, పుండ్లను మాన్పడానికి వినియోగిస్తారు.
ఐతే, మనం ఈ 21 పత్రాల గురించీ, వాటి విశేష గుణాల గురించీ ఎపుడూ పట్టించుకోం. అసలు పత్రిలో 21 రకాలలో ఎన్ని మనకు దొరుకుతున్నాయో కూడా తెలీదు. ఏది ఏ ఆకో మనకు వద్దేవద్దు. మార్కెట్లో ‘‘పత్రి’’పేరుతో క్రోటన్ ఆకులు సైతం ఇచ్చేస్తారు. మనం తెచ్చేస్తాం. పూజ కానిస్తాం. ఇదీ మన తీరు. జాగ్రత్తగా ఆలోచించండి. అలాంటి క్రోటన్ ఆకుల పూజవల్ల ఎంత ప్రమాదమో! ఏదో దేవదారు, మద్ది తప్ప మిగిలినవన్నీ మన ఇళ్ళచుట్టూ ఉండే చెట్లే. అంచేత ఈసారి వినాయకుని పత్రి పూజ ఎలాచేయాలో మీరే నిర్ణయించుకోండి. ఇది భక్తి, ఆడంబరాలకోసం కాదు. మన ఆరోగ్యంకోసం అనేది గుర్తుంచుకొని మరీ చేయండి!
===

21 పత్రాల శాస్ర్తియ నామాలు

పత్రి పేర్లు శాస్ర్తియ నామాలు తెలుగు పేర్లు
మాచీ పత్రం Artemisia.vulgaris మాఛిపత్రి
బృహతీపత్రం Solanum.indicum బృహతీపత్రం (ములక)
బిల్వపత్రం Aegle.marmelos భిల్వం (మారేడు)
దూర్వాయుగ్మం cyandon.Dactylon (శే్వత) గరిక
cyandon.linearis (నీల)
దత్తూర పత్రం Datura.stramonium ఉమ్మెత్త
బదరీపత్రం Zizyphus.jujuba గంగరేగ (రేగు)
అపామార్గపత్రం Achyranthes.Aspera ఉత్తరేణి
తులసి పత్రం Ocimum Sanctum తులసి
చూతపత్రం Mangifera.Indica మామిడి
పత్రి పేర్లు శాస్ర్తియ నామాలు తెలుగు పేర్లు
కరవీర పత్రం Nerium.Odorum గనే్నరు
విష్ణుక్రాంత పత్రం Evolvulus.Alsinoides అపరాజిత
దాడిమి పత్రం Punica.Granatum దానిమ్మ
దేవదారుపత్రం Cedrus.Deodara దేవదారు
మరువక పత్రం Origanum.Majorana మరువం
సింధువారపత్రం Vitex.Negundo సింధువారం (వావిలా)
జాజి పత్రం Jasminum.Auriculatum జాజి
గండలీ పత్రం Cynodon.Dactylon సర్పాక్షి
శమీ పత్రం Prosopic.spicigera జమ్మి
అశ్వత్థ ఫత్రం Ficus.Religiosa రావి
అర్జున ఫత్రం Terminalia.Arjuna మద్ది
ఆర్క పత్రం Pterocarpus.Santalinus జిల్లేడు


suresh battula

Read more...

శనిత్రయోదశినాడు జరిగే శనిప్రదోష పూజలకు గోత్రనామాలు పంపండి

>> Thursday, August 25, 2011


ఈనెల 27 శనివారం రోజు త్రయోదశి తిథి వస్తున్నందున ఆరోజు శనీశ్వరునికి ఆసాయంత్రం ఈశ్వరునకు ప్రత్యేక అర్చనలు జరుగుతాయి . జాతకంలో శనిగ్రహ దోషాలు ఉండి చిక్కులు చికాకులతో సతమతమవుతున్నవారు శనీశ్వరునికి తైలాభిషేకం చేపించి ఆరాధించటం వలన దోషాలు తొలగుతాయి అని శాస్త్రవచనం
ఇక ఆరోజు ప్రదోష కాలంలో జరిపే శివార్చనవలన అనంతమైన పుణ్యం లభిస్తుందన్నది పురాణప్రాశస్త్యంగలవిషయం. సకల బాధలను తీర్చి కరుణతో కొలచినవారికి కొంగుబంగారమయ్యే శివుని అర్చించటం సర్వదా శుభకరం
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో నవగ్రహమంటపంలో ఆరోజు తైలాభిషేకములు ప్రత్యేక అర్చనలు జరుపబడతాయి. సాయంత్రం పీఠం లో కొలువైయున్న శ్రీరామలింగేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం ప్రత్యేక అర్చనలు నిర్వహింపబడతాయి.
గోత్రనామాలు పంపిన భక్తులతరపున పూజ నిర్వహింపబడుతుంది . పీఠసాంప్రదాయం ప్రకారం ఇక్కడ జరిగే అర్చనలు పూజలకొరకు చెల్లించవలసినది ఏమీ ఉండదు.

[ కానీ శనిదోష నివారణార్ధం జరిపేశనిత్రయోదశి పూజలకుమాత్రం పూజాద్రవ్యాలు మాస్వంతఖర్చుతోనే వాడమని పలువురు కోరుతున్నందున దాని కొరకు పంపే ఆసక్తి ఉన్నవారు సంప్రదిస్తే ఎలాపంపాలో తెలియజేస్తాము.] దీనిని మరోలా భావించవద్దని మనవి.]
durgeswara@gmail.com
9948235641

Read more...

కృష్ణ తత్వం

>> Wednesday, August 24, 2011

కృష్ణ తత్వం
- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
పనిషత్తుల కాలంలో ఉద్భవించిన సత్యం, శివం, సుందరం, ప్రేమ పవనాలు అనంతరకాలంలో ఒకే ఒక మహా మహితాత్మునిలో కేంద్రీకృతమై భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా, రాజకీయంగా స్పందింపజేశాయి. గీతాకారుడైన శ్రీకృష్ణుని వాక్కులు నేటికీ భారతీయ జీవనంపై అమోఘమైన ప్రభావాన్ని ప్రసరింపజేస్తూనే ఉన్నాయి. భారతీయ సంస్కృతినుంచి శ్రీకృష్ణుని పాత్రను తొలగిస్తే మిగిలేది అత్యల్పం అంటారు స్వామి రంగనాథానంద. మన ధర్మం, తత్వశాస్త్రం, భక్తిమార్గం, వాఞ్మయం, చిత్రలేఖనం, శిల్పం, నృత్యం, సంగీతం- జాతి సంస్కృతి నాగరికతలకు సంబంధించిన అన్ని అంశాల్లో శ్రీకృష్ణుని ముద్ర గోచరిస్తుంది. బహుజన హితం, బహుజన సుఖం లక్ష్యంగా సుసంపన్నమైన వ్యక్తిత్వం కలిగినవారే అవతారపురుషులు. కృష్ణావతారం పరిపూర్ణమైనది. ఆయనను 'పరిపూర్ణ పురుషుడు' అంటారు వేదాంతులు. ఆయన రసస్వరూపుడు. గురువు, నేత, రాజనీతివేత్త, మహర్షి, యోగి, విశ్వసారథి. చివరకు విధిచేతిలో లొంగిన మానవోత్తముడు.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపనలనే త్రిపుటి కృష్ణావతార పరమార్ధం. ఈ ఉద్యమానికి శ్రీకృష్ణుడు విశ్వరథ సారథ్యం వహించాడు. ఆయనలో ఒకపక్క మానవత్వం తొణికిసలాడగా, మరోపక్క దివ్యత్వం ప్రకాశించింది.

శ్రీకృష్ణుడు అవ్యక్తధర్మానికి వ్యక్తరూపం. అతడికి ఎవరితోనూ ఘర్షణ లేదు. ఘర్షణ పడినవాళ్లు కూడా తమ దుష్టత్వం వల్లనే విభేదించారు తప్ప కారణం ఉండికాదు. ధృతరాష్ట్రుడు దుష్టుడైనా కృష్ణుడి హితవాక్కు అనుసరించలేకపోవడం జరిగిందిగాని, ఘర్షణ పడలేదు. దుర్యోధనుడు కూడా రాయబార ఘట్టాల్లో పాండవులను నిందించినా కృష్ణుణ్ని నిందించడం చేతకాలేదు. అతడు పాండవులకు ఎంత హితుడో తమకూ అంత హితుడేనని వారికి తెలుసు. ఈ సత్యాన్ని భరించగల హృదయ వైశాల్యం వారికి లేకపోయింది.

కృష్ణుడి జీవితంలో ఇతరులకు అతడి నిమిత్తంగా సన్నివేశాలు ఉన్నాయిగానీ అతడికి సంబంధించిన సన్నివేశాలు చాలా అరుదు. చివరకు యాదవ వినాశనంగాని, తన కాలికి తగిలిన బాణంగాని అతడి మనసును తాకిన సన్నివేశాలు కాలేకపోయాయి. అతడి జీవితంలోని సుఖదుఃఖాలకు సంబంధించిన సందర్భాలేవీ అతడి మనసును తాకలేకపోవడం మానవాతీతమైన లీల. కృష్ణుడి జీవితంలో తనకోసం ఆచరించిన ధర్మమూ కనిపించదు. తమ స్వధర్మాన్ని లోకహితంగా ఆచరించడానికి సంకల్పించినవారు సాధువులు. స్వధర్మాన్ని స్వార్థానికి వినియోగించుకునేవారు దుష్కృతులు. సాధువులకు రక్షణ ఇచ్చేందుకు, దుష్కృతులను శిక్షించేందుకు అన్ని కాలాల్లో దిగివస్తూనే ఉంటానని కృష్ణుడు చెప్పాడు. కృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమైంది.

కృష్ణతత్వాన్ని పరిశీలించడం అంటే- సముద్రం లోతును తెలుసుకునే ప్రయత్నం చేయడమే. మహాభారతం కృష్ణుని పరంగా ఒక దర్శనం. భారతంలో ఇమడ్చటానికి అవకాశం లేక పోయిన కృష్ణుని లీలామయ జీవితాన్ని వ్యాసుడు భాగవతంలో కీర్తించాడు. ఆయన బోధించిన జీవనతత్వాన్ని భగవద్గీతలో వివరించాడు. భారతీయుల ఆధ్యాత్మిక, లౌకిక ఆకాంక్షలకు ఆ మహాపురుషుని జీవితంలో సమాధానాలు లభిస్తాయి.



Read more...

కృషితో నాస్తి దుర్భిక్షం

>> Tuesday, August 23, 2011

కృషితో నాస్తి దుర్భిక్షం
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌
రుషులైనా కృషి చేయనిదే సత్ఫలితాలు సాధించలేరు.జీవితంలో ప్రతిక్షణం అత్యంత విలువైనదే. జారిపోయిన క్షణాన్ని తిరిగిపొందటం ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యం కాదు. నిన్న ఎప్పుడూ నిన్నగానే ఉండిపోతుంది. 'నేడు' క్రమంగా నిన్నగా మారిపోతుంటుంది. ఇది జీవన వైశిష్ట్యం.

మనిషి ఎప్పుడూ కాలం తనకు ప్రసాదించిన ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకోవటంలో నిమగ్నుడై ఉండాలి. తెలివిగల వ్యాపారి తన ధనాన్ని ఎన్నోరెట్లు అభివృద్ధిపరచుకుంటాడు. శూరుడైన రాజు తన రాజ్యాన్ని అంతకంతకు విస్తరించుకుంటూ చక్రవర్తి కావటానికి ప్రయత్నిస్తాడు. మునివాటికల్లో నిత్యమూ తపోశక్తిని అధికం చేసుకునే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.

మరి, సామాన్యుడి విషయం ఏమిటి?

ఆశ-నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ పగటికలలు కంటూ ఉంటాడు. కళ్లముందు కనిపించే గొప్పవన్నీ తనవి కావాలనుకుంటాడు. అందమైన గృహం, వాహనం, అప్సరసలాంటి భార్య- ఇలాంటివన్నీ తనకే కావాలనుకుంటాడు. అవి ఇతరులకుంటే అసూయ పడుతుంటాడు.

లోకంలో అత్యధికుల సమస్య ఇది.

ఏమీ కష్టపడకుండా అన్ని సౌకర్యాలూ లభించడం 'సుఖం' అనుకుంటారు. ఏ సుఖమూ శాశ్వతంగా ఉండదు. ఒకసారి 'సుఖం' అనుభవించాక, అది దూరమయ్యాక కలిగే దుఃఖం భరించరానిదిగా ఉంటుంది.

కృషివల్ల లభించే ఫలాలు తరగని ఆనందాన్నిస్తాయి. సుఖం శరీరానికి సంబంధించింది. దానివల్ల కొంతవరకే ఆనందం కలుగుతుంది. సుఖం పాతబడిన కొద్దీ ఆనందం పలుచనవుతుంటుంది.

కాబట్టి, సుఖంతో కలిగే ఆనందం- శాశ్వతం కాదు.

కృషివల్ల కలిగే ఆనందమే నిత్యమూ, శాశ్వతమూ. బాగానే ఉంది. మరి, కృషి ఎలా చెయ్యాలి? దేని గురించి చెయ్యాలి?

ప్రతి వ్యక్తికీ విధ్యుక్త ధర్మాలు అంటూ కొన్ని ఉంటాయి.

అంటే, వారు వారు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు. ఆశలు అధికమైనప్పుడు తమ కర్తవ్యంపట్ల ఆసక్తి మందగిస్తుంది. ఏవి తాను చేయలేడో వాటి గురించి ఆలోచిస్తూ, 'ఆ ఫలితాలు తనకు లభిస్తే చాలు' అనే వూహలతో వూయలలూగుతుంటాడు.

ఆ విధంగా కర్తవ్య నిర్వహణలో- అంటే, తన కృషిలో విఫలమవుతుంటాడు. కొత్తగా పొందాలనుకునేవి పొందలేకపోవటం అటుంచి, ఉన్న అవకాశాన్ని చెడగొట్టుకుంటాడు.

కృషిపట్ల దృఢ విశ్వాసంతో, అంకితభావంతో, అంతర్లీనంగా ఉన్న ప్రజ్ఞతో, ఫలితాలపట్ల ఎలాంటి ఎదురు చూపులూ లేకుండా శ్రమించేవారికి తప్పక గుర్తింపు లభిస్తుంది.

ఇది ఆధ్యాత్మిక జీవితానికీ వర్తిస్తుంది.

ఈ పూజకిది ఫలితం, ఈ జపానికిది లాభం, ఈ దానానికి ఇది ఫలం లాంటి లెక్కలు మానేసి, అంతరంగస్థితుడైన 'అంతర్యామి' మీదనే అన్ని చూపులూ కేంద్రీకరించాలి. తన ప్రతి చర్యా దైవసేవగానే భావించాలి. అప్పుడది సత్కృషి అవుతుంది. దానికి 'నాస్తి' అనేదే ఉండదు.

మన సత్కృషికి సత్ఫలితాలు ఇవ్వటానికి భగవంతుడు వివశుడవుతాడు. అంటే- ఇవ్వకుండా ఉండలేడు. అందుకే కృషి ఫలితాలు రుషులకే కాదు, రాక్షసులక్కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈ సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలి.



Read more...

అన్నా ! ఈ కృష్ణుణ్ని మనం దేవుడనుకుంటాంగానీ .... అబ్బే

>> Monday, August 22, 2011

అన్నా ! ఈ కృష్ణుణ్ని మనం దేవుడనుకుంటాంగానీ .... అబ్బే మరీ అనాచారపరుడు . ఏం దేముడో ఏంటో ? ఇటువంటివాణ్ణి పరమాత్మ అంటే నమ్మటం కష్టం గాఉంది .... ఫిర్యాదు చేశాడు అర్జునుడు

అయ్యో ! ఏమైంది అర్జునా ? విస్మయంగా అడిగాడు ధర్మరాజు.
ఈరోజు మేము వ్యాహ్యాళికెళ్లామా ? అక్కడ ఈయన అసలు రంగు బయటపడింది .అర్జునుడు అసహనంగా అన్నాడు
ఏంజరిగింది ? ధర్మరాజు వివరమడిగాడు .చెప్పసాగాడు అర్జునుడు.
====********************************************************************
ఆరోజు అర్జునుడూ కృష్ణభగవానుడు వ్యాహ్యాళికి వెళ్లారు . దారిలో విశేషాలను పరికిస్తూ దాదాపు ఊరిబయటకు వెళ్లారు .
అక్కడ ఊరిబయట ఒక గుడిసె .చాలా నిరుపేద నివాసం .అందులోనూ మద్యమాంసాదులు భుజించే వ్యక్తి నివాసం.
దూరంనుంచి కృష్ణార్జునులను గమనించిన ఆగుడిసె యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి పాదాలపై వాలాడు. వచ్చావా ప్రభూ ! ఎన్నల్లకెణాళ్లకు ఈ దీనునిపై దయగలిగింది. దీనదయాళో ఇన్నాళ్లకు నన్ను కరుణించి నాకోసం నడచివచ్చావా ? అంటూ ఆనదం దుఃఖం ముప్పిరిగొనగా పరిపరి విధాలా ప్రార్ధిస్తున్నాడు. భక్తి ఉన్మాదంలో ఏదేదో మాట్ళాడుతున్నాడు. నాజన్మ ధన్యం చేయవచ్చావా నాతండ్రీ ! అని మరలామరలా పాదాలపైబడుతున్నాడు. స్వామిని న్లువెల్లా తడుముకుని తన్మయుడవుతున్నాడు. కన్నయ్య చిరునవ్వులు చిందిస్తుంటే సరిగా శుభ్రమైన దుస్తులుగానీ శుభ్రతగానీ లేని అతన్ని చూసి అర్జునునికి మాత్రం కంపరమెత్తుతున్నది. కృష్ణుడు మాత్రం భక్తుని అక్కునచేర్చుకుని ఓదారుస్తున్నాడు .ఏం కావాలి అని అడుగుతున్నాడు భక్తున్నీ
దూరంగా జరిగి ఎప్పుడు ఈగోలవుతుందా వెళ్లాలని చూస్తున్న అర్జునుడు ఆమాటమాత్రం అడగలేక చూస్తున్నాడు.
అప్పుడా భక్తుడు స్వామీ ! తమరు ఈ మాహావీరునితో కలసి నాగుడెసెలోకొచ్చి నాచేతి ప్రసాదం స్వీకరించవా స్వామీ ! నాచేతులారా రెండు ముద్దలు తినిపించుకోవాలి నీకు అంతకంటే ఈజన్మకేమీ అక్కరలేదు అని విన్నవించుకున్నాడు
.బావా ! పాపం ఇతని కోర్కె తీరుద్దాము వెళ్లొద్దామా ? అడిగాడు.
తాను రాజపుతృడు ఇలాగుడెసెల్లోకి వెళ్ళి వాల్లుపెట్టే పాచికూడు తినడానికి తానేమన్నా ఈ పశువులకాపరిలా పల్లెవాడా ? ఇలా ఆలోచించుకున్న అర్జునుడు .నువ్వెళ్ళిరాలే బావా ... అంతదాకా నేనీ చెట్లదగ్గర ఉంటాను అని తప్పుకున్నాడు.
సరే ! నీ ఇష్టం .అని భక్తునివెంట అతని గుడెసెలోనికి వెళ్లాడు.
లోపలకు తీసుకెళ్ళిన ఆభక్తుడు స్వామికి పీటవేసి పాదాలు కడిగి కాళ్ళుతుడచి పలురకాలుగా పొగుడుతూ పూజిస్తున్నాడు. స్వామీ ఈరోజు మంచి మాసం కూరవండాను .ఉండు పెడతాను . అని మెత్తని ముక్కలు ఏరి ఏరి స్వామికి తినిపిస్తున్నాడు. బాగుందా స్వామీ ... అనడుగుతున్నాడు . స్వామి కొసరికొసరి బతిమాలి ఇదొక్కటి తిను కన్నాయ్యా మాతండ్రివి కదూ ! ఇంకొక్కటి తిను అని తినిపిస్తున్నాడు.
బయట ఫలవృక్షాల దగ్గర ఫలాలుతీసుకుని తింటూ వేచి ఉన్న అర్జునునికి ఆలస్యమయ్యే కొద్దీ విసుగొస్తున్నది.
చాలాసేపు చూసి ఇక ఆగలేక లోపలేమిజరుగుతుందో చూద్దామని గుడిసెవద్దకెళ్ళి కిటికీలోంచి తొంగి చూశాడు.
అంతే ! ఆయనకు అసహ్యమనిపించింది . ఛీ ,ఛీ మరీ ఇలా మద్యమాంసాలకు కూడా అలవాటుపడ్దాడు ఈ నల్లోడు అబ్బే యాక్ .. అనుకున్నాడు .. దూరంగా వెళ్లి వేచి ఉన్నాడు ఎప్పటిలాగే
కృష్ణుడు బయటకొచ్చి వెళదమా ?బావా ? అన్నాడు
ఏంటీ ! తమ భక్తుడు అంత మధురభక్ష్యాలందించాడా ఇంతసేపు పట్టింది ? అడిగాడు వెటకారంగా పార్థుడు.
వాని హృదయం అంత మధురమైనది అందుకే అవి అంతగా రుచిగా వున్నాయి నర్మగర్భంగా పలికాడు నల్లనయ్య
ఉంటాయి ...ఉంటాయి ఎందుకుండవు ఒట్టి అనాచారపరుడు ,, ఇంటికెళ్లనీ మా అన్నగారిదగ్గర బట్టబయలు ఇతని బండారం మనసులో కసి అనుకున్నాడు కిరీటి
............................................................................................................................................

ఇదన్నా సంగతి వివరించాడు పార్ధుడు
నమ్మలేకపోయాడు ధర్మజుడు
కానీ అర్జునా ఇదినమ్మలేకపోతున్నాను .నువ్వు నిజంగా చూశావా ..ఆయన మహాపురుషుడు.....సందేహంగా అన్నాడు

నువ్వు నమ్మవు. నీలాగే లోకమంతా ఉంటుందనుకుంటావు అమాయకంగా . ఇది చిన్నప్పటినుంచి దొంగసరుకే .
ఏదో నాలుగు మహిమలు చూసి మనం బోల్తాపడుతున్నాం ..వస్తున్నాడుగా అడుగు ఆపెద్దమనిషినే ....అన్నాడు అర్జునుడు ఉక్రోషంగా
ఏంటీ ! అన్నదమ్ములేదో గుసగుసలాడుకుంటూన్నారు మాకూ చెప్పవచ్చుకదా ? ఆగదిలోకి వస్తూ కృష్ణూడు మేలమాడాడు

బావా ! తమరు ఏమీ అనుకోకుంటే చిన్నసందేహం తమరు మాకు బంధువేగాదు..గురువూ నూ,మంచెదో చెడేదో చెప్పి సన్మార్గంలో నడిపేఆచార్యుడూకూడా . మరలాంటి తమరు కొన్నిఅనాచారపనులు చేస్తున్నారని ....మా
నసుగుతున్నాడు ధర్మరాజు

మీవాడంటున్నాడా ? ఏమి చేశానో చెప్పవచ్చుకదా ?
అదే మీరు నిషిధ్ధపదార్ధాలు భుజించారని .అనాచారుల ఇంట ఇలా .....
అవునా ! నేనెప్పుడు తిన్నాను ? అమాయకంగా అడిగాడు స్వామి
హమ్మా ! అబద్దాలు కూడానా . అర్జునుడు మండిపడ్డాడు.
వున్నవిషయం చెబుతున్నాను బావా ! ఈరోజు సాయంత్రం నేనూ అర్జునుడు అలావ్యాహ్యాలికెళ్ళాం .అక్కడొక భక్తుడు ఏదో పండ్లు ప్రసాదంగా పెడితే స్వీకరించాను వచ్చేశాను ఇందులో తప్పేముంది . ? అడిగాడు లీలానాటక సూత్రధారి.
అవ్వ ! ఎంతబద్దం ? పండ్లు స్వీకరించావా ? పాడుతిండి తిన్నావుకాదా ? అర్జునుడన్నాడు.

నేనా ! ఇదిగో ధర్మరాజా ! నీతమ్ముడే ఇంట్లోకి రాలేదు .ఎక్కడకో వెళ్లి ఎదో తినుంటాడు .నెపం నామీదకు నెడుతున్నాడు అన్నాడు స్వామి
మరలా ఇదొకటా ఎవరేమి తిన్నామో ? తేలుద్దామా పంతానికి పోతున్నాడు కోపం పెరిగిన పార్థుడు
అలాగే అన్నాడు స్వామి
ఇదిగో ధర్మరాజా ! మీ అనుమానం ఇప్పుడే తీరాలి .కాబట్టి మేమిరువురము వమనానికి[కక్కుకోవటం] కు ఔషధం తీసుకుని సత్యం నిరూపిస్తాము సిద్దమేనా అన్నాడు స్వామి
సిద్దమేనన్నాడు పార్ధుడు
వైద్యుని రప్పించి ఇద్దరూ వమనానికి ఔషధం స్వీకరించారు.
దానిప్రభావం వలన కృష్ణార్జునులకిరువురకూ వాంతులయ్యాయి స్వామి నోటినుండి ఫలాదులతో సుగంధభరితమైన పదార్ధాలు బయటకొస్తున్నాయి
మరటువైపు ? అర్జునుని నోటినుండి మత్స్య మాంసాదులతో కూడిన పదార్ధాలు బయటకొచ్చిపడుతున్నాయి
కళ్ళుతిరిగాయి అర్జునునికి ఔషధప్రభావం తోకాదు..... అయోమయంతో



Read more...

కృష్ణాష్టమి శుభాకాంక్షలు

>> Sunday, August 21, 2011


సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు

"పైకొని చూడరె వుట్ల పండుగ నేడు
ఆకడ గొల్లెతకు ననందము నేడు

అడర శ్రావణబహుళాష్టమి నేడితడు
నడురేయి జనియించినాడు చూడ గదరే

అరుదై శ్రావణబహుళాష్టమి నాటి రాత్రి
తిరువవతారమందెను కృష్ణుడు

యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు
కరములందు బెట్టితే కడుసంతోసించెను"

అట్టి మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.

పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.

తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కున తిరిగి, "ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.

ఇంకా పూజ సమయంలో బాలకృష్ణా స్తోత్రమ్, శ్రీ కృష్ణ సహస్రనామములు, శ్రీ మద్భావవతములతో శ్రీకృష్ణుడిని స్తుతించవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించుకుని పూజను ముగించాలి.

ఇంకా కృష్ణష్టామి రోజున ఒంటిపూట భోజనం చేసి, శ్రీ కృష్ణుడికి పూజచేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
www.webdunia.com నుండి

Read more...

పరమ సుందరుడు

>> Saturday, August 20, 2011


పరమ సుందరుడు
-వి.రాఘవేంద్రరావు
వాల్మీకి రామాయణంలో సుందరకాండకు ఒక ప్రత్యేకత ఉంది. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ- ఇలా మిగతా కాండలన్నీ సార్థక నామధేయాలు కలిగి ఉన్నాయి. సౌందర్యమంతా రాసిపోసినట్టు, రాముడి ఆజ్ఞను శిరసావహించి, హనుమ సీతాన్వేషణకు బయలుదేరి సీతను చూసి లంకను కాల్చిరావటం విశేషమైన ఒక కథాంశం. ఇందులో ప్రముఖ పాత్ర పోషించింది ఆంజనేయుడు. ఈ ఆంజనేయుడు అతిసుందరుడని వాల్మీకి మహర్షి చెప్పటం మరో విశేషం! సౌందర్యం అంటే బాహ్యసౌందర్యం కాదని, ఆత్మసౌందర్యమేనన్నది కవిహృదయం. సుఖం ఇంద్రియాలపై ఆధారపడి ఉంటుంది. ఆనందం హృదయానికి సంబంధించింది. కాబట్టి, ఏ వస్తువువల్ల ఉల్లం పల్లవించి ఆనందం అనుభూతం అవుతుందో- అదే అందమైన వస్తువు. ఇందుకు సీతారామాంజనేయులే నిదర్శనం.

రాముడు సీతను పోగొట్టుకుని అడవిలో అలమటిస్తున్నాడు. సీత రావణనీత అయి అశోకవనంలో శోకిస్తున్నది. హనుమంతుడు జీవాత్మ రూపిణి అయిన సీతకు, పరమాత్మ స్వరూపుడైన రాముడికి ఒకరి జాడ ఒకరికి తెలియజేసి రెండు హృదయాల్లో ఆనందం నింపాడు. అంచేత, హనుమంతుణ్ని 'సుందరే సుందరః కపిః' అని కవి సంబోధించటంలో ఓ చమత్కారం ఉంది.

పరమాత్మనుంచి వేరుపడ్డ జీవాత్మ తిరిగి పరమపదాన్ని చేరుకోవాలని ఆరాటపడక తప్పదు. అలాగే, పరమాత్మ కూడా జీవాత్మను అక్కున చేర్చుకోవటానికి ఆత్రంగా ఎదురుచూస్తూనే ఉంటాడు. ప్రకృతి ప్రభావంవల్ల జీవుడైన జీవాత్మ తన ఆది ఆత్మ స్థితిని గ్రహించలేడు. జీవుడికి ఆ ఎరుక చెప్పగల ఒక 'ఘటకుడు' కావాలి. ఆ ఘటకుడికి మరొక పేరు గురువు లేక ఆచార్యుడు. సుందరకాండలో కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు కడు ప్రశంసనీయంగా, సమర్థంగా ఆ పాత్ర నిర్వహించగలిగాడు. ఆత్మసౌందర్యంతోపాటు ఈ ఆచార్య సౌందర్యం, బంగారానికి పరిమళం అబ్బినట్టుగా ఉంది. సుందరాచార్యుడు గురు దర్శకుడు కాబట్టి, రామభద్రుడు సీత దగ్గరకు ఆంజనేయుణ్ని దూతగా పంపించాడు. ఆ తరవాత రామాయణంలో మిగిలిందల్లా మూడే ముక్కలు- కట్టె, కొట్టె, తెచ్చె.

భగవంతుడు జీవుని పొందటానికి గురువును ఆశ్రయించాలి. ఏకంగా భగవంతుణ్ని చేరటం అసాధ్యం- అన్న ఆధ్యాత్మిక తత్వాన్ని వాల్మీకి తెలియజేయటానికి సులభసుందరమైన పద్ధతి అవలంబించాడంటే అతిశయోక్తి కాదు. సుందరకాండ రామాయణానికే తలమానికమైంది. ఆంజనేయుడు పరమసుందరుడయ్యాడు. పరమ గురువూ ఆయనే.

Read more...

మతం మార్చటం తప్పేనని ఒప్పుకుంటారా ?

>> Friday, August 19, 2011

ఈమధ్య నయనతార అనే సినిమానటి తన మతం మార్చుకొన్నదని ఆమతానికి చెందిన మతగురువులు తీవ్రంగా స్పందించారు . ఇది చాలాదుర్మార్గపు చర్య అని. మతం మార్చినవాల్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఎవరో ప్రలోభాలతో ఆమెను మతం మార్పించారని ఆరోపించారు.
ఇక్కడ డబ్బులిచ్చి ,మోసపుమాటలు చెప్పి,కాలేజీ సీట్లిచ్చి,సంకటంలో ఉన్నవారి మనఃబలహీనతలను అవకాశాలుగా మలచుకుని మతం మార్చే ఖర్మ,నీచస్థితి హిందువులెవరికీ పట్టలేదు. ఇక వారే మతం మార్చటం తప్పని ఒప్పుకున్నారు గనుక అటువంటి వారిపై చర్యలుతీసుకోవటానికి సాహసించే ప్రభుత్వం భవిష్యత్తులోనైనా రాగలిగితే మతబేహారుల పీడ ఈదేశానికి తొలగొచ్చు. సరే అదటుంచుదాం .ముందు ఈ మతమార్పిడులను అడ్డుకోగలగటానికి హిందువులలో చైతన్యంకలగటమే మార్గం.

అటువంటి చిన్న ఉదాహరణ నొకటి చెబుతాను . నేను వీరయ్యచౌదరిగారనే హెడ్ మాస్టర్ గారిదగ్గర పనిచేశాను .ప్రస్తుతం ఆయన ఉద్యోగవిరమణచేసి విశ్రాంతి తీసుకుంటూన్నారు . ఆయనకు ఎదురైన సన్నివేశాన్ని సరదాగా వివరిస్తుండేవారు.
మాస్టర్ గారికి నరసరావుపేట దగ్గర రావిపాడులో టీచర్ గారితో పెళ్ళికుదిరింది . వాళ్లు కన్వర్టెడ్ . సరే పెళ్ళి రావిపాడులో నిర్ణయించారు .పెళ్ళివారంతా తరలి వెళ్లారు .అక్కడ పెళ్ళి చేసేప్రక్రియ మొదలయింది .వారి మతగురువులు పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తెల పేర్లు చదువుతూ ఏదో డేనయ్య జ్ఞానయ్యో గానో చదివారట. మాస్టర్ గారికి తనపేరు వినపడక అయోమయంగా వాడెవడు ? అని అడిగారు. అప్పుడామత గురువులు అదిమీపేరే నండీ.... మా మతాచారం ప్రకారం ముందుగా మామతాన్నిచ్చి నామకరణం చేస్తాము ఇప్పటినుండి మీపేరు ఇదే నని చెప్పారట.
అవునా ! భలే... ఉంది పేరు. ఇంతకీ మీలో మా "అయ్య" ఎవరు ? అనడిగారట వీరయ్యగారు
దెబ్బకు బిత్తరపోయిన ఆమతగురువులు అదేమిటండి ? అలా అన్నారు అనడిగారు

అవునండి చిన్నప్పుడు అమ్మా నాకెవరు పేరు పెట్టారే ? అని మమ్మనడిగితే ఇంకెవరు పేరుపెడతారు మీ అయ్యే ,అని చెప్పింది . అంటే మా అయ్యకు నేను పుట్టానుకనుక పేరు పెట్టే హక్కు మా అయ్యకే ఉందనుకుంటూన్నాను ,ఇప్పుడు మీరు పేరు పెడుతున్నారంటే అనుమానం వచ్చి అడిగాను . మా అయ్య ఎవరా అని? అన్నాడట


అంతేకాదు సీరియస్సయ్యి పోయి నన్నుకన్నవాల్లకు నాపేరు పెట్టే అధికారం గాని మీకెవరిచ్చారు ? నా పేరు నానమ్మకాలను కించపరచే పనైతే ఈ పెల్లే నాకక్కరలేదు అని అడ్డం తిరిగాడట . దాంతో బంధువులంతా కలగజేసుకుని ఈ తంతులను ఆపి పెళ్ళిజరిపారట.

ఇక శంకరరెడ్డి నామితృడొకడు పెళ్లని పిలిస్తే వెళ్లాను పొన్నేకల్లు అనే ఊర్లో . అమ్మాయి జాబ్ చేస్తోంది కన్వర్టెడ్ స్థితిమంతులు. కాస్త అండగాఉంటారనే ఉద్దేశ్యంతో శంకర్ రెడ్డి ఈ సంబంధం కుదుర్చుకున్నాడు. పెళ్ళి వారి మతమందిరంలో . వెళ్లాము .చాలా పెద్ద ప్రార్ధనాలయం అది. తంతు జరుగుతుంది.పెళ్ళికుమారునికి ఏదో ద్రావకాన్నిచ్చారు .ఆతరువాత అతను పవితృడయ్యాడని ప్రకటించి ప్రతాపరెడ్డికి ..అమ్మాయి [పేరు గుర్తులేదు నాకు] కి వివాహం జరుపబడుతున్నదని చెబుతున్నారు. ఈప్రతాపరెడ్డెవడో నాకర్ధంకాలేదు . [పొరపాటున ఇంకెవరిపెళ్లికో రాలేదుకదా అనే అనుమానం కూడా వచ్చింది. వేదికమీద మాత్రం అదేజంట . ఇక వివాహమయ్యాక అక్కడ కొందరు పెల్లికుమారుని బంధువులు ఆమతాచార్యుని దగ్గరమాట్లాడుతుంటే అక్కడకు వెళ్లాను . ఆయన ఇష్టానుసారం గానే పేరుమార్చుకున్నాడండి అంటున్నాడు .వీల్లలో కుర్రాల్లేమో మీరు మార్చార్లేండి అని జోకులేస్తున్నారు. ఆయన అవ్వుతున్నాడు.

ఇది స్థితి .ఇప్పుడు స్వధర్మం పట్ల చైతన్యవంతులు కానిదే హిందువులనెవరూ రక్షించలేరనేది మాత్రం సత్యం.

Read more...

భగవంతుణ్ని చేరడమెలా?

>> Thursday, August 18, 2011

భగవంతుణ్ని చేరడమెలా?
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
గవంతుణ్ని చేరుకోవడానికి వైదిక ధర్మం నాలుగు ప్రధాన మార్గాలు సూచించింది. 1. జ్ఞానమార్గం 2. కర్మమార్గం 3. భక్తిమార్గం 4. యోగ మార్గం. ఈ నాలుగో మార్గాన్నే వైరాగ్య మార్గమనీ అంటారు. ఇది మానవుడిలో అంతర్వాహిని రూపంలో ఉంటుంది. ఈ నాలుగు మార్గాల్లో దేన్ని అనుసరించినా మానవుడు భగవంతుని చేరుకోగలుగుతాడని చెబుతారు. తమ తమ శక్తినీ సదుపాయాన్నీ అనుసరించి ఆయామార్గాలను మానవులు ఎంపిక చేసుకుంటారు.

జ్ఞానమార్గం రెండు రకాలని ముండకోపనిషత్తు వివరించింది. 1. పరవిద్య, 2. అపరవిద్య. భౌతిక జీవన సౌకర్యాలు- అంటే ధనం, కీర్తి, అధికారం, ఆహారం, శయనం, భోగం, వైభోగం... ఇలాంటివన్నీ అపరవిద్యకు సంబంధించినవి. ఇంద్రియాల ద్వారా పొందే ప్రపంచజ్ఞానమిది. అపరవిద్య ద్వారా పొందిన జ్ఞానం అనిత్యమైంది. దీనివల్ల పరమాత్మ లభించడు. అవివేకులు ఈ మార్గం కోరుకుంటారు. బ్రహ్మజ్ఞానం పరవిద్య ప్రధాన లక్షణం. ఇది వివేకవంతులు ఎంచుకునే మార్గం. ఇది శాశ్వతమైనది. పరవిద్యకు వేదాలు సాధనాలు. వేదాలు మార్గనిర్దేశనం చేసేవి మాత్రమే. భగవంతుని దర్శించే ప్రయత్నం ఎవరికి వారు చేసుకోవలసిందే. జ్ఞానయోగమంటే మన పూర్వులు ఉద్దేశించిన ఆత్మజ్ఞానమనే గ్రహించాలి. ఈ ఆత్మజ్ఞానమే పరమాత్మజ్ఞానం. ఆత్మను తెలుసుకోవడమంటే పరమాత్మను తెలుసుకోవడమే! నువ్వుల్లో నూనెలా, పెరుగులో వెన్నలా అంతరాత్మలోనే దైవం ఉన్నాడు. సాధన వల్లనే దైవదర్శనం సంప్రాప్తమవుతుంది. ఆత్మజ్ఞానం పొందడానికి సాధనతో పాటు స్వచ్ఛమైన ప్రవర్తన, పరిశుద్ధమైన శీలం, ఇంద్రియ నిగ్రహం కూడా అవసరమని భగవద్గీత చెబుతోంది. ఆత్మజ్ఞానం పొందినవాడికి కర్మవాసనలంటవు. అప్పుడే అతను జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయినవాడు సకల జీవులపట్లా సమదృష్టిగలవాడై ఉంటాడు.

భగవంతుని చేరుకోవడానికి సూచించిన రెండో మార్గం కర్మమార్గం. కర్మ అంటే పని లేక చర్య. జన్మించిన ప్రతి జీవీ కర్మ చేస్తూనే ఉంటుంది. కర్మాచరణంనుంచి మానవుడు కూడా తప్పించుకోలేడు. ప్రతి కర్మకూ ఫలితముంటుంది. మంచి కర్మకు మంచి ఫలితం, చెడ్డకర్మకు చెడు ఫలితం లభిస్తుంది. సత్కర్మలే చేసి సత్ఫలితాలను సముపార్జించమని గీతాకారుడు భగవద్గీతలో ప్రవచించాడు. దుష్కర్మలను చేసేందుకు ప్రేరేపించే రజస్తమోగుణాల మూలతత్వాలైన కామక్రోధాలను దూరంగా ఉంచితే పరమాత్మ మరింత చేరువవుతాడని గీతాకథనం. అంతేకాదు. 'కర్మ చేస్తూ వెళ్లు, ఫలితాన్ని నాకే వదిలిపెట్టు...' అంటాడు వాసుదేవుడు. ఫలితం మీదనే ధ్యాస పెట్టుకుంటే కర్మ కొనసాగదు, కర్మమీద ఏకాగ్రత నిలవదని తాత్పర్యం. సర్వకర్మలను భగవదాయత్తం చేసి భగవంతుణ్ని శరణువేడితే కర్మబంధం తెగిపోవడమే కాక, జన్మపరంపరనుంచి విముక్తి కూడా లభిస్తుందన్నది పెద్దల మాట.

ఇక మూడో మార్గం భక్తి. పరమాత్మ పట్ల అపరిమితమైన ప్రీతినే భక్తి అంటాం. భగవంతుడు కరుణామయుడు, ప్రేమమూర్తి. ఆ ప్రేమమూర్తి కేవలం భక్తిలతలకే బందీ అవుతాడు. పూజ్యులయందు మనసు చేర్చినప్పుడు కలిగే అనురాగపూర్వక వృత్తిని 'భక్తి' అంటారని నారద భక్తిసూత్రం నిర్వచించింది. భక్తిని నవవిధాలుగా చెబుతారు. భక్తి పదకొండు విధాలని నారద భక్తి సూత్రాలు నిర్వచించాయి. 'పత్రం, పుష్పం, ఫలం తోయం'- ఏది సమర్పించినా హృదయనైర్మల్యంతో, ఏకాగ్రతతో నివేదిస్తే అదే నాకు సంతోషదాయకం, మీకు మోక్షదాయకం అన్నాడు పరమాత్మ. సత్వరజస్తమోగుణాలను అతిక్రమించి, జన్మమృత్యుజరాదులనుంచి విముక్తుడై అమృతత్వం పొందుతాడు భక్తుడు. ఈ మూడు మార్గాల్లో భక్తిభావం అంతర్లీనంగా ఉండితీరాలి. లేకపోతే ఆ మూడూ నిరర్థకాలే!

భగవంతుని రూపాన్ని మనసులో సుప్రతిష్ఠితం చేసుకొని, సజ్జనుడై, భగవత్ప్రేమలో పూర్తిగా నిమగ్నమైనవాడు పరిపూర్ణభక్తుడు. అతనిది పరిణతి చెందిన భక్తి. అన్ని మార్గాల్లోనూ భక్తి మార్గమే అత్యంత శక్తిమంతమైనది. భగవంతుని చేరేందుకు ఇంతకుమించి దగ్గరి దారి లేదు. భక్తికి భగవంతుడు 'వశం' అవుతాడు. భక్తి లేకపోతే నరుడు 'శవం' అవుతాడు.

భగవంతుణ్ని చేరే నాలుగో మార్గం రాజయోగం. ఇది సాధకుణ్ని భగవంతుడితో అనుసంధానం చేస్తుంది. శరీరంలో కుండలిలో నిద్రాణంగా ఉన్న ప్రాణశక్తిని మేల్కొల్పి సుషుమ్ననాడి ద్వారా స్రహస్రారంలోని చైతన్యశక్తితో అనుసంధానించడమే రాజయోగం. ఇది చాలా కష్టసాధ్యమైన మార్గం. ప్రాణశక్తిని ఉద్దీపం చెయ్యడం ద్వారా శుద్ధచైత్యన్యస్థితిని అందుకోవడమే రాజయోగ లక్ష్యం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యహార, ధారణ, ధ్యాన, సమాధులనేవి రాజయోగానికిగల ఎనిమిది సోపానాలు... వీటిని అధిరోహించటమే రాజయోగసాధనమవుతుంది.

భగవంతుణ్ని చేరుకోవడానికి ఈ నాలుగు మార్గాల్లో ఏదైనా అనుసరణీయమేనని మన పూర్వజులు అనుభవపూర్వకంగా చెప్పారు. చిత్తశుద్ధి, ఏకాగ్రత, ఆత్మసమర్పణ భావం, విశ్వాసం, భక్తికి సంపూర్ణతనిచ్చే లక్షణాలని సనాతన ధర్మం చెబుతోంది. ఇవి మినహాయించి చేసే ఆడంబరాలు, దానధర్మాలు, మొక్కుబడులు, ఉపవాసాలు, వ్రతాలు, భజనలు, అర్చనలు, ఆరాధనలు- అన్నీ నిరర్థకాలేనని గ్రహించాలి.



Read more...

నామరామాయణం

>> Tuesday, August 16, 2011


నామరామాయణం
ఓ౦! శ్రీ సీతాలక్ష్మణభరతశత్రుఘ్నహనుమత్సమేత
శ్రీ రామచ౦ద్ర పరబ్రహ్మణే నమ:



om

బాలకాండము
శుద్ధబ్రహ్మపరాత్పర రామ
కాలాత్మకపరమేశ్వర రామ
శేషతల్పసుఖనిద్రిత రామ
బ్రహ్మాద్యమరప్రార్థిత రామ
చండకిరణకులమండన రామ
శ్రీమద్దశరథనందన రామ
కౌసల్యాసుఖవర్ధన రామ
విశ్వామిత్రప్రియధన రామ
ఘోరతాటకాఘాతక రామ
మారీచాదినిపాతక రామ
కౌశికమఖసంరక్షక రామ
శ్రీమదహల్యోద్ధారక రామ
గౌతమమునిసంపూజిత రామ
సురమునివరగణసంస్తుత రామ
నావికధావితమృదుపద రామ
మిథిలాపురజనమోహక రామ
విదేహమానసరంజక రామ
త్ర్యంబకకార్ముకభంజక రామ
సీతార్పితవరమాలిక రామ
కృతవైవాహికకౌతుక రామ
భార్గవదర్పవినాశక రామ
శ్రీమదయోధ్యాపాలక రామ
రామ రామ జయ రాజారామ
రామ రామ జయ సీతారామ

అయోధ్యాకాండము
అగణితగుణగణభూషిత రామ
అవనీతనయాకామిత రామ
రాకాచంద్రసమానన రామ
పితృవాక్యాశ్రితకానన రామ
ప్రియగుహవినివేదితపద రామ
తత్క్షాళితనిజమృదుపద రామ
భరద్వాజముఖానందక రామ
చిత్రకూటాద్రినికేతన రామ
దశరథసంతతచింతిత రామ
కైకేయీతనయార్పిత రామ
విరచితనిజపితృకర్మక రామ
భరతార్పితనిజపాదుక రామ
రామ రామ జయ రాజారామ
రామ రామ జయ సీతారామ

అరణ్యకాండము
దండకావనజనపావన రామ
దుష్టవిరాధవినాశన రామ
శరభంగసుతీక్ష్ణార్చిత రామ
అగస్త్యానుగ్రహవర్ధిత రామ
గృధ్రాధిపసంసేవిత రామ
పంచవటీతటసుస్థిత రామ
శూర్పణఖార్తివిధాయక రామ
ఖరదూషణముఖసూదక రామ
సీతాప్రియహరిణానుగ రామ
మారీచార్తికృదాశుగ రామ
వినష్టసీతాన్వేషక రామ
గృధ్రాధిపగతిదాయక రామ
శబరీదత్తఫలాశన రామ
కబంధబాహుచ్ఛేదన రామ
రామ రామ జయ రాజారామ
రామ రామ జయ సీతారామ

కిష్కింధాకాండము
హనుమత్సేవితనిజపద రామ
నతసుగ్రీవాభీష్టద రామ
గర్వితవాలిసంహారక రామ
వానరదూతప్రేషక రామ
హితకరలక్ష్మణసంయుత రామ
రామ రామ జయ రాజారామ
రామ రామ జయ సీతారామ

సుందరకాండము
కపివరసంతతసంస్మృత రామ
తద్గతివిఘ్నధ్వంసక రామ
సీతాప్రాణాధారక రామ
దుష్టదశాననదూషిత రామ
శిష్టహనూమద్భూషిత రామ
సీతవేదితకాకావన రామ
కృతచూడామణిదర్శన రామ
కపివరవచనాశ్వాసిత రామ
రామ రామ జయ రాజారామ
రామ రామ జయ సీతారామ

యుద్ధకాండము
రావణనిధనప్రస్థిత రామ
వానరసైన్యసమావృత రామ
శోషితశరదీశార్థిత రామ
విభీషణాభయదాయక రామ
పర్వతసేతునిబంధక రామ
కుంభకర్ణశిరశ్ఛేదక రామ
రాక్షససంఘవిమర్ధక రామ
అహిమహిరావణచారణ రామ
సంహృతదశముఖరావణ రామ
విధిభవముఖసురసంస్తుత రామ
ఖఃస్థితదశరథవీక్షిత రామ
సీతాదర్శనమోదిత రామ
అభిషిక్తవిభీషణవందిత రామ
పుష్పకయానారోహణ రామ
భరద్వాజాభినిషేవణ రామ
భరతప్రాణప్రియకర రామ
సాకేతపురీభూషణ రామ
సకలస్వీయసమానత రామ
రత్నలసత్పీఠస్థిత రామ
పట్టాభిషేకాలంకృత రామ
పార్థివకులసమ్మానిత రామ
విభీషణార్పితరంగక రామ
కీశకులానుగ్రాహక రామ
సకలజీవసంరక్షక రామ
సమస్తలోకోద్ధారక రామ
రామ రామ జయ రాజారామ
రామ రామ జయ సీతారామ

ఉత్తరకాండము
అగణితమునిగణసంస్తుత రామ
విశ్రుతదశకంఠోద్భవ రామ
సితాలింగననిర్వృత రామ
నీతిసురక్షితజనపద రామ
విపినత్యాజితజనకజ రామ
కారితలవణాసురవధ రామ
స్వర్గతశంబుకసంస్తుత రామ
స్వతనయకుశలవనందిత రామ
అశ్వమేధక్రతుదీక్షిత రామ
కాలానివేదితసురపద రామ
ఆయోధ్యకజనముక్తిద రామ
విధిముఖవిభుదానందక రామ
తేజోమయనిజరూపక రామ
సంస్మృతిబంధవిమోచక రామ
ధర్మస్థాపనతత్పర రామ
భక్తిపరాయణముక్తిద రామ
సర్వచరాచరపాలక రామ
సర్వభవామయవారక రామ
వైకుంఠాలయసంస్థిత రామ
నిత్యానందపదస్థిత రామ
రామ రామ జయ రాజారామ
రామ రామ జయ సీతారామ
ఇతి శ్రీ నామ రామాయణ౦ స౦పూర్ణ౦

మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్

వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామల మూర్తయే
పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్


Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP