అందరికీ ఉగాది శుభాకాంక్షలు .వివిధప్రదేశాలలో రేపు విద్యార్థుల జయార్ధం జరుగనున్న హనుమత్పూజలు.
>> Monday, March 15, 2010
ముందుగా అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు . వికృతి నామ సంవత్సరాన మీకు మీకుటుంబానికి అన్నింటా శుభములు,సంతోషములు కలుగజేయాలని జగన్మాతను ప్రార్ధిస్తున్నాము.
నిన్న కనీసం రెడువందలు ఖర్చుపెట్టి మీ ఊరిలో విద్యార్ధులకోసం ప్రత్యేకపూజలు చేపించమని నే కోరిన వెంటనే స్పందిస్తున్న భక్తజనులకు కృతజ్ఞతలు . మొదట అర్ధంకాలేదని ,మీరు చెప్పినవిషయం విన్నాక అనుమానాలుతీరాయని తెలుపుతున్నవారికి ధన్యవాదములు.
రేపు తాడేపల్లిగూడెం .ఇనిమెళ్ళ,ముప్పాళ్ల , నూజండ్ల,నరసరావుపేట లలో ఆంజనేయస్వామి ఆలయాలలో విద్యార్థులకోసం ఈకార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు అక్కడనుండి కార్యక్రమనిర్వహనకు ముందుకొచ్చిన ధార్మికమితృలు తెలియజేస్తున్నారు. చాలా తక్కువసమయం లో ఏర్పాట్లు కష్టం కనుక వచ్చేశనివారం మరికొన్నిచోట్లచేయడానికి ప్రయత్నిస్తున్నామని కొందరు మితృలు చెబుతున్నారు.
ఇక భాగ్యనగరం [హైదరాబాద్] లో గల ప్రముఖదేవాలయాలలో విద్యార్థులకోసం ప్రత్యేకపూజలు ఏర్పాటుచేసినట్లు విశ్వహిందుపరిషత్ కార్యకర్తలు తెలిపారు. NTR గార్డెన్స్ ఎదురుగా గల హుస్సేన్ సాగర్లోని హనుమదాలయం .విద్యుత్ సౌధ ఎదురుగా గల హనుమత్ క్షేత్రం ,అలాగే అత్తాపూర్ లో గల కాలాహనుమాన్ ఆలయంలో తిరుమలలో జరిపిన సరస్వతీయాగం నుండి తెచ్చిన రక్షలు ఉంచామని హాల్ టిక్కేట్ చూపిన విద్యార్థులకు ఉచితంగా అర్చనచేపించి, రక్షలు,పూజలో ఉంచిన పెన్నులుకూడా అందజేస్తున్నట్లు మల్లావాసుబాబు చెప్పారు.
[ రెండువందలు ఖర్చు అని నిన్నఫోశ్ట్ టైటిల్ చూసి ,ఆశ్చర్యపోయామని,కొందరు నాగూర్చి తెలిసిన మితృలు ఫోన్ చేశారు . అవి స్థానిక ఆలయంలో పూజాధికములకోసం కార్యక్రమానికి ఉపక్రమించినవారు వెచ్చించవలసిన ఖర్చు. ఇతరులకెవరికీ ఇవ్వటానికి కాదు .ధన్యవాదములు]
ఇక్కడ పీఠములో రేపు సహస్రకమలార్చన లో గోత్రనామాలు పంపిన భక్తులందరితరపున పూజచేస్తున్నాము.ఇప్పటికే మీకుపంపిఉన్న నామావళిని జపించవలసినదిగా మనవి.
మరొకసారి శుభాకాంక్షలు .
సర్వేజనాసుఖినోభవంతు .
1 వ్యాఖ్యలు:
మీక్కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు!
Post a Comment