శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమంతులవారి టి ఏ బిల్లు

>> Sunday, March 25, 2018

రామ రావణ యుద్ధం తర్వాత హనుమంతుడు సంజీవని మూలిక తెచ్చినందుకు తనకు టి.ఎ. బిల్లు ఇవ్వమని అకౌంట్స్ సెక్షను లో బిల్లు  సబ్మిట్‌ చేశాడు. దానికి ఆడిటర్ మూడు కారణాలతో రిజక్ట్ చేశాడు.

1) హనుమంతుడు వెళ్ళేముందు అప్పుడు రాజు భరతుడి పర్మిషన్‌ లేదు.

2) హనుమంతుడు గ్రేడ్-2 ఆఫీసర్ అతను గాలిలో ప్రయాణించుటకు అనుమతిలేదు.

౩) సంజీవని మూలిక తెమ్మంటే సంజీవని పర్వతం తెచ్చాడు కనుక అనుమతి లేకుండా అదనపు లగేజి తెచ్చాడు కనుక టి.ఎ. ఇవ్వడానికి కుదరదు.

దీనికి హనుమంతుడు విచారించి రామున్ని వేడుకున్నాడు రాముడు అకౌంట్స్ సెక్షన్‌ ను పునపరీశిలించమన్నాడు.

హనుమంతుడు నారదుని సలహా మేరకు అకౌంటెంట్ కు టి.ఎ.బిల్లులో 20% కమీషన్ ఇస్తా అనగానే బిల్లును క్రింది కారణాలతో చెల్లించారు.

1) హనుమంతుడు వెళ్ళినప్పుడు భరతుడు రాజు అయినప్పటికీ రాముని చెప్పులు రాజ్యం ఏలుతున్నవి కావున రాముడే రాజు. కాబట్టి రాముని పర్మిషన్ ఉంది ఇవ్వవచ్చు.

2) అత్యవసర సమయంలో అధికారి అనుమతితో గ్రేడ్-2 ఉద్యోగి వాయు ప్రయాణం చేయవచ్చును.

౩) సంజీవని పర్వతం ఎక్స్ ట్రా లగేజి కాదు ఎందుకంటే హనుమంతునికి మూలిక తెలియక పొరపాటున వేరొకటి తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళడం కన్నా ఒకేసారిలో పని పూర్తి అయింది.

ఈ వివరణతో హనుమంతుని బిల్లు పాసయ్యంది.

రాముడు షాక్స్...
అకౌంట్స్‌ డిపార్టుమెంటు రాక్స్...

హ్యాపి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP