శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆదివారం చేయకూడని పనులే మనకు అలవాటయ్యాయి

>> Saturday, March 16, 2024

🕊️శ్రీమతే రామానుజాయ నమః 🦚
🦚 శ్రీలక్ష్మీనరసింహస్వామి నే నమః 🦜
🦜 శ్రీరామ జయ రామ జయజయ రామ 🕊️

   💎నేటి మంచిమాట 💎

మాంసం తినడం..! మద్యం తాగడం..!
 క్షవరం చేసుకోవటం..!
తలకు నూనె పెట్టుకోవడం..!

ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు, కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..! ఈ కర్మలు చేసినవారు జన్మ జన్మలకు ఇబ్బంది పడతారని అని నొక్కి చెప్పారు మన పెద్దలు.

ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు
ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!

మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!

ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!

అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!

ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!

ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు..

అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!

 బ్రిటీషు వాడు
(Thomas Babington Macaulay,)
ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు..
మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!!

పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!

మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!

కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!

ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.!

ఆదివారం అరోగ్యవారం గా మార్చుకుందాం....

యోగ చేద్దాం.! ప్రాణాయామం చేద్దాం.!
సూర్యనమస్కారాలు చేద్దాం.!
సూర్యోపాసన చేద్దాం.!! ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం.!!

ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు
కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! కానీ
దీన్ని పాటించడానికి ప్రయత్నిద్దాం..!!

ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ
క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే
కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.

🙏 ఆచార్య శ్రీపాదములే మనకు రక్షకము 🤷‍♂️

🙇‍♂️ నవ్వండి నవ్విస్తు వుండండి 💧

🌹 ఊర్ధ్వపుండరములు ధరించిన అతివిలక్షణమైన శ్రీవైష్ణవుల దర్శనము శుభప్రదము మరియు మజ్గళకరము 🌹

💎జయ తిరుప్పావై జీయర్ తిరువడిగళే శరణమ్ 👏

Subhash

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP