శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీరామ జమనము గూర్చి తప్పుడు ప్రచారం

>> Sunday, April 8, 2018

శ్రీరామ జననం బీ సి 5114 జనవరి 10 అనే ఫోటో ఒకటి అంతర్జాలం లో చక్కర్లు కొడుతోంది. అది నిజం కాదు. శ్రీరామ జననం త్రేతాయుగం నాటిది. దీనిమీద వివరంగా ఒక పోస్టు ఇదివరలో పెట్టాను.

. విషయం ఏమిటంటే, ఈ నక్షత్ర కూటములు మళ్ళీ మళ్ళీ విశ్వంలో సంభవిస్తుంటాయి. శ్రీరామ జననం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ 18 సర్గ లో ఇలా వివరించారు. తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్ సమత్యయుః |
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |
నక్షత్రేsదితి దైవత్యే స్వోచ్ఛసంస్థేషు పంచసు |
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతివిందునా సహ ||
ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతమ్ |
కౌసల్యాsజనయద్రామం సర్వలక్షణ సంయుతమ్ ||

తా|| యజ్ఞము ముగిసిన పిమ్మట ఆరు ఋతువులు గడిచెను. పిమ్మట పండ్రెండవ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవిగర్భములో శ్రీరామచంద్ర ప్రభువు జన్మించెను. సూర్యుడు ,అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని ఐదు గ్రహములు తమ ఉచ్ఛస్థానములోఅనగా మేష, మకర, కర్కాటక, మీన, తులా రాసులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురుచంద్రులు కలిసి ఉండిరి. బుధాదిత్యులు మేషమునందు ఉండిరి. కౌసల్యాదేవి కి శ్రీరామచంద్రుడు జన్మించెను .ఆయన జగన్నాధుడును అన్ని లోకములచే నమస్కరింపబడువాడును, సర్వశుభలక్ష సంపన్నుడును మహాభాగ్యశాలియూ విష్ణ్వంశసంభూతుడును ఇక్ష్వాకువంశవర్ధనుడు .

శ్రీరామ జననం త్రేతాయుగం లో జరిగింది మనం కలియుగం లో ఉన్నాము. ఇప్పుడు అసలు ఆ యుగాలు ఏమిటో చూద్దాం

\~దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి) . మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము) . ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును

కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

త్రేతాయుగము నకు కలియుగామునకు తేడా దాదాపు 2592000 మానవ సంవత్సరాలు. ఇంత తేడా ఉంటే మరి ఈ శాస్త్రజ్ఞులు అలా అంటారేం ? అంటే రెండు సమాధానాలు. మన వేదకాలం తగ్గించటానికి పశ్చిమ దేశాల వారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీరాముడు పుష్పక విమానం, అప్పుడున్న ఇంజనీరింగ్ అంతా ఒప్పుకుంటే వాళ్ళ అహంకారం దెబ్బతింటుంది అని అలా కుదిస్తున్నారు.

ఇక అసలు విషయం ఏమిటంటే మనం ఉన్న పాలపుంత అనే గలాక్సీ కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ ఉన్నది కదా !! కాబట్టి శ్రీరాముడు పుట్టినప్పుడు ఉన్న గ్రహ స్తానాలు మళ్ళీ మళ్ళీ , మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ( సూర్యుడు ,అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని ఐదు గ్రహములు తమ ఉచ్ఛస్థానములోఅనగా మేష, మకర, కర్కాటక, మీన, తులా రాసులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురుచంద్రులు కలిసి ఉండిరి. బుధాదిత్యులు మేషమునందు ఉండిరి) ఇప్పుడున్న పరిజ్ఞానం తో వాళ్ళు గలాక్సీ యొక్క పరిమానాన్నే కొలవ లేకపొతున్నారు. ఎదో ఉహిస్తున్నారు. రాశి చక్రం ఇన్ని వేల సంవత్సరాలలో ఎన్ని సార్లు శ్రీరాముడు పుట్టిన స్థానాలు ఉన్నాయో వీళ్ళు గణన చేయటం కష్టం. అందుకని ఒక గలాక్సీ భ్రమణము మాత్రమే లెక్కలో తీసుకుని అదే తేదీలు మనకు ఇస్తూ, మనలని మోసం చేస్తూ, వాళ్ళు మోస పోతున్నారు. దీనికి అంతటికీ కిరస్తానీ డబ్బు కారణం. డబ్బుతో వారు మన వేదకాలం కుదించటానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ ఫోటో పెట్టిన తేదీలు ఇది నిజం కాదు.

జాజిశర్మ గారి fb post

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP