శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పులిపిర్ల తొలగింపుకు ఓ అద్భుత మూలికా వైద్యుడిడిగో

>> Saturday, June 16, 2012

పులిపిరి మల్లి తలచుకుంటే మళ్లీ రాదు


శస్త్రచికిత్స చేసి తొలగించాల్సిన పులిపిరిని ఆయన నెత్తురుచుక్క రాకుండా తీసేయగలరు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎందరికో పులిపిరుల చికాకులను క్షణాల్లోనే తొలగించగలిగిన వడియాల మల్లికార్జునరావుకు ఆ విద్య వంశపారంపర్యంగా వచ్చినది కాదు. అతని అన్వేషణకు దక్కిన వరమది. దాన్నొక సామాజిక బాధ్యతగా వినియోగిస్తున్న మల్లికార్జునుని పరిచయమే ఈ కథనం...

ఆ రోజు నా కోరికను మా నాన్న ముందు ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాలేదు. చదువుకుంటామనో, సినిమాల్లో చేరతామనో, వ్యాపారం చేస్తామనో తల్లిదండ్రులను అడగవచ్చు. కానీ అడవికి వెళతానని చెబితే వాళ్లు ఏ విధం గా స్పందిస్తారు?...ఈ సందేహం చాలాకాలం నా నోరును మూయించింది. కాని నాకెదురైన అనుభవం నన్ను నిలువనీయలేదు. ఎలాగైనా సరే పులిపిర్ల వైద్యం నేర్చుకోవాలని నా కోరిక. చివరికి ధైర్యం చేసి మా నాన్న తో చెప్పేసా..." కొన్నాళ్లు శ్రీశైలం అడవులకు వెళ్లి పులిపిర్ల వైద్యం నేర్చుకుంటా''ఈ మాటలు విని "ఇప్పుడూ వైద్యమే నేర్చుకుంటున్నావుగా. అడవులకెళ్లి కొత్తగా తెలుసుకునేదేమిటి?'' అన్న రీతిలో నాన్న నా వైపు చూశారు. నిజమే, అప్పటికే నేనొక వైద్యుని దగ్గర సహాయకునిగా చేరి కొంతకాలంగా వైద్యం నేర్చుకుంటున్నాను.

ఆ ఇబ్బంది తెలిసిన క్షణం... మాది ప్రకాశం జిల్లా మార్టూరు. మధ్యతరగతి కుటుంబం కావడంతో డిగ్రీ వరకు చదివి ఏదైనా ఉద్యోగం చేయాలని ప్రయత్నించాను. మార్టూరులోని ఒక వైద్యుని వద్ద సహాయకుడిగా చేరాను. అంతా సక్రమంగా సాగిపోతోంది. అలాంటి సమయంలో ఒక సంఘటన జరిగింది. చాలామంది రోగాలను నయం చేసి పంపిస్తున్న మా వైద్యునికి ఒక సమస్య చికాకుపెట్టింది. ఆయన ముఖం మీద దాదాపు రెండు వందల పులిపిర్లు గుత్తుల్లా పేరుకుపోయాయి. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతీ ఒక్కరూ పులిపిర్లు చూసి సానుభూతి వ్యక్తం చేయడమే. వాటికోసం ఆయన ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. మానసికంగా చాలా ఇబ్బందిపడేవారు. అప్పటికి లేజర్ ట్రీట్‌మెంట్ వంటివి ఇంకా రాలేదనుకుంటా.

నేర్చుకోవాలని... పులిపిర్లకు శ్రీశైలం అడవుల్లో ఉన్న స్వామి ఒకరు ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారని మా వైద్యునికి తెలిసింది. మా వైద్యుడు నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్లారు. అలా శ్రీశైలం దగ్గర్లోని సున్నిపెంట గ్రామంలో మల్లికార్జునరావు అనే సాధువును తొలిసారి చూశాను. ఆయన గంటలో మా వైద్యుని ముఖంపై ఉన్న రెండొందల పులిపిర్లను మాయం చేసేశారు. ఎక్కడా చుక్క రక్తం రాలేదు. మచ్చలూ మిగల్లేదు. నాకదొక అద్భుతంలా అనిపించింది. ఎలాగైనా ఈ వైద్యం నేర్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అదే విషయాన్ని నాన్నతో చెబితే ఎన్నో సందేహాల మధ్య "నీకు అంతగా నేర్చుకోవాలనే తపన ఉంటే వెళ్లు, నీకో ప్రత్యేకత సంపాదించుకో'' అన్నారు. అలా నా అన్వేషణ శ్రీశైలం అడవుల్లోకి సాగింది.

అనుభవం నేర్పిన విద్య... అక్కడకు వెళ్లాక మల్లికార్జునరావు నన్ను తిరిగి వెళ్లిపొమ్మని సూచించారు. నా మనసులోని కోరికను చెప్పినప్పటికీ నన్ను తన శిష్యునిగా స్వీకరించడానికి అంగీకరించలేదు. నాకేమో తిరిగి వచ్చే ఆలోచన లేదు. అందుకని ఏమైతే అదయిందని అక్కడే ఉండిపోయాను. ఆహారం, వసతి ఎలాగో గడుస్తున్నా యి కానీ నా కోరిక నెరవేరదేమోనని లోలోపల భయపడుతుండగా ఒక రోజు గురువుగారి దగ్గరి నుంచి పిలుపు వచ్చింది. అక్కడితో నా వన జీవనం మొదలైంది. ఎండా, వానా, చలి, భయం ఏమీ లేదు.

ఆయనతోపాటు అడవుల్లో తిరిగేవాణ్ణి. ఆకలి, దప్పిక, నిద్ర, నీరసం రాకుండా మా గురువు చేయగలరు. ఏవో మూలికలతో పాయసం లాంటి పదార్థం ఇచ్చేవారు. అది ఆరగిస్తే పైన చెప్పిన అవసరాలు ఇబ్బందిపెట్టేవే కావు. ఇలా సంవత్సరం గడిచిపోయాక నాపై నమ్మకం ఏర్పడి మా గురువు పులిపిర్ల వైద్యం బోధించారు. దానికి ముందు ఆయన కొన్ని నిబంధనలు విధించారు. అవి- అత్యాశకుపోయి ఈ వైద్యాన్ని దుర్వినియోగం చేయొద్దని, ఏమీ ఇచ్చుకోలేని పేదలకు తక్కువకు సేవలు అందించాలని. అయితే పుల్లిపిర్ల వైద్యానికి ఉపయోగించే ఆకుల పేర్లు ఆయన నాతో చెప్పలేదు. ఈ వైద్యం గురించి చెప్పిన కొన్నాళ్లకే ఆయన చనిపోయారు.

నాకు ఇప్పటికీ ఆ పేర్లు తెలియవు కాని అడవిలో ఆ ఆకులను గుర్తుపట్టి సేకరిస్తుంటాను. అలా వాటిని సేకరించి వైద్యం చేయడం ప్రారంభించాను ఒకవైపు ఉద్యోగం...ఇంకోవైపు సద్యోగం వైద్యం నేర్చుకుని ఇంటికొచ్చాక నాకు వివాహం జరిగింది. పులిపిర్ల వైద్యం విషయంలో గురువు మాట పాటించేటపుడు సంతృప్తి దక్కేదే కానీ, ఇల్లు గడిచేది కాదు. అందుకే మా మామయ్య ఉపాధి హామీ పథకం పనుల్లో టెక్నికల్ ఉద్యోగంలో చేర్పించారు. ఖాళీ సమయంలో మా చుట్టు పక్కల ప్రాంతాల్లో మాత్రం ఈ వైద్యం చేసే వాన్ని. చిలకలూరిపేట, మేదరుమెట్ల, ఒంగోలు, చీరాల, తెనాలిల్లో చాలామందికి పులిపిర్లను బాగుచే శాను. ఈ ఆకులు సేకరించడం అంత సులభంగా జరిగేది కాదు. మూడు నెలలకోసారి ఆకులను శ్రీశైలం వెళ్లి తెచ్చుకునేవాణ్ణి. వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ తడి తగలకూడదు.

సంతృప్తి చాలు... ఇంట్లో ఒప్పుకోవడంతో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తికాలం పులిపిర్ల వైద్యం మొదలుపెట్టాను. భార్యాపిల్లల్ని పోషించుకోవడానికైనా ఎంతో కొంత తీసుకోవాలని సన్నిహితులు సూచించారు. దాంతో ఒక పులిపిరి తొలగించడానికి 50 రూపాయలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. మొదట్లో చాలామంది ఆకులు, అలములతో తగ్గిస్తాడట అంటూ విమర్శించారు. అయినా నేనేమీ బాధపడలేదు. చదువు కూడా ఉంటే మంచిదని వైద్యం చేస్తూనే ఎంఎ పూర్తి చేశాను. నా వైద్యం చూశాక కొంతమంది ఫోన్లు చేసి మాకూ ఆ వైద్యాన్ని చెప్పాలని అడిగేవారు. అందరికీ చెప్పడం కుదరదని బదులిస్తే బెదిరించేవారు.

ఇలాంటివి చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. నా వైద్యం గురించి తెలిసి అమెరికా, ఈజిప్ట్, జర్మనీ దేశాల నుంచి కూడా పులిపిర్లు బాధితులు వచ్చేవారు. కొంతకాలం గడిచాక వైద్యం అందించడానికి హైదరాబాద్ సౌకర్యంగా ఉంటుందని భావించి ఇక్కడి బాలాపూర్‌లో ఉంటున్నాను. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎంతోమందికి పులిపిర్లు నయం చేయగలిగాను. అందులో సినీ ప్రముఖులు కూడా అనేకమంది ఉన్నారు.ఒక చిన్నారికి కాళ్లు, చేతులపై వందల కొద్దీ వచ్చిన పులిపిర్లను తగ్గించినపుడు కలిగిన సంతృప్తిని ఎన్నటికీ మరువలేను. ం బల్లెడ నారాయణమూర్తి ఫోటోలు: రాజ్‌కుమార్ 

mallikharjunaravu cell        9440251969


[andhrajyothy. telugu daily]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP