మీ జేబులోంచి ఓ రెండువందలుమీఊర్లో ఖర్చుబెట్టి ,మీసమయం లోంచి 24 గంటలు నాకు దానమివ్వగలరా ?
>> Sunday, March 14, 2010
మీరు రెండువందల రూపాయలు మీఊర్లో ఖర్చుపెట్టి 24 గంటల సమయాన్ని ఇవ్వగలిగితే మీరు స్వామి పరివారంగా మారి లోక కళ్యాణకరమైన ఒక కార్యక్రమం మీచే నిర్వహింపజేపించాలనే సంకల్పం కలిగినది.
ప్రస్తుతము పిల్లలు పరీక్షలకు సిద్దమవుతున్నారు. మానవశక్తి కి పరిమితమెంతో అంతవరకు కృషిచేసి రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. అయితే తమ ప్రయత్నమంతా కూడా సఫలతపొందాలంటే ఆపిల్లలకు ఏ ఆటంకం కలగకుండా ఉండాలి చివరి పరీక్షవరకు. వీరిలో బాగా చదువుతూ కోడా నవసరమైన భయాలకు లోనైతప్పులు చేశేవారు,కంగారుఎక్కువై తడబడేవారు, వీరితో బాటు ఎంత చదివినా గుర్తుకురాక ఇబ్బందిపడేవారు తీరా అన్నీబాగున్నా ఏదో హఠాత్తుగా ఇబ్బందులు వచ్చి పరీక్షసరిగా వ్రాయలేక పోయేవారు కూడా ఉంటున్నారు. దీనికితోడు తల్లిదండ్రులు చదువునొక జీవన్మరణ పోరాటంగా నూరిపోసి పసిబిడ్డలపై అధికవత్తిడి తెస్తున్నారు.
సరే ! ఇప్పుడు మనం చేయవలసిన పనేమిటంటే ! సకల భయాలను పారద్రోలి ,అపారధైర్యాన్ని ,జ్ఞాపకశక్తిని బుద్ధి కుశలతను ప్రసాదించి తానెక్కడ ఉంటే అక్కడ విజయాన్ని ప్రసాదించగల పవనసుతుని శక్తిని విద్యార్థుల మనోశక్తికి అనుసంధానం చేద్దాము . పిల్లలకు ఆయనపట్ల విపరీతమైన అభిమానము . ,ఆయన తమ వెంటనుంటే కొండలనైనా అవలీలగా పైకెత్తగలమనే ఆత్మ విశ్వాసం ఉంటుంది. ఆయనను శరణువేడి ఆయన అనుగ్రహం తో ఈ పరీక్షలలో దిగ్విజయంగా సాగటానికి " శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం " ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేస్తున్నది ఈప్రాంతం లో.
అదేవిధంగా మీరు నివాసమున్నచోటనే మీరే ఈఖర్చుతో విద్యార్థులకోసం ఈకార్యక్రమాన్ని చేపట్టే విధానము తెలియజేస్తాము . మీకు పైన నేను చెప్పిన ఖర్చుతప్ప అదనపు భారం కలగకుండా నే భారీ కార్యక్రమముగా ఈపూజ సాగుతుంది .అదీ హనుమంతుడు భక్తునికి ప్రసాదించే శక్తికి చిన్న ఉదాహరణ. ఈకార్యక్రమంలో పాల్గొనుటద్వారా విద్యార్థులు హనుమంతుని కృప పొంది, తరువాత జీవితం లో ఆయనయొక్క దివ్యగుణాలను ఆదర్శంగా తీసుకుని సమాజంపట్ల ఉపకారబుద్దిని పెంపొందించుకుంటారు . ఇలా సహకరించి, పదిమందికి మీద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను కలిగే మేలువల్ల పోగుపడే పుణ్యరాశి మీ వెంటనుండి శుభాలను కలిగిస్తుంది మీకు., మీరు స్వామి పరివారంలో వారౌతారు . ఈకార్యక్రమాన్ని మీరు ఎవరితరపున ,ఏ ఆథ్యాత్మిక సంస్థ తరపున చేయటం లేదు .కేవలం హనుమద్భక్తులుగా చేస్తున్నారనే విషయం మరువకండి . మీకు కావలసిన సూచనలను సహాయము అందించడానికి నేను ఫోన్ లో 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఇదిచదివి మీరు ఈ హనుమత్కార్యక్రమం చేయాలి అనే సంకల్పం కలిగితే మాత్రం క్షణమాగవద్దు ,అది స్వామి మనకిచ్చిన అవకాశంగా గ్రహించి ముందుకు దూకండి. అవలీలగా స్వామి ఈమహత్తర కార్యక్రమాన్ని మీచే ఎలా జరిపిస్తాడో చూడండి .[ నాక్కూడా అంతే ఖర్చయ్యాయి అదీ నాప్రయాణాలకోసం ఈ కార్యక్రమం చేపట్టడానికి మీవెంట ఇంకో నలుగురు హనుమద్భక్తులు ఉంటే మీ అందరికీ కలిపి అంత ఖర్చులవుతాయి అంతే . ఇది హనుమత్సేవకు ఉపక్రమించాలనుకునే భక్తులకొరకు మాత్రమే వ్రాసినపోస్ట్ దయచేసి నచ్చితే చదవండి లేదా నచ్చకుంటే తొలగిపొండి . మాకు స్వామి మీదున్ననమ్మకం తో చేపడుతున్న కార్యక్రమాన్ని మిగతా హనుమద్భక్తులకు అందజేయుటకు వ్రాయబడినది . అనవసర వ్యాఖ్యలకు చోటివ్వవద్దు]
జై భజరంగబలీ కీ
జై పవనసుత హనూమాన్ కీ
నా నంబర్ 9948235641
1 వ్యాఖ్యలు:
Post a Comment