శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్నా ! ఈ కృష్ణుణ్ని మనం దేవుడనుకుంటాంగానీ .... అబ్బే

>> Monday, August 22, 2011

అన్నా ! ఈ కృష్ణుణ్ని మనం దేవుడనుకుంటాంగానీ .... అబ్బే మరీ అనాచారపరుడు . ఏం దేముడో ఏంటో ? ఇటువంటివాణ్ణి పరమాత్మ అంటే నమ్మటం కష్టం గాఉంది .... ఫిర్యాదు చేశాడు అర్జునుడు

అయ్యో ! ఏమైంది అర్జునా ? విస్మయంగా అడిగాడు ధర్మరాజు.
ఈరోజు మేము వ్యాహ్యాళికెళ్లామా ? అక్కడ ఈయన అసలు రంగు బయటపడింది .అర్జునుడు అసహనంగా అన్నాడు
ఏంజరిగింది ? ధర్మరాజు వివరమడిగాడు .చెప్పసాగాడు అర్జునుడు.
====********************************************************************
ఆరోజు అర్జునుడూ కృష్ణభగవానుడు వ్యాహ్యాళికి వెళ్లారు . దారిలో విశేషాలను పరికిస్తూ దాదాపు ఊరిబయటకు వెళ్లారు .
అక్కడ ఊరిబయట ఒక గుడిసె .చాలా నిరుపేద నివాసం .అందులోనూ మద్యమాంసాదులు భుజించే వ్యక్తి నివాసం.
దూరంనుంచి కృష్ణార్జునులను గమనించిన ఆగుడిసె యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి పాదాలపై వాలాడు. వచ్చావా ప్రభూ ! ఎన్నల్లకెణాళ్లకు ఈ దీనునిపై దయగలిగింది. దీనదయాళో ఇన్నాళ్లకు నన్ను కరుణించి నాకోసం నడచివచ్చావా ? అంటూ ఆనదం దుఃఖం ముప్పిరిగొనగా పరిపరి విధాలా ప్రార్ధిస్తున్నాడు. భక్తి ఉన్మాదంలో ఏదేదో మాట్ళాడుతున్నాడు. నాజన్మ ధన్యం చేయవచ్చావా నాతండ్రీ ! అని మరలామరలా పాదాలపైబడుతున్నాడు. స్వామిని న్లువెల్లా తడుముకుని తన్మయుడవుతున్నాడు. కన్నయ్య చిరునవ్వులు చిందిస్తుంటే సరిగా శుభ్రమైన దుస్తులుగానీ శుభ్రతగానీ లేని అతన్ని చూసి అర్జునునికి మాత్రం కంపరమెత్తుతున్నది. కృష్ణుడు మాత్రం భక్తుని అక్కునచేర్చుకుని ఓదారుస్తున్నాడు .ఏం కావాలి అని అడుగుతున్నాడు భక్తున్నీ
దూరంగా జరిగి ఎప్పుడు ఈగోలవుతుందా వెళ్లాలని చూస్తున్న అర్జునుడు ఆమాటమాత్రం అడగలేక చూస్తున్నాడు.
అప్పుడా భక్తుడు స్వామీ ! తమరు ఈ మాహావీరునితో కలసి నాగుడెసెలోకొచ్చి నాచేతి ప్రసాదం స్వీకరించవా స్వామీ ! నాచేతులారా రెండు ముద్దలు తినిపించుకోవాలి నీకు అంతకంటే ఈజన్మకేమీ అక్కరలేదు అని విన్నవించుకున్నాడు
.బావా ! పాపం ఇతని కోర్కె తీరుద్దాము వెళ్లొద్దామా ? అడిగాడు.
తాను రాజపుతృడు ఇలాగుడెసెల్లోకి వెళ్ళి వాల్లుపెట్టే పాచికూడు తినడానికి తానేమన్నా ఈ పశువులకాపరిలా పల్లెవాడా ? ఇలా ఆలోచించుకున్న అర్జునుడు .నువ్వెళ్ళిరాలే బావా ... అంతదాకా నేనీ చెట్లదగ్గర ఉంటాను అని తప్పుకున్నాడు.
సరే ! నీ ఇష్టం .అని భక్తునివెంట అతని గుడెసెలోనికి వెళ్లాడు.
లోపలకు తీసుకెళ్ళిన ఆభక్తుడు స్వామికి పీటవేసి పాదాలు కడిగి కాళ్ళుతుడచి పలురకాలుగా పొగుడుతూ పూజిస్తున్నాడు. స్వామీ ఈరోజు మంచి మాసం కూరవండాను .ఉండు పెడతాను . అని మెత్తని ముక్కలు ఏరి ఏరి స్వామికి తినిపిస్తున్నాడు. బాగుందా స్వామీ ... అనడుగుతున్నాడు . స్వామి కొసరికొసరి బతిమాలి ఇదొక్కటి తిను కన్నాయ్యా మాతండ్రివి కదూ ! ఇంకొక్కటి తిను అని తినిపిస్తున్నాడు.
బయట ఫలవృక్షాల దగ్గర ఫలాలుతీసుకుని తింటూ వేచి ఉన్న అర్జునునికి ఆలస్యమయ్యే కొద్దీ విసుగొస్తున్నది.
చాలాసేపు చూసి ఇక ఆగలేక లోపలేమిజరుగుతుందో చూద్దామని గుడిసెవద్దకెళ్ళి కిటికీలోంచి తొంగి చూశాడు.
అంతే ! ఆయనకు అసహ్యమనిపించింది . ఛీ ,ఛీ మరీ ఇలా మద్యమాంసాలకు కూడా అలవాటుపడ్దాడు ఈ నల్లోడు అబ్బే యాక్ .. అనుకున్నాడు .. దూరంగా వెళ్లి వేచి ఉన్నాడు ఎప్పటిలాగే
కృష్ణుడు బయటకొచ్చి వెళదమా ?బావా ? అన్నాడు
ఏంటీ ! తమ భక్తుడు అంత మధురభక్ష్యాలందించాడా ఇంతసేపు పట్టింది ? అడిగాడు వెటకారంగా పార్థుడు.
వాని హృదయం అంత మధురమైనది అందుకే అవి అంతగా రుచిగా వున్నాయి నర్మగర్భంగా పలికాడు నల్లనయ్య
ఉంటాయి ...ఉంటాయి ఎందుకుండవు ఒట్టి అనాచారపరుడు ,, ఇంటికెళ్లనీ మా అన్నగారిదగ్గర బట్టబయలు ఇతని బండారం మనసులో కసి అనుకున్నాడు కిరీటి
............................................................................................................................................

ఇదన్నా సంగతి వివరించాడు పార్ధుడు
నమ్మలేకపోయాడు ధర్మజుడు
కానీ అర్జునా ఇదినమ్మలేకపోతున్నాను .నువ్వు నిజంగా చూశావా ..ఆయన మహాపురుషుడు.....సందేహంగా అన్నాడు

నువ్వు నమ్మవు. నీలాగే లోకమంతా ఉంటుందనుకుంటావు అమాయకంగా . ఇది చిన్నప్పటినుంచి దొంగసరుకే .
ఏదో నాలుగు మహిమలు చూసి మనం బోల్తాపడుతున్నాం ..వస్తున్నాడుగా అడుగు ఆపెద్దమనిషినే ....అన్నాడు అర్జునుడు ఉక్రోషంగా
ఏంటీ ! అన్నదమ్ములేదో గుసగుసలాడుకుంటూన్నారు మాకూ చెప్పవచ్చుకదా ? ఆగదిలోకి వస్తూ కృష్ణూడు మేలమాడాడు

బావా ! తమరు ఏమీ అనుకోకుంటే చిన్నసందేహం తమరు మాకు బంధువేగాదు..గురువూ నూ,మంచెదో చెడేదో చెప్పి సన్మార్గంలో నడిపేఆచార్యుడూకూడా . మరలాంటి తమరు కొన్నిఅనాచారపనులు చేస్తున్నారని ....మా
నసుగుతున్నాడు ధర్మరాజు

మీవాడంటున్నాడా ? ఏమి చేశానో చెప్పవచ్చుకదా ?
అదే మీరు నిషిధ్ధపదార్ధాలు భుజించారని .అనాచారుల ఇంట ఇలా .....
అవునా ! నేనెప్పుడు తిన్నాను ? అమాయకంగా అడిగాడు స్వామి
హమ్మా ! అబద్దాలు కూడానా . అర్జునుడు మండిపడ్డాడు.
వున్నవిషయం చెబుతున్నాను బావా ! ఈరోజు సాయంత్రం నేనూ అర్జునుడు అలావ్యాహ్యాలికెళ్ళాం .అక్కడొక భక్తుడు ఏదో పండ్లు ప్రసాదంగా పెడితే స్వీకరించాను వచ్చేశాను ఇందులో తప్పేముంది . ? అడిగాడు లీలానాటక సూత్రధారి.
అవ్వ ! ఎంతబద్దం ? పండ్లు స్వీకరించావా ? పాడుతిండి తిన్నావుకాదా ? అర్జునుడన్నాడు.

నేనా ! ఇదిగో ధర్మరాజా ! నీతమ్ముడే ఇంట్లోకి రాలేదు .ఎక్కడకో వెళ్లి ఎదో తినుంటాడు .నెపం నామీదకు నెడుతున్నాడు అన్నాడు స్వామి
మరలా ఇదొకటా ఎవరేమి తిన్నామో ? తేలుద్దామా పంతానికి పోతున్నాడు కోపం పెరిగిన పార్థుడు
అలాగే అన్నాడు స్వామి
ఇదిగో ధర్మరాజా ! మీ అనుమానం ఇప్పుడే తీరాలి .కాబట్టి మేమిరువురము వమనానికి[కక్కుకోవటం] కు ఔషధం తీసుకుని సత్యం నిరూపిస్తాము సిద్దమేనా అన్నాడు స్వామి
సిద్దమేనన్నాడు పార్ధుడు
వైద్యుని రప్పించి ఇద్దరూ వమనానికి ఔషధం స్వీకరించారు.
దానిప్రభావం వలన కృష్ణార్జునులకిరువురకూ వాంతులయ్యాయి స్వామి నోటినుండి ఫలాదులతో సుగంధభరితమైన పదార్ధాలు బయటకొస్తున్నాయి
మరటువైపు ? అర్జునుని నోటినుండి మత్స్య మాంసాదులతో కూడిన పదార్ధాలు బయటకొచ్చిపడుతున్నాయి
కళ్ళుతిరిగాయి అర్జునునికి ఔషధప్రభావం తోకాదు..... అయోమయంతో



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP