శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అనామకుని చే ఇంత వైభవోపేతంగా హనుమత్ రక్షాయాగం జరిపించడమా ? ఇది స్వామి కృపకాక ఇంకేమిటి ?

>> Saturday, May 19, 2012






అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద ? రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో ! అని శరణు వేడితే చాలు .సర్వకార్యాలు సాధింపచేస్తారు హనుమ . అది ఆయన కృప . భక్తప్రియత్వం . నిజంగా నావంటి అనామకుని చేత సంకల్పింపజేసి "హనుమత్ రక్షాయాగమనే " బృహత్తర కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేపించి ఆయన మహిమను నిరూపించారు స్వామి .

అహోబిళ క్షేత్రంలో సంకల్పం గావించబడి జగద్గురువులు ,పీఠాధిపతుల,సాధుసంతుల ఆశీర్వాదములతో శ్రీపంచమినాడు ప్రారంభించబడిన కోటి చాలీసా పారాయణ సహిత మహాయాగం ఇంతవైభవంగా జరగటం కలయా వైష్ణవ మాయయా ? అన్నట్లు జరిగింది. శృంగేరి,కంచి కామకోటి జగద్గురువులు ,గణపతి సచ్సిదానండ స్వామిజీ ,చిన్నజీయర్ స్వామిజీ, అష్టాక్షరి సంపత్కుమార జీయర్ స్వామిజీ, శ్రీరంగా రామానుజర్ జీయర్ స్వామి, శైవాక్షేత్ర గురువులు[విజయవాడ] వీర బ్రహ్మేంద్ర స్వామి వారి స్థానం నుండి మంగాలాశాసనములందాయి.
ప్రారంభంలో సహాయంగా ఉండటానికి ముందుకొచ్చిన వారు కొన్ని ప్రశ్నలడిగారు ?
మీదగ్గర ఇంత కార్యక్రమాన్ని చేయటానికి వలసిన ధనం ఉందా ?లేక సమీకరించటానికి అవసరమైన వనరులున్నాయా ? మీకు విస్తృత స్తాయిలో పరిచయాలున్నాయా ? అనుచరవర్గమున్నారా ?

లేరు అన్నది నాసమాధానం .
మరి ఏధైర్యంతో ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకుంటూన్నారు ?

నేను స్వామి వైపు చూపాను . ఆయనే నాధైర్యం . ఆయన నామంపట్ల విశ్వాసమే నాదగ్గరున్న ధనం . నిత్యరామనామజపోపాసకులైన జనమే నాబంధువర్గం ఎలా జరుపుతాడన్నది ఆయనిష్తం . అయనను నమ్మి నడవటమే నాకిష్టం .


ఇక మనోహర్,ఆదేపుడి భాస్కర్ లతో తో మొదలైన సహాయం అవసరమైనప్పుడల్లా వచ్చిచేరుతూనే ఉంది . ఎంతమందో స్వామి భక్తులు తాము మున్నామని అండగా నిలచారు .
కోటిచాలీసా పారాయణ క్ర్తతువు మొదలయింది . ఎక్కడెక్కడనుంచో తాము పారాయణాలు చేయటానికి చేపిమ్చటానికి ముందుకొచ్చారు భక్తులు. ముఖ్యంగా ఇక్కడ శ్రీ సుభాష్ గారి గూర్చి చెప్పుకోవాలి రాష్ట్రవ్యాపితంగా ఆయనకున్న పరిచాయాలద్వారా విస్తృతంగా పారాయణాలు ప్రారంభ,మయ్యాయి . ఇక అంతర్జాలంలో తెలుగు అగ్రిగేటర్ల,సమూహాల ద్వారా దేశవిదే దేశ విదేశాలలో ఉన్న భక్తులు పారాయణం మొదలుపెట్టారు . ఇక ఇక్కడ గిద్దలూరు నుంచి కృష్ణారావు గారు గోరంట్లయ్యగారు ఒక బృందం గానుఒంగోలు నుంచి శ్రీనివాసరెడ్డి,సుంకర శ్రీనివాసరావు గార్ల బృందం , ఇటు కురిచేడు వైపునుంచి సుందరరావు ,కురంగిశ్రిను బృందం దరిశివైపునుండి కోటేశ్వరరావు వాళ్ళు యాగంకోసం పనిచేశారు . ఆదిశేషయ్య ,సుబ్బారావు, మాలకొండారెడ్డి ,అంజిరెడ్డి ,సుబ్బారెడ్డి ఇలా మాకుర్రవాళ్ళు ఇక్కడ శ్రమిం చగా
హైదరాబాదునుండి నాగామురారి డిజైన్ పనులుచుశారు . అటు అమెరికానుండి భాస్కర్ రామరాజు ,భరద్వాజ్ లాంటి వారు గుర్గావ్ నుండి మోహన కిశోర్ , నాగప్రసాద్ లాంటి కుర్రాళ్ళు ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షించారు .
ఇక ఎక్కడెక్కడో ఉన్న హనుమత్ బందువర్గ మంతా తరలి వచ్చి పారాయణ ప్రచారానికి పూనుకున్నారు . పెద్దలు హరిసంకిర్తనాచార్యులైన బాబురావుగారు విశాఖ ప్రాంతంలోనూ ఉపమాక క్షేత్రం గా వివి ఎస్ శర్మగారు నల్గొండ నుండి శ్రీదేవి గారు, తాడిపత్రి శేషాద్రి అయ్యంగారు,విజయమోహన్ గారు ,హైదరాబాదునుండి నవీన్ కుమార్ గారు ,రాదాక్రుష్ణగారు, కొత్తవలస నుండి విజయకుమారి గారు, తుని నుండి గోవిమ్దరావుగారు తెనాలి నుండి వరదరాజులు గారు, ఎలమంచిలి నుండి రామచంద్ర మూర్తి గారు విజయవాడనుండి రామకృష్ణగారు , అనేక విద్యాలయాలు ,దేవాలయాలవారు పారాయణాలు చేపించి యాగానికి సహకరించారు . ఇక యాగానికి అవసరమైన సహాయ సహకారాలు అందించిన దేశవిదేశాలలో వున్నా భక్తులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి .

పూర్ణాహుతి ని నూటా ఎనిమిది కుండములతో జరపాలని భావించాము . హనుమజ్జయంతి రోజు రాత్రి జోరువర్షం నేలతల్లి పులకించి పోయింది. పొద్దుటే యాగశాల నిర్మించాల్సిన స్థలంలో టెంట్ లు వేయాలని ప్రయత్నిస్తే హోరుగాలి . దీనికితోడు నేల మెతకబడి ఉంది .కనుక టెంట్లు నిలబడవని పనివాళ్ళు చేతులెత్తేశారు . అన్నదానం చిదంబరశాస్త్రి గారి సూచనల మేరకు యాగస్థలాన్ని ఆలయ ఆవరణలోకి మార్చి ఇరవయ్యేడు యాగ కుమ్డములు అరగంటలో నిర్మిచారు కుర్రవాళ్ళు . ఇక హోమ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న మా గోపాలకృష్ణ మూర్తి భట్టు గారి బృందం ,హైదరాబాద్ నుంచి వచ్చిన రాజశేఖరుని విజయ శర్మ బృందం చెన్నై నుంచి వచ్చిన హనుమత్ శాస్త్రి అనేకమంది ఆలయ అర్చకులు,గ్రామ పురోహితులు ఎటువంటి ఫలా పేక్ష లేకుండా లోకశ్రేయస్సుకోసం వేదమంత్రోచ్చారణలతో స్వామిని స్తుతించారు . వారి ఉత్సాహంతో యాగం అనుకున్నసమయానికన్నా ఇంకో గంటన్నర సేపు నిర్విరామంగా కొనసాగింది. ఇక ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి ,బ్రాహ్మణులకు ఇవ్వాలనుకున్న వస్త్రాలు విజయవాడలో దొరకక పొతే కాశి నుండి ఆవస్త్రాలను పంపిన అక్కడి రామ మందిర నిర్వాహకులగు స్వామి వారికి హైదరాబాద్ నుండి ఈ శ్రమనుతీసుకున్న పంద్రంగి తిలక్ గారిని ని ఏమ్తపోగిడినా తక్కువే. శరీరం లో ఓపిక లేకున్నా రాత్రి వేల ఒంటిగంటకు వెళ్లి రైల్లో వచ్చిన ఆబట్టల మూటను మోసుకొని తెచ్చి అమ్దిమ్చిన వారికి అక్కడనుండి తెచ్చి యాగాస్థలానికి చేర్చిన మా పిల్లలు నాగా ఏడుకొండలరేడ్డి,పొట్లపల్లి అంజిరెడ్డి ఎంతో శ్రమపడ్డారు .
ఇక యాగానికోచ్చిన నాగేంద్రకుమార్ అయ్యంగార్ , venkaTEshvarlu &psm lakshmi gaarlu ,తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు ,మనోహర్ ,నాగ, kaayala nagendra ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో బాధ్యతతీసుకుని నిర్వహించిన
ఈ యాగం నకు సంతృప్తి చెందిన పవనసుతుడు భక్తులందరి మనోభీష్టాలు నెరవేరేలా అనుగ్రహ వర్షం కురిపించారనేదానికి సందేహమక్కరలేదు . ఇంత భాగ్యం కల్పించిన ఆపావనముర్తికి పవనసుతునకు జయమంగళం ,నిత్య శుభమంగళం .

జైశ్రీరాం

భక్తజన పాదదాసుడు
దుర్గేశ్వర


5 వ్యాఖ్యలు:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ May 19, 2012 at 11:41 AM  

జై శ్రీరామ్

A.V.Naga Sandeep Kumar May 19, 2012 at 7:02 PM  

jai sri ram

Sandeep P May 19, 2012 at 10:47 PM  

చాలా సంతోషం దుర్గేశ్వర గారు. ఆ హనుమంతుడి అనుగ్రహం ఆస్తికులకందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను.

siva May 20, 2012 at 7:49 PM  

chala Santosham Durgeswararao garu neenu miss ayinadhuku chala badhapaduthuannu

old is gold May 21, 2012 at 12:20 PM  

దుర్గేశ్వర రావు గారూ మీరు ధన్యులు.మీ వలన మేమందరము స్వామి సెవలో ఉడతలలా
తలా ఒక చేయి వేయగలిగాము.మీకు అ భగవంతుడు ఆయుః ఆరోగ్యాలు ప్రసాదించాలని
మనసారా ఆకాంక్షిస్తున్నాను.మీరు భవిష్యత్తులో అనేక దైవ కార్యాలు చేయలని
కొరుతున్నాను. జై సీతరాం జై వీర హనుమాన్

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP