శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమజ్జయంతి,హనుమద్రక్షాయాగంలో స్వామి అభిషేకమునకై మీతరపున ఒక అభిషేక కలశం సమర్పించండి

>> Saturday, May 10, 2014

  హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి అనంతరం నూటాఎనిమిది కలశజలములతో  స్వామికి అవబృథస్నానం నిర్వహించబడుతుంది.

అందుకోసం  నూటా ఎనిమిది కలశములను నూటాఎనిమిదిమంది భక్తుల తరపున సుగంధద్రవ్యములతో గంగాజలంతో నింపి గంగాది దివ్యనదులను ఆవాహనచేసి పూజించి ఋత్విక్కులు సిధ్ధపరచి ఉంచుతారు. పూర్ణాహుతి అనంతరం జాగంలో పాల్గొన్నవారు, ఎవరైతే యాగమునకు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా తమతరపున స్వామి అభిషేకమునకు కలశములఏర్పాటుచేయమని కోరుతారో వారి తరపున పురోహితులు అభిషేకం నిర్వహిస్తారు.

ఒక్కొక్క కుటుంబతరపున ఒక్కొక్క కలశమును ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందులో ప్రస్తుతం అన్నపూర్ణభిక్షాశాల నిర్మాణంలోనూ,ఈసంవత్స్రరం జరుగుతున్న హనుమత్ రక్షాయాగంలోనూ తమ పురుషార్ధములను సమర్పించినవారితరపున కలశస్థాపన జరుపటం జరుగుతుందికనుక వారు ఏమీ పంపనవసరం లేదు. నూటాఎనిమిది మందిలో వారు కాక మిగిలిన సంఖ్యలో కలశస్థాపనకు భక్తులకు అవకాశం కల్పించబడుతుంది.  ఇందుకోసం  ఒక్కో కలశస్థాపనకు 1116/-  .పురుషార్థంగా సమర్పించవలసి ఉంటుంది.ఈ ద్రవ్యమును కేవలం ఈ యాగ నిర్వహణ లోనూ,అన్నదానంలోనూ వినియోగింపబడుతుంది వారి తరపున హనుమజ్జయంతి రోజు అర్చన,పూర్ణాహుతి సమయంలో అభిషేకం నిర్వహించి ఆంజనేయస్వామి వారి రక్షలు ప్రసాదములు పోస్ట్ ద్వారా పంపబడతాయి .. 
ఇది కేవలం స్వామిసేవలో పాల్గొనే అవకాశం అందరికీ కల్పించి వారిద్రవ్యంతోనే వారికొరకు స్వామికి చేయబడుతున్న సేవ.  ఇందులో భక్తిని వ్యాపారంగా మార్చే ఎటువంటి కలిప్రభావపు ఆలోచనలు లేవని మనవి.ఇక ఇంతకు ముందు పోస్ట్ లలో వ్రాసినవిధంగా  ఈ యాగమునకై గోత్రనామాలు పంపే భక్తులు అందుకోసమై ఏమీ చెల్లించవలసిన పనిలేదు.

తమతరపున కూడా కలశస్థాపన అర్చన జరిపించుకోదలచుకున్న వారు మెయిల్,లేదా ఫోన్ ద్వారా సంప్రదిస్తే వారికి ఎక్కౌంట్ నంబర్ తెలియపరుస్తాము.ఆ ఎక్కౌంట్ కు తమ పురుషార్ధములను పంపవచ్చు. 
జైశ్రీరాం


భక్తజనపాదదాసుడు
దుర్గేశ్వర
durgeswara@gmail.com
9948235641




0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP