శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ప్రాణం ఖరీదు - జాహ్నవి [andhrajyothy.daily]

>> Saturday, August 4, 2012

ప్రాణం ఖరీదు
- జాహ్నవి

ప్రజలను రకరకాల సామాజిక ఆర్థిక, లింగ, సమూహాలుగా విడగొట్టి ప్రభుత్వాలు రగుల్చుతున్న రావణ కాష్టాలకు తోడు మేధావులు కూడా అంతర్యుద్ధాలను ప్రోత్సహించాలా? తమ పూర్వీకులు పాటించినట్లుగా చెబుతున్న కుల వివక్షలకు నేటి తరం మూల్యం చెల్లించాలంటూ వ్యక్తిగతంగా సంబంధం, బాధ్యత లేకపోయినా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మరి తెలిసి తెలిసీ ఆధునిక యుగంలో మనం పాటిస్తున్న చట్టబద్ధ వివక్షలకు ఎన్ని భావితరాలు మూల్యం చెల్లించాలో ఏ రూపంలో చెల్లిస్తాయో!

మన దేశంలో కుల వ్యవస్థ చాలా ప్రాచీనమైనది. ఈ వ్యవస్థ గురించిన చర్చ కూడా కనీసం కొన్ని వందల సంవత్సరాలుగా సాగుతోంది. బ్రిటిషు వారి పరిపాలనలోనూ, స్వాతంత్య్రోద్యమ సమయంలోనూ, స్వాతంత్య్రానంతరం కూడా ఈ చర్చ ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. వేల మంది మేధావులు ఈ విషయంలో తమ అభిప్రాయాలు, ఆలోచనలు, పరిష్కారాలు వెలిబుచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో నెహ్రూ లాంటి కాంగ్రెస్ నాయకులు నమ్మి ఆచరించిన రాజ్యసామ్యవాద విధానాలు, పరిమిత కాలానికి రిజర్వేషన్ల ద్వారా అనతి కాలంలోనే కులాల్లోని అంతరాలను, వాటి మధ్య విభేదాలను రూపుమాపవచ్చనుకున్నారు.

మరోపక్క అప్పట్లో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఉన్న కమ్యూనిస్టులైతే కమ్యూనిజం స్థాపన ద్వారా కులాలు వాటంతట అవే మాయమైపోతాయనుకున్నారు. అలా జరగక పోగా, భారత సమాజంలోని కుల వ్యవస్థ, దాని వాస్తవికత, కులం-వర్గం, వాటి అస్తిిత్వాలు, వాటి స్పృహ, వాటి మధ్య పోలికలు, తేడాలు, ఏది సత్యం, ఏది శాశ్వతం, ఏది ప్రాథమికం అనే విషయాల గురించి సాహిత్యం, కవిత్వం, పరిశోధన, సామాజిక విశ్లేషణలు, రాజకీయ ఎజెండాలు, ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు గందరగోళానికి కూడా గురిచేశాయి, చేస్తున్నాయి.

కమ్యూనిస్టు వర్గపటంలో ఒక అంచున ఉండే మార్క్సిస్టు-లెనినిస్టు విప్లవ పార్టీల్లో కూడా కులాల విషయంలో తీవ్రమయిన చర్చ జరగడం, వాటిలో కొన్ని కులాధార, విప్లవ కమ్యూనిస్టు పార్టీలుగా అవతరించడం కూడా జరిగింది. ఆధునిక కుల సమూహాలు, ఒక్కో సమూహానికి ఒక్కో దేవుడు, ఒక్కో నాయకుడు, ఒక్కో పవిత్ర గ్రంథం, ఒక్కో మేధావి బృందం తయారయ్యాయి. ఈ పరిణామాలన్నీ సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి తప్ప ఒక హేతుబద్ధ అవగాహన, స్పష్టత, పరిష్కార దిశగా మాత్రం తీసుకెళ్ళడం లేదు. గుడ్డివాళ్ళు ఏనుగు భాగాలను తడిమి వర్ణించినట్లుగా పరిమితమైపోతున్నారు. భావోద్వేగాలు, అంధ విశ్వాసాలు, స్వప్రయోజనాలు, వర్తమాన రాజకీయాల ప్రభావం లేకుండా హేతుబద్ధ, నిలకడైన విశ్లేషణతో ఈ అంశాన్ని అర్థం చేసుకున్నప్పుడే సరైన పరిష్కారం దొరుకుతుంది.

తన ప్రమేయం లేకుండా జన్మతః సిద్ధించిన కుల, మత, ప్రాంత, జాతీయతా అస్తిత్వాల(ఐడెంటిటీ)తో సంబంధం లేకుండా, స్వతంత్రుడిగా తనకున్న బుద్ధి కుశలత, శారీరక శక్తులతో తన కృషి మేరకు సంపాదించుకుని సంతోషంగా బ్రతికే హక్కు ప్రతి మనిషికీ, మనిషిగా, సృష్టిలో సహజంగా సంక్రమించిన హక్కు. ఆ హక్కును కాదనే, కాలరాసే అధికారం ఏ ఇతరులకీ లేదు. ఈ రాజకీయ సమానత్వం రాజ్యాంగ రీత్యా మన దేశంలోని అందరికీ ఉంది. ఆ సమానత్వాన్ని పాక్షికంగా కాలరాయడం, పెడ వ్యాఖ్యానాలతో రాజకీయ అవసరాల మేరకు వికృతంగా మార్చే శక్తి, అధికారం ప్రభుత్వాలకు మాత్రమే ఉంది.

ఆ అధికారాలను ప్రభుత్వాలు సినికల్‌గా వాడుకుంటాయి. మూడు ఉదాహరణలను పరిశీలిద్దాం. పురాణ యుగాల్లో మనుస్మృతి పేరిట రాసి, ఆచరించిన శాసనాలు రాసింది ఎవరైనా, ఆనాటి పాలక ప్రభుత్వాల ప్రమేయం లేకుండా అమలయ్యే అవకాశం లేదు. కాబట్టి వివక్షలకు కారణం ప్రభుత్వాలే తప్ప వ్యక్తులు కాజాలరు. బానిసత్వం రద్దయిన తరువాత కూడా అమెరికాలో నల్లవారి పట్ల తీవ్ర వివక్ష కొనసాగింది. అది 'జిమ్ క్రో' చట్టాల ద్వారా వ్యవస్థీకృతమైన వివక్ష. ఆ రకంగా అమెరికా ప్రభుత్వమే చట్టాల ద్వారా వివక్షకు పచ్చ జెండా ఊపింది.

మూడో ముఖ్య ఉదాహరణ మనదేశ రాజ్యాంగంలో ఒక పక్క రాజకీయ సమానత్వం ఇస్తూనే, ఒక తాత్కాలిక కార్యక్రమంగా పదేళ్ళ పాటు దళితులకు, ఆదివాసీలకు రిజర్వేషన్లు ప్రకటించడం. సమానత్వపు పునాదుల్లోకి జరిగిన ఈ ప్రభుత్వ చొరబాటు, జోక్యం భారతదేశ సమాజంలో కుల వ్యవస్థను శాశ్వతీకరించడమే కాకుండా, మరిన్ని జోక్యాలకు దారితీసింది. వ్యక్తులందరూ రాజకీయంగా సమానులే అన్నది సృష్టిపరమైన వాస్తవం. ఈ వాస్తవాన్ని కాదనే వ్యక్తి తనకు తానుగా మాత్రమే నష్టపోతాడు. ఒకవేళ ప్రభుత్వమే ఈ వాస్తవాన్ని ధిక్కరించి చట్టరూపంగా జోక్యం చేసుకుంటే, మొత్తం సమాజం, వ్యవస్థే వికృతమవుతుంది, అయ్యింది కూడా. తన జోక్యం వల్ల జరిగిన అనర్థాలను ఏ ప్రభుత్వమూ ఒప్పుకోదు.

వాటిని కప్పిపుచ్చడం కోసం మరిన్ని జోక్యాలకు తెగబడుతుంది. జరుగుతున్నది అదే. పదేళ్ళ కోసమేనని ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు సరిపడా ఫలితాలనివ్వలేదన్నారు. ఇంకో పదేళ్ళు, ఇలా పెంచుకుంటూ పోయారు. అయినా ఫలితం లేదంటూ ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లన్నారు. అదీ చాలదని ఇప్పుడు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లుండాలని ప్రతిపాదిస్తున్నారు. ఇలా ఒక జోక్యపు వైఫల్యం మరిన్ని జోక్యాలకు దారితీస్తుంది. కొన్ని కులాలకు, తెగలకే రిజర్వేషన్లిస్తే మిగతా వారు ఊరుకుంటారా? వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, మండల కమిషన్, కేంద్ర స్థాయిలో బీసీ రిజర్వేషన్లు, పంచాయతీలు, స్థానిక సంస్థల్లో, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, కొన్ని కులాలను ఒక గ్రూపు నుంచి ఇంకో గ్రూపుకు మార్చడం, వర్గీక'రణం' - ఇలా కోతి పుండు బ్రహ్మ రాక్షసి అయ్యింది.

దీనికి తోడు దళితుల రక్షణ కోసమనే పేరుతో దళితేతరులను టార్గెట్ చేసే ప్రత్యేక చట్టాలు, ఉప ప్రణాళికలు, కొన్ని వృత్తులకు ప్రత్యేక ప్రభుత్వ సదుపాయాలు, మహిళలకు ప్రత్యేక చట్టాలు, ప్రాంతాల వారీ రిజర్వేషన్లు, కోటాలు - ఇలా బ్యాంకు నుంచి రుణం పొందాలన్నా, లైసెన్సు పొందాలన్నా, విద్యాసంస్థల్లో ప్రవేశం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, తప్పుచేస్తే శిక్షించాలన్నా, దౌర్జన్యం నుంచి రక్షించబడాలన్నా, అతడు భారతదేశీయుడైతే చాల దు, ఏ రక్షిత, అరక్షిత, ఆ రక్షిత కుల, మత, ప్రాంతానికి చెందిన వాడో అన్నది ముఖ్యమైపోయింది.

ఇలాంటి చట్టపరమైన వివక్ష వాతావరణంలో వ్యక్తులు స్వతంత్రంగా ఆలోచించడం, స్వతంత్రంగా బ్రతకాలనుకోవడం మానేసి తన కుల, మత, లింగ, ప్రాంత సమూహాల్లో ఒక సూక్ష్మ భాగంగా భావించడం, ఆ సమూహ అస్థిత్వమే తన వ్యక్తిగత చిరునామాగా భ్రమించడం ఎక్కువైంది. దాంతో వ్యక్తులు ఉత్పాదకతలో ఒకరితో ఒకరు పోటీపడాల్సిన స్థానంలో సమూహాల మధ్య కొట్లాటలు, ప్రచ్ఛన్న యుద్ధాలు, కొన్నిసార్లు ప్రత్యక్ష హింసకు దారితీయడం, ఒకరిపట్ల ఒకరికి అసూయ, ద్వేషం ఎక్కువయ్యాయి.

లక్షింపేట సంఘటన, అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం, తదనంతర ఉద్వేగాలు ఈ పరిణామాల్లో భాగమే. అందరితో పాటు సమాన స్థాయిలో బుద్ధి కుశలత, శారీరక శక్తులు కలిగి ఉండి కూడా, ఉత్పాదక రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవలసిన యువతీ యువకులు అనుత్పాదక రంగమైన ప్రభుత్వ ఉద్యోగాలొక్కటే దిక్కన్న భావంతో వాటి వెంట పరుగులు తీస్తున్నారు. ఉద్యోగం దొరికిన వాళ్ళు అందులో వ్యక్తిగత ఎదుగూ బొదుగూ లేకుండా మగ్గిపోతున్నారు. దొరకని వాళ్ళు (అత్యధిక సంఖ్యాకులకు దొరకవు) తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనై, కులాల వారీగా చీలిపోయిన సామాజిక పరిస్థితుల్లో తమ శక్తి సామర్థ్యాలను గుర్తించే వారే లేక కృంగిపోతున్నారు.

కటాఫ్ మార్కులు తగ్గించి కొందరికి విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించడం ద్వారానో, రిజర్వేషన్లిచ్చి కొందరికి ప్రభుత్వోద్యోగాలు ఇవ్వడం ద్వారానో కొందరు వ్యక్తులు తాత్కాలికంగా లాభపడతారేమో గానీ, దాని వల్ల ఆ సామాజిక వర్గాలకు, వ్యక్తులకు, వ్యవస్థలకు, మొత్తం మీద సమాజానికి జరిగే నష్టమే ఎన్నో రెట్లు ఎక్కువ. ఏ కులంలో, ఎంత పేదరికంలో పుట్టినా, ఒక్క తరంలోనే చేతినిండా పని, గౌరవ ప్రదమైన జీవితం, కడుపు నిండా తిండి, అందమైన ఇల్లు, సకల సౌకర్యాలు, కోతల్లేని కరెంటు, సొంత సంపాదనతోనే తనకు, తన కుటుంబానికి కావలసిన విద్య, వైద్య వసతులు - ఇవన్నీ పొందాలంటే కావలసింది ప్రభుత్వం, ప్రత్యేక చట్టాలు, రిజర్వేషన్లు కాదు.

ప్రజల ధన, మాన, ప్రాణాలను సమానంగా, కట్టుదిట్టంగా రక్షించగల వ్యవస్థలు, ప్రజలందరూ తమ తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించగల స్వేచ్ఛా వాతావరణం. ధనిక, పాశ్చాత్య దేశాల్లో అత్యంత పేదవారిగా పరిగణించేవారికి కూడా మనదేశంలోని మధ్యతరగతి కంటే ఎక్కువ సదుపాయాలు, సంపాదన ఉన్నాయంటే అదే కారణం. తన ఉనికికి అసలు పరమార్థమేమిటో తనకే తెలియక, కుల రాజకీయ క్రీడల్లో మునిగి తేలుతున్న అసమర్థ ప్రభుత్వాల పాలనలో ఎవరి ప్రాణాలకూ విలువ లేదు.

లక్షింపేట సంఘటన నేపథ్యంలో దళితులు గ్రామగ్రామాన మిలిషియాగా ఏర్పడాలని అభిప్రాయపడ్డ మేధావులు ఒక్క విషయం ఆలోచించాలి. దళిత మిలిషియాలకు దీటుగా దళితేతర మిలిషియాలు ఏర్పడవా? ప్రజలను రకరకాల సామాజిక ఆర్థిక, లింగ, సమూహాలుగా విడగొట్టి ప్రభుత్వాలు రగుల్చుతున్న రావణ కాష్టాలకు తోడు మేధావులు కూడా అంతర్యుద్ధాలను ప్రోత్సహించాలా? మేధావుల మెదళ్ళను శతాబ్దాలుగా తొలుస్తున్న కుల సమస్యను నాలుగు వరుసల వ్యాసంలో చర్చించడం అసాధ్యమని అంగీకరిస్తూనే, చివరగా ఒక మాట. తమ పూర్వీకులు పాటించినట్లుగా చెబుతున్న కుల వివక్షలకు నేటి తరం మూల్యం చెల్లించాలంటూ వ్యక్తిగతంగా సంబంధం, బాధ్యత లేకపోయినా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు కదా, మరి తెలిసి తెలిసీ ఆధునిక యుగంలో మనం పాటిస్తున్న చట్టబద్ధ వివక్షలకు ఎన్ని భావితరాలు మూల్యం చెల్లించాలో ఏ రూపంలో చెల్లిస్తాయో!
- జాహ్నవి

9 వ్యాఖ్యలు:

శివరామప్రసాదు కప్పగంతు August 4, 2012 at 10:09 PM  

"...ఒక్కో పవిత్ర గ్రంథం, ఒక్కో మేధావి బృందం తయారయ్యాయి......" Most of them denounce the existing religion and caste without realizing that they themselves are the new "Caste" and/or "Religion" and speak and pronounce as if standing on a high pedestal above everybody, which in itself is making them not part of the society.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) August 7, 2012 at 1:42 AM  

ఈ ఐలయ్య గోలేంటో గానీ, మొత్తానికి కుల వ్యవస్థనీ అర్థం పర్థం లేని సోదినీ భారతీయత పేరుతో వెనకేసుకొచ్చేవాళ్ళకి చక్కగా ఉపయోగ పడుతున్నాడనిపిస్తుంది.

ఇంతకీ ఈ ఐలయ్య వ్యతిరేక మేధావులు అసలు, వర్ణ వ్యవస్థ అనేది ఒక పనికి మాలిన వ్యవస్థ అని డైరెక్టుగా ఒప్పుకోరెందుకు? వర్ణ వ్యవస్థగానీ, దానికి దన్నుగా నిలిచే కర్మ సిధ్ధాంతంగానీ.. వాటిని వెనకేసుకువచ్చేవాళ్ళ ని ఎవరు మాత్రం నమ్ముతారు చెప్పండి..

SNKR August 7, 2012 at 3:59 PM  

/వర్ణ వ్యవస్థ అనేది ఒక పనికి మాలిన వ్యవస్థ అని డైరెక్టుగా ఒప్పుకోరెందుకు? /
పనికిమాలిందని ఎలా చెప్ప గలరు? వేల ఏండ్ల క్రిందటి మనుషులు తమకంటూ ఓ వ్యవస్థ ఏర్పరుచుకున్నారు. వేల ఏళ్ళుఒగా చాలావరకూ ఆచరణలో వుంది, నాలుగు నుంచి 500పైన వర్ణాలుగా విస్తరించింది. 21వశతాబ్దంలో స్వయంప్రకటిత మేధావులొస్తారని, వాళ్ళకు అది పనికిమాలినదనిపిస్తుందని, పాపం వాళ్ళెలా వూహించగలరు లేండి. ఏ కాలానికైనా నిలబడే (పనికి వచ్చేది) సిస్టం మేధావులు చేసి చూపాలి.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) August 9, 2012 at 7:43 AM  

వేల ఏండ్ల కిందే ఒక వ్యవస్థని ఏర్పరచుకున్నారు. అసలు ఒక వ్యవస్థ లాంటిది ఉందాలి అనే అవసరాన్ని గురించారు అనేదాంట్లో గొప్పదనాన్ని ఎవరూ కాదనలేదు.

అదే విధంగా అప్పటి సమాజం సాధించిన ప్రగతిని కూడా ఎవరూ తక్కువ చెయ్యట్లేదు. కాకపోతే వాళ్ళ ఆలోచనలూ, విలువలూ ఇప్పటికి కూడా నూరు శాతం సరైనవేననీ, అప్పటికదే సరైనది అనే ధోరణితోనే సమస్య. అప్పటి వ్యవస్థ ఒక చారిత్రక విషయంగా ఉండి పోతే ఎవరికీ ఏమీ అభ్యంతారాలు ఉండవు. కానీ ఆవ్యవస్థ అలా ఉండడానికి లేనిపోని సమర్ధింపులూ, కొత్త కొత్త విచిత్ర భాష్యాలూ చెయ్యటం కొద్దిగా ఆత్మ వంచనేమో అనిపిస్తుంది నాకు.

అప్పటి సమాజంలో ఉన్న వాటి కంటే కొద్దిగా ఉన్నతమైన విలువలని ప్రతిపాదించే ప్రయత్నం అభినందనీయమే. కానీ ఆ విలువలనే సర్వ కాలాలకీ సత్యాలుగా నమ్మించాలని చూసినప్పుడు అందులో స్వార్ధ ప్రయోజనాలని గురించలేక పోతామా ఏంటి?

శివరామప్రసాదు కప్పగంతు August 9, 2012 at 6:45 PM  

OK for a moment lets admit that some are justifying the age old caste system. But what these so called forward thinking people hating the caste system are doing? They ultimately are ending up spewing venom of hatred against certain communities and singling out one community which has not so far reacted at all. Is there a single thing that these so called exponents of "no caste" system have shown to others to prove that they denounced the caste system? They want only their caste to take upper hand, that's all.

If one community is the sole responsible culprit, leave that Caste as a outcast and let all other castes become one and lead the society by example. Whether that can happen?? or Happening? Why it is not happening!

What I feel is that those who are thinking that they are denouncing old caste system (which was evolved over centuries) are themselves creating a new caste system.

The present caste system is based on what a person is doing for a living (in earlier system also it was almost same but it was later on became by birth). Like for example IAS is one Caste, Software Engineer is another Caste,University Professors one Caste, Bank Officers another caste and like that so on and so forth. If the son of a IAS Officer later becomes a Software Engineer, he shifts to the Caste of Software Engineer and that is the dynamism the new caste system achieved.

Ultimately despite self hypnotizing of being "progressive" everybody is accepting this neo caste system. Can a Clerk working in a Collector's Office take lunch along with the IAS Officer on the same Table? Why not!!!

Let Caste system evolve itself and refine itself. When some brand a particular community and try to make them guilty of everything that "was" bad the natural reaction would be to justify the system that was long back forgotten.Those people in whose generation the new caste system has come into vogue and which is being accepted by them shall be compelled by these unruly criticism to go back to believe the old caste system is good and correct.

Any thing done too much will have negative results only.


The point the Writer of the article is trying to make is different and the the arguments, as is quite natural in blog world, are going at a tangent.

శివరామప్రసాదు కప్పగంతు August 9, 2012 at 6:46 PM  

The point the Writer of the article is trying to make is different and the the arguments, as is quite natural in blog world, are going at a tangent.

SNKR August 9, 2012 at 7:31 PM  

//అందులో స్వార్ధ ప్రయోజనాలని గురించలేక పోతామా ఏంటి?/

వృత్తిపనుల ఆధారంగా వర్గీకరించిన వ్యవస్థ అలా అచేతనంగా చారిత్రలో కలిసిపోవడానికి కారణం అది ఆచరించబడటం. ఆచరణలో కాలానుగుణంగా అది ఎన్నో మార్పులకు గురైంది, విభజించబడింది, వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది.
కోటాలు, కులచట్టాలు ఆ వ్యవస్థ ఆధారంగా చేసుకుని వున్నవే. కులవ్యవస్థ పోతే కోటాలు, కుల చట్టాలు తాయిలాలు పోతాయి, మరి అందుకు సిద్ధపడే దెవ్వరు? 60ఏళ్ళుగా కోటాలు పొడిగించబడుతున్నాయి, మరిన్ని కులాలు తమకు కోటాలు కావాలంటున్నాయి అంటే... పరోక్షంగా కుల వ్యవస్థ కావాలని కోరుకుంటున్నవారే ఎక్కువవుతున్నారనుకోవాలి. ఏ పార్టీ మాత్రం వోటు బ్యాంకులను వదులుకోవాలనుకుంటుంది? వాళ్ళూ పురాతన వ్యవస్థ మీద ఆడిపోసుకుంటూనే ఆ ఆట ఆడుతున్నారు. కుల సమీకరణాలు మీరు పాఠాలు చెప్పే కాంగ్రెస్ విష సంస్కృతిలోని భాగాలు కాదా? ప్రతి ఎలక్షన్ల ముందు ఈ సమీకరణాలు చూసుకోవడం లేదా? ఆ స్వార్థ ప్రయోజనాలు గుర్తించలేక పోయామా? గుర్తించాం , కొనసాగిస్తున్నాం.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) August 10, 2012 at 10:13 PM  

>> వృత్తిపనుల ఆధారంగా వర్గీకరించిన వ్యవస్థ

Are you sure ??

శివరామప్రసాదు కప్పగంతు August 11, 2012 at 9:34 AM  

I am 100% sure. Any society at any time, right from the day mankind started to evolve to live as groups which later on became villages and eventually graduated to cities, has been just a refined division of labour.

Everybody does something which is required and useful to the other and these are exchanged with the common medium called "money". Thats all.

May be I am wrong and if so, pray your honour explain and enlighten us just little minions, according to your enlightened thinking as to how the Caste system has come into vogue? By one community forcing it on others? Were others so weak to accept it thrust upon them. Still I am ready to admit all that and accept that one community was responsible to create caste system by some wile method of crookedness etc etc.as being viciously being propagated by vested interest groups. Today when that community does not matter for reckoning in any field, why not the so called progressive thinking modern people in other castes come together and create a caste-less society. Why its not being implemented, my Dear Learned Friend! The answer to that "why" lies the root cause for caste system not only in India but anywhere in the world. Old castes have faded away and new castes have sprung up and strengthening day by day.

Lets stop persecuting one community people for the perceived or imagined sins their forefathers alleged to have committed so long ago.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP