శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవీ భక్తుల మనసును నొప్పించరాదు .

>> Tuesday, October 12, 2010

నిన్నటి సంధ్యవేళ అమ్మ దర్శనం [శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం లో ]

దేవీభక్తుల మనసును నొప్పించరాదు అని పెద్దల హెచ్చరిక . తన భక్తులను అవమానిస్తే ఆ జగన్మాత తననవమానిమ్చినట్లుగా భావిస్తుందట. అవును తన బిడ్డనెవరన్నా ధూషిస్తే తల్లికి కోపం రావటం సహజమే కదా !
కనుకనే పెద్దలు ఈ హెచ్చరిక చేశారు . మనం ఈ విషయం లో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలి . నాకు నిన్న ఇలాంటి ప్రమాదం ఎదురైంది. కానీ అమ్మఅనుగ్రహాన తొలగిపోయింది . పూజానంతరం కొద్దిగా ఖాళి దొరికితే మితృలను పలకరిద్దామని నెట్ ఓపెన్ చేసి చాట్ లో ఉన్నప్పుడు ఒక దేవిభక్తుని తో మాట్లాడుతూ అసంకల్పితంగా వారిని నొప్పించినట్లున్నాను . వారు చేసినవ్యాఖ్య వారు బాధపడినట్లుగా అనిపించింది .
వెంటనే మెళకువ కలిగి దేవీ నవరాత్రులలో దేవీ భక్తుని మనసును నొప్పించానే అని చాలా బాధకలిగించింది . వారిని వెంటనే క్షమాపణ వేడాను. ఈ విషయం లో తగిన పరిహారం చెప్పమని మరొక పెద్దవారైన సాధకులొకరిని అడిగాను . కపిలగోవు చుట్టూ ప్రదక్షిణలు చేయమని సలహా ఇచ్చారు ఆయన. గోవు అందుబాటులో లేకున్న చిత్రపటానికే ప్రదక్షిణలు చేయమని సలహా చెప్పారు. మనస్సంకల్పంతో ప్రధక్షిణలు చేసిన వెంటనే ఎవరికి నేను కష్టం కలిగించాననుకున్నానో వారే పెద్దమనస్సుతో అయ్యో !నేనేమీ బాధపడలేదు అని మెస్సేజ్ పంపారు . అవును గోప్రదక్షిణ మహాత్మ్యమటువంటిది మరి. జయ జగజ్జనని .

1 వ్యాఖ్యలు:

B.Rathnam October 25, 2010 at 11:53 PM  

ఉన్న గొప్పతనం ఇదే. తనను తాను నమ్ముకున్న వాడు ఎన్నటికీ చెడిపోడు దైవమే సత్యముర హృదయమె పుష్కర స్నానంబుర తరచిచూడ యాత్రలన్ని తనలో దర్శించుర మన మనస్సే మన మిత్రువు, మనస్సే మన శత్రువు. 'ఉద్దరేత్ ఆత్మన ఆత్మానం' మనస్సుని బాగు చేసుకొని నిన్ను నీవు ఉధ్ధరించుకోవాలి. బయట శత్రువులు బయటి మిత్రులు నిన్ను ఏం చేయలేరు. మనకి ఆ విషయాలు తెలియక బయటివాళ్ళనే మిత్రులని దగ్గర చేసుకుంటాం, శత్రువులని దూరం చేసుకుంటాం. కానీ నిజానికి వాళ్ళు కారు.మనస్సే మన శత్రువు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP