శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చిన్నపిల్లలకి దృష్టి దోషాలు తగులకుండా శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము

>> Thursday, March 21, 2013

శ్రీగురుభ్యో నమః
నమస్కారం,

ఋషిపీఠం వారి ఆధ్యాత్మిక మాసపత్రికలో, ఈ నెల మార్చి సంచికలో, చిన్న పిల్లలకి దృష్టి దోషాలు తగలకుండా ఉండడానికి ఈ క్రింది మంత్ర శ్లోకాలు ఇవ్వబడ్డాయి. ఎవరికైనా ఇంట్లో చంటి పిల్లలు ఉంటే ఉపయోగపడగలదని ఇక్కడ వ్రాస్తున్నాను.

Inline image 1
విబూదిని చేతితో పట్టుకొని, ఈ క్రింది మంత్రాలను పఠించి, దానిని పిల్లల ఉదుటన, కంఠాన, వక్షస్థలమున, భుజాలపై రాస్తే, దృష్టిదోషాలు తొలగి, సర్వ గ్రహ దోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగి, శ్రీకృష్ణుని రక్షణ లభింపచేస్తాయి.

చిన్నపిల్లలకి దృష్టి దోషాలు తగులకుండా శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము:
వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II

మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP