శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భళా !బెజవాడ గోవిందరెడ్డీ . .

>> Monday, August 24, 2009

భళా !బెజవాడ గోవిందరెడ్డీ . .


ఈరోజు శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో చేరిన పందికొక్కులు శ్రీవారి బొక్కసాన్ని ఎలా కుళ్లగొడుతున్నాయో వార్తలలోతెలుసుకుని ప్రతి ధార్మికుని రక్తం ఉడుకుతున్నది. కొందరు ఒకరితో ఒకరు చర్చించడం ,మరొకరితో చెప్పుకుని బాధపడటం ,మరుసనాటికి మరచిపోవటం జరుగుతుంది. మనలాంటివాల్లు ఇంతటితో సరిపెట్టుకుంటే అదే బలంగా శేషాద్రి లాంటి డాలర్ దొంగలు ఎదురు లేకుండా దోపిడిచేస్తున్నారు. మనంభక్తులమేగాని ధర్మనిష్ట వున్నవాల్లంకాదు.కానీ కొందరుంటారు నిజంగా దేవుని పట్ల శ్రద్దావిశ్వాసాలు కలవారు. వారు మాత్రం దీనిని తమ ఆత్మీయులకు జరిగే అన్యాయంగా భావించి ఎదుర్కొనేవారు. అలాంటి వారిలో నెల్లూరు జిల్ల కాంగ్రెస్ నాయకుడు బెజవాడ గోవిందరెడ్డిగారొకరు.

ఈరోజు[24-8-09] ఆంధ్రజ్యోతి లో మెయిన్ పేపర్ చూడండి ఆయన్ గురించితెలుస్తుంది. అందరిలా ఆయన శ్రీవారి సొమ్ము దోచుకుంటున్నారు దుర్మార్గులు అని సరిపెట్టుకోలేదు. టీటీడీ ఆస్తులపైన హైకోర్ట్ లో ప్రజాహిత వ్యాజ్యాన్ని వేశారు. దానితో ఇప్పుడు పొగబెడితే కలుగుల్లోంచి ఎలుకలు బయటపడుతున్నాయి. ఆయనను ఆవ్యాజ్యం ఉపసంహరించుకుంటే పదికోట్లు ఇస్తామని ,లేకుంటే ఏమైనా చెస్తామనే బెదిరింపులు వస్తున్నాయట . ఐనా చలించకుండా భగవంతుని తరపున పోరాడుతున్నారు . శ్రీవారి ఆభరాణలవిలున సుమారు ఏభైఅరువేల కోట్లు ఉండగా దానిని తక్కువచేసి ముప్పైఆరు వేల కోట్లుమాత్రమే అని ఎందుకు చెబుతున్నారో.సస్పెండైన శేషాద్రి నే మరలానియమించి రెండుతాలాలు అతనిచేతికెందుకిచ్చారో తెలుపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు

ఇప్పడు మనమేం చేయాలి . భలేచేస్తున్నాడని సంతోషపడితే అతని పోరాటానికి అర్ధం లేకుండాపోతుంది.నిజంగా శ్రీవారి పట్ల నమ్మకమున్నవారమైతే .ఆయనపట్లమనకు ప్రేమాభిమానాలుంటే[కేవలం అవసరభక్తి కాదు] మనం కూడా గొంతెత్తి ఈ అన్యాయాన్ని నిరసిద్దాము ,ఒక మెయిల్ ,ఒకవుత్తరం ముక్కద్వారా ప్రభుత్వానికి టిటీడి పాలకవర్గాలకు మననిరసన తెలిపి చూస్తూ ఊరుకోమని హెచ్చరిక చేద్దాము. ఇలా ధర్మం కోసం భగవంతుని కోసం పోరాడేవారికి నైతిక మద్దతునిద్దాము.


టి టి దే వారి అన్ని వివరాలు ఇక్కడ నుంచి చూడొచ్చు
www.omnamovenkatesaya.com




0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP