శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమంతుని స్మరణ ఎలాకాపాడినదో చూడండి ఈ పిల్లవానినిని ప్రమాదం నుండి.

>> Sunday, August 18, 2013

నిన్న శనివారం  మా విద్యార్థి చిరంజీవి కృష్ణారెడ్డిని హనుమత్ప్రభువు కాపాడిన లీల ఇది.
మాదగ్గర చిన్నప్పుడు చదువుకున్న బిక్కం క్రిష్ణారెడ్డి  ఇప్పుడు గృహస్థుడై ఇద్దరు పిల్లలకు  తండ్రి . పిల్లవాడూ తరచూ పీట్ఃఅం లో జరిగే సత్సంగాలకు వచ్చి పాల్గొంటాడు. మొన్న ముక్కోటీ కి  శ్రీవారిసేవకు వచ్చి రామదండు లో చాలా చక్కని సేవలందించాడు కూడా.  అతని భార్య ఇప్పుడు గరభవతి కనుక  సత్సంగాలకు రావచ్చా? ,పూజలు జరుపవచ్చా ? అని అడిగినప్పుడు. దైవనామ స్మరణ మానవద్దని ,ముఖ్యంగాప్రయాణసమయాలలో చాలీసా పారాయణం మరువవద్దని హెచ్చరించాను. కాకుంటే కొబ్బరికాయలు కొట్టడం,ప్రత్యేకపూజలు చేయకపోయినా నామస్మరణ చేయాలి అదే మనకు శ్రీరామరక్ష అని చెప్పాను.

నిన్నశనివారం పసుపుగల్లు దగ్గర వారి బంధువులు సింగరకొండ ఆంజనేయ స్వామి దేవాలయానికి మొక్కుచెల్లింపుకోసం వెళుతూ  బంధువులందరినీ పిలవగా ఇతనూ బయలుదేరాడు..దారిలో గాంధీనగర్ జయరామిరెడ్డి కొడుకును దరిశి లో స్కూల్ లో దింపమని ఇతని మోటర్ సైకిల్ ఎక్కించాడు. వీల్లు ఉల్లగల్లు క్రాస్ రోడ్ నుండి పసుపుగల్లుకు మళ్ళి  వెళుతుండగా రహదారి పక్కన ఉన్న ఓ చింతచెట్టు పైనుండి పెద్ద కొమ్మ విరిగి మీదపడినది. స్వామిని ఆశ్రయించి వుండటం వలన  కొమ్మ ఖచ్చితంగా ముఖాన్ని రాసుకుంటూ బండి లైట్ డోమ్ మీద పడింది. అది నుజ్జు నుజ్జయింది . కొమ్మలు ఇతనికి బండిపై నున్న పిల్లవానికి తగిలటం బండి పడటం జరిగింది.  ఒక్కక్షణం కొమ్మ మీద పడటం ఆలస్యమయి ఉంటే తల మధ్యభాగాన్ని తాకి తల బద్దలయి ఉండేది.
హనుమత్ప్రభువు కృపాకటాక్షాలు ఆబిడ్దను రక్షించాయి. బండిమీదవున్న చిన్నపిల్లవాడూ నొప్పని ఏడుస్తుంటే అక్కడనుండి హుటాహుటీన దరిశి తరలించి ఎక్సరేలు తీసి ఏమీ ప్రమాదంలేదని డాక్టర్లు చెప్పారు. అదేసమయంలో నన్ను పరామర్శిమ్చడానికి దరిశినుంచి వచ్చిన లక్ష్మీనారాయణ వాల్లు మాట్ళాడుతున్నారు. ఇంతలో ఫోన్ లో ఈవిషయం విని గాబరాపడ్డాము. రాత్రి సత్సంగానికొచ్చిన కృష్ణారెడ్డి వానిపిల్లలను చూసేదాకా మనసు ఆగలేదు.
ఆపదలను బాపేస్వామి ఆర్తులకు అండ హనుమంతుని స్మరణ్ మరువరాదు ఈ కష్టకాలంలో జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP