శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ముప్పుముంచుకొచ్చె...ధూమకేతువుపొంచివుండె.. మత్తువదిలి మహాశక్తిని ప్రార్ధించండి

>> Monday, September 7, 2009

ఆక్రమణకు సిద్ధమవుతున్నధూమకేతువు [చైనా]

[పొంచివున్న పాక్ ముష్కరమూకలు]
దేశానికి మరో విపత్తుపొంచివున్నది . ధూమకేతువు ఈధరిత్రిపై నెత్తురుపారించలని కుయుక్తులు పన్నుతున్నది.
ఈదేశరక్షణ కోసం ప్రతి వారూ శత్రుగర్వ విమర్ధిని .రాక్షససంహారిణి మహిషాసురమర్ధిని అగు ఆజగన్మాతను శరన్నవరాత్రులలొ ఆరాధించి ఆతల్లి కరుణ కలిగేలా ప్రార్ధించాలి.

మీరు ప్రామాణికమైన పంచాంగాలన్నీ పరిశీలించి చూడండి . ఈ విరోధినామ సంవత్సరాన జరగనున్న పెనుముప్పులను సూచించాయి . ప్రమాదాలు ,విరోధాలు ,నాయకుల మరణాలు అంతేగాక దుర్మార్గులైన శత్రువులవలన యుద్దభయం కూడా సూచన చేసి వున్నాయి . దానికి ప్రమాణముగా చైనా దురాగతాలు మొదలయ్యాయి . మొన్న రెండు హెలీకాప్టర్ లు మన గగనతలం లోకి రావటమేగాక నిన్న సరిహద్దు దాటి మన భూభాగం లో వచ్చి చైనా అని వ్రాసిన సంఘటనల్ను తేలికగా తీసుకోరాదు. ఓపక్క పెద్దమామ అమెరికా సహాయం తో ఆయుధసంపత్తిని సమకూర్చుకుని మరోవైపున ముష్కరమూకలు పొంచివున్నాయి. ఈసమయం లో దుర్మార్గులు తెగబడుతూ వుంటే వీరపుత్రులైన మన సైన్యం తమప్రాణాలను తృణప్రాయంగా ఎంచి శతృమూకలను తరిమి కొట్టడానికి సిద్దమవుతారు.ప్రాణం పోయినా వెనుకకు తిరగరు. వారి గూర్చి వారిశక్తిగూర్చి అనుమానం లేదు . కానీ అత్యాధునిక ఆయుధసంపత్తి రీత్యా చూసి వాస్తవాన్ని గమనిస్తే ఇరువైపులా ఒకేసారి దాడిజరిగితే అది మహాప్రమాదము ఒప్పుకొనకతప్పదు ,. ప్రపంచం రేపు పెద్దరికానికి ఒప్పుకున్నా వాడుచెప్పేది వీల్లవైపునే గాని మనవైపున కాదు. బలవంతుడే నిజాయితీపరుడు ఈ కలికాలం లో .
అందుకోసమే శత్రువును నిర్జించాలంటే మనకు భౌతిక శక్తి మాత్రమే చాలదు. దైవసహాయం కావాలి .అందుకోసము దేశం శక్తివంతము కావాలని ,శత్రుదుర్భేధ్యమై , శత్రుజనమారకమై సంపన్నం కావాలని కోరుతూ ఆమహాశక్తిని ఆరాధించాలి. శరన్నవరాత్రులు ఆతల్లికి ప్రీతిపాత్రమైన సమయము . కనుక జనులందరూ ఆతల్లిని వేడుకోవాలని ప్రార్ధిస్తున్నాము. శ్రీవెంకటేశ్వర జగన్మాత పీఠము లో భక్తులు ఈదిశగా సాధనలను ప్రారంభించనున్నారు.మీరంతా ఆసంకల్పానికి మీమనోశక్తులతో తోడ్పాటు నివ్వాలని మనవి.

ఏం ? మనమేనా మిగతా శత్రుదేశాలాలో వారు చేసే ప్రారధనలు భగవంతుడు తోడ్పాటునివ్వడా అంటారేమో . భగవంతుడు ఎవరి ప్రార్ధననైనా వింటాడు కానీ దుర్మార్గం తలచేవారి పట్ల కరుణ చూపడు. మనమెవరిమీదకు ఆక్రమణచేయటం లేదు. మనసరిహద్దులవరకే రక్షిస్తూ ధర్మంగావుంటున్నాము .కనుక యతోధర్మ స్థతోజయ : అన్నారు పెద్దలు .ధర్మం మనవైపునున్నది . ధర్మం వైపునే దైవం వుంటూంది. అందుకే సంఖ్యాబలం ఎక్కువైఅనా కౌరవులు ఓడిపోయారు.
ఈదేశాన్ని .భౌతికంగా ,నైనా ధార్మికంగా నైనాజరిగే దాడులనుండి కాపాడుతూ ధర్మాత్ములైన మనవీరులను ప్రేరేపించి దేశాన్ని రక్షిస్తున్నది దైవశక్తే . కనుక ఆతల్లిని వేడుదాము . మనదేశము ,సైన్యము శక్తివంతులను విజేతలను చేయమని.శత్రువుల వ్యూహాలు నశించి మన వైపురాకుండా పలాయనం చిత్తగించేలా చేయమని .........

"యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా:
నమస్తస్యై
నమస్తస్యైనమస్తస్యై నమో నమ: "



10 వ్యాఖ్యలు:

Icanoclast September 7, 2009 at 10:31 PM  

దేవుడు తనను స్తుతిస్తేగానీ లేదా తనకెవరైనా గుర్తుచేస్తేగానీ తాను చేస్తానన్న ధర్మ పరిరక్షణ చేయడా? Is God an egotist?.

Anonymous September 8, 2009 at 12:20 AM  

@Icanoclast బ్రతకాలంటే ఊపిరి తీయాలి. బల్బు వెలగాలంటే దానికి సంబంధించిన ఉపకరణాలు ఏర్పాటు ఉండాలి, టీవీ చూడాలంటే దానికి సంబంధించిన ఏర్పాటు చేసుకోవాలి కానీ అవ్వన్నీ మనం స్శ్టించామా? కాదే ప్రకితిలో అన్నీ ముందే ఉన్నాయి. వాటిని వాడుకునెందుకు పరికరాలను మాత్రం సృష్టంచాం.
దేవుడిని అనుభూతి చెందాలంటే ప్రార్ధన చేయాలి. దైవ శక్తి అపరిమితంగా కురవాలంటే ప్రార్ధన చేసితీరాలి. చేయకపోతే దేవుడు ఉండడా అంటారా.. ఉంటాడు అప్పుడు దైవం ఉంటుంది కాబట్టేగా అందరం ఇప్పుడు ఇలా ఉన్నాం.

durgeswara September 8, 2009 at 12:44 AM  

మీ ప్రాంతం లో దోమలు పెరుగుతున్నాయి .దానివలన ప్రమాదం కనుక మీరు మీతోకలసిఇంకొందరు మీమీ శాయశక్తులా ప్రయత్నించి వాటినివారణచెసుకోవాలని చూశారు .మీరు విజయవంతమయితే మీచర్యప్రభుత్వానికి ఆనందమవుతుంది. అక్కడ తానుచేయల్సన పని మీరుచేయటమేమని కోపపడదు. ఆస్థాయికి ఎదిగినందుకు సంతోషపడుతుంది. ఇక మీరుచేసేది మంచిపని అది చంపటమైనా గానీ .దీనికి మీశక్తి చాలదనుకుని మీరు అడిగితే అదనపు యంత్రాంగాన్ని పరికరాలను సహాయంగాపంపుతుంది. ఒఅకవేల మీరు ఆడగకున్నా అది ఆప్రాంతం లో సమస్యాయి ప్రజలకు నష్టం కలిగించేదయితే దాని సవరణకు తనయంత్రాంగం ద్వారా సరిచేస్తుంది అతరువాత. ఆప్రభుత్వమిచ్చిన విద్య విజ్ఞానం రవాణా .ఇలాసౌకర్యాలద్వారా కావలసిన వి చేకూర్చుకుని మీరు దోమలమీదయుద్దం చేస్తుంటే మంచిదే అప్పుడు ప్రభుత్వ ప్రత్యక్షప్రమేయం అవసరం లేదు.అంతమాత్రాన మీరు ప్రభుత్వపరిధిలో లేనివారు కాదుగదా! అయితే మూర్ఖంగా చెస్తే నేనే చేయాలి ,ప్రభుత్వం రాకూడదని వాదిస్తే లాభం లేదు. సమస్యమనచేయిదాటినప్పుడు ప్రభుత్వమే స్వయంగా కల్పించుకుంటుంది. కానీ ఈలోపల చాలమందికి సమస్యలవలన వేదన కలగవచ్చు ,మలేరియాలాంటీ వాటితో మరణాలు కలగవచ్చు. కనుక మనప్రయత్నానికి తోడు దైవసహాయాన్ని అడగటం తెలివిగలపనిగదా! ? ఇందులో చిన్నపడాల్సినది బాధపడాల్సినది ఏమున్నది?మాలాంటిమామూలువారికి.
ఏదన్నా గర్విష్ఠులకు బాధకలుగుతుండేమోగాని ఇంకెవరికీ బాధలేదు . కాబట్టి ఈ ఇగోలు గర్వంతో కన్నుమూసుకున్నవారికి. సర్వాంతర్యామికి వర్తించవు.

Icanoclast September 8, 2009 at 3:08 AM  

@Anonymous గారు : నేను సృష్టిని(creation) నమ్మను ఐతే ఆవిష్కరణలను(inventions) నమ్ముతాను. ప్రకృతినే మీరు దైవమంటున్నారని నేనకుంటునాను. దేవుని కృప మనమీద కురిసినట్లు మనకెలా తెలుస్తుంది?

@దుర్గేశ్వర రావు గారు: governament లా కాకుండా దేవుడు సర్వఙుడు, సర్వాంతర్యామి, అపరిమిత దయాగుణ సంపన్నుడు అయినప్పుడు ఆ నిగర్వికి మనం మొఱ పెట్టుకోవలసిన అవసరం వుందనుకోను.

"సమస్యమనచేయిదాటినప్పుడు ప్రభుత్వమే స్వయంగా కల్పించుకుంటుంది. కానీ ఈలోపల చాలమందికి సమస్యలవలన వేదన కలగవచ్చు"
కానీ కల్యాణకారకుడైన దేవుడు "ఈ లోగా" మనల్ని వేదనల పాలబడేలా గాలికొదిలేస్తాడని నేననుకోను. మీరేమంటారు?

చిలమకూరు విజయమోహన్ September 8, 2009 at 7:25 AM  

@ Icanoclast గాలిలో ఎన్నో రేడియో తరంగాలు ఎన్నో ఉంటాయి.రేడియోను ఆన్ చేసి నీక్కావలిసిన కార్యక్రమాన్ని ట్యూన్ చేసుకొని ఏవిధంగా వినగలుగుతున్నావో అదే విధంగా మీ మనస్సుని భగవంతుడనే వానివైపు ట్యూన్ చేసి చూడండి ఆయన కృప మనపై కురిసిందో లేదో తెలుస్తుంది.
మీరు నమ్మనంత మాత్రాన సృష్టి లేదంటే ఎలా ?

durgeswara September 8, 2009 at 4:33 PM  

స్వతంత్రించిన మానవుడు కర్మ ఫలితాన్ని పూర్తిగా తన మీదవేసుకుంటాడు . కనుక అతనిప్రయత్నాన్ని అతని ఫలితాల్;అను అనుభవించేదాక భగవంతుడు వేచి చూడటం సృష్టిధర్మం లో ఒక భాగమే.

Icanoclast September 8, 2009 at 7:57 PM  

@చిలమకూరు విజయమోహన్: ఈ ట్యూన్ చేయడం అంటే ఏమిటి (ఏదైనా ప్రయోగలో expected result ని సాధించడం కోసం steps చేసుకుంటు పోతాం. అటువంటిదా?). మీరు నమ్మినంతమాత్రాన సృష్టి ఉందంటే ఎలా? :) sorry సృష్టించబడటాన్ని నేను నమ్మను. స్రష్ట అనబడే "concept" అవశ్యకతను నేను సందేహిస్తున్నాను.

@durgeswara: మన కర్మ పలాన్ని (సృష్టిధర్మానుసారం) అనుభవించడం తప్పనప్పుడు మళ్ళీ ఈ పూజలు, ప్రార్ధనలు, నమాజులు ఎందుకు? సత్కర్మలు చాలవా? ఇవన్నీ కేవలం మనకు మనం సర్దిచెప్పుకోవడానికి కాదా?
భగవంతుణ్ణికూడా కట్టిపడేసేంత శక్తికలిగిన "సృష్టిధర్మ" నిర్ణేత ఎవరు?


నాలో ఎప్పటినుంచో చెలరేగుతున్న ప్రశ్నలకు సమాధాన్నణ్వేషించే ప్రయత్నమిది. (ఒక వేళ ఎవరైనా) అసహనానికి గురైతే అర్ధం చేసుకోగలను కానీ ఆగ్రహాన్ని మాత్రం కాదు.

Icanoclast September 8, 2009 at 7:57 PM  
This comment has been removed by the author.
Anonymous September 9, 2009 at 2:02 AM  

Icanoclast >>నాలో ఎప్పటినుంచో చెలరేగుతున్న ప్రశ్నలకు సమాధాన్నణ్వేషించే ప్రయత్నమిది.<<
నిజమా? మరి నాకెందుకో అలాగనిపించలేదు!! మీకు ఎవరైనా చెపితే తెలుసుకుందామన్న జిజ్ఞాసకన్నా మీకు తెలిసిందాన్ని చూపెట్టాలన్న ఆశే ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇక్కడ ఎవరేం మాడ్లాడినా వాళ్ళని అపహాస్యం చేయడానికే పనిగట్టుకుని కామెమ్ట్స్ రాస్తున్నారు తప్పించి మీరేదో తెలుసుకోవాలని ఇక్కడికి రాలేదన్న సంగతి మీ వ్యాఖ్యలలోనే తెలిసిపోతోంది

>>దేవుని కృప మనమీద కురిసినట్లు మనకెలా తెలుస్తుంది?<<
ఎలా తెలుస్తుంది. తెలుసుకుంటే తెలుస్తుంది. తీపి ఇలాగుంటుంది అనిచెప్తే ఎలా తెలుస్తుంది?
ఎప్పుడైనా మెడిటేషన్ చేసారా? నేర్చుకుని ప్రయత్నించండి ఎవరి అనుభూతులు వాళ్ళవే. ఎవరికి వాళ్ళు అన్వేషించి పొందాల్సిందే ఒకరివి మరొకరికి ఎలా తెలుస్తాయి.

మీకు అనుభుతూలదేవుడక్కర్లేదు. మీకుఅది సాధ్యంకాదు కూడా. ఇక ఏదైనా ప్రయోజనం జరిగితే ఒప్పుకుంటారా? అలాకుడా ప్రయత్నించచ్చు. ఒక్కో సమస్యకు ఒక్కో పద్దతి ఉంటుంది. మీకేదైనా సమస్య వుంటే సరైన మార్గదర్శి దొరికితే గనక మీరు దైవ శాయంతో దాన్ని పరిష్కరించుకొని దైవం కృప ఎలా కురుస్తుందో స్వయంగా తెలుసుకోవచ్చు. కానీ మీ ప్రయత్నం అక్కడ ముఖ్యమైనది దానికి అడ్డదారులుండవు, దళారుల చేతుల్లో పడి మీరు మోసపోతే పూచీ మాది కాదు ;)
ఉదా:- ఓ సమస్యకోసం ఫలానా పారాయణం ప్రతిరోజూ పదకొండుసార్లు పఠించాలని అంటే మీరు చిత్తశుద్దితో అదేవిధంగా చేసితీరాలి చేయకుండా నాకు జరగలేదని చెప్పుకుంటారు .

అసలు ఇంతకీ మీ సమస్య ఏమిటో నాకు అర్ధం కావట్లేదు, ఎవరో కొందరు వాళ్ళ నమ్మకాల కొరకు వాళ్ళు ఏవో చేస్తున్నారు ఆ నమ్మకాలవల్ల మంచే కానీ ఎవరికీ నష్టంలేదు. అహింస, ధర్మం, పరోపకారం ఇలాంటివాటికి ప్రోహ్సాహిస్తున్నారని మీకేమైనా బాధగా వుందా?
దైవం అనే పేరుతో అడ్డుకట్టలేకపోతే ప్రపంచంలో స్వార్ధపరులైన ప్రభ్వుల ఆగడాలు ఎలా వుండు వుండేవి,
ధర్మం అనేది ఒక పదం ఉంటుందని మీకు తెలుసా. ధర్మో రక్షతి రక్షత అని చెప్పేదే సనాతన మతమైన హిందూ మతం.
ఎవరి మతంలోనైనా దైవం ఉన్నాడనే అంటారు. మనలోని నమ్మకం కోరిక మేరకు ఆరూపందాల్చుతుంది దైవశక్తి.

మీలాంటి వాళ్ళని తయారు చేసిన నాస్తికులు తమ చివరి దశలో ఎలా జీవించారో ఎలాంటి నమ్మకాలని తిరిగి ఆహ్వానించారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

శ్రీ శ్రీ చెప్పాడు దేవుడు లెడని నేను అదే నమ్ముతా అంటాడో పిచ్చాడు! కానీ శ్రీ శ్రీ తన కొడుకుకి సాయిఅని పేరుపెట్టుకుంటాడు. తన చివరి దశలో రహస్యంగా తీర్థయాత్రలు చేస్తాడు. షిరిడీ సాయి అనే డబ్బింగు సినిమాకి పాటలూ మాటలు రాస్తాడు.. ఎందుకంటారు?

Icanoclast September 9, 2009 at 2:33 AM  

Dear anonymous,
Good bye.
Regards,
Iconoclast.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP