శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గోవు ప్రపంచం లో 700 కోట్ల మందికి ఆరాధ్య దైవం కానుందా??

>> Monday, April 9, 2018

100 కోట్ల మంది భారతీయులకి గోవు ఆరాధ్య దైవం.. మరి ఇప్పుడు ఆ గోవు ప్రపంచం లో 700 కోట్ల మందికి ఆరాధ్య దైవం కానుందా??
===========================================================

చదువుకున్న హిందూవులు కూడా అరి వీర భయంకర శాస్త్రవేత్తలు లా భ్రమపడి తమ గ్రంధాలను, తమ సంస్కృతిని హేళన చేస్తున్న వేళ..

చదువుకున్న హిందువులు కూడా ఆవు యొక్క గొప్పతనం తెలుసుకోకుండా.. ఆవుని పూజిస్తున్న తమ హిందువుల నమ్మకాలు చూసి తామే నవ్వుతున్న వేళ..

ప్రపంచం అంతా గోవుని పూజించే సమయం రాబోతుంది..

అవును అని రాబోతుంది అని అనిపిస్తుంది.. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు నిత్యమ్ సవాలు విసురుతూ ఇప్పటికి దాకా సరైన చికిత్స, ఔషధమ్ లేని వ్యాధి ఎయిడ్స్.. ఇప్పటిదాకా ఎన్నో పరిశోదనలు ఎయిడ్స్ మీద జరుగుతున్నప్పటికీ సరైన ఫలితం రావటం లేదు.. కానీ

ఇటీవల అమెరికాలో  స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్సీస్ట్యూట్, ది ఇంటర్ నేషనల్ ఎయుడ్స్ వాక్సినేషన్ ఇన్సిషియేషన్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో ఎయిడ్స్ కి వాక్సిన్ కనిపెట్టడం లో #గోవు ద్వారా ఒక కీలక ముందు అడుగు పడింది..

ఒక వ్యాధికి టీకా లేదా వ్యాక్సిన్ కనుకొవాలంటే ఆ వ్యాధి కారక మైన దానిని ప్రతిఘటించి నాశనం చేయగలిగే ప్రతి రక్షకం (అంటిబాడీస్) ఉండాలి.. ఒక వైరస్ మన శరీరం లోకి ప్రవేశించగానే ప్రతిజనకం (ఆంటీజెన్) ను విడుదల చేస్తుంది, దానికి సమానంగా మన శరీరం లో ఆంటీబాడీస్ తయారయ్యి ఆ వచ్చిన వైరస్ ని ఎదుర్కుంటాయి.

కొన్ని వ్యాధులను ఎదుర్కోవడానికి మన శరీరం లో ఆంటీబాడీస్ లేనప్పుడు..

శాస్త్రవేత్తలు వేరే జీవులలో వ్యాధికారక వైరస్ ఎక్కించి.. ఆ వైరస్ కు ఆ జీవి ప్రతిఘటించి ఆంటీబాడీస్ తయారు చేస్తుంది, ఆ అంటిబాడీస్ ని మనం మన చికిత్స కోసం వాడుకుంటాం..

పరిశోధన వివరాలు లోకి వెళ్తే..
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

శాస్త్రవేత్తలు HIV వైరస్ (ఇమ్యునోజెన్) ని నాలుగు ఆరోగ్య వంతమైన దూడలలోకి ఎక్కించారు.. ఆశ్ఛర్యంగా తక్కువ సమయం లో ఆ దూడలలో HIV వైరస్ ని ప్రతిఘటిస్తూ ఆంటీబాడీ లు bNBs రూపంలో 35 - 50 రోజుల వ్యవధిలో ఆ దూడల రక్తం లో తయరయ్యి HIV ఆంటీజెన్ యొక్క ప్రభవాన్నీ తటస్తీకరించాయి (న్యూట్రల్, ఆపివేయడం)

పరిశోధనలో ఒకరైన శాస్త్రవేత్త దేవిన్ షాక్, ఈ పరిణామానికి ఆశ్చర్య పడి " ఆవు దూడలు యొక్క అంటిబాడిస్,  HIV వైరస్ యొక్క ఆంటీజెన్ కి ఇంత తొందరగా ప్రతిఘటిస్తాయి అని అనుకోలేదు" అని అన్నాడు.

మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే శాస్త్రవేత్తలు ఆ నాలుగు దూడ లలో రక్తం లో నుండి HIV ని ప్రతిఘటించిన ఆంటీ బాడిస్ ని వేరు చేసి వాటికి NC -COW 1 అని నామకరణం చేశారు..

ఈ పరిశోధనలో అసలు ఆవు యొక్క రోగనిరోధక శక్తి ఎలా ఉంటుంది, HIV ని ఎదుర్కోవడానికి తయారయ్యే అంటిబాడీస్ అవి దూడలలో ఎలా తయారయ్యాయి అనే విషయాలు కనుగోవాల్సివుంది..

ఈ పరిశోధనలో వచ్చిన ఫలితాలతో మరి కొన్ని రోజుల్లో మనుషులపైనా కూడా ఆవు దూడ లలో నుండి దొరికిన ఈ ఆంటీ బాడీస్ ని ప్రయోగించి మనిషి లో వీటి పనితనం చూస్తారు..

అదే గనుక జరిగితే ఆవు దూడ నుండి వచ్చిన ఆంటీబాడీస్ వల్ల మనిషి లో HIV ని నియంత్రించగలిగే అంటిబాడీస్ తయారయ్యి, HIV కి వాక్సిన్ (టీకా) చికిత్స రూపంలో  దొరికే అవకాశం భవిషత్ లో వస్తుంది..

ఈ పరిశోధన వివరాలు "నేచర్" అనే జర్నల్ లో ప్రచురించబడ్డాయి.. సాదరణంగా ఈ జర్నల్ లో ప్రచురించబడ్డ ఆర్టీకల్స్ కి దాదాపు నోబెల్ బహుమతి వచ్చే అవకాశం ఉంటుంది..

మేము గోవుని పూజించేది ఎదో మూఢ నమ్మకం తో కాదు.. గోవు మాకు దైవం.. పాలిచ్చి పెంచిన అమ్మ లాగే.. మన సమాజానికి నిరతంరం సేవ చేసే గోవు కూడా మాకు అమ్మే..

రోగులకు గ్లాసుడు పాలు ఇచ్చి మత మార్పిడి చేసిన థెరిస్సా, మదర్ థెరిస్సా అయితే..!

ఏ లాభాపేక్ష లేకుండా అందరికి పాలు ఇచ్చి పెంచి పోషించే గోవు ని మాత అని పిలిస్తే తప్పా...???

ఓ హిందూ మేలుకో.. రండి కలిసి పోరాడుదాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP