పత్రం పూజయామి - ఇందులో వాడే పత్రాల విశిష్టత
>> Thursday, September 26, 2013
సుముఖాయ నమః - మాచీ పత్రం పూజయామి
నేత్రములకు మంచి ఔషధము. ఆకుని తడిపి కళ్ళ మీద ఉంచుకోవాలి. పసుపూ నూనెతో నూరి ఒంటికి రాసుకోవాలి.
గణాధిపాయ నమః - బృహతీ పత్రం పూజయామి
నేలమునుగ ఆకులు - ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును. శరీరమునకు దివ్యఔషధము.
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి
మారేడు ఆకులు - మూల శంక నయమగును. రోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని
నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో
వేసుకుని తాగాలి.
గజాననాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి
జంటగరిక ఆకు - మూత్ర సంబంధ వ్యాధులు తొలుగును. పచ్చడి చేసుకొని తినవలెను.
హరసూనవే నమః - దత్తూరపత్రం పూజయామి
ఉమ్మెత్త ఆకు - మానసిక రోగాలు తొలగును. ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేయాలి.
లంబోదరాయ నమః - బదరీ పత్రం పూజయామి
రేగు ఆకు - శరీర సౌష్టవానికి శ్రేష్టం. మితంగా తింటే మంచిది.
గుహాగ్రజాయ నమః - అపామార్గపత్రం పూజయామి
ఉత్తరేణి ఆకులు - దంతవ్యాధులు నయమగును. ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకోవాలి.
గజకర్ణాయ నమః - తులసీపత్రం పూజయామి
తులసీ ఆకులు - దగ్గు, వాంతులు, సర్వ రోగనివారిణి. రోజు ఐదు, ఆరు ఆకులను తింటే మంచిది.
ఏక దంతాయ నమః - చూత పత్రం పూజయామి
మామిడి ఆకు - కాళ్ళ పగుళ్ళు, అతిసారం నయమగును. మామిడి జిగురులో ఉప్పు కలిపి వేడి చేసి పగుళ్ళకు రాయాలి.
వికటాయ నమః - కరవీర పత్రం పూజయామి
గన్నేరు ఆకు - జ్వరమును తగ్గించును[లోనికి తీసుకోరాదు]
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంత పత్రం పూజయామి
అవిసె ఆకు - రక్త దోషాలు తొలగును. ఆకు కూరగా వాడవచ్చు.
సురసేవితాయ నమః - అర్జున పత్రం పూజయామి
మద్ది ఆకులు - వ్రణాలు తగ్గును. వ్రణాలున్న భాగాల్లో ఆకులను నూరి రాసుకోవాలి.
సర్వేశ్వరాయ నమః - దేవదారు పత్రం పూజయామి
దేవదారు ఆకులు - శ్వాశకోశ వ్యాధులు తగ్గును
ఫాలచంద్రాయ నమః - మరువక పత్రం పూజయామి
మరువం ఆకులు - శరీర దుర్వాసన పోగొట్టును. వేడినీటిలో వేసుకొని స్నానం చేయవలెను.
హేరంబాయ నమః - సింధువార పత్రం పూజయామి
వావిలి ఆకు - ఒంటినొప్పులను తగ్గించును. నీటిలో ఉడికించి స్నానం చేస్తె మంచిది.
సురాగ్రజాయ నమః - గండకీ పత్రం పూజయామి
గండకీ ఆకు - వాత రోగములు నయమగును
ఇభవక్త్రాయ నమః - శమీపత్రం పూజయామి
జమ్మి ఆకులు - కుష్ఠు వ్యాధులు తొలగును. ఆకుల పసరును ఆయా శరీర భాగాలలో రాసుకోవాలి.
శూర్పకర్ణాయ నమః - జాజీ పత్రం పూజయామి
జాజి ఆకులు - నోటి దుర్వాసన పోగొట్టును. ఆకులను వెన్నతో కలిపి నూరి పళ్ళు తోముకోవాలి.
వినాయకాయ నమః - అశ్వత్థ పత్రం పూజయామి
రావి ఆకులు - శ్వాసకోశ వ్యాధులు తగ్గును. పొడి చేసి తేనెతో సేవిస్తే మంచిది.
వటవే నమః - దామిడీ పత్రం పూజయామి
దానిమ్మ ఆకు - అజీర్తి, ఉబ్బసం తగ్గును. పొడిచేసి కషాయంగా తాగవచ్చు.
కపిలాయ నమః - అర్క పత్రం పూజయామి
జిల్లేడు ఆకులు - వర్చస్సు పెంచును.
[by kbn sharma ]
2 వ్యాఖ్యలు:
పత్రాల గురించి విశేషాలు బాగా తెలిపారు. ఒక్కటే డౌట్ గన్నేరు ఆకులు వాడటం సేఫ్ అంటారా?
శర్మగారు ఇచ్చిన వివరంలో గన్నేరు జ్వరహారిణి అన్నారు గాని.అది లోపలకు తీసుకోకూడదు.
Post a Comment