చదువులలో వెనుకబడ్డ విద్యార్థులకోసం
>> Sunday, December 27, 2009
ఓం ప్రణోదేవీ సరస్వతీ / వాజేభిర్వాజినీవతీ /ధీనా మవిత్ర్యవత్ .ఓం సరస్వత్యై నమ:
అంటూ చదువుల తల్లి సరస్వతీ దేవీని స్మరించుకుంటే విద్యార్థులకు బుద్ధిశక్తులు లభిస్తాయని పండితులు అంటున్నారు. దేవతలలో నదులలో శ్రేష్ఠులారైన సరస్వతీ దేవీని ప్రతి నిత్యం పై మంత్రాన్ని స్మరించుకునే వారు బుద్ధికుశలతతో జీవిస్తారని విశ్వాసం. అంతేగాకుండా అన్నప్రదాయినిగా, ధనప్రదాయినిగా శారదాదేవిగా భక్తులకు అండగా నిలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అందుచేత విద్యార్థులు పరీక్షా సమయంలోనే మాత్రం కాకుండా ప్రతినిత్యం, శుచిగా స్నానమాచరించాలి. తర్వాత పూజగదిలోని సరస్వతీ దేవీ పటమో, లేదా విగ్రహాన్ని నిష్ఠతో పూజించి పై మంత్రాన్ని ఉచ్చరించినట్లైతే వాక్చాతుర్యతతో పాటు బుద్ధికుశలతలు దరిచేరుతాయని పండితులు అంటున్నారు.
మనిషికి మంచి మాటే అలంకారమని, మాటతోనే సర్వజగత్తు నడుస్తోందని, ఆ వాక్కుకు దేవత స్వరూపిణి అయిన సరస్వతీ దేవిని స్మరిస్తే సకల సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
చదువులలో వెనుకబడ్డ విద్యార్థుల కు ఈ మంత్రజపం అద్భుతప్రయోజనాలనిస్తుంది .
5 వ్యాఖ్యలు:
దుర్గేశ్వర రావు గారు,
ఇప్పుడు చదువులంటే, మార్కులే కదండీ. నేను చదువుకుంటున్నప్పుడు ప్రోగ్రెస్ కార్డులో ఓ శ్లోకం ముద్రించే వారు.
"విద్యా దదాతి వినయం
వినయాద్యాతి పాత్రతాం |
పాత్రత్వాత్ ధనమాప్నోతి
ధనాద్ధర్మం తతస్సుఖమ్ ||"
ఈ భావనతో చదువుకునే వారికి మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి.
పై వాఖ్యలోని శ్లోకం అర్ధం చెప్పండి ఎవరైనా
విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతామ్।
పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్।।
విద్యా దదాతి వినయమ్, వినయాత్ యాతి పాత్రతామ్, పాత్రత్వాత్ ధనమ్ ఆప్నోతి, ధనాత్ ధర్మమ్, తతః సుఖమ్.
తాత్పర్యం: విద్య వినయాన్ని ఇస్తుంది. (అలాంటి విద్యావంతుడైన మనిషి) వినయం నుండి పాత్రతను (గ్రహించడానికి తగిన శక్తిని), పాత్రత్వం వలన ధనాన్ని, (అలా పొందిన) ధనం నుండి ధర్మాన్ని, తర్వాత సుఖమును పొందుచున్నాడు.
"వినయం దదాతి పాత్రతాం" అని పాఠాంతరం కూడా వినవస్తుంది కానీ ఛందస్సు రీత్యా అది దోషం, కాబట్టి అది ప్రమాదవశాత్తూ కల్పించబడింది అని తెలుస్తోంది.
ధీనామవిత్ర్యవతు (ధీనామవిత్రీ అవతు)... అవతు అంటే రక్షించుము అని.
ధన్యవాదాలు రాఘవ గారు
Post a Comment