శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"హనుమత్ రక్షాయాగ" ప్రసాద వితరణ జరుగుతున్నది అందనివారు తెలియజేయండి

>> Sunday, May 20, 2012

"హనుమత్ రక్షాయాగ" ము వైభవోపేతంగా జరగటానికి సహాయ సహకారములందిం చిన భక్త బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము . వారందరికీ స్వామి అనుగ్రహం కలగాలని గోత్రనామాలతో పేరుపేరునా సంకల్పం చెప్పటం జరిగింది . ప్రార్ధనలు చేయటం జరిగినది .
ఇక స్వామి వారి ప్రసాదములు భక్తులందరికీ అందజేసే ప్రక్రియ మొదలైనది . గోత్రనామాలతో పాటు యాగ దక్షిణ పంపిన వారందరికీ పోస్ట్ లో ప్రసాదములు పంపాము . సత్సంగాలు , బృందాలు గా పారాయణం చేసినవారికి వారి బృంద బాధ్యులకు అందజేస్తున్నాము . యాక అమెరికాలో ఉన్న వారికి రామరాజు భాస్కర్ గారివద్దకు పంపి వారిద్వారా అందేలా చూస్తున్నాము . ఒక నాలుగురోజులు వేచిచుసి ప్రసాదములు అమ్దనివారి మాకు కాల్ లేదా మెయిల్ ద్వారా తెలియజేయగలరు .

భగవత్ ప్రసాదాన్ని అమ్ముకునే దౌర్భాగ్యానికి మేమింకా దిగజారలేదు కనుక మీరు మరోలా భావించకండి . వేలాదిమంది భక్తులు పారాయణం చేశారు . వారందరికీ పోస్టల్ ఖర్చులు భరించి పంపే ఆర్ధిక స్తోమత మాకు లేదు .
అందువలన మాత్రమే యాగదక్షిణ రూపేణా ద్రవ్యం పంపినవారికి పోస్ట్ చేయగలిగాము . మీకు ప్రసాదములు రావాలని కోరుకుంటే పోస్ట్ లేదా కొరియర్ ఖర్చెంతవుతుందో అంత మాత్రం పంపితే వారికి ప్రసాదములు పంపగలము .
హవన భస్మము ,హనుమత్ రక్షలు , శ్రీవారి కల్యాణాక్షతలు ప్రసాదం పాకెట్లో ఉంటాయి .పరమపవిత్రంగా జాగ్రత్తగా దాచుకుని వాడుకునే వారు మాత్రమే ప్రసాదాలు స్వీకరించాలని మనవి . నేను ఈరోజు తిరుమల వెళుతున్నందున మరోవారందాకా ఇక్కడ మెయిల్స్ చూడలేను గమనించగలరు .జైశ్రీరాం


durgeswara@gmail.com

9948235641

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP