శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పసిపిల్లల ప్రార్ధనలకు కరిగిపోయాడు పవనసుతుడు

>> Wednesday, May 23, 2012

 మొన్న  సోమవారం ఒక  కాల్ వచ్చింది . ఎవరో ఒకపాప,  స్వామి ! మీరు హనుమాన్ చాలీసా చదివి శ్రీరామ  అని వ్రాయమన్న పేపర్లో చూశాను    ఏకష్టమొచ్చినా హనుమంతునికి చెప్పుకుంటే  తీరుస్తారని ?     వ్రాశారు కదా  నిజంగా  స్వామి   తీరుస్తారా  అనడిగింది .

  ఏఊరమ్మా ?  మీది అడిగాను

కడప  .అన్నదాపాప .

గొంతునుబట్టి చూస్తే వయసు తొమ్మిది పదేళ్లు ఉండవచ్చు.ఆపాప అడిగే తీరులో గొంతులో దిగులు ధ్వనిస్తున్నది
ఇప్పుడేమి కష్టమొ చ్చినదమ్మా ? అనునయంగా అడిగాను ..

మా పాపపకు బాలేదు . అందరు హాస్పటల్ కెళ్ళి బాధపడుతున్నారు  పాపకు స్వామి తగ్గిస్తాడా ?

ఎవరిపాపమ్మా ? ఏమయింది  అడిగాను

 మాపెదనాన్న వాల్లపాప .మాతో బాగా ఆడుకుంటుంది . బాలేదని హాస్పటల్  కు తీసుకెళ్ళారు . ఇంకా ఇంటికి తీసుకురావటం లేదు .అందరు ఏడుస్తున్నారు . స్వామి తగ్గిస్తాడా పాపకు ,ఆర్తితో ఆపాప అడుగుతున్న  తీరు మనసును కదిలిస్తున్నది .

తప్పనిసరిగా తగ్గిస్తారు తల్లి !  తగ్గించమని నువ్వడుగు . మాపెద్దవాల్లం అడిగేకంటే  నువ్వడిగితేనే  స్వామి  కి ఇష్టం , పాపకు వెంటనే తగ్గిస్తారు  అని చెప్పాను. ఎలా అడగాలి ?  ప్రశ్నించిందిమళ్ళి .

నీదగ్గర హనుమాన్ చాలీసా  ఉందికదమ్మా ! రేపు మంగళవారం స్వామి పటానికి ఎదురుగా  కూర్చుని నీకు చేతనైనన్నిసార్లు చదువు . స్వామీ ! పాపకు తగ్గించమని దణ్ణం పెట్టుకో . పదేపదే ఆయన్నడుగు 

అలాచేస్తే ఏ  బాధైనా తగ్గిస్తారా స్వామి  మనకు ?

అడిగి చూడమ్మా ! నీలాంటి  మంచిమనసు గలవాల్లడిగితే  స్వామీ ఖచ్చితంగా అనుగ్రహిస్తారు .పాపకు ధైర్యం చెప్పి స్వామికి నమస్కరిం చుకున్నాను

నిన్నసాయంత్రం    ఆపాపే మరలా ఫోన్ చేసింది . స్వామీ నిన్నటినుండి .పాపకు తగ్గించమని   ఆంజనేయస్వామిని అడుగుతూనే ఉన్నాను . ఈరోజు పెదనాన్నవాళ్ళు  వచ్చి చెప్పారు పాపకు తగ్గుతున్నాదట . డాక్టర్లు  తగ్గిపోతుందని చెప్పారట . థాంక్స్  అంకుల్  ! స్వామి  పాపకు తగ్గించారు . పిల్ల  గొంతులో ఆనందం . ఆపసిమనస్సు ప్రార్ధనను ఆలకించి స్వామి   తన అనుగ్రహం  చూపారన్నమాట . ఆహా ఏమి స్వామి   లీల ?
కల్మషం లేని మనస్సులు చేసే ప్రార్ధనకు ఎంత శక్తి ఉంటుందో  ఓ ప్ర,మాణము . అలానే ఏకష్టమొచ్చినా  స్వామినే అడుగమ్మా ! పిలిస్తే వస్తాడు . అనిచెప్పి ఫోన్ పెట్టేశాను . చిత్రం  గా  నేను ఆపాప  పేరడగటం మరచిపోయాను .
జై శ్రీరాం

5 వ్యాఖ్యలు:

Anil Kumar Puranam May 23, 2012 at 2:42 AM  

Jaya Hanuman

Anil Kumar Puranam May 23, 2012 at 2:42 AM  

Jaya Hanuman

శ్యామలీయం May 23, 2012 at 5:28 AM  

“More things are wrought by prayer than this world dreams of.”
- Lord Tennyson (1809-1892)

madhumarati May 23, 2012 at 9:51 PM  

స్వామి నీ లీలలు ఆమోఘం , అమృతం

రాహుల్ May 29, 2012 at 12:04 AM  

ఈ పోస్ట్ లో ఎదో మహత్తు ఉన్నట్టుంది, చదువుతుంటె చాలా ఆనందంగా, తన్మయత్వంగా అనిపించింది.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP