శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చెక్క సెంట్రింగ్ కు--ఎలక్షన్ కౌంటింగ్ కు సంబంధం ఏంట్రానాయనా?

>> Tuesday, May 13, 2014


వాస్తవంగా అయితే లేదు . ఇంకెక్కడన్నాఅయితే అసలుండదేమో! గాని మనదేశంలో ..అదీ మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపనికీ  సినిమాలు, ఎన్నికలతో సంబంధం ఏర్పడిపోతుంది.

ఒకపక్క యాగం సమయం దగ్గరవుతుంది అన్నపూర్ణభిక్షాశాల కు స్లాబ్ ఆలస్యమవుతుందని మేము కంగారుపడుతున్నాము.  చెక్క సెంట్రింగ్ మేస్త్రీలు ఏడవతేదీ ముందు ఎన్నికలున్నాయన్నారు.  డబ్బులిచ్చినదికాక బ్రతిమాలగా !మొన్న వచ్చారు. మెట్లకు చెక్కబిగించారు. నిన్న రాలేదు ఏం బాబూ! ఈరోజన్నా వస్తారా ? అని అడిగిన మామేస్త్రీ తో ఈరోజు మండల ,జిల్లా పరిషత్ ఎన్నికల లెక్కింపు  ఇవాళ రావటం కుదరదు. మేమంతా దరిశి వెళుతున్నాం అన్నారట. ఏంచేయమంటారు ?చూస్తున్నారు కదా నేను కావాలని ఆలస్యం చేయటం లేదు స్వామీ! అంటున్నాడు మా మేస్త్రీ .   ఒకవేళ ఈరోజు ఫలితాలలో వాల్లపార్టీ అభ్యుర్థులు గెలిస్తే సంతోషం తో, ఓడితే విషాధంతో నో రేపు రామన్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

రాజకీయాలపట్ల అవగాహన ఉండాలి కానీ ఇంతలా రోజువారి  పనులుకూడా మానివేసేంత పిచ్చి పెరగటం సమాజానికి ఆనారోగ్యసూచనే.0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP