సృష్టిలో మొదటి మానవుల కొడుక్కి పెళ్ళామెలా దొరికింది ?
>> Wednesday, September 9, 2009
ఆమధ్య నేను నరసారావుపేట వెళ్లాలని వినుకొండలో రైలెక్కాను. నేను కూర్చున్న సీటు పక్కనే ఒక పెద్దాయన ఆయనకు ఎదురుగా ఇద్దరు కుర్రపాస్టర్ లు కూర్చుని వున్నారు. వారి భుజాన సంచీ తెలుపు గుడ్డలు,చేతిలో బైబిల్ మనగ్రామాలలో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్న వేషధారణేకనుక సులభంగనే గుర్తుపట్టాను. వారు మాట్లాడుకుంటున్న దానిని బట్టి ఆయన ఈమధ్య కొత్తగా మతం మారిన వ్యక్తని వాల్లు ఆయనను గుంటూరు లో జరుగుతున్న స్వస్థతకూటములకు తీసుకు వెళుతున్నారని.
ఆయనే నన్ను అడిగాడు మీరెక్కడికి అని . నేను చెప్పాను . ఆయన తనగూర్చి చెప్పుకున్నాడు ఇలా " నేను నీలగంగవరం గ్రామానికి చెందినవాడిని ,స్కూల్ హెడ్మాస్టర్ గా పనిచేసి రిటైర్డ అయ్యాను. ఈమధ్య నేను బైబిల్ చదవటం మొదలెట్టాను .అప్పుడప్పుడొ రామాయణ భారతాలను చదివానుగాని ,ఈబైబిల్ చదువుతుంటే చాలా ప్రశాంతంగా వున్నట్లనిపిస్తుంది . ఇలా ఆయన చెబుతున్నాడు ఎదురుగా వున్న కుర్రపాస్టర్లు సంతోషం తో మరిన్ని వివరాలు చెబుతున్నారు.హిందూమతం లో లేని విశేషత ,బైబిల్ చదవటం వలన మారుమనసుకలిగి లభించే ఆనందము ఏదో వారి గ్రంథాలగూర్చి మతం గూర్చి మహిమలగూర్చి చెప్పుకుంటున్నారు . నేను మౌనంగా గమనిస్తున్నాను. ఉన్నట్లుండి మాస్టర్ గారు ఓ బాణం వదిలారు .
’ అంతా బాగుందిగాని . బైబిల్ చదువుతున్నప్పుడు నాకుకలిగిన ఒక అనుమానం నన్ను గందరగోళపరుస్తున్నది"
ఏమిటది? అడిగారు పాస్టర్ లు.
’ మనగ్రంథం లో భూమి ఏర్ప్పడ్డాక సృష్టించబడిన మొదటి మానవులు ఆదాం ,హవ్వ లుకదా?
"అవును " సందేహమేముంది.
"అంతకుమునుపు భూమి మీద ఏమానవుడూ లేడని కదా అర్ధం ?"
"అవును నిస్సంశయంగా అదే , అదేమనపవిత్రబైబిల్ చెబుతున్నది. అదే సత్యం .మానవులంతా వారి సంతానమే "
"ఆదాం హవ్వలకు ఇద్దరుకుమారులు ,కయీను .హేబేలు . వారిలో ్కయీను ఈర్ష్యాపరుడై హేబేలును చంపాడు కదా. ఆతరువాత దైవం కోపించి అతనిని అక్కడనుండి వెళ్లగొట్టగా తూర్పుగా ఏథెను దేశం లో నోదు నగరం లో నివాసముండి అక్కడ వివాహమాడినట్లు వున్నదికదా ?"
అవును.
అరి ఆదాం హవ్వల మొదటీసంతానము వీల్లు కనుక భూమి మీద ఉన్న మొదటి నలుగురు మానవులలో ఒకరు చంపబడ్దారు. కనుక మిగిలినది ముగ్గురు. అలాగయితే ఇతనికి వేరే చోట వివాహమాడటానికి పిల్ల ఎలదొరికినది . అసలు వేరేదేశము ,నగరము ఉన్నాయనుకుంటే అక్కడ మనుషులున్నట్లేకదా ? మరి లాంటప్పుడు మొదటిమానవులు ఆదాం హవ్వలని ఎలా చెప్పవచ్చు ?
అంతే పిడుగుపాటువంటి ఈప్రశ్న వినగానే మన కుర్రపాస్టర్లు పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్టు గిలగిలలాడారు.
గుంటూరు లో పెద్ద ఫాదర్ గారున్నారు ఆయన చెబుతారు అని నీళ్ళునములుతున్నారు.
నెను చాలాసేపుచూసి నవ్వు ఆపుకోలేక నవ్వి ,అందులో అబద్దాన్ని మాత్రమే మీరు తెలుసుకున్నారు ,నిజాన్ని నేను చెబుతాను మతద్వేషం తోకాక విజ్ఞానం తో ఆలోచిస్తానంటె అని చెప్పాను .
నేనేమి ప్రమాణాలు చూపించి సమాధానం చెప్పివుంటానో వూహించండి ,[రేపు మరొక పోస్ట్ లో చెబుతాను వాస్తవాన్ని]
7 వ్యాఖ్యలు:
నేను కూడా ఒకసారి ట్రైన్ లో ఒక యువ పాస్టర్ ని కలిసా... ఏం చేస్తారని అడిగితే సోషల్ సర్విస్ అని చెప్పాడు. ఎక్కడైనా వరదలు వస్తే అక్కడకి వెళ్ళి వారికి సాయం చెయ్యటం ఇలాంటివన్న మాట. మరి ఆదాయమో అంటే క్రైస్తవసంస్ధలు జీతాలిస్తాయని చెప్పాడు. ఇందుకు ప్రతిగా ఆ సాయం పొందిన వారు మతం మారాలి(మార్చాలి) ఇదీ వాళ్ళ టార్గెట్. వీళ్ళంతా సంఘసేవ ముసుగులో మతమార్పిడీ ప్రతిఫలాన్ని ఆశించేవారే...
మా ఊళ్ళో ఒక రిక్షావాడు ఇలానే క్రైస్తవ సంఘాల ఆర్ధిక సాయంతో కొడుకులని SW engineerలను చేసాడు. వాళ్ళు తండ్రికి ఇప్పుడు కార్ కూడా కొనిచ్చారు. అది చూసి ఆ వీధికి వీధి మొత్తం ఇప్పుడు క్రైస్తవం పుచ్చుకుంది. ఇలా గత పదేళ్ళల్లో ఎంత మంది మతం వారిని చూసానో లెఖ్ఖ లేదు. అదే సమయంలో హిందువుగా మారినవాడిని ఒక్కరిని కూడా చూడలేదు.
మానవతకీ మతానికీ లంకెను ఎప్పుడు చెరిపేస్తారో ...
ఎమో తెలియటంలేదు. మీరే చెప్పండి. భలే సస్పెన్స్లో పెట్టారు. త్వరగా చెప్పండే.... :)
మాస్టారు మీకిది శోభించదు. నేను రాక రాక, అంతర్జాలానికి వచ్చి, పొద్దునే మీ టపా చదివితే, అర్ధాంతరంగా అసలు విషయం చెప్పకుండానే మధ్యలోనే ఆపేశారు. త్వరగా మిగతా విషయం కూడా శెలవివ్వండి.
భలే అనుమానమే వచ్చిందండీ ఆయనకి! :D
the question is very popular and the doubt is very genuine...adam and eve had many other children and
cain must have married his sister/niece. in those days it is not un common. in fact till the days of moses, the law againest marrying your sibling is not there.
even now, muslims and some europian countries (victorian english etc..) marry their uncle's and aunt's kids which we consider wrong. same way, north indian people, don't even marry the maternal uncle's kids or paternal aunt's kids (menata n menamama kids) which we telugus do vey commonly.
మీరు చెప్పినది అర్ధమైనది .సరే ఆప్రకారం ారికి అదనపు సంతతి కలిగినట్లు బైబిల్ లో సృష్టి రచనను చెప్పే సమయం లో చెప్పబడలేదు .ఇక కయీను ఒక దేశానికి వెళ్ళి నగరం లో నివాసముండి ,ఒకరిని చేసుకున్నారని వున్నది .అంటే సృష్టి అంతకుముందు వుండివుండాలి కదా .అలావుంటేనే కదా వాల్లకు పుట్టిన ఆడపిల్లను ఇతను చేసుకోగలిగేది. మీరు తెలుగులో వివరణ ఇవ్వండి .
పైన వ్రాసినదానికి చిన్న సవరణ . అతను ఆదాం హవ్వలకు పుట్టిన మరొకసంతానమైన తనచెల్లెలిని చేసుకున్నాడన్నారు. సరే కానీ ఇతను వెళ్ళేసరికే ఒకదేశము ,నగరము వున్నాయి కదా .అక్కడ కొద్దిగా వివరణ కావాలి
Post a Comment