శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అహోబల! మహాద్భుతం .అనిపించిన అహోబిళయాత్ర.

>> Wednesday, August 22, 2012
కొండలలో

కోనలలో
కలసి సాగుతూ
ఎగువసన్నిధిలో మాబృందం


స్వామి అనుగ్రహం వలన హనుమత్ రక్షాయాగం పూర్తయిన మూడునెలలకు ఇప్పటికి అహోబిల యాత్రకు అనుమతి లభించినది . అడుగడుగునా ఆ ప్రహ్లాదవరదుని అనుగ్రహం చవిచూస్తూ సాగిన ఈ యాత్రావిశేషాలను మీతో పంచుకుంటున్నాము .
మొన్న శనివారం సాయంత్రం బయలుదేరాలని నిర్ణయించుకుని అందరూ గిద్దలూరు లో కలవాలని తెలిపాము. యాత్ర విషయం తెలసిన భక్తులు తమగోత్రనామాలతోకూడా స్వామికి అర్చన జరుపమని గోత్రనామాలు పంపారు .ఆరోజు సాయంత్రం  పీఠంనుండి నేను నాతోపాటు ఆదిశేషయ్య బయలుదేరాము . దరిశిలో సుందరరావు వచ్చి చేరాడు . అక్కడ ఉన్న కోటేశ్వరరావు గారిని రమ్మని చెప్పగా వీలుకావటం లేదన్నాడు. అక్కడకు  మాకోసం సిద్దంగా ఉన్న వాహనంలో పొదిలి చేరుకున్నాము .అటువైపు ఒంగోలు నుంచి గజ్జల శ్రీనివాసరెడ్డీ,  ఏ .ఈ సుంకరశ్రీనివాసరావుగారు ,అంకిరెడ్డీ, ఓబులరెడ్డి  వచ్చి చేరారు . మావాహనం గిద్దలూరు వెళ్ళెసరికే అక్కడ వార్తరిపోర్టర్ కృష్ణారావుగారు ఒకగంట క్రితం  వరకూ ప్రయాణం చేసిఅలసిపోయి ఇంటికివచ్చిఉన్నా కూడా మాకోసం ఎంతోశ్రమతీసుకుని  భోజనాదులు ఏర్పాటుచేశారు .  ఆదంపతుల అతిథిమర్యాదకు  ఎంతో ఆనందం కలిగినది . అక్కడ నుండి మాతో శ్రీ  గోరంట్లయ్య[AE] గారు సత్యన్నారాయణ [AE ]గారు  వారొక వాహనంతో యాత్రకు జతకలిశారు . సత్యన్నారాయణగారైతే అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేశారు . రాత్రి రెండుగంటలకు దిగువ అహోబిళంచేరి అక్కడ రూములో బసచేశాము . పొద్దుటే లేచి   అల్పాహారాలు కట్టించుకుని ఒక గైడ్ ఆయనపేరునరసింహ [మావాల్లు దేవానంద్ అనిమార్చారు లెండి ] వెంటబెట్టుకుని బయలుదేరి ఎగువసన్నిధికి చేరుకున్నాము  అక్కడ  స్నానాదులు పూర్తిచేసుకుని ఉగ్రనరసింహుని అమ్మ చెంచులక్ష్మీమాతను దర్శించుకుని  నవ నారసింహ క్షేత్రదర్శన మనే సాధనను ప్రారంభించినది మాబృందం . బృందానికి అన్నిఅవసరాలు చూసేందుకు గోరంట్లయ్య గారికి నాయకత్వం అప్పచెప్పాము .
ఇక యాత్ర లో ఉన్న సమస్య లో ముఖ్యమైనది  ఏంమిటంటే  మొత్తం  బృందంలో ఫార్టీప్లస్ వాళ్లం ఐదుగురం , . ఇక శ్రీనివాసరెడ్డికి  డిస్క్ ప్రాబ్లెం ప్లస్ శారీరికభారంకూడా అదనం .
గోరంట్లయ్యగారికి బాక్ పెయిన్ . కోటేశ్వరరావుగారికి పాదం లో నొప్పి .ఇవి  చాలాజాగ్రత్తగా నడపాల్సిన మారుతీకార్లవంటివి.  మిగిలినవాల్లలో  ఆదిశేషు ,సుందరరావు,అంకిరెడ్డి,ఓబులరెడ్డి  రైతులు కుర్రవాళ్లు  కనుక ఇబ్బందిలేదు . 
ముందుగా  దారిలో క్రోఢ,వరాహనరసింహుని దర్శనం చేసుకున్నాము . ఆపై జ్వాలానరసింహుని దర్శనానికి సాగాం . భవనాశిని నదిని అనుసరిస్తూ నేలపై సూర్యకిరణాలు పడని ఆ అడవిలో ఎత్తైన వృక్షరాజాలు ప్రసాదిస్తున్నచల్లనిగాలి,ని ఆస్వాదిస్తూ సాగాము. మబ్బులుకూడా పట్టిఉన్నాయి కనుక ముందుజాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లుకూడా తీసుకెళ్ళాం . అయితే వాటర్ బాటిల్లుగాని ప్లాస్టిక్ కవర్లుగాని ఎక్కడా అడవిలో పడవేయవద్దని ముందుగానే చెప్పాము. ఆకాశాన్నంటే గిరి శిఖరాల మధ్యలోయలు. అమ్మలా లాలిస్తున్న ప్రకృతి పచ్చదనం ,ఇవ్వటమే తప్ప యాచించటంతెలుయని ని దాతలవలే సమున్నతమైనిలచిన  వృక్షదేవతల ఆశీశ్శులు పొందుతూ జ్వాలానరసింహ క్షేత్రానికి చేరాము . అక్కడ దారిపై న ఎత్తునుంచి పడుతున్న  జలధారలలో తడచిపులకరించాము. స్నానం చేసి స్వామిని చూస్తుంటే  అహో! అద్భుతం ఆ శక్తిక్షేత్ర దర్శనం  చెప్పటం నావల్లకావటం లేదు .అక్కడతాకుతున్న శక్తితరంగాలకు ఒళ్ళుగగ్గుర్పొడుస్తున్నది .కళ్లలో ఆనందభాస్పాలు ఉబుకుతున్నాయి.
అక్కడ స్వామి హిరణ్యకశిపుని చంపినతరువాత గోళ్లుకడుగగా ఏర్పడిన రుధిరకుండం లో నీటి అడుగుభాగం ఎర్రగాఉంటుంది . ఇక అక్కడ ప్రత్యేకంగా చెప్పవల్సినది భక్తులకు సేవనందిస్తున్న చెంచులు . ఆనాటినుంచి ఇప్పటివరకు వాల్లు వచ్చిన భక్తులకు పానకం తయారుచేసి ఇస్తూనే ఉన్నారు. భక్తజనసేవనే సాధనగా చేసుకున్న వారిజీవితం ధన్యం. 
ఇక  నేను తప్ప మనవాల్లందరూ  అల్పాహారాలు కానిచ్చారు . అక్కడనుండి  ఉగ్రస్థంభం పైకి ఎక్కాలి. చాలాకఠినమైన నడక నిట్టనిలువుగా కొండపైకి మట్టిబాటనే సాగాలి. కాలుపెడితే చిన్నచిన్న రాల్లు జారిపోతుంటాయి . గోరంట్లయ్యగారు,శ్రీనివాసరావుగారు సత్యన్నారాయణ, కోటేశ్వరరావుగార్లు మేము మాలోల నరసింహ క్షేత్రం లో వేచి ఉంటామని వెళ్లారు .  మిగతావాళ్లం పైకి ఎగబాకటం మొదలెట్టాము . నడక పాకటంలానే ఉందొకొకచోట . పైకి వెళుతున్నకొద్దీ మనస్సు నిరామయమవుతున్నది నాశారీరిక శక్తి అల్పం ప్రభూ ! నీవుతప్ప దిక్కువేరెవ్వరు లేరని వేడుకున్న గజేంద్రుని లాంటి మానసికభావన వస్తుంది మనకు 
. నామనసులో ఓచిన్న సందేహం బయలుదేరి పెద్దదయిపోతున్నది. స్వామి ఈస్థంభంలోనుంచి వచ్చారని భావిస్తున్నాము కదా !? మరి ఈస్థంభంపై కాలు మోపవచ్చునా ? అని అనుమానం. అయితే ఎన్నో తరాలుగా పెద్దలంతా అలా ఎందుకెళుతున్నారు ? వారికి తెలియకనా?  అనే సందేహం మనసుకు చుట్టుముట్టీ ఏనిర్ణయానికి రాకుండాచేస్తున్నాయి . ఇక తీరా రాతిస్థంభంగా పిలచే కొండశిఖరభాగానికి నాలుగువందల మీటర్ల దూరానికెళ్ళెసరికి శ్రీనివాసరెడ్డికి అడుగు ముందుకు పడలేదు . అక్కడనుండి పైకిఇంకానిలువుగా ఎక్కాలి . అతని శరీరం లో నొప్పులు మొదలయ్యాయి . అసలే డిస్క్ ప్రాబ్లం . ఇంకాశ్రమపెడితే ఇబ్బంది అని అతనిని వారించి ఆయనకు తోడుగా నేను ఉంటాను మిగతావాల్లను పైకెళ్ళిరమ్మని పంపాను . కృష్ణారావుగారి  ఉత్సాహాన్ని చెప్పుకోవాలి పిల్లలకంటే వేగంగా నడుస్తున్నాడు. ఒక అరగంట తరువాత పైనుండి వాల్లు వచ్చే దాకా ఉండటమెందుకు బ్యాగులు నేనుచూస్తుంటాను .చిన్నగా కూర్చుని జారుతున్నట్లు క్రిందకు వెళ్లమని శ్రీనివాసరెడ్డిని పంపాను . నిలబడి ముందుకు వంగితే  ప్రమాదం ఎక్కడ పట్టుతప్పినా దొర్లుకుంటూ లోయలోకి జారుకుంటారు .
ఇక పైన వాళ్లు వచ్చినదాకా అక్కడే కూర్చుని నామస్మరణ చేస్తున్నాను  . చూస్తూ ఉండగా స్వామి అనుగ్రహమేమిటో కళ్లముందు కనపడుతూఉందినాకు. పండుముసలి వాళ్లు ఎనభై ఏల్లుదాటినవాల్లనుంచి పసిపిల్లలదాకా పైకెళుతున్నారు క్రిందకొస్తున్నారు .  భారీశరీరాలవాల్లు బక్కపలచటివాల్లు అందరూ సాగుతున్నారు. నేను చూస్తుండగనే  తిరునామాలు ధరించిన ఓ వృధ్ధుడు క్రిందకు దిగుతూ కాలు జారింది ,గుండెగుభేల్ మన్నది ఆయన క్రిందకు దొర్లాడనుకున్నాను కానీచిత్రం. నారాయణా అని ఆవ్రుధ్ధుని నోట నామం రావటం అతని కాలు నిలదొక్కుకోవటం జరిగింది . నిజమే కొండపైనుంచి క్రిందకు త్రోయబడ్డ ప్రహ్లాదుని గాచిన వరదుని లీల నిజమేకదా ! ఆర్తజనబాంధవా నారాయణా !
ఇక నాసందేహం పెద్దదవుతున్నది పైకెళ్లాలా వద్దా ? అని.
పైనుండి  ఓవృద్ద వైష్ణవదంపతులు తిరిగొస్తున్నారు కన్నడిగులు .తిరునామాలు దాల్చి వైష్ణవదాసులు. ముందుగా నాదగ్గరకొచ్చిన  ఆయనకు నాదగ్గరున్న ఖర్జూరఫలాలు అందజేసి నమస్కరించాను . వారు థాంక్సప్పా అని ఆశీర్వదించారు .  పైనుంచి శారీరక భారంతో ఆపసోపాలు పడుతూ తిగుతున్న భార్యతో ఆయనంటాడు,  స్వామిపైన మనకెంత నమ్మకముందో  తెలియడానికిదొక పరీక్ష అని. ఆవిడకూడా తగిన ఇల్లాలు . అవునండి ! ఇది  మనభక్తికి పరీక్షే అంటున్నది . 
ఆయనతో నాసందేహాన్ని చెప్పాను. మీ భావనలో అది సరైనదే . మీకు స్వామి రూపం ఆ శిలలో కనపడుతున్నది కనుక మీరు కాలుమోపలేనంటున్నారు. మంచిదే .అది మీకు సరైనదే  ఎవరో ఒకభక్తుడు నాటి సన్నివేశానికి గుర్తుగా అక్కడొక ప్రతీకను నిల్పి వచ్చేవారుదర్శిమ్చుకునేలా  చేశారు . వెళ్ళేవారి దర్శనపద్దతీ సమ్మతమే .అని వివరించారు . అంతలో ఆతల్లి మహాలక్ష్మిలా మాసమీపానికొచ్చినది. ఆవిడకు ఖర్జూరాలు అందజేశాను . ఆవిడా సంతోషపూర్వకంగా ఆశీర్వదించారు. . మావాల్లు కూడా దిగుతూ ఉంటే బ్యాగులు తీసుకురమ్మని కేకవేసి వారితోపాటు దిగుతూ   నేను, " భారములన్నిటికీ నీవేకలవని నిర్భయుడనై ఉంటిరా శ్రీరామా "అనే కీర్తన పాడుకుంటూ వస్తున్నాను . అప్పుడాయన కన్నడంలో ఆవిడకు ఆకీర్తనకు అర్ధం చెబుతున్నారు . ఇక్కడ ఆంధ్రలో రామభక్తి ఎక్కువ అంటున్నాడు .

ఇక  క్రిందకొచ్చి  మరలా స్నానం చేసి మాలోల నరసింహుని సన్నిధికి పయనమయ్యాము .  దారిలో భక్తజన గోవిందనామస్మరణలతో గొంతుకలుపుతూ గంటతరువాత 'మాలోల నృసింహుని' సన్నిధానానికి చేరుకున్నాము. మాలోల అంటే మా అంటే అమ్మ లక్ష్మీదేవి లోలుడు అంటే వశమయినవాడు అని అర్ధం . అక్కడ అమ్మతో వేంచేసి ఉన్న స్వామికి దీపములు సమర్పించి   ఈ యాత్రకు గోత్రనామాలు పంపిన భక్తులందరి పేర్లతో  తులసీ దళార్చన జరిపించాము . అక్కడ మేము చేసిన సంకీర్తన తో పులకించిపోయాము మేము స్వామి కూడా .
ఇక యజ్ఞం చేసుకోవటానికివీలైన  ప్రదేశం వెతుక్కుంటూ క్రిందకు దిగాము  మూడుచోట్ల ప్రయత్నించినా మనసు కుదరక ఈ కార్యక్రమాన్ని మరునాటికి వాయిదావేసుకున్నాము . అప్పటికే నాలుగున్నరైంది .అయితే దిండుగా జీడిపప్పులు,కిస్మిస్లు,శనగుండలు ఇలా పదార్ధాలన్నీ  సందులేకుండా మిషన్లాడటం వలన ఆకలంటే అర్ధం కాలేదు మావాల్లకు. ఇక దారిలో   ఆదిశేషు,సుందరరావు పొయ్యి వెలిగించగా శ్రీనివాసరావుగారు గోరంట్లయ్యగారి కాంబినేషన్లో తయారై  "ఓమంచి  కాఫీ " అనే కార్యక్రమం   జరిగింది . ఆచల్లని వాతావరణం లో కాఫీ అమృతంలా లోనకెళ్లింది . మరచిపోలేని కాఫీ . థాంక్స్ టు శ్రీనివాసరావు,&గోరంట్లయ్యగారు .
అక్కడనుండి దిగి జలపాతంలో స్నానంచేసి ఎగువసన్నిధిలో వేంచేసిఉన్న ఉగ్రనరసింహుని దర్శించాము .ఆపై అమ్మను దర్శించి కుంకుమార్చన జరిపించాము . సమయమవుతున్నది త్వరగా రావాలి అని అర్చకస్వామి తొందరపెట్టారు. అయినా సరే ఆవునెయ్యితో దీపాలు వెలిగించి అమ్మకుసమర్పించి అందరం సామూహికంగా లక్ష్మీదేవిస్తోత్రం చేయగనే అమ్మకరిగిపోయినట్లున్నది . అర్చకులవారు పిలచిమరీ అమ్మవారికి అలంకరిమ్చిన  పుష్పాలను ప్రసాదంగా ఇచ్చారు . అమ్మకరుణ అలాఉంది. అయితే అమ్మా నీప్రసాదం ఇచ్చావు , కానీ మాచేతితో ఏ ప్రసాదం సమర్పించుకోలేకపోయాంకదా నీకు ... మాచేత  ఏదైనా ప్రసాదం  సమర్పించుకునేలా చేయవా ?అని మనసులో బతిమాలుకుని  నా నిత్యపారాయణమైన లలితాపారాయణం మొదలుపెట్టాను . గుడిలోంచి దర్శంచేసుకుని వస్తున్న భక్తులలో ఓచిన్నారి అడుకుంటూ వెనక్కునడుస్తూ నాదగ్గర కొచ్చినది  ఆపాపను ఒడిలో కూర్చోబెట్టుకుని ఖర్జూరం ఇచ్చాను. ఆతరువాత సుమారు పన్నెండేల్ల అమ్మాయి మాదగ్గరలో కూర్చొనగా ఆవిడకూ ఆతరువాత ఓయువతి వచ్చి చేయిచాచగా ఆవిడకు,తరువాతవచ్చిన ప్రౌఢవయస్కురాలైన ఓమాతృసమానురాలికీ, ఓపండుముత్తైదువ, వచ్చి చేయిచాచగా వారికి దేవీభావనతో ఖర్జూరాలు సమర్పిస్తూ వారి పాదాలను దర్శిస్తూ మనసులో నమస్కరించుకుంటూన్నాను . ఇంతలో మరలా  ఓ చిన్నారి రాగా  రమ్మని సైగచేయగనే వచ్చి చేయి చాచిందినువ్వుసమర్పించాలనుకున్నవి పెట్టు    అన్నట్లు . ఖర్జూరఫలాలను నోటిలో పెట్టి అమ్మకు తినిపించాననే భావనతో నా మనసుఆనందడోలికలలో తేలియాడింది . 
ఇక ఆనంద సమయంలో మా బృందం చేసిన సంకీర్తన తో మనసు దివ్యలోకాలకు సాగుతున్నట్లయింది.

ఇక అక్కడనుండి దిగివస్తూ కారంజ నరసింహ సన్నిధిలో దర్శనం ఆతరువాత యోగానంద నారసింహుని సన్నిధికి చేరాము . అక్కడ కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో భోజనం చేసి రూముతీసుకుని విశ్రాంతి తీసుకున్నాము. ఉదయాన్నే అక్కడ ఆశ్రమ నిర్వాహకుల అనుమతి తీసుకుని  శివాలయం లో  యజ్ఞం ప్రారంభించాము. సోమవారం,అదీ కాశినాయన సద్గురు సన్నిధానం .  యజ్ఞం అద్భుతంగా సాగింది. అడుగడుగునా మమ్మల్ని కళ్లలో పెట్టుకుని కాపాడుతున్న మాగురువుగారు హనుమత్ స్వామి కి కూడా ఆహుతులు సమర్పించుకుని ఆనందపరవశులమయ్యాము.అయితే నేను ఇక్కడ నుండి గంధం చాలాతీసుకెళ్లాను. అక్కడ స్వామికి గంధం తో శరీరాన్ని లంకరించాలని మనసులో కోరిక . అయితే అక్కడ అర్చకస్వాములు ఉన్నారు కనుక మనకు అవకాశం లేకపోయెనే అని మనసులో వెలితి అలాగే ఉంది నిన్నటినుండి . యోగనారసింహుని దర్శించి  అక్కడ అర్చకస్వామి కివ్వగా గంధం అలంకరణచేసి మాకు ప్రసాదంగా ఇచ్చారు. అక్కడే కొద్దిగా భోజనం తీసుకుని మరలా యాత్రసాగించాము .అక్కడనుండి చత్రవట నారసింహుని దర్శించాము .అక్కడ మేమిచ్చిన గంధం పెద్దముద్దచేసి స్వామి వక్షస్థలానికి అలంకరించి భక్తులకు ప్రసాదంగా ఇచ్చారు అర్చకస్వాములు.
అటుపై భార్గవనరసింహుని  సన్నిధికి అడవిలో ఓ రెండుకిలోమీటర్లు నడచివెళ్ళి దర్శిమ్చుకున్నాము.అక్కడ సంకీర్తన జరిపి దిగువ అహోబిలం చేరాము . అప్పటికి మధ్యాహ్నం రెండు. ఇక మిగిలినది పావన నరసింహక్షేత్రం . అది ఎగువనుండి ఏడు కిలోమీటర్ల నడకదారి లేదా దిగువసన్నిధినుండి పదహారు కిమీ అడవిలో జీపులు ట్రాక్టర్లదారి .అదీ అక్కడికమాండర్ జీపులపైనేసాధ్యం . 
తిరిగి వెల్లటానికి సమయంచాలదుకనుక జీపు లోవెళ్దామని కొందరు  కానీ ఒక్కో జీపుకు ఎనిమిదిమమ్దిని మాత్రమే ఎక్కించుకుంటామని అదీ పద్దెనిమిది వందలు అన్నారు. నాకైతే వాహనమెక్కటం ఇష్టం లేదు .నడచి వెళదామని ఉంది . కానీ సమయంచాలదు నడవలేమని అంటున్నారు. ట్రాక్టర్ కోసం ప్రయత్నిస్తే స్వామి అనుగ్రహం వలనే కాబోలు దొరకలేదు . [దొరికుంటే చాలా ఇబ్బంది పడేవారం ]పోనీలే ఈసారికి రాలేకపోయామని క్షమాపణలు చెప్పుకుందాం అనుకున్నాము, కానీ గోరంట్లయ్య గారుమాత్రం ససేమిరా అన్నారు తొమ్మిదిక్షేత్రాలు దర్శించాల్సినదే అంటారు . స్వామి ఆయనచేత అలాపలికిస్తున్నారు . చివరగా సుందరరావు,ఓబులరెడ్డీ ,ఆదిశేషు ఎగువసన్నిధినుండి నదచి వెళ్లాలని, పంపాము. కానీ మిగతావాల్లంకూడా వెల్లవలసినదే నని నిర్ణయించుకుని జీపు మాట్లాడారు .  శ్రీనివాసరెడ్డి బండి ఎక్కబోతుండగా ఫుట్పాత్ ఊడివచ్చింది .ఏదో అశుభంగా మనసులో ఆలోచనమెదలాడినా పెద్దగా లెక్కచేయలేదు .  ఇక బయలుదేరేముందు ఓపదహారేళ్ళ,పదిహేడేళ్ళ  పిల్లవాణ్ణీ డ్రైవర్ గా ఎక్కించారు .ఇదేమిటంటే   వీళ్ళకు మమ్చి అనుభవమండీ అన్నారు.  అదొకచైతన్యరథం .ఎక్కడవక్కడ ఊడిపోయేట్లున్నాయి. మమ్చిబండి పంపమని అడిగితే .కుదరదండీ ఇక్కడ యూనియన్ సీరియల్ ప్రకారమే బండ్లువస్తాయని వాల్లు మొండికేశారు . 
ఇక అడవిలో అడుగుపెట్టాక పరిస్థితి మహాప్రమాదకరమని తేలింది. అది అడవిలో అడ్డదిడ్డంగా ఈ జీపులవాల్లు ఏర్పరచినబాట .గతుకులు గోతులు  వర్షానికికొన్నిచోట్ల మోకళ్లలోతు బురదనీళ్లున్నాయి . వాడు విపరీతమైన వేగంతో పోతుంటే బండిలోవాళ్ళు ఎగిరెగిరిపడుతున్నారు . మెలికలుతిరుగుతూ ఏచెట్టుకు ఎక్కడ గుద్దుతాడో తెలియదు. బురదనీటీలో జారుకుంటూ ఎక్కడతిరగబడుతుందో అనేట్లుంది.వాణ్ని అరుస్తుంటే అలాకాపోతే బండి నడవదు లాగలేదు ాంటూన్నాడు ముందుకూర్చున్న మాకృష్ణారావుగారు .వాస్తవంకూడా అంతే ఆగితే నెట్టటంకూడా కష్టమే . ఇక  చాలీసా పారాయణం ఎత్తుకున్నాము . మధ్యలో ఏంటిరా ఈ డ్రైవింగ్ అంటూ వాన్ని మమ్దలించటం ఈపరిస్థితిపై జోకులేసుకుంటూ నవ్వుకోవటం. మిమ్మల్ని అక్కడదాకాతీసుకెళతామని గ్యారంటీ ఏమన్నాఇచ్చామా సార్? అని వాడనటంతో అదిచెప్పుకోవటం ఒకటే నవ్వుకోవటం. అప్పటికే చెట్టుకొమ్మలు కొట్టుకుంటూన్నాయి కొందరికి. నాకైతే ఏదో ప్రమాదం అని మనస్సుకు హెచ్చరికలందుతున్నాయి.   నాకేమైనా పరవాలేదు .నన్ను నమ్మి ఇంతమంది వచ్చారు నీసన్నిధికి వీల్లలో ఎవరికేమైనా నీకు చిన్నతం కదా స్వామీ అని ప్రార్ధిస్తున్నాను .  తీరా క్షేత్రసమీపానికొస్తున్నమనగా కొండవాలు దిగటం మలుపులోంచి ఎదురువస్తున్న మరొక జీపు ఇద్దరూ కంట్రోల్ చేయలేక ఢీ కొన్నాయి.  జైశ్రీరాం అనేకేక  అప్రయత్నం గా నోటినుంచి వచ్చింది మధ్యలో సీటూమారి ముందుకూర్చున్న శ్రీనివాసరెడ్డి కేమైనదా అని ఆందోళన పడ్డాను. అవతలి జీపు డ్రైవరూ వీడి వయసువాడే ,పెద్దవాల్లు నడపలేదు అమ్దుకని ఇలాపిల్లల్ని డ్రైవర్లుగాపెట్టుకుంటూన్నారు ఓనర్లు. స్వామి అనుగ్రహం వలన ఇద్దరూ స్లోగా రావటం ఇద్దరూ పక్కకుతిప్పటం వలన పెద్దప్రమాదం జరగకుండా కాపాడబడ్డాము .
జనాన్ని దించి ఇరుక్కున్న బంపర్లు వెనక్కు లాగి బండ్లు . వేరుచేశారు  .వాడితప్పేంలేదు ! మధ్యలోనే చెప్పాడు మెమేమన్నా గ్యారంటీ ఇస్తామా మీకు అని డ్రయివర్ మాతలు చెప్పుకుని తెగనవ్వుకున్నాము .  ఇక పావన నరసింహుని  సన్నిధికి మేం వెళ్ళెసరికి అటునదకతో వచ్చినవాల్లు చేరారు . చూడుబాబూ మాకింకా చెయాల్సినపనులు చాలావున్నాయి .డబ్బుతీసుకుని నువ్వెళ్లిపో ,,మేం ఇలానడచి వెళతామని చెప్పి వాణ్ణి పంపించి వేశాము .

[దయచేసి ఎవరన్నా వెళ్ళినా పావననరసింహసన్నిధికి ఈ వాహనాలు ఎక్కకండి]

అక్కడనుండి నడకతో అద్భుతమైన ప్రక్రుతిసౌందర్యాలను తిలకిస్తూ మరలా ఎగువ అహోబిలంచేరి జలపాతం క్రింద స్నానాలు చేసి స్వామిని దర్శించుకుని దిగువసన్నిధానానికి చేరుకున్నాము. సరిగ్గా సమయానికి వచ్చారు ఇప్పుడు స్వామికి నివేదించిన తీర్థప్రసాదగోష్ఠి ఉన్నది అనిచెప్పారు ఆలయంలో .ఆహా సంపూర్ణం నవనారసింహ క్షేత్రాలు దర్శింపజేసి ఆయన ప్రసాదానికి మేము అర్హులమయ్యామని సూచించి  ఆయనప్రసాదించిన మహాప్రసాదం స్వీకరించి ఆనందంతో తిరుగుప్రయాణమయ్యాము .

వేదములు నుతింపగా  .వేడుకలు కైవారగ ..అదరించె  దాసుల మోహన నారసింహుడూ ..........మోహననారసింహుడు .

[నెట్  స్లో అవటం వలన ఫోటోలు నిదానంగా లోడ్ అవుతున్నాయి కొద్దిగంటలలో ఇక్కడుంచుతాను ]

7 వ్యాఖ్యలు:

Yogi August 22, 2012 at 11:24 AM  

http://yandamoorinovels.blogspot.com/2011/01/vennello-adapilla-vennello-aadapilla.html

Yogi August 22, 2012 at 11:26 AM  

Master garu, Namaskaram.. mee yatra varnana adbhutam.. memu kooda yatra lo vunna bhavana.. Thanks andi. Ee sari India trip lo choodali ahobilam..
Ramana

కంది శంకరయ్య August 22, 2012 at 5:34 PM  

ధన్యోస్మి! మీతో పాటూ నేనూ యాత్రలో పాల్గొన్న అనుభూతి కలిగింది. సంతోషం.. ధన్యవాదాలు.

A.V.Naga Sandeep Kumar August 23, 2012 at 1:38 AM  

nice

VIJAYSAI August 23, 2012 at 3:25 AM  

Master garu, Namaskaram. mee yatra varnana chala bagundi. Ahobilam gurinchi yenno vishayalu thelusukunnamu. Chala thanks andi

Vijayasai. Durbha

anrd August 23, 2012 at 5:38 AM  

మీ యాత్రా విశేషాలను చక్కగా వివరించారు.

మేము అహోబిలం వెళ్ళామండి. అయితే, తొమ్మిది క్షేత్రాలు దర్శించుకోలేదు. నవనారసింహులలో కొన్ని మాత్రం దర్శించుకోగలిగాము.

svkr August 24, 2012 at 10:42 AM  

krishnakarthik Sidebar
Classic Flipcard Magazine Mosaic Sidebar Snapshot Timeslide
హరిసేవ: అహోబల! మహాద్భుతం .అనిపించిన అహోబిళయాత్ర.
Aug
24
హరిసేవ: అహోబల! మహాద్భుతం .అనిపించిన అహోబిళయాత్ర.
హరిసేవ: అహోబల! మహాద్భుతం .అనిపించిన అహోబిళయాత్ర.
durgeswarao gaariki namaskaram. hanuman rakshaa yagam sankalpaniki prerana nichina mahaa sannidaanam sri ahobila nava naarasimha kshetra yatranu aa swami karuna kataakshamto tamarito kalisi purticheyadam naaku swami ichhina varamgaa bhavistunnanu. nijangaa aswami kataaksham vallane nenu hyderabad nundi vachina ventane etuvanti alasata lekunda raagaligaanu. yatraku veltunna bhaktulaku aathidyamivvadam swami anugrahanga bhavinchamu. aatidhyamlo lopalu unte kshaminchhali. ( samayam takkuvaga unnanduvalana aamerake cheya galiganu. ) . Bhakti maargamlo meelanti bhagavat upaasakula parichayam maaku marinta sphurti nivvadamtopatuga swami sevaku daggaravutamu. sri venkateswara jaganmata peetam darsana bhagyamkankshistu.., jai sri ram, jai bhajarangabali., jai hanuman.,

Posted just now by svkr

0 Add a comment Followers
Followers
Blog Archive
Blog Archive
20121
August1
హరిసేవ: అహోబల! మహాద్భుతం .అనిపించిన అహోబిళయాత్ర.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP