చిన్నారి పుట్టినరోజు రారండి.. శుభములనొందండి
>> Wednesday, October 13, 2010
శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం లో కొలువై యున్న మన చిన్నారి పుట్టినరోజు [దుర్గాష్టమి] ది 15 -10-2010 న జరుపబడుతుంది . అందరూ వచ్చి అమ్మ ను సేవించుకోవాలని మనవి . ఈసందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరుగుతాయి . సంతానం లేని దంపతులు పాల్గొని పూజజరిపితే అమ్మ అనుగ్రహాన సత్సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకము .
మరునాడు మహర్నవమి ఉత్సవం జరుపబడుతుంది .భగవద్బంధువులందరికీ ఇదే మా ఆహ్వానం
4 వ్యాఖ్యలు:
మన చిన్నారి దుర్గమ్మ పుట్టిన రోజు.
భక్తుల హృదయాలలో కొలువుండ పుట్టిన రోజు.
అష్ట కష్టాలనూ మటుమాయం చేయాలని కొరుతూ
తనను గూర్చి తపించే భక్తుల కల్పవల్లిగా పుట్టిన రోజు.
ఆ దుర్గమ్మ కరుణా కటాక్ష వీక్షణా గవాక్షాలు తెరువబడే
ఆనంద దుర్గాష్టమి ఈ రోజు.
భక్తులకాలవాలమైన శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠస్థ దుర్గాంబికా పుత్రులు శ్రీ దుర్గేశ్వరులకు యావన్మంది భక్తులకూ ఆ జగన్మాత ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి; జగన్మంగళకారకులుగా దీవించాలని మనసారాకోరుకొంటున్నాను.
durgeswara gaaru danyavadamulu.
విజయ దశమి శుభా కాంక్షలు అందరు దిగ్విజయంగా జరుపు కోవాలని కోరుతు .
చిన్నారి దుర్గమ్మ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు .
నవరాత్రి శుభాకాంక్షలు .
Post a Comment