శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భగవంతుడిచ్చిన విద్యను ఇలా రాజకీయనాయకులమెప్పుకై పలుచన చేసుకుంటున్న మన జ్యోతిషవేత్తలు

>> Wednesday, April 2, 2014

జ్యోతిష్యం భగవంతుడిచ్చిన వరం . దానిని లోకోపకారమునకై వినియోగించటం కూడా భగవత్ సేవ లో ఒకభాగంగా మారుతుంది. ఈవిద్యనేర్చిన నాటి పండితులు వినయ, వివేకాలతో లోకోపకారమునకై సూచనలు చేస్తూ పరిహారములు సూచిస్తూ  అటుభుక్తిని ,ఇటు సమాజంలో గౌరవాభిమానాలను సంపాదించుకున్నారు. దీనికి కొన్ని నియమాలను విధించి ఉంచారు శాస్త్రకారులు.  రాబోవు ఫలితాలను ఎంతవరకు చెప్పాలో, అదీ ఏరకంగా సూచించి వదలివేయాలో కూడా నియమాలను శిష్యులకు ఉపదెశిస్తూ వచ్చారు. ఇది కలియుగం కొందరు పండితులకు వినయం స్థానంలో అహంకారం,స్వార్ధపరత్వం తిష్ఠవేసుకుంటున్నాయి .  వ్యక్తిగత గౌరవం కోసం శాస్త్రగౌరవాన్ని తగ్గించటానికి కూడా వెనుకాడటం లేదు నేడు .  
  మొన్న ఉగాదినాడు వివిధ చానళ్లలో పంచాంగశ్రవణం   చేస్తూ వారు వెల్లడిస్తున్న విషయాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం  కాలేదు. . ఒక్కో చానల్ లో ఒక్కో సిధ్ధాంతిగారు  ఒక్కో పార్టికి ఆస్థాన సిధ్ధాంతిలా  రాబోవు ఫలితాలను వెల్లడిస్తుంటే  చానల్లు మార్చిమార్చి  చూసే వారికి ఇదొక  వికటకవుల విన్యాసంగా అగుపించినది.
ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకుని జాతకం అద్భుతంగా ఉందని కాబో యే ముఖ్యమంత్రి ఆయనేనని, ఆయనచెతిలో రాష్ట్రం లో వానల్లేకున్నా పంటలు విరగబండుతాయన్న్ లెవెల్లో ఫలితాలు చెప్పేస్తున్నారు.

వీరు శాశ్త్రానికి ప్రతినిధులుగాకాక ఆయాపార్తీలకు ప్రతినిధులుగా వ్యవహరించటం శాస్త్రాభిమానులమనసును కష్టపెడుతున్నది. గతంలో కూడా ఎన్నికలఫలితాల సమయంలో ఫలానా బాబుగారికి ఫలితాలు ఇలాఉంటాయి అద్భుతవిజయం అంటూ టివీ స్టుడియోలలో తిష్టవేసుకుని లైవ్ లో ఫలితాలు సూచించటం ఫలితాలు రాగానే ఒక్కొక్కరు జారుకోవటం మనం  చూశాము. చానల్ల రేటింపెంచుకోవటానికి మిమ్మల్ని స్టుడియోలే కూర్చోబెట్టుకుంటున్న టి.వి చానల్లు, పత్రికలమ్ముకోవటాకి మాత్రమే రాశి ఫలాలు ప్రకటిస్తూ ఇవన్నీ అశాస్త్రీయమైనవని,మూఢనమ్మకాలని ఎగతాళి చేయడానికి బురదజల్లడానికి వెనుకాడని కుహన సెక్యులర్ వాదుల మానసిక పుత్రికలన్న విషయం ఈ సిధ్ధాంతులకు తెలియదా? తెలిసినా ,మీమీ  అవగాహనా లోపములతో శాస్త్రానికి చెడ్డపేరు తెస్తున్నామన్న విషయం గమనించరా ?  శాస్త్రాన్ని ఉపదేశించే సమయంలో మీమీ గురువులు మీకు చెప్పిన జాగ్రత్తలు గాలికొదలేశారా?
అయ్యా మనం మన వ్యక్తిగత గౌరవాలు అశాశ్వతం, శాస్త్రం శాశ్వతం మీరు  మీకు భుక్తిని ,గుర్తింపును  ఇచ్చిన శాస్త్రానికి అపచారం చేయకండి ,జనంలో శాస్త్రంపై అపనమ్మకాన్ని కలిగిమ్చకండి అని సవినయంగా మనవిచేస్తున్నాము
ఎందుకిలా వ్యవహరిస్తున్నారు

1 వ్యాఖ్యలు:

astrojoyd April 3, 2014 at 7:44 PM  

ఈ శాస్త్రంలో మోసగాళ్ళే ఎక్కువ సర్.ఏ టీవీ ఛానల్ చూసినా లావు తగ్గదానికొక మంత్రం,సన్న బడెందుకోక మంత్రం కూడా చెప్పేస్తున్నారీ కుహన జ్యోతిష్కులు ..కలికాలం అని సరిపెట్టుకోండి మీరు కూడా..

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP