దరిశిలో విద్యార్థుల జయార్ధమై ఈరోజు జరిగిన హనుమత్ పూజ
>> Friday, March 12, 2010
ప్రకాశం జిల్లా దర్శి లో పదవతరగతి విద్యార్థులజయార్థమై ఈ రోజు హనుమత్ పూజలు ,ధ్యానములు జరిగాయి. శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం తరపున విద్యార్థులలో ఆత్మ విశ్వాసం ,ఏకాగ్రత ధారణాశక్తి పెరగడానికై హనుమత్ కృప కోరుతూ పట్టణం లో ఉన్న ఆరామ క్షేత్రమైన హనుమంతుని గుడిలో ఈ పూజలు నిర్వహించుట జరిగినది. ఉదయాన్నే స్వామికి విద్యార్థులపేరున పంచామృతాభిషేకములు,తమాలార్చన జరిపి అనంతరం విద్యార్థులచే హనుమత్ రక్షాధారణ చేపించటం జరిగింది. అనంతరం ఒక సాధకుడు తన లక్ష్యాన్ని చేరుకోవడమెలాగో హనుమంతుని జీవితచరిత్రనుంచి విశ్లేషించి చెప్పబడినది. హనుమంతునిలా ఏకాగ్రత ,ధైర్యం ,సునిశిత బుద్ధి శక్తి ఎలావచ్చాయో వివరించాము. ,ఆయనలా సదాచారము , మంచి ఆలోచనలు చేస్తే మీరే స్వామి ప్రతిరూపాలౌతారని , రాముడిని గుండెలలో ఎలా దాచుకున్నాడో ,మీ మనసులో ఆయన అలా వచ్చికూర్చుంటాడని చెప్పగానే పిల్లలు కేరింతలు కొట్టారు. సోమరిపోతులకు దైవమెప్పుడూ సహాయపడడని ,భగవంతుడిచ్చిన అవయవాలను సక్రమంగావినియోగించుకుని ,ఆయనపై భక్తి కలిగియుంటే సత్ఫలితాలొస్తాయని చెప్పాము. సముద్రాన్ని అవలీలగా ఉల్లంఘించిన స్వామి మీమనసులో నిలబడితే ఆరు సబ్జక్టులు ఒకలెక్కలోనివా ? ఇంకా పరీక్షలంటే భయపడేవారున్నారా అని ప్రశ్నిస్తే .లేదులేదు అని కోరస్ గా అరచిన పిల్లలు స్వామి అండతో మేము విజయం సాధిస్తామని ,కొండలెత్తిన స్వామి అండ ఉండగా విజయం సాధించటం మాకొకలెక్కకాదు ,, జైభజరంగభళీకీ ....అని నినాదాలు చేశారు. చాలీసాలోని సంపుటీకరణ మంత్రాన్ని ధ్యానం చేయడం నేర్చుకుని ఉల్లాసంగా ఆత్మధైర్యంతో తిరిగి వెళ్లారు పిల్లలు .వికలాంగులైన పిల్లలు కూడా స్వామి శక్తితో అద్భుతవిజయం సాధిస్తామని ధైర్యంగా చెబుతుంటే , స్వామి అనుగ్రహం తో వాళ్ళు కొండలు పిండిచేయగలరనిపించింది.
ఒక్కోపాఠశాలనుండి బృందాలుగా వచ్చిన విద్యార్థులు ఆనందోత్సాహాలతో కార్యక్రమం లో పాల్గొన్నారు.
1 వ్యాఖ్యలు:
చాలా మంచి పనులు చేస్తున్నారు మాష్టారూ..ఎక్కడైతే దైవప్రీతి ,పాప భీతి , సంఘనీతి ఉంటాయో అక్కడే ధర్మం నిలుస్తుంది. ఆ ధర్మాన్ని నిలబెట్టేందుకు చేసే ప్రతి కార్యము ఒక మహాయజ్ఞము. మీరు చేస్తున్న ఈ యజ్ఞం మహోన్నతమైనది.
ఆభిజ్ఞాన
Post a Comment