శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హిందూ చైతన్య శిబిరంలో పాల్గొనవలసినదిగా ఆహ్వానం

>> Monday, January 7, 2013

వివేకానందుని  150వ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని కలియుగాబ్ది 5114,శ్రీనందన నామ సంవత్సర పుష్యమాస బహుళ అష్టమి,నవమి.దశమి తిథులలో  చారిత్రాత్మకంగా విశాల హిందూ చైతన్యశిబిరం నిర్వహింపబడుచున్నది.  విజయవాడ గుంటూరు హైవే పై కాజ గ్రామం దగ్గర  టోల్ గేట్ ఎదురుగా శాతవాహన నగర్ ఏర్పాటయింది  ఈ శిబిరం కోసం.ఈనెల 18,19,20 తేదీలలో జరిగే  ఈశిబిరంలో మూడురోజులు వివిధపీఠాధిపతులు,స్వామీజీలు, స్వయం సేవకులు పాల్గొననున్నారు. చివరిరోజు  అటుగుంటూరు నుండి ఇటువిజయవాడనుండి గణవేషధారుల పథసంచలనంతో హిందుశక్తియొక్క విశ్వరూపప్రదర్శనం జరుగుతుంది.
ఇరవయ్యవతేది  మధ్యాహ్నం    శిబిర ప్రదేశంలో ఏర్పరచిన  మూడుప్రధానవేదికలలో  పూజ్యస్వామీజీలు,సాధుసంతుల సమావేశము   2 మాతృసమ్మేళనం  3  ప్రతిష్ఠిత వ్యక్తుల సమావేశము  లు నిర్వహించబడుతున్నాయి  .   ప్రతిష్ఠాత్మకమైన ఈ సమ్మేళనములలో పాల్గొనవలసినదిగా  అందరికీ ఆహ్వానము తెలుపుతున్నారు నిర్వాహకులు.

పూర్తివివరాలు

www.hinduchaitanyasibiram.org/Vivaralu.aspx

లో చూడవచ్చు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP