శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆనందం వెళ్ళివిరిసింది హనుమత్ప్రభువుల కృపతో......

>> Friday, February 2, 2018

హనుమత్ ప్రభువుల అపార కరుణతో  హనుమత్ రక్షాయాగం పదవ ఆవ్రుతి పూర్ణాహుతి అత్యంత భక్తిపూరిత వాతావరణంలో జరిగింది. మనసంతా స్వామి నిండగా వచ్చిన భక్తులుచేస్తున్న  నామస్మరణతో పరిసరాలన్నీ శ్రీరామ నామ మయమనిపించగా  స్వామి అన్నీచూస్తున్నారనే భావన మామనసులలో నిండిపోయింది.
ద్వాదశ కుండాత్మకంగా హోమము నిర్వహిస్తున్నాము.  కార్యక్రమం నడుపుతున్న త్రినాథ శర్మ గారు ,సమూహికంగా చేస్తున్నాం కనుక  అసాధ్య సాధక స్వామిన్..... అనే స్తుతిశ్లోకముతో ఆహుతులిద్దామని అనుకున్నారట .... కానీ నోరు తెరవాలనుకునే సరికి  హనుమన్మూలమంత్రంతో ఆహుతులివ్వాలనే సంకల్పం మనసును ఊపివేయగా    ...మూలమంత్ర పఠనం ప్రారంభించారు. ఆహుతులిస్తూ పడమర వైపు స్వామి మూర్తి ఉన్నవైపుకు చూశారు. అక్కడ స్వామి దగ్గర ఓ వానరం  [స్వామి పరివారంలో సభ్యులనుకుంటా]]  కూర్చుని యాగం గమనిస్తూ ఉంది.  మాప్రాంతానికి ఎప్పుడో గాని కోతులు రావు.  అది గమనించి శర్మగారు అక్కడ ఓ కార్యకర్తకు సైగచేయగా అతను వెళ్ళి వీడియో తీస్తుండగా నెమ్మదిగా  వానరం అక్కడనుండి నిష్క్రమించినది. యాగానంతరం శర్మగారు చెప్పగా అప్పుడు ఆవీడియో చూశాము. ఓహో! స్వామివారు కార్యక్రమం చూసి రమ్మని వారి పరివారాన్ని పంపారని సంతోషపడ్డాము.

ఆతదనంతరం  భక్తులందరి తరపున నూటాఎమినిది కలశములతో  స్వామికి అభిషేకం జరిపి  తమాలార్చన జరుపబడింది. ఈయాగంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ కమీషనర్ రామారావుగారు ,సి ఆర్ డి ఏ డైరెక్టర్ చెన్నకేశవరావుగారు పాల్గొని భక్తిప్రపత్తులతో స్వామిని సేవించుకున్నారు.

ఆతదుపరి శ్రీదేవీ భూదేవీ సమేతంగా శ్రీవారు... భవానీ సమేతంగా రామలింగేశ్వర స్వామి వార్లను కళ్యాణవేదికపైకి ఆహ్వానించి వారి  కళ్యాణమహోత్సవాలు నిర్వహించాము  .ఆపై వివాహ భోజనం స్వామి పరివారం పలకరింపులతో సంతోషంవెల్లివిరిసింది. స్వామీ... మళ్ళీ మళ్ళీ ఈ ఆనందాన్ని ప్రసాదించు మరో వంద జన్మలదాకా అని వేడుకున్నాను.


















1 వ్యాఖ్యలు:

sam February 2, 2018 at 10:27 PM  

dear sir very good blog and nice information

Latest Telugu News

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP