శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షా యాగమునకు మీ గోత్ర నామాలు పంపించండి

>> Monday, July 6, 2026

భగవద్బంధువులందరికీ హనుమత్ స్మరణపూర్వక నమస్కారములు. హనుమత్ రక్షా యాగమను క్రతువును ప్రారంభించి ఇప్పటికి 18 సంవత్సరములైనది.మన పూర్వీకులు సూచించిన విధానంలో భక్తిప్రదానంగా చేయగలిగిన ఈ సాధనా కార్యక్రమంలో దేశవిదేశాలనుండి పాల్గొన్న ఎంతోమంది భక్తులు తమ సాధన ద్వారా తమ తమ జీవితాలలో స్వామి అనుగ్రహ ఫలితాలను పొందియున్నారు. భక్త రక్షకుడైన హనుమంతుని కృపను కలుగజేసే ఈ యాగము జూలై 18 శనివారము అనగా ఆషాఢ శుద్ధ పంచమి నాడు పూర్ణాహుతితో 18 వ ఆవృతిగా పూర్తవనున్నది. ఈ సమయంలో విశేషముగా పార్వతీ పుత్ర గణపతి, శివతనయుడగు కుమారస్వామి,అత్రి పుత్రుడు దత్తాత్రేయ స్వామి,హరిహరసుతుడగు ధర్మశాస్త వారల హోమములు కూడా అంజనీసుతుని యాగమునకు అనుబంధంగా నిర్వహించబడుతున్నవి.ఈ యుగములో ధర్మ పరిరక్షణ,భక్తజన రక్షణ చేయుచున్న.ఈ పంచతత్వాలను ఆరాధించుట ద్వారా భూమ్మీద సంభవిస్తున్న.వికృతుల నుండి భక్తులు రక్షింప బడవలెనని సంకల్పము . ఇందులో పాల్గొనుటకు హనుమాన్ చాలీసా పారాయణము.శక్త్యానుసారము శ్రీరామ నామలేఖనము మాత్రమే దక్షిణగా కోరుచున్నాము. మీ గోత్రనామాలను మెయిల్ లేదా బ్లాగు పై స్క్రోల్ అవుతున్న నంబర్ లు వాట్సప్ ద్వారా పంపగలరు జై శ్రీరామ్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP